సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం.. | Tamil Nadu CM Vijay Approves Six Shows a Day for New Releases | Sakshi
Sakshi News home page

Tamil Nadu CM Vijay: సినిమా రిలీజ్‌ వేళ.. సినీ ప్రియులకు గుడ్ న్యూస్..

Nov 4 2026 8:38 AM | Updated on Nov 4 2026 8:49 AM

Tamil Nadu CM Vijay Approves Six Shows a Day for New Releases

తమిళ సినీ పరిశ్రమకు సీఎం విజయ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త సినిమాల విడుదల సమయంలో థియేటర్లలో షోల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమా విడుదలైన తొలి వారం రోజులు రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 గంటల వరకు సినిమాలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది.

ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం
2023లో అజిత్ నటించిన 'తునివు' సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత తమిళనాడులో ఉదయం ప్రత్యేక షోలపై ఆంక్షలు విధించారు. రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. తాజాగా సీఎం విజయ్ ప్రభుత్వం ఈ ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

దీపావళికి పండగే..
ఈ నిర్ణయం దీపావళికి విడుదల కానున్న సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. సూర్య నటించిన 'సీన్', నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మూకుతి అమ్మన్ 2', ‘రామాయణ’ చిత్రాలకు ఈ వెసులుబాటు కలిసిరానుంది. తొలి వారంలో అదనపు షోలతో ప్రేక్షకులకు మరిన్ని అవకాశాలు లభించడంతో పాటు బాక్సాఫీస్ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళ సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు మద్దతుగా నిలిచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

(ఇదీ చదవండి: అల్లు అరవింద్‌తో నటించాలని ఉంది: నటి జయసుధ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement