నవంబర్ 16న హైదరాబాద్‌లో ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి హీరో ధనుష్, మమ్ముట్టితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ.. సాయిపల్లవిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘లేడీ పవర్ స్టార్’గా..
నాగవంశీ సాయి పల్లవిని ‘లేడీ పవర్ స్టార్’గా అభివర్ణించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘నా నిర్మాణంలో సాయిపల్లవి ఓ తెలుగు సినిమా చేయాల్సి ఉంది. దానికి అడ్వాన్స్ కూడా తీసేకున్నారు. అయినా సినిమా చేయలేదు. తెలుగులో ఓ సినిమా బాకీ ఉంది’ అని సరదాగా అన్నారు. అయితే ఏ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారో.. అది ఎంత మొత్తమో అనేది మాత్రం వెల్లడించలేదు.
అప్పుడే చెప్పా..
ఇదే విషయమై సాయిపల్లవి కూడా మాట్లాడారు. ‘కరోనా కంటే ముందే ఓ సినిమా కోసం నిర్మాత నాగవంశీ నాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ డబ్బులు ఇప్పటికీ నా దగ్గరే ఉన్నాయి. అప్పుడే చెప్పా సినిమా చేసినప్పుడు ఇవ్వండి అని. కానీ ఆయన వినకుండా ఇచ్చేశారు. మళ్లీ తీసుకోలేదు’ అని సాయి పల్లవి అన్నారు.
కాగా ‘ఓం’లో ధనుష్‌తో పాటు సాయి పల్లవి, మమ్ముట్టి, శ్రీలీల నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 20 న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను విడుదల చేస్తోంది.
(ఇదీ చదవండి: నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు: అమల అక్కినేని)
“Power Star గారికి Lady Version ఉంటుందని first time చూస్తున్నా. Ma’am, advance ఉంది. మీరు నాకు సినిమా చేయాలి!” #NagaVamsi about #SaiPallavi at #OM Prerelease Event https://t.co/2vTQgmSENV
— ANANTAPUR CINEMA (@AnantapurCinema) November 16, 2026


