సిల్వర్ స్క్రీన్‌పై అజిత్‌ను ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారట కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హీరో అజిత్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘డేర్ డేవిల్’. ఈ సినిమాలో శ్రీలీల ఓ హీరోయిన్గా నటిస్తుండగా, ఉన్ని ముకుందన్, సునీల్, పార్తిబన్, ప్రభు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసింది.
కాగా, ఈ సినిమాలోని విలన్ పాత్రలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ నటించనున్నారని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఈ నెలలోనే ‘డేర్ డేవిల్’ షూటింగ్లో పాల్గొంటారట శివ రాజ్‌కుమార్. హైదరాబాద్ షెడ్యూల్లోనే అజిత్, శివ రాజ్‌కుమార్‌లపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారట దర్శకుడు. అజిత్ భార్య షాలిని నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుందని తెలిసింది.


