హీరోయిన్లకు కొన్నిసార్లు అద్భుతమైన అవకాశాలు వస్తుంటాయి. కానీ వాళ్లు స్టార్స్ అవుతారా లేదా అనేది సదరు బ్యూటీస్ ఫెర్ఫార్మెన్స్‌తో పాటు సినిమాల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నాళ్ల ముందు టాలీవుడ్‌లో వరసపెట్టి మూవీస్ చేసిన శ్రీలీల.. ఇప్పుడు కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. వరసగా స్టార్స్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఇంతకీ ఎవరా స్టార్స్? శ్రీలీలకు సక్సెస్ ఎందుకు అంత ముఖ్యం?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
అమెరికాలో పుట్టి, బెంగళూరులో పెరిగిన తెలుగు మూలాలున్న అమ్మాయి శ్రీలీల. కన్నడలో తొలుత సినిమాలు చేసింది. 'పెళ్లి సందడి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రారంభంలోనే రవితేజతో చేసిన 'ధమాకా'తో రూ.100 కోట్ల బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఆ తర్వాత ఈమె పరిస్థితి దారుణంగా తయారైంది. చేసిన చాలా చిత్రాల్లో ఒకే తరహా 'సీఈఓ' పాత్రలతో బోర్ కొట్టించింది. బాలకృష్ణతో చేసిన 'భగవంత్ కేసరి' తప్పితే మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తదితరులతో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితాల్ని అందుకున్నాయి. దీంతో ఈమెకు తెలుగులో దాదాపుగా అవకాశాలు తగ్గిపోయాయి.
ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతి టైంలో వచ్చిన 'పరాశక్తి'తో తమిళంలోకి ఎంటరైంది. ఇది డిజాస్టర్ అయింది. కానీ ధనుష్ 'ఓం'లో ఓ హీరోయిన్‌గా అవకాశముంది. ఈ మూవీ ఈ నెల 20న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. ఇదలా ఉండగానే అజిత్ 'డేర్ డెవిల్', రజనీకాంత్ 'ధర్మన్' చిత్రాల్లో అవకాశాలు అందుకుని ఆశ్చర్యపరిచింది. ఈ మూడు చిత్రాల్లో ఉన్నది స్టార్ హీరోలే. ఇవి సక్సెస్ అవ్వాల్సిన అవసరం శ్రీలీలకు ఎంతయినా ఉంది. ఇవి గనక ఏమైనా తేడా కొడితే శ్రీలీల కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోవడం గ్యారంటీ. మరి ఏం జరుగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. ప్రకటన)
SHE'S GOT THE SPARK SHE'S GOT THE PATAKA Welcoming the gorgeous @sreeleela14 to DHARMAN #Dharman #KettaPaiyanSir #SuperstarRajinikanth #KamalHaasan @rajinikanth @ikamalhaasan #Mahendran #Nayanthara @Dir_Ashwath @anirudhofficial @anbariv @iYogiBabu @SimranbaggaOffc @sreeleela14 #RaashiKhanna @nikethbommi #KarthikRajkumar @PradeepERagav @kabilanchelliah @ShruthiManjari @APIfilms @homescreenent @saregamasouth @RKFI @turmericmediaTM @magizhmandram
— Raaj Kamal Films International (@RKFI) November 4, 2026


