అల్లు అరవింద్‌తో నటించాలని ఉంది: నటి జయసుధ | Jayasudha Interesting Comments on Allu Aravind Go Viral | Sakshi
Sakshi News home page

అల్లు అరవింద్‌తో నటించాలని ఉంది.. : నటి జయసుధ

Nov 4 2026 7:45 AM | Updated on Nov 4 2026 7:46 AM

Jayasudha Interesting Comments on Allu Aravind Go Viral

మాస్టర్‌ రోహన్‌, మాస్టర్‌ అరుణ్‌, బేబీ ఖుషీ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సమ్మర్‌ హాలీడేస్‌’. శ్రీకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 6న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్‌ నటి జయసుధ నిర్మాత అల్లు అరవింద్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

జయసుధ మాట్లాడుతూ.. అల్లు అరవింద్‌తో తనకు ఇప్పటి పరిచయం కాదని, ఎన్నో ఏళ్లుగా ఆయనతో అనుబంధం ఉందని తెలిపారు. ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నారని, అయితే ఇప్పటి జనరేషన్‌కు ఆ విషయం తెలియదని అన్నారు. ఈ విషయాన్ని తాను ఎప్పుడో అరవింద్‌గారికి చెప్పానని గుర్తు చేసుకున్నారు.

‘అరవింద్‌గారూ.. ఒక సినిమా తీయండి. మనమిద్దరం కలిసి నటిద్దాం’ అని గతంలోనే చెప్పినట్లు జయసుధ వెల్లడించారు. ఆమె చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ఈవెంట్‌లో నవ్వులు పూయించాయి. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

(ఇదీ చదవండి: దొంగ నా కొడుకు.. టైటిల్‌ మార్చేశారు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement