గుడిలో పూజలు.. ప్రభాస్‌ పాత వీడియో వైరల్‌ | Prabhas Old Video Goes Viral Now | Sakshi
Sakshi News home page

గుడిలో పూజలు.. ప్రభాస్‌ పాత వీడియో వైరల్‌

Nov 17 2026 6:54 PM | Updated on Nov 17 2026 7:10 PM

Prabhas Old Video Goes Viral Now

సోషల్‌ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్‌ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన పాత వీడియోలు, ఫొటోలు ప్రతిసారీ కొత్తవిగా చక్కర్లు కొడుతుంటాయి. అసలు విషయం తెలియకపోతే అవే నిజమని భావించే పరిస్థితి కూడా ఉంటుంది. తాజాగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు సంబంధించిన ఓ పాత వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్‌ తాజాగా ఆలయాన్ని సందర్శించారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని ఆయన పీఆర్‌ టీమ్‌ స్పష్టం చేసింది.

ప్రభాస్‌  గుడికి ఎప్పుడు వెళ్లాడు?
ప్రభాస్‌ నటించిన ‘సలార్‌: పార్ట్‌ 1–సీజ్‌ఫైర్‌’ చిత్రం 2023 డిసెంబర్‌లో విడుదలైన విషయం తెలిసిందే. సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ప్రభాస్‌ కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ప్రముఖ కటీల్‌ శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

(చదవండి: హాలీవుడ్ సినిమా.. కానీ ఇంతింత రేట్లా?)

అప్పట్లో ప్రభాస్‌ ఆలయాన్ని సందర్శించిన వీడియోకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా అదే వీడియోను కొందరు సోషల్‌ మీడియా వేదికగా మరోసారి షేర్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ ఇటీవలే కటీల్‌ ఆలయానికి వెళ్లారంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ వీడియోపై మరోసారి చర్చ మొదలైంది.

రెండేళ్ల తర్వాత మళ్లీ వైరల్‌?
సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫొటోలు, వీడియోలను సందర్భ లేకుండా వైరల్‌ చేయడం సోషల్‌ మీడియాలో సాధారణంగా మారిపోయింది. వీడియో ఎప్పుడు తీసిందనే విషయాన్ని పరిశీలించకుండా ప్రస్తుత ఘటనకు సంబంధించినదిగా పోస్టులు చేయడంతో అసలు విషయం పక్కదారి పడుతోంది. ప్రభాస్‌ విషయంలోనూ ఇదే జరిగింది.అయితే ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోకు, ప్రభాస్‌ తాజాగా ఆలయాన్ని సందర్శించారనే ప్రచారానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన పీఆర్‌ టీమ్‌ వెల్లడించింది. ఈ వీడియో పాతదేనని స్పష్టం చేసింది.

(చదవండి: ‘ఇప్పుడు మా ఇంటి వాతావరణమే మారిపోయింది’)

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్‌ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆయన నటించిన ‘ఫౌజీ’, ‘స్పిరిట్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి 2’ చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది.  ప్రశాంత్‌నీల్‌ రూపొందిస్తోన్న ‘సలార్‌ 2’ కూడా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement