కొత్త అవతారంలో స్టార్‌ హీరోయిన్‌.. విలన్‌గా ఎంట్రీ! | Nitya Menon As Villian In Mr And Mrs Gray Movie | Sakshi
Sakshi News home page

Nitya Menon: నిత్యామీనన్‌ కొత్త అవతారం.. విలన్‌గా ఎంట్రీ..!

Nov 4 2026 10:38 AM | Updated on Nov 4 2026 10:46 AM

Nitya Menon As Villian In Mr And Mrs Gray Movie

ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామీనన్‌.. ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు తన సహజమైన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఈసారి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనుంది. వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గ్రే’ చిత్రంలో నిత్యా విలన్‌గా నటిస్తోంది.

ఏడేళ్ల క్రితం
ఏడేళ్ల క్రితం ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరో హిందీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్‌ మంగళవారం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. రెట్రో లుక్‌లో రూపొందించిన ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

వేవ్‌బ్యాండ్‌ ప్రొడక్షన్స్‌పై దాదాపు మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు అంకుర్‌ పజ్నీ, విశాల్‌ రంజన్‌ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేయా శర్మ, ఆశిష్‌ విద్యార్థి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

(ఇదీ చదవండి: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement