48ఏళ్ల వయసులో రెండో భర్తకు విడాకులిచ్చిన ప్రముఖ సింగర్‌ | Kanika Kapoor Announced Divorce From Second Husband Gautam Hathiramani After Four Years Of Marriage At 48, Post Goes Viral | Sakshi
Sakshi News home page

Kanika Kapoor Divorce: రెండోసారి విడాకులు.. బాధ కలిగిస్తోందంటూ..

Nov 4 2026 12:19 PM | Updated on Nov 4 2026 12:32 PM

Kanika Kapoor Announced Divorce From Second Husband Gautam Hathiramani

బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌ గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘బేబీ డాల్‌’, ‘చిట్టియాన్‌ కలైయాన్‌’ వంటి పాటలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తన భర్త గౌతమ్‌ హతిరమణితో విడిపోతున్నట్లు ప్రకటించింది. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది.

రెండో పెళ్లి కూడా విఫలం..
కనికా కపూర్‌ 2022లో లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమణిని వివాహం చేసుకుంది. వీరిద్దరికీ గతంలోనే పరిచయం ఉండగా.. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్లకే ఈ బంధం ముగిసింది. కనికాకు ఇది రెండో వివాహం. గతంలో ఆమె ఎన్నారై రాజ్‌ చండోక్‌ను పెళ్లి చేసుకుంది. 1999లో జరిగిన ఈ వివాహం 2012లో విడాకులతో ముగిసింది. మొదటి వివాహం ద్వారా ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

48 ఏళ్ల వయసులో.. 
రెండోసారి విడిపోవాల్సి రావడం తనకు బాధను కలిగిస్తోందని కనికా కపూర్‌ వెల్లడించింది. ఈ సమయంలో తన వ్యక్తిగత జీవితంపై అభిమానులు దయతో స్పందించాలని, తమ గోప్యతను గౌరవించాలని కోరింది. విడిపోవడానికి గల కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. కాగా ఆమెకు 48ఏళ్ల వయసులో ఇలా కావడం ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. 

(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’పై డైరెక్టర్‌ క్లారిటీ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement