ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. ప్రకటన | Baa Baa Black Sheep Movie OTT Release Date Latest Update | Sakshi
Sakshi News home page

OTT Movie: 'యానిమల్' నటుడి తెలుగు సినిమా.. ఓటీటీ ప్రకటన

Nov 4 2026 3:31 PM | Updated on Nov 4 2026 3:31 PM

Baa Baa Black Sheep Movie OTT Release Date Latest Update

'యానిమల్' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న మరాఠీ నటుడు ఉపేంద్ర లిమాయో.. తెలుగులోనూ వరస మూవీస్ చేస్తున్నాడు. అలా చేసిన ఓ చిత్రమే 'బా బా బ్లాక్ షీప్'. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

అక్షయ్, విష్ణు ఓయ్, ఉపేంద్ర లిమాయో ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'బా బా బ్లాక్ షీప్'. గుని మంచికంటి దర్శకుడు. గత నెల 09న థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడిది ఈ శుక్రవారం(నవంబర్ 06) నుంచి సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.

'బా బా బ్లాక్ షీప్' విషయానికొస్తే.. సత్యనారాయణ అలియాస్ సత్తిపండు (విష్ణు ఓయ్) మేఘాలయాలో తన ప్రియురాలు మేరి (సమృద్ధి ఆర్యల్)ని పెళ్లి చేసుకోవడాని రెడీ అవుతుంటాడు. పెళ్లికి ముందు స్నేహితుడు సందీప్‌ (అక్షయ్‌ లగుసానితో కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటాడు. మధ్యలో పోలీసులు రావడంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఈక్రమంలో సత్తిపండు కారుకి ప్రమాదం జరుగుతుంది. అక్కడే సందీప్‌కి ఓ పెట్టె దొరుకుతుంది. దాన్ని తీసుకొని సత్తిపండు పెళ్లికి వెళ్తాడు.

అక్క‌డికి గ్యాంగ్‌స్ట‌ర్ జాన్‌(ఉపేంద్ర లిమాయో) వస్తాడు. పెట్టె కనిపించకపోవడంతో సందీప్, సత్తిపండులను కిడ్నాప్ చేసి తనదైన శైలిలో వేధిస్తాడు. బాక్స్‌ ఇవ్వకపోతే సత్తిపండుని చంపేస్తానని బెదిరిస్తాడు. ఫ్రెండ్ కోసం సందీప్‌.. మ‌రో ఫ్రెండ్ జాన్వీ(విస్మ‌య‌శ్రీ)తో ఆ బాక్స్‌ని వెతకడానికి వెళ్తాడు. మరి ఆ బాక్స్‌ దొరికిందా? సత్తిపండు పెళ్లి చివరకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement