breaking news
CM Vijay
-
కండక్టర్‌గా సీఎం విజయ్.. సర్ప్రైజ్ చేసిన అమ్మాయిలు!
తమిళనాడులో ఉచిత బస్ ప్రయాణ పథకం ‘వెట్రి పయనం’ ప్రభుత్వం మరింత విస్తరించింది. శుక్రవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో సి. జోసెఫ్ విజయ్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల బస్సులో కాసేపు ఆయన కండక్టర్ అవతారం ఎత్తారు. స్వయంగా టికెట్లు కొట్టి ప్రయాణికులతో మాట్లాడారు. ఆ సమయంలో కొందరు అమ్మాయిలు ఆయన్ని సర్ప్రైజ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ‘వెట్రి పయనం’ పథకాన్ని విస్తరించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 12,695 ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. సాధారణ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసులకు కూడా ఈ అవకాశం వర్తిస్తుందని విజయ్ ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు ఆదాయ పరిమితి ఉండదని, ప్రయాణాల సంఖ్యపైనా ఎలాంటి పరిమితి లేదని స్పష్టం చేసింది. తాజా విస్తరణతో రోజుకు సుమారు 84.32 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని, ఉద్యోగాలు, కళాశాలలు, ఆస్పత్రులకు వెళ్లే వారికి ప్రయాణ భారం తగ్గుతుందని విజయ్ సర్కార్ అంటోంది. విజయ్ జేబులో చాక్లెట్లుపథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం విజయ్ మహిళల బస్సులోకి వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. స్వయంగా టికెట్లు అందించారు. ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థులు ఉత్సాహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు కొందరు ఆయనకు చాక్లెట్లు ఇవ్వగా.. ఆయన వాటిని జేబులో దాచుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. CM Vijay is personally handing out tickets to women on the women's bus.College students are sharing 'Dairy Milk' chocolates, adding to the excitement! 😅❤️ pic.twitter.com/NOy11JqpzK— Actor Vijay Team (@ActorVijayTeam) October 2, 2026మహిళల ఆర్థిక భారం తగ్గించడం, ప్రజా రవాణాను మరింత వినియోగంలోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం విజయ్ ఈ సందర్భంగా చెప్పారు. పథకం విస్తరణతో మరిన్ని ప్రాంతాల్లో మహిళలకు ప్రయోజనం అందనుందని అన్నారాయన.అయితే ఈ పథకంపై కొందరు ప్రశంసలు వ్యక్తం చేస్తుండగా.. అవసరమైన వర్గాలకే పరిమితం చేయకుండా అందరికీ వర్తింపజేయడం వల్ల రవాణా సంస్థల ఆదాయంపై భారం పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు విజయ్ సర్కార్ నిర్ణయం వల్ల తమ ఉపాధికి దెబ్బ పడుతుందని చెబుతూ ప్రైవేట్ బస్సుల యాజమాన్యం తాజాగా ఒక్కరోజు సమ్మె చేసింది. ఇదీ చదవండి: గాంధీ గురించి జెన్‌జీ అభిప్రాయమిదేనా? -
చాన్నాళ్లకు కనిపించిన విజయ్ భార్య సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)
-
సత్యభామకు ఓదార్పు.. ‘స్వీట్ బ్రో’ సభలో కన్నీటి డ్రామానా?
ఉప ఎన్నికల వేళ.. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ప్రచార సభలో చోటుచేసుకున్న ఓ భావోద్వేగ ఘటనపై డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. ధారాపురం ఉప ఎన్నిక ప్రచారంలో టీవీకే అభ్యర్థి సత్యభామ ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకోగా.. విజయ్ ఆమెను ఓదార్చారు. ఈ ఘటనపై డీఎంకే నేత కనిమొళి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ప్రజల సానుభూతి కోసం ఆడిన నాటకమంటూ విమర్శించారు.ధారాపురంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో టీవీకే అభ్యర్థి సత్యభామ(Sathiyabama) మాట్లాడుతుండగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే వేదికపై ఉన్న విజయ్ ఆమెను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఈ ఘటనపై స్పందించిన డీఎంకే నేత కనిమొళి.. మొత్తం పరిణామం ముందే ప్లాన్ చేసినట్లుగా ఉందని ఆరోపించారు.‘స్వీట్ బ్రో’ అంటూ వచ్చి..“మంత్రి రాజ్‌కుమార్‌కు ఫోన్ వస్తుంది. ఆయన మాట్లాడిన తర్వాత సత్యభామ చెవిలో ఏదో చెబుతారు. వెంటనే బాగా మాట్లాడుతున్న ఆమె కన్నీళ్లు పెట్టుకుంటారు. మహిళగా తాను ఒత్తిడిలో ఉన్నానని చెబుతారు. ఆ తర్వాత విజయ్ వచ్చి ఓదారుస్తారు. వెంటనే ప్రజల నుంచి స్పందన వస్తుంది. వేదికపైనైనా, ప్రచారంలోనైనా విజయ్ ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు” అంటూ కనిమొళి ఆరోపించారు.టీవీకే నుంచి ఘాటు కౌంటర్కనిమొళి వ్యాఖ్యలపై టీవీకే నేత, తమిళనాడు విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్ తీవ్రంగా స్పందించారు. ఇవి దురుద్దేశపూరిత ఆరోపణలని ఖండించారు. సత్యభామ ప్రసంగాన్ని త్వరగా ముగించాలని మాత్రమే రాజ్‌కుమార్ సూచించారని, దానిని వక్రీకరించి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. “ఇలాంటి ఆరోపణలు విని ఆశ్చర్యపోయాను. ఇది పూర్తిగా అసత్యం. సభల్లో సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసంగాలను కుదించాలని చెప్పడం సాధారణమే” అని రాజ్‌మోహన్ తెలిపారు.அழுத சத்தியபாமா அவர்கள் தேற்றிய முதலமைச்சர் விஜய் ! 🥹#CMVijayInDharapuram pic.twitter.com/vaXecdrwtq— Prakash Vijay (@PrakazVijay_Of) September 30, 2026ఎండలో గంటల తరబడి ప్రజలు.. విజయ్ ఎనిమిది గంటలకు పైగా ప్రయాణించి ఎండలో తడిసిపోయేంతగా ప్రచారం నిర్వహించారని, ప్రజలు కూడా గంటల తరబడి వేచి ఉన్నారని రాజ్‌మోహన్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రసంగ సమయాన్ని తగ్గించాలని సూచించడం సాధారణ ప్రక్రియేనని పేర్కొన్నారు.గతంలోనూ పెద్ద సభల నిర్వహణలో రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి ప్రముఖులకు కూడా సమయ పరిమితి గురించి సూచనలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.కాంగ్రెస్ రియాక్షన్ఈ వివాదంపై తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్ కూడా స్పందించారు. ఇతర పార్టీల ప్రచారాలను డ్రామా అంటూ విమర్శించడం సరికాదని అన్నారు. ప్రజలను కలిసేందుకు ఒక పార్టీ చేసే కార్యక్రమం ప్రచారమైతే, మరో పార్టీ చేస్తే డ్రామా ఎలా అవుతుందని ప్రశ్నించారు.ఇదీ చదవండి: అతన్ని ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు -
జేసన్ సంజయ్ సినిమా.. సీఎం విజయ్ చూస్తే సంతోషం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తొలిసారి దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. టాలీవుడ్‌కి చెందిన సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. ఈరోజే(అక్టోబరు 02) థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో టీమ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. తమిళంలో నేను చేసిన తొలి చిత్రమిది. నాకు చాలా ముఖ్యమైన చిత్రం అని చెప్పింది. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉంది. కమర్షియల్ అంశాలతో సిగ్మా ఉంటుంది. సంజయ్ నాకు మంచి ఫ్రెండ్. విదేశాల్లో చదువుకున్నా, 24 ఏళ్ల వయసులో మంచి తమిళ చిత్రాన్ని ఎలాంటి టెన్షన్ లేకుండా తెరకెక్కించాడు. జేసన్ దర్శకుడు అయ్యాడు కానీ ఆయనలో మంచి నటుడు ఉన్నాడు. కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు. ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రి విజయ్ చూస్తారా అని అడుగుతున్నారు. ఆయన్ని చూడొద్దని ఎవరైనా చెప్పగలరా, చూస్తే చాలా సంతోషం అని చెప్పుకొచ్చాడు. -
ఒక్కొక్కరికి రూ.30 లక్షలు.. సీఎం విజయ్ ప్రకటన
జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు-2026లో భారత మహిళల స్క్వాష్ జట్టు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పతక విజయంలో కీలక పాత్ర పోషించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఒక్కొక్కరికి రూ. 30 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు.ఈ విజయం అంతర్జాతీయ క్రీడా వేదికపై తమిళనాడు కీర్తిని ఈ ఘనత మరింత పెంచిందని విజయ్ కొనియాడారు. "20వ ఆసియా క్రీడలలో మహిళల స్క్వాష్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత జట్టుకు నా అభినందనలు. అలాగే ఆ జట్టులో సభ్యులుగా ఉన్న తమిళనాడు క్రీడాకారిణులు జోష్నా చిన్నప్ప, షమీనా రియాజ్‌లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.జోష్నా, షమీనాలు ప్రపంచ వేదికపై తమిళనాడు కీర్తిని మరింత పెంచారు. వారి విజయానికి గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 30 లక్షలు అందజేస్తాం" అని విజయ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.చదవండి: పంత్ అట్టర్ ఫ్లాప్.. రాణించిన సర్ఫరాజ్, స్మరణ్.. 237 పరుగులకు ఆలౌట్ -
తమిళనాడు ఉప ఎన్నికలు.. అన్నాడీఎంకేకు భారీ షాక్
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఉపఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ మంత్రి, సీనియర్ అన్నాడీఎంకే(AIADMK) నేత ఎస్. సెమ్మలై అధికార టీవీకే పార్టీలో చేరారు. టీవీకే పార్టీ అధినేత, సీఎం విజయ్ ధారాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో తన మద్దతుదారులతో కలిసి సెమ్మలై టీవీకే కండువా కప్పుకున్నారు.తమిళనాడులో ధారాపురం ఉపఎన్నికలో టీవీకే అభ్యర్థి, మాజీ అన్నాడీఎంకే నేత పి. సత్యబామకు మద్దతుగా నిర్వహించిన సభలో వీరి చేరిక జరిగింది. సేలం జిల్లాకు చెందిన సెమ్మలై.. అన్నాడీఎంకేలో సుదీర్ఘకాలం పనిచేశారు. 1984లో తారమంగళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అనంతరం అన్నాడీఎంకేలో చేరారు. 2001లో జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి తనకు టికెట్ దక్కకపోవడంతో సెమ్మలై పార్టీకి దూరమయ్యారు.Former ADMK Minister Semmalai, who joined @TVKPartyHQ today, met Chief Minister Vijay! A setback for @EPSTamilNadu ahead of by-polls! pic.twitter.com/IGa6fcsTl3— George (@georgeviews) September 30, 2026జయలలిత మరణం తర్వాత తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు నిరాకరించారని, ప్రస్తుతం అన్నాడీఎంకేలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆ పార్టీలో కొనసాగేందుకు తన మనస్సాక్షి అంగీకరించడం లేదని గతంలో ఆయన ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలోనే టీవీకేలో చేరే తన నిర్ణయాన్ని సెమ్మలై వెల్లడించారు. తాజాగా టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ధారాపురం, మదురాంతకం (ఎస్సీ) నియోజకవర్గాలకు అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన పి. సత్యబామ, మరగతం కుమారవేల్ రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఉపఎన్నికల్లో టీవీకే తరఫున మాజీ అన్నాడీఎంకే నేత పి. సత్యబామ ధారాపురం నుంచి బరిలో ఉన్నారు.సీఎం విజయ్ ప్రచారం.. ధారాపురం ఉపఎన్నికలో టీవీకే అభ్యర్థి సత్యబామకు మద్దతుగా విజయ్ బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ నియోజకవర్గం పశ్చిమ తమిళనాడులో అన్నాడీఎంకేకు బలమైన ప్రాంతంగా ఉంది. కాగా, ధారాపురం సభలో సత్యబామ భావోద్వేగానికి గురయ్యారు. తనపై సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ ఆమె మాట్లాడిన సమయంలో విజయ్ ఆమెను ఓదార్చారు.ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా -
శభాష్ వేల్ మురగన్.. సింగం కాప్‌పై సీఎం విజయ్ ప్రశంసలు
సాక్షి,చెన్నై: కోయంబత్తూరులో గట్కా స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అత్యంత సాహసోపేతంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ ఎం.వేలుమురుగన్‌ను తమిళనాడు సీఎం విజయ్ అభినందించారు. చెన్నైలోని సచివాలయానికి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు.కోయంబత్తూరు జిల్లా కోవిల్‌పాళయం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వేలుమురుగన్, గత ఆదివారం (సెప్టెంబర్ 27న) తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కర్ణాటక నుంచి అక్రమంగా నిషేధిత గుట్కా ఉత్పత్తులను తరలిస్తున్న అనుమానాస్పద ఎస్యూవీ కారును పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. పోలీసులు తనిఖీ చేస్తుండగా, కారులోని నిందితులు ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా వెనక్కి తిప్పి పారిపోయేందుకు యత్నించారు. ఆ సమయంలో అప్రమత్తమైన కానిస్టేబుల్ వేలుమురుగన్ క్షణం కూడా ఆలోచించకుండా దూకి, వేగంగా వెళ్తున్న ఆ కారు పైకప్పును గట్టిగా పట్టుకున్నారు. నిందితులు కారును ఆపకుండా సుమారు 40 కిలోమీటర్ల దూరం వరకు వేగంగా పోనిచ్చినా, ప్రాణాపాయాన్ని లెక్కచేయకుండా వేలుమురుగన్ కారు పైకప్పు పైనే వేలాడుతూనే ఉన్నారు.చివరికి తిరుపూర్ జిల్లా అవినాశి సరిహద్దు ప్రాంతంలో పోలీసులు ఆ కారును అడ్డగించి, మూడేళ్ల నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సాహస ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో సాహసం ప్రదర్శించిన కానిస్టేబుల్ వేలుమురుగన్ చూపిన తెగువను, ఆయన డ్యూటీ పట్ల నిబద్ధతను, సమయస్ఫూర్తి సీఎం విజయ్ కొనియాడారు. భవిష్యత్తులో విధుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ మహేష్ కుమార్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. Video - Chief Minister Joseph Vijay invited Head Constable Velmurugan to the Secretariat and felicitated him for his courageous efforts to prevent the smuggling of gutka in Coimbatore, risking his own life. https://t.co/rucSBnkDgC— Vignesh Theni (@Vignesh_twitz) September 29, 2026 -
ఇన్నాళ్లు విన్నాం.. ఇక ఇప్పుడు మా వంతు: ఉదయనిధి
తమిళనాడు రాజకీయాల్లో అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. గతంలో డీఎంకేను లక్ష్యంగా చేసుకుని ‘ఓం శక్తి.. పరాశక్తి’ నినాదాలతో టీవీకే అధినేత విజయ్ విరుచుకుపడ్డారు. అదే ఎన్నికల్లో బాగా వర్కవుట్ అయ్యింది కూడా. ఇప్పుడు.. ఉప ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ దానికి కౌంటర్‌గా సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.మదురాంతకంలో జరిగిన డీఎంకే సమావేశంలో ఉదయనిధి కొత్త నినాదాన్ని ప్రకటించారు. ‘ఓం కాళి.. జై కాళి.. టీవీకే ఒక ఒడుగాళి(తప్పించుకుని పారిపోయే పార్టీ)’ అంటూ పార్టీ శ్రేణులతో నినదించారు. గత రెండేళ్లుగా విజయ్ తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని ‘ఓం శక్తి.. పరాశక్తి..డీఎంకే ఒక థీయ శక్తి(దుష్ట శక్తి)’ నినాదాన్ని పదేపదే ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. అప్పట్లో తాము అధికారంలో ఉన్నామని.. ఆయన మాటలను తాము విన్నామని చెప్పారు. ఇప్పుడు సమాధానం ఇచ్చే అవకాశం తమకు వచ్చిందని వ్యాఖ్యానించారు.ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. శాంతిభద్రతల వైఫ్యలంపై సమాధానం చెప్పకుండా విజయ్ తప్పించుకుని తిరుగుతున్నారని,పైగా రీల్స్.. ఫొటోషూట్ల మీదే టీవీకే సర్కార్ ఫోకస్ అంతా ఉంటుందోని మండిపడ్డారయన. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఉదయనిధి కీలక సూచన చేశారు. విజయ్ పేరును నేరుగా ప్రస్తావించాల్సిన అవసరం లేదని.. ‘ఓం కాళి.. జై కాళి’తో పాటు టీవీకే పేరును ప్రస్తావిస్తూ ఈ నినాదాన్ని వినిపించాలని కోరారు. ఉప ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రచార సభల్లోనే కాకుండా రాబోయే రోజుల్లోనూ ప్రజలను కలిసిన ప్రతిచోటా, ఇంటింటి ప్రచారంలోనూ దీన్ని పునరావృతం చేయాలని సూచించారు.కరూర్ ఘటనపైనా విమర్శలుఇదే సమయంలో కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ ఉదయనిధి విజయ్‌పై విమర్శలు చేశారు. ఈ ఘటనలో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఘటనపై ప్రత్యర్థి పార్టీ నాయకత్వం మీడియా, ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుందని ఆయన ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో కొత్త నినాదంమదురాంతకం, ధారాపురం ఉపఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ ప్రచారం వేడెక్కింది. ఈ నేపథ్యంలో విజయ్ నినాదానికి ప్రతిగా ఉదయనిధి కొత్త నినాదాన్ని తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఇకపై ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారంలోనూ ఈ నినాదాన్ని విస్తృతంగా వినిపించాలని డీఎంకే శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.మరోవైపు.. విజయ్ కూడా డీఎంకేను లక్ష్యంగా చేసుకుని తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ‘ఓం శక్తి’–‘ఓం కాళి’ నినాదాల చుట్టూ తమిళనాడు రాజకీయ ప్రచారంలో కొత్త పోరు మొదలైంది. -
ఆస్పత్రిలో పుట్టిన ప్రతి పసికందుకు సీఎం విజయ్ గోల్డ్ రింగ్
-
మా మంచి మేనమామ.. సీఎం విజయ్ బంగారు కానుక (ఫొటోలు)
-
నా జీవితంలో మర్చిపోలేని గాయం: సీఎం విజయ్ ఎమోషనల్
చెన్నై: కరూర్ తొక్కిసలాట ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ మృతులకు నివాళులర్పించారు. 2025 సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన ఈ విషాద ఘటన తమ జీవితాల్లో ఎప్పటికీ మానని గాయంగా మిగిలిపోయిందని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు, తన మద్దతుదారులు, టీవీకే కుటుంబం ఈ విషాదాన్ని ఇప్పటికీ మరవలేకపోతున్నారని తెలిపారు.గతేడాది ఇదే రోజు.. సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో టీవీకే నిర్వహించిన సభలో భారీగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విషాదం తమ హృదయాల్లో మోస్తున్న బంధువుల జ్ఞాపకాలను మరింత బాధాకరంగా మార్చిందని విజయ్ అన్నారు. మృతుల కుటుంబాలు అనుభవిస్తున్న వేదనను మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. ఒకరికొకరం ఓదార్పుగా, అండగా, ఆశ్రయంగా నిలుద్దామని తెలిపారు.కరూర్ ఘటనపై దర్యాప్తు కూడా కొనసాగుతోంది. తొలుత తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఈ కేసు దర్యాప్తును స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ ఘటనకు సంబంధించి కార్యక్రమానికి అనుమతులు, జన సమూహ నియంత్రణ, పోలీసుల మోహరింపు, అత్యవసర స్పందన వంటి అంశాలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.என் நெஞ்சில் குடியிருக்கும் அனைவருக்கும் வணக்கம்.கடந்த வருடம். இதே நாள்.அதாவது 2025 செப்டம்பர் 27.என் வாழ்நாளில், நம் கரூர் சொந்தங்களின் வாழ்வில், நம் தமிழ்நாட்டு உறவுகளின் மனத்தில் ஆறாத ரணமாக, தீராத வலியாக, வேதனையான நிகழ்வு நடந்த நாள்.சொல்ல முடியாத சோகத்தைச் சுமந்து…— TVK Vijay (@TVKVijayHQ) September 27, 2026ఈ కేసులో టీవీకేకు చెందిన పలువురు నేతలను కూడా సీబీఐ విచారించింది. పార్టీ అధినేత విజయ్ను సైతం విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. కరూర్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన 41 మందిని గుర్తుచేసుకుంటూ విజయ్ వారికి ఘన నివాళి అర్పించారు. వారి జ్ఞాపకాలు ఎప్పటికీ తమతోనే ఉంటాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు.. -
వీరమణి కేసుపై విజయ్ సంచలన వ్యాఖ్యలు.. డీఎంకేకు కొత్త టెన్షన్?
తమిళనాడులో పోక్సో కేసు వ్యవహారం రాజకీయంగా మరోసారి చర్చకు వచ్చింది. గ్రానైట్ వ్యాపారి వీరమణికి సంబంధించిన పోక్సో కేసును గతంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం దాచిపెట్టిందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై డీఎంకే, అన్నాడీఎంకే ఎందుకు మౌనం వహిస్తున్నాయంటూ సీఎం ప్రశ్నించారు.మదురాంతకం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న విజయ్.. ఈ కేసు గత డీఎంకే ప్రభుత్వ హయాంలోనే వెలుగులోకి వచ్చిందని, అయితే ఆ కేసును, దాని పూర్వాపరాలను ప్లాన్ ప్రకారమే దాచిపెట్టారని ఆరోపించారు. స్టాలిన్ సర్.. నోరు విప్పండి. ఈ విషయంలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని మౌనంగా ఉంటారా?’ అంటూ ప్రశ్నించారు. మహిళల భద్రత కోసం తామే పనిచేస్తున్నామని డీఎంకే చేస్తున్న ప్రచారాన్ని కూడా విజయ్ విమర్శించారు. వీరమణి ఎంతోమంది యువతుల జీవితాలను నాశనం చేశారని ఆరోపిస్తూ.. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకే ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.పెన్‌డ్రైవ్‌తో మొదలై.. క్లోజర్ రిపోర్ట్ వరకు2025 అక్టోబర్‌లో ఓ స్వచ్ఛంద సంస్థకు గుర్తుతెలియని వ్యక్తి పెన్‌డ్రైవ్, లేఖ అందజేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో ఓ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఉందని పేర్కొంటూ వీరమణి పేరు ప్రస్తావించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుమారు ఐదు నెలల విచారణ అనంతరం పోలీసులు క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. వీడియోలో కనిపిస్తున్న బాలికను గుర్తించలేకపోవడం, ఒరిజినల్ వీడియో లభించకపోవడం, తగిన ఆధారాలు లేకపోవడం వంటి కారణాలను అందులో పేర్కొన్నారు. అయితే ప్రత్యేక పోక్సో కోర్టు ఈ క్లోజర్ రిపోర్టును అంగీకరించలేదు. మరింత దర్యాప్తు చేయాలని ఆదేశించింది.కోర్టు ఆదేశాలతో కేసులో కీలక మలుపుకోర్టు ఆదేశాల తర్వాత దర్యాప్తు వేగం పుంజుకుంది. వీడియోలో కనిపించిన బాలికను పోలీసులు గుర్తించి.. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు విస్తరించడంతో మరికొందరు బాధితులు కూడా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఏడుగురికి పైగా బాధితులను గుర్తించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరమణితో పాటు ఆయనకు చెందిన ఇద్దరు సహాయకులు మహేంద్ర సిమ్హన్, ఆయన భార్య శాంతిని ఆగస్టు 28న అరెస్టు చేశారు.విజయ్ సర్కార్ చర్యలుకేసు తీవ్రత పెరగడంతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని ఆదేశించింది. గత దర్యాప్తులో ఎవరైనా నిర్లక్ష్యం వహించారా? కేసును బలహీనపరిచే ప్రయత్నం జరిగిందా? అన్న కోణాల్లోనూ విచారణ సాగుతోంది. పోలీసు వ్యవస్థలోని అధికారుల పాత్రపై కూడా సమీక్ష మొదలైంది. దీంతో ఈ కేసు కేవలం నిందితులపై దర్యాప్తుకే పరిమితం కాకుండా.. గతంలో కేసును హ్యాండిల్ చేసిన తీరుపైనా విచారణ జరుగుతున్న వ్యవహారంగా మారింది.విజయ్ సర్కార్‌పై స్టాలిన్ సమాధానం..ఇదిలా ఉండగా.. కేసును అడ్డుకున్నారంటూ గత డీఎంకే ప్రభుత్వంపై టీవీకే వర్గాల నుంచి ఆరోపణలు రావడంతో రాజకీయ దుమారం మొదలైంది. వీరమణిని కాపాడాలని తమ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తనపై, తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు అసత్యం, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. బాలికలకు న్యాయం జరగడమే ఈ వ్యవహారంలో అందరి ప్రధాన లక్ష్యం కావాలని స్టాలిన్ పేర్కొన్నారు. దీంతో వీరమణి కేసు ఇప్పుడు క్రిమినల్ దర్యాప్తుతో పాటు తమిళనాడు రాజకీయాల్లోనూ ప్రధాన చర్చగా మారింది.ఇదీ చదవండి: కర్ణాటక సీఎం నోట సంచలన వ్యాఖ్యలు.. -
తమిళనాట ఉప ఎన్నికల హీట్.. సీఎం విజయ్ బిగ్ డెసిషన్
తమిళనాట ఉప ఎన్నికల వేడి పీక్స్‌కు చేరుతోంది. అక్టోబర్ 6న మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న వేళ.. సీఎం, టీవీకే అధినేత విజయ్ నేరుగా రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారాన్ని బూత్ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించిన విజయ్.. శుక్రవారం మదురాంతకంలో పార్టీ బూత్ స్థాయి నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో క్షేత్రస్థాయి ప్రచారం, ఓటర్లను కలిసే విధానం, స్థానిక సమస్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.కాగా, ఉపఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీకే అధినేత, సీఎం విజయ్‌కు ఇవే తొలి ఉపఎన్నికలు కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. మరోవైపు డీఎంకే అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగగా.. అన్నాడీఎంకే తనకు చేజారిన రెండు సీట్లను తిరిగి దక్కించుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. మదురాంతకం నుంచి టీవీకే తరఫున కే. మరగతం కుమారవేల్, ధారాపురం నుంచి పి. సత్యబామను బరిలోకి దించింది. వీరిద్దరూ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఆ రాజీనామాల కారణంగానే ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు అదే నియోజకవర్గాల నుంచి టీవీకే అభ్యర్థులుగా మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ ఉపఎన్నిక టీవీకేకు కీలక రాజకీయ సందర్భంగా మారింది. అక్టోబర్ 6న మదురాంతకంతో పాటు ధారాపురంలోనూ ఉపఎన్నిక జరగనుంది.ఇక, బూత్ ఏజెంట్ల సమావేశంలో మంత్రి ఎన్. ఆనంద్, మంత్రి ఆదవ్ అర్జున్ కూడా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రోడ్లు, తాగునీరు వంటి ప్రాథమిక సమస్యలను గుర్తించి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవాలని ఆనంద్ సూచించారు. అవసరాలను తెలుసుకునేందుకు మంత్రులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో రెండు, మూడు రోజులపాటు ఎమ్మెల్యేలతో కలిసి ఉండి.. ప్రత్యేకంగా ఫిర్యాదులను పరిష్కరించనున్నారు.డీఎంకే నుంచి గట్టి పోటీ..టీవీకేకు పోటీగా డీఎంకే కూడా రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మదురాంతకం నుంచి ఐ. పరంధామన్, ధారాపురం నుంచి ఎస్. సుగన్యను బరిలోకి దించింది. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ టీవీకే, డీఎంకే మధ్య నేరుగా పోటీ నెలకొంది.అన్నాడీఎంకేకు మరో లెక్క..ఇక ఈ రెండు సీట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుచుకున్నవే. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరడంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కోల్పోయిన స్థానాలను తిరిగి సాధించడంపై అన్నాడీఎంకే ఫోకస్ పెట్టింది. మదురాంతకంలో ఎస్. కనితా సంపత్, ధారాపురంలో కే. బానుమతిని అభ్యర్థులుగా నిలబెట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.అసలు పోరు ఇక్కడే..ఈ రెండు ఉపఎన్నికల్లో మూడు పార్టీలకు మూడు వేర్వేరు రాజకీయ లెక్కలు ఉన్నాయి. టీవీకేకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ప్రజా స్పందనను ఎన్నికల ద్వారా ఎదుర్కొనే అవకాశం ఉండగా.. డీఎంకే తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు బరిలో ఉంది. అన్నాడీఎంకే మాత్రం తన నుంచి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు టీవీకే తరఫున పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తిరిగి పోటీ చేస్తోంది. ఇదే అంశం ప్రచారంలో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. ఇక, మదురాంతకం, ధారాపురం రెండూ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. అక్టోబర్ 6న పోలింగ్, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదీ చదవండి: తమిళనాడు ఎప్స్టీన్ కేసులో కీలక పరిణామాలు -
తమిళనాడు ‘ఎప్స్టీన్’ కేసులో కీలక పరిణామాలు
తమిళనాడులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త ఆర్.వీరమణిపై నమోదైన పోక్సో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మైనర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ‘తమిళనాడు ఎప్స్టీన్ కేసు’గా చర్చనీయాంశమైంది. బాలికలపై లైంగిక దాడుల ఆరోపణలతో వీరమణి, ఆయన సహచరులు అరెస్టు కాగా.. గతంలో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసుల పాత్రపైనా ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో కేసుకు కేంద్రంగా ఉన్న వీడియోను ఓ జాతీయ మీడియా సంస్థ తాజాగా బయటపెట్టడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది.వీరమణి(84)పై ఆరోపణలకు కీలక ఆధారంగా పేర్కొంటున్న వీడియోను జాతీయ మీడియా సంస్థ యాక్సెస్ చేసి ప్రసారం చేసింది. అందులో ఓ బాలికతో ఆయన ఉన్నట్లు దృశ్యాలు చూపించింది. ఈ వీడియోను 2025 అక్టోబర్‌లోనే ఓ కాంగ్రెస్ నేత పోలీసులకు అందించినట్లు వెల్లడించింది. అయితే ఆ సమయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. మరోవైపు వీడియో స్పష్టత, ప్రామాణికతపై డీఎంకే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో అప్పటి దర్యాప్తులో ఏం జరిగింది? పోలీసులకు ఆధారాలు అందినప్పటికీ కేసు ఎందుకు ముందుకు సాగలేదు? అన్న ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.పెన్‌డ్రైవ్‌తో మొదలై.. క్లోజర్ రిపోర్ట్ వరకు2025 అక్టోబర్‌లో ఓ స్వచ్ఛంద సంస్థకు గుర్తుతెలియని వ్యక్తి పెన్‌డ్రైవ్, లేఖ అందజేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో ఓ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఉందని పేర్కొంటూ వీరమణి పేరు ప్రస్తావించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.సుమారు ఐదు నెలల విచారణ అనంతరం పోలీసులు క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. వీడియోలో కనిపిస్తున్న బాలికను గుర్తించలేకపోవడం, ఒరిజినల్ వీడియో లభించకపోవడం, తగిన ఆధారాలు లేకపోవడం వంటి కారణాలను అందులో పేర్కొన్నారు. అయితే ప్రత్యేక పోక్సో కోర్టు ఈ క్లోజర్ రిపోర్టును అంగీకరించలేదు. మరింత దర్యాప్తు చేయాలని ఆదేశించింది.కోర్టు ఆదేశాలతో కేసులో కీలక మలుపుకోర్టు ఆదేశాల తర్వాత దర్యాప్తు వేగం పుంజుకుంది. వీడియోలో కనిపించిన బాలికను పోలీసులు గుర్తించి.. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు విస్తరించడంతో మరికొందరు బాధితులు కూడా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఏడుగురికి పైగా బాధితులను గుర్తించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కేసులో వీరమణితో పాటు శాంతి, మహేంద్ర సిమ్హన్లను పోలీసులు అరెస్టు చేశారు. మరో మాజీ ఉద్యోగి గణేశన్‌ను కూడా డిజిటల్ ఆధారాల వ్యవహారంలో అరెస్టు చేసినట్లు జాతీయ మీడియా నివేదించింది.పాత దర్యాప్తుపైనే ఇప్పుడు ఫోకస్కేసు ఇక్కడితో ఆగలేదు. తొలుత దర్యాప్తు చేసిన పోలీసు అధికారుల వ్యవహారంపైనా అధికారులు దృష్టి పెట్టారు. అప్పట్లో కేసును ఎందుకు మూసివేయాలని నిర్ణయించారు? ఆధారాలు అందుబాటులో ఉన్నప్పటికీ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగలేదు? తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. పాత దర్యాప్తులో వ్యవహరించిన సీనియర్ పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. అదే సమయంలో వీరమణికి సంబంధించిన కార్యాలయాలు, గెస్ట్‌హౌస్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న మరికొందరి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది.విజయ్ సర్కార్ చర్యలుకేసు తీవ్రత పెరగడంతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని ఆదేశించింది. గత దర్యాప్తులో ఎవరైనా నిర్లక్ష్యం వహించారా? కేసును బలహీనపరిచే ప్రయత్నం జరిగిందా? అన్న కోణాల్లోనూ విచారణ సాగుతోంది. పోలీసు వ్యవస్థలోని అధికారుల పాత్రపై కూడా సమీక్ష మొదలైంది. దీంతో ఈ కేసు కేవలం నిందితులపై దర్యాప్తుకే పరిమితం కాకుండా.. గతంలో కేసును హ్యాండిల్ చేసిన తీరుపైనా విచారణ జరుగుతున్న వ్యవహారంగా మారింది.విజయ్ సర్కార్‌పై స్టాలిన్ రిప్లైఇదిలా ఉండగా.. కేసును అడ్డుకున్నారంటూ గత డీఎంకే ప్రభుత్వంపై టీవీకే వర్గాల నుంచి ఆరోపణలు రావడంతో రాజకీయ దుమారం మొదలైంది. వీరమణిని కాపాడాలని తమ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తనపై, తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు అసత్యం, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. బాలికలకు న్యాయం జరగడమే ఈ వ్యవహారంలో అందరి ప్రధాన లక్ష్యం కావాలని స్టాలిన్ పేర్కొన్నారు. దీంతో వీరమణి కేసు ఇప్పుడు క్రిమినల్ దర్యాప్తుతో పాటు తమిళనాడు రాజకీయాల్లోనూ ప్రధాన చర్చగా మారింది.అసలు ప్రశ్నలివే..ఇప్పుడు ఈ కేసులో అసలు ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. పోలీసులకు వీడియో ఎప్పుడు చేరింది? ఆధారాలు ఉన్నప్పటికీ తొలి దర్యాప్తు క్లోజర్ రిపోర్టు వరకు ఎందుకు వెళ్లింది? కోర్టు ఆదేశాల తర్వాతే బాధితులను గుర్తించే దిశగా దర్యాప్తు ఎలా ముందుకు సాగింది? ఈ అంశాలపై విజయ్ సర్కార్ దృష్టి సారించడంతో పాత దర్యాప్తు తీరుపైనా విచారణ జరుగుతోంది. మరోవైపు వీరమణిని కాపాడారన్న ఆరోపణలను స్టాలిన్ ఖండిస్తూ.. తమ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో నిందితులపై కేసు దర్యాప్తుతో పాటు.. గతంలో ఈ వ్యవహారాన్ని పోలీసులు ఎలా నిర్వహించారన్నది కూడా ఇప్పుడు కీలకంగా మారింది.ఇదీ చదవండి: విద్యార్థుల మెనూలోకి బీఫ్ -
టీమిండియా క్రికెటర్‌కు తమిళనాడు సీఎం విజయ్ భారీ నజరానా
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియాలో సభ్యురాలైన భారత మహిళా క్రికెటర్ జి కమలికి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.75 లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు వెల్లడించారు. మదురైకి చెందిన కమలిని ప్రతిభను ప్రత్యేకంగా అభినందించిన సీఎం విజయ్.. ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కమలిని విజయం రాష్ట్రంలోని యువతకు, మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జట్టు సాధించిన చారిత్రాత్మక విజయంపై హర్షం వ్యక్తం చేశారు.వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కమలిని ఇప్పటికే భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2024లో మహిళల అండర్-19 ఆసియా కప్, 2025లో అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్లలో ఆమె భాగమైంది.వైస్ జగన్ అభినందనలుమరోవైపు ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అభినందించారు. జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీ చరణిని ప్రత్యేకంగా ప్రశంసించారు.కాగా, నిన్న జరిగిన ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఫైనల్స్‌లో భారత్ శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసి, వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది.స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, శ్రీచరణి, శ్రేయాంక, షఫాలీ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇదీ చదవండి: ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. స్వర్ణం మనదే! -
సీఎం విజయ్ సర్ ప్రైజ్.. పిల్లలకు స్వయంగా బ్రేక్ ఫాస్ట్ వడ్డింపు
-
థాంక్యూ విజయ్ మామ (చిత్రాలు)
-
పిల్లలతో సీఎం విజయ్.. స్వయంగా వడ్డించి, వారితోనే టిఫిన్
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం మరో కీలక పథకం ఆచరణలోకి తెచ్చింది. పాఠశాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఉచిత అల్పాహార పథకం మరింత విస్తరించింది. ఇప్పటివరకు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే అందుతున్న పథకాన్ని.. ఇప్పుడు 6 నుంచి 8వ తరగతి వరకు విస్తరించారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం ఉదయం చెన్నై తిరువాన్మియూర్లోని గాంధిగ్రామం ప్రభుత్వ పాఠశాలలో దీనిని ప్రారంభించారు.‘పెరుంతలైవర్(మహానేత) కామరాజర్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం విస్తరణతో రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 15.30 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. 15,454 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 6, 7, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఉదయం అల్పాహారం అందనుంది. ఇప్పటివరకు ప్రాథమిక తరగతులకే పరిమితమైన ఈ పథకం తొలిసారి మధ్య పాఠశాల స్థాయికి చేరింది.పథకం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయ్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వారికి అల్పాహారం వడ్డించి, వారితో కలిసి కూర్చుని తిన్నారు. గాంధిగ్రామం పాఠశాలలో ప్రారంభ కార్యక్రమం సందర్భంగా 217 మంది విద్యార్థులు అల్పాహారం తీసుకున్నారు. వారికి పొంగల్, సాంబార్, స్వీట్ వడ్డించినట్లు సమాచారం. విద్యార్థులతో వారి చదువు, తరగతుల గురించి కూడా విజయ్ మాట్లాడారు. ఈ విస్తరణ కోసం 2026–27 ఆర్థిక సంవత్సరంలో టీవీకే ప్రభుత్వం అదనంగా రూ.217.63 కోట్లు కేటాయించింది. దీంతో అల్పాహార పథకానికి మొత్తం కేటాయింపు రూ.724 కోట్లకు చేరింది.🔔 | பெருந்தலைவர் காமராஜர் காலை உணவு திட்ட விரிவாக்கத்தினை தொடங்கி வைத்தார் முதலமைச்சர் விஜய் ! #Kamarajar | #CMJosephVijay pic.twitter.com/2sraGsQ0tE— Prakash Vijay (@PrakazVijay_Of) September 22, 2026#CMJosephVijay had breakfast with schoolchildren during the expansion of Perunthalaivar Kamarajar’s Breakfast Scheme..⭐ pic.twitter.com/JUPrGFAkDf— Laxmi Kanth (@iammoviebuff007) September 22, 2026రెండు జిల్లాల్లో మాత్రం నో..అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న చెంగల్పట్టు, తిరుప్పూర్ జిల్లాల్లో మాత్రం ఈ విస్తరణను మంగళవారం నుంచి అమలు చేయలేదు. మదురాంతకం, ధరాపురం నియోజకవర్గాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు మినహాయింపు ఇచ్చారు. మిగిలిన రాష్ట్రంలోని అర్హత ఉన్న పాఠశాలల్లో పథకం అమల్లోకి వచ్చింది.చెన్నై నగర పరిధిలోని 447 ప్రభుత్వ, ప్రభుత్వ సాయంతో నడిచే పాఠశాలలకు సమీకృత వంటశాలల(ఒకే దగ్గర వండి) ద్వారా అల్పాహారం అందించనున్నారు. ఇతర నగరాలు, మున్సిపాలిటీలు, వాటికి ఆనుకుని ఉన్న పట్టణ ప్రాంతాల్లోని 2,150 పాఠశాలలకు కూడా ఇదే రీతిలో ఆహారం సరఫరా చేస్తారు. గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లోని 12,857 పాఠశాలల్లో స్థానికంగా వంట చేసి విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేశారు.మెనూలో ఏం ఉంటుందంటే..విద్యార్థులకు అందించే అల్పాహారంలో ఉప్పుమా, కిచిడీ, పొంగల్ వంటి వంటకాలు ఉన్నాయి. వారంలో కొన్ని రోజులు చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని కూడా అందించేలా ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో మెనూలో ప్రొటీన్ శాతం పెంచేందుకు నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ తెలిపారు. కొత్త మెనూను ముందుగా ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత అమలు చేయనున్నట్లు చెప్పారు.తల్లిదండ్రులకు విజయ్ పేరుతో మెసేజ్పథకం విస్తరణ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ముఖ్యమంత్రి విజయ్ పేరుతో SMSలు కూడా పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా పథకం విస్తరణపై తల్లిదండ్రులకు సమాచారం అందించేలా ఈ సందేశాలను పంపినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.స్టాలిన్ హయాంలోనే..తమిళనాడులో పాఠశాల పిల్లలు ఉదయం ఆకలితో తరగతులకు హాజరుకాకుండా చూడటం, పోషకాహారాన్ని అందించడం, పాఠశాల హాజరు–చదువుపై ఏకాగ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ అల్పాహార పథకాన్ని 2022లో ప్రారంభించారు. తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అమలు చేసి, ఆ తర్వాత ఎయిడెడ్ స్కూళ్లకు కూడా విస్తరించారు. తాజా నిర్ణయంతో 6 నుంచి 8వ తరగతి విద్యార్థులూ ఈ పథకం పరిధిలోకి వచ్చారు.ఇదీ చదవండి: ఆయన వయసు 125 ఏళ్లు.. సర్ షాక్ -
1200 కోట్లతో సచివాలయం, అసెంబ్లీ.. సీఎం విజయ్ సముద్రం చూసేందుకేనా!?
సాక్షి,చెన్నై: వందేళ్లు గుర్తుండిపోయేలా రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో, 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయ-శాసనసభ సముదాయాన్ని నిర్మించాలని సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలోని పట్టినాపక్కంలో తలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌పై రాజకీయ దుమారం రేగింది. ఈ ప్రతిపాదనను డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల ఇళ్లను, వారి జీవనోపాధిని ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ దెబ్బతీస్తుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న మత్స్యకార సంఘాలకు డీఎంకే పూర్తి మద్దతు ఇస్తుందని, ప్రభుత్వం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే తాము కూడా ప్రత్యక్ష నిరసనల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు.జ్యోతిష్యుల సలహా మేరకేనా?ఇప్పటికే రద్దీగా ఉండే ప్రాంతంలో కొత్త సచివాలయం అవసరం ఏముందని స్టాలిన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో డీఎంకే ప్రభుత్వం సచివాలయాన్ని నిర్మించిన ఒమాందూరార్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ స్థలాలు చాలానే ఉన్నాయని గుర్తుచేశారు. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం సముద్రం వైపు ఉండాలని జ్యోతిష్యులు సలహా ఇవ్వడం వల్లే ప్రభుత్వం పట్టినాపక్కం ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి సముదాయాలు సీఎం పనిచేయడానికి ఉద్దేశించినవే కానీ, సముద్రం వైపు చూస్తూ కూర్చోవడానికి కాదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు.ట్రాఫిక్,పర్యావరణ సమస్యలు ప్రతిపాదిత స్థలం చుట్టూ అనేక పాఠశాలలు ఉన్నాయని, ఇప్పటికే అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉందని స్టాలిన్ పేర్కొన్నారు. అక్కడ భారీ ప్రభుత్వ సముదాయం వస్తే విద్యార్థులకు, స్థానికులకు నరకం చూపుతుందన్నారు. మరోవైపు ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఐ(ఎం) కూడా తీర ప్రాంత పర్యావరణ ముప్పును ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించింది. మిత్రపక్షాల మాటను కూడా లెక్కచేయకుండా టీవీకే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని స్టాలిన్ మండిపడ్డారు.ప్రభుత్వం క్లారిటీ ఈ విమర్శలపై ప్రభుత్వం తరఫున పీడబ్ల్యూడీ మంత్రి ఆధవ్ అర్జున స్పందిస్తూ.. ప్రస్తుతం సచివాలయ సముదాయానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపొందించాలని మాత్రమే ఆదేశించామని, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి : సీఎం విజయ్ ‘ప్రధాని’ కలలు?.. చురకలంటించిన కాంగ్రెస్! -
క్లాస్ పీకిన సుప్రీంకోర్టు.. వెనక్కి తగ్గని విజయ్ సర్కార్
హిందీ భాష విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనూ తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు భూమి కేటాయించబోమని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్‌మోహన్ స్పష్టం చేశారు. అలాగే తమిళనాడు రెండు భాషల విధానానికే కట్టుబడి ఉంటుందని తెలిపారు.నవోదయ పాఠశాలల్లో మూడు భాషల విధానం అమలవుతుండటం, అందులో హిందీ ఉండటంపై తమిళనాడు విజయ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో కచ్చితంగా భూములు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు గత ఆదేశాలను సమీక్షించాలంటూ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మైండ్ సెట్ మార్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి చురకలు అంటించింది. అయితే హిందీకి తాము వ్యతిరేకం కాదని, తమిళానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ విధానమని మంత్రి రాజ్‌మోహన్ అంటున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తుది తీర్పు కాదని, కేసు ఇంకా విచారణలోనే ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో సీఎం విజయ్ చర్చిస్తున్నట్లు సమాచారం.నవోదయ పాఠశాలల కోసం ప్రతి జిల్లాలో భూమిని గుర్తించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న వెనక్కి తీసుకోలేదు. మరో మూడు నెలల గడువు ఇచ్చింది. కేంద్రం, రాష్ట్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం.. తమిళనాడు హిందీపై తన ‘మైండ్‌సెట్’ మార్చుకోవాలని, రాష్ట్రంలో హిందీ బోధించకూడదనే వైఖరి ఉండకూడదని వ్యాఖ్యానించింది.ఈ పరిణామాల మధ్య తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వ వైఖరికి మద్దతు తెలిపారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు అవసరం లేదని, ఇప్పటికే మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి నవోదయ పాఠశాలలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. అదే సమయంలో హిందీకి తాము వ్యతిరేకం కాదని, హిందీని బలవంతంగా అమలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.దీంతో తమిళనాడులో అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. రాజకీయంగా పరస్పరం విభేదిస్తున్నప్పటికీ భాషా విధానం విషయంలో ఒకే వైఖరితో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య ఈ వివాదం తదుపరి విచారణలో ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: బెంగాల్లో బీజేపీ సర్కార్.. మరీ ఇంత ఘోరమా? -
సీఎం విజయ్ మరో సంచలనం.. మేనమామగ!
తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి దశాబ్ధాలుగా ఉన్న పార్టీలకే చెక్ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన నాటి నుంచి తనదైన పాలనా మార్కును చూపిస్తున్న విజయ్ ఇప్పుడు మరో అద్భుత పథకం అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే బంగారు తల్లులకు కానుకగా గ్రాము పుత్తడి ఇచ్చే పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.తమిళనాడు ప్రజలకు విజయ్ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది.. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన నవజాత శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరాల బహుమతి. ఈ నేపథ్యంలోనే 'తైమామన్ తంగ మోతిరం' (మేనమామ బంగారు ఉంగరం) పథకం సెప్టెంబర్ 28న లాంఛనంగా ప్రారంభించబడుతునట్లు సమాచారం. అయితే దీనికి ఈ ఏడాది జూన్ 22 నుండి ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన పిల్లలందరూ అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ లెక్కలుప్రభుత్వ లెక్కల ప్రకారం తమిళనాడులో ఏటా సుమారు 7.8 లక్షల జననాలు నమోదవుతాయి. వీటిలో దాదాపు 99.9 శాతం ప్రసవాలు ఆసుపత్రులలో జరుగుతుండగా, సుమారు 4.2 లక్షలు - అంటే 53 శాతం - ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్నాయి. తమిళనాడు శాశ్వత నివాసితులై, ఆర్.సి.హెచ్. గుర్తింపు సంఖ్యతో పి.ఐసి.ఎం.ఇ.లో నమోదు చేసుకున్న తల్లుల నవజాత శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఉంగరానికి ఒక ప్రత్యేకమైన సీరియల్ నంబర్ ఉంటుందని అది ట్యాంపర్-ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో సరఫరా చేయబడుతుంది. మొదటి దశలో ఇప్పటికే 1.28 లక్షల ఉంగరాలను సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.రెండు నియోజకవర్గాలకు బైపోల్ తమిళనాడులో మధురాంతకం, ధరాపురం నియోజకవర్గాలలో అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉపఎన్నికల కోసమని ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది. దీంతో ప్రస్తుతానికి ఆ రెండు నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు తాత్కాలికంగా నిలిచిపోనుంది. -
మహేష్ ఖలేజా చాలా ఇష్టం.. విజయ్ కొడుకు ఆసక్తికర కామెంట్స్!
-
టీవీకేకు తలపోటు.. తమిళనాట మరో ట్విస్ట్!
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే-కాంగ్రెస్ పొత్తు మరో కొత్త మలుపు తీసుకుంది. విజయ్, రాహుల్ గాంధీ మధ్య ప్రధాని అభ్యర్థిత్వంపై మొదలైన చర్చ ఇప్పుడు కాంగ్రెస్ నేతల మధ్యే మాటల యుద్ధానికి దారితీసింది. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పొత్తు భాగస్వాములు అంగీకరించాల్సిందేనని మాజీ టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై స్పష్టం చేయగా.. అసలు రాహుల్‌కు వ్యతిరేకంగా టీవీకే ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి కౌంటర్ ఇచ్చారు. దీంతో పొత్తులో అంతా సవ్యంగానే ఉందా? లేక ప్రధాని అభ్యర్థి అంశం అసలు పంచాయితీగా మారిందా? అన్న చర్చ మొదలైంది.తమిళనాడులో టీవీకే-కాంగ్రెస్ పొత్తు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2029 లోక్‌సభ ఎన్నికల ప్రధాని అభ్యర్థిత్వంపై రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే పార్టీలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించాలని సెల్వపెరుంతగై వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రధాని అభ్యర్థి అయితే.. పొత్తు భాగస్వాములు దాన్ని అంగీకరించాలని, అలా లేనప్పుడు అలాంటి పొత్తు అవసరం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ తమ నేతను ప్రధాని అభ్యర్థిగా బహిరంగంగా, స్పష్టంగా అంగీకరించే పార్టీలతోనే పొత్తు పెట్టుకోవడం సముచితమని పేర్కొన్నారు.‘పొత్తులో ఎలాంటి సమస్య లేదు’సెల్వపెరుంతగై వ్యాఖ్యలపై ప్రవీణ్ చక్రవర్తి స్పందిస్తూ.. పొత్తులో ఎలాంటి గందరగోళం లేదని అన్నారు. టీవీకే అధికారికంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పారు. ఇటీవల జరిగిన కూటమి సమావేశంలో అన్ని భాగస్వామ్య పార్టీలు కలిసి చర్చించాయని, ముఖ్యమంత్రి విజయ్ కూడా సమావేశంలో ఉన్నారని తెలిపారు. అందరూ కలిసి మాట్లాడుకున్నారని, పొత్తు బలంగానే ఉందని పేర్కొన్నారు.‘నవ్వుతూ మాట్లాడితే ఒప్పందమా?’ప్రవీణ్ వ్యాఖ్యలకు సెల్వపెరుంతగై సోషల్ మీడియా వేదికగా మళ్లీ స్పందించారు. నాయకులు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడాన్ని ప్రధాని అభ్యర్థిత్వంపై అంగీకారంగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విజయ్ లేదా టీవీకేలోని కీలక నేతల్లో ఎవరైనా రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని స్పష్టంగా చెప్పారా? అని నిలదీశారు. అలా చెప్పి హామీ ఇచ్చి ఉంటే తనకు తెలియజేయాలని కోరారు.ఇదిలా ఉండగా.. ఇటీవల టీవీకేకు చెందిన కొందరు నేతలు 2029 లోక్‌సభ ఎన్నికల్లో విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్థిగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులోని రెండు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు బహిరంగమయ్యాయి. ప్రస్తుతం టీవీకే-కాంగ్రెస్ పొత్తులో అసలు పరీక్ష సీట్ల సర్దుబాటు కాదు.. ప్రధాని అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం అనే చర్చ మొదలైంది.అసలు చిక్కు టీవీకేకే..ఈ వ్యవహారంలో టీవీకే ముందున్నది కీలకమైన ప్రశ్న. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్న సొంత నేతల వ్యాఖ్యలకు బ్రేక్ వేయాలా? లేక రాహుల్ గాంధీ పేరుపై కాంగ్రెస్ కోరుతున్న స్పష్టత ఇవ్వాలా? అన్నది ఆ పార్టీ తేల్చుకోవాల్సి ఉంది. విజయ్ పేరుపై పట్టుబడితే కాంగ్రెస్‌తో పొత్తులో విభేదాలు మరింత బహిర్గతమయ్యే అవకాశం ఉంది. రాహుల్ అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపితే విజయ్ను ప్రధాని ముఖంగా ముందుకు తెస్తున్న నేతలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు పొత్తు.. మరోవైపు ప్రధాని పీఠంపై ఆశలు.. ఈ రెండింటి మధ్య టీవీకే ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నదే ఇప్పుడు అసలు ఉత్కంఠ. విజయ్ మౌనం వీడి స్పష్టత ఇస్తారా? లేక ఈ పంచాయితీని కూటమి నేతలకే వదిలేస్తారా? అన్నది చూడాలి.ఇదీ చదవండి: సీఎం రెండో పెళ్లిపై బిగ్ ట్విస్ట్.. -
నేను త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని కాదు : సీనియర్ నటి అంబిక
మొన్నటి వరకు కోలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోయిన్ త్రిష పేరు రాష్ట్రంలో బాగా వినిపిస్తోంది. ఆయన ఎన్నికల్లో గెలిచి, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనీ, రాజకీయాల్లోనూ త్రిష పేరు మరింత ట్రెండ్ అయింది. ప్రతి పక్షాలు సైతం ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆమె పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. సీఎం విజయ్, త్రిషల మధ్య ఉన్న సంబంధంపై రకరకాల పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవి నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్‌లు కలిసి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల సీఎం విజయ్ యూకే పర్యటనకు వెళ్లగా.. త్రిష కూడా అతని వెంట వెళ్లింది. ఇద్దరు లండన్‌లో కలిసి కనిపించిన వీడియో ఇటీవల నెట్టింట బాగా వైరల్ అయింది. కారు రేసింగ్ ఈవెంట్స్‌కి విజయ్ వెళ్లగా..త్రిష కూడా అక్కడ కనిపించింది. రేసింగ్ ఈవెంట్‌ను విజయ్ గ్యాలరీ నుంచి వీక్షిస్తుండగా సడెన్‌గా త్రిష మధ్యలోకి వచ్చింది. అయితే విజయ్ వెంటనే తన ముఖం వీడియోలో పడకుండా పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. వీరిద్దరు కలిసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో త్రిష, విజయ్‌ల స్నేహం మరోసారి చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ‘బిర్యానీ’ కోసం జుట్టు, గెడ్డం పెంచా.. యాక్షన్ సీన్స్ కూడా చేశా : సంపూర్ణేష్ బాబు)తాజాగా దీనిపై నటి అంబిక స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. త్రిష స్థానంలో ఉంటే తాను అలా కెమెరాల ముందు కనిపించేదాన్ని కాదని చెప్పింది. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకున్నంత మాత్రాన పాత స్నేహాలను వదులుకోవాల్సిన అవసరం లేదు.కానీ, మనం ఆలోచించినంత ఉన్నతంగా బయటి వ్యక్తులు ఉండరు. మన ప్రవర్తన వల్ల మన స్నేహితుడిపై విమర్శలు వస్తాయని తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను త్రిష స్థానంలో ఉంటే, విమర్శలు వస్తాయని తెలిస్తే, నేను విజయ్‌తోపాటు వెళ్లకుండా ఉంటాను. ఇది నా అభిప్రాయం. మనం స్నేహానికి విలువ ఇవ్వాలి, కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి’ అని అంబిక చెప్పుకొచ్చింది. అంబిక విషయానికొస్తే.. కన్నడ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, మురళీ మోహన్, కృష్ణ రాజు వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. దాదాపు ఆమె 300పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించింది. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో కూడా నటించి, తన నటనా ప్రస్థానాన్ని కొనసాగించారు. 1988లో, అంబిక అమెరికాకు చెందిన ఒక డాక్టర్ మీనన్ ను వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లారు. ఎనిమిది సంవత్సరాల పాటు వైవాహిక జీవితం గడిపి, ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన తర్వాత, కొన్ని కారణాల వల్ల 1996లో ఆమె విడాకులు తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. Thalapathy Vijay didn't expected her entry ? He looks UNCOMFORTABLE right after the moment trisha entered the frame 👀#Thalapathy #Vijay #Ajithkumar #TVK pic.twitter.com/2lDJpW5hnP— Gokul (@ItzGokulVJ) September 12, 2026 -
భద్రతా కారణాలతో విజయ్ లండన్ కార్యక్రమం రద్దు
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ కోసం లండన్‌లో భారీగా తరలివచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లండన్‌లోని ప్రముఖ ‘ది షార్డ్’ భవనం వద్ద విజయ్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో అధికారులు రద్దు చేశారు. వందలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో భాగంగా యూకేలో ఉన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు మంగళవారం ‘ది షార్డ్’ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పలువురు అభిమానులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. అయితే భారీగా జనసమీకరణ జరగడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.‘అనుమతి రాలేదు.. కార్యక్రమం రద్దు’భద్రతా కారణాలతో కార్యక్రమానికి అవసరమైన అనుమతి లభించలేదని విజయ్ బృందం ప్రకటించింది. లౌడ్‌స్పీకర్ ద్వారా అభిమానులకు సమాచారం అందిస్తూ.. ప్రజల భద్రత దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో విజయ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు గంటల తరబడి ఎదురు చూసినట్లు పీటీఐ తెలిపింది.VIDEO | UK: Vijay fan greeting event in London called off due to 'health and safety' reasons after large number of people gather to see Tamil Nadu CM.Announcement was made by the authorities outside CM Vijay's hotel at the Shard in London on Tuesday.(Full video available on… pic.twitter.com/l4GDVUL6Fk— Press Trust of India (@PTI_News) September 15, 2026తలా-దళపతి.. విమర్శలకు టీవీకే కౌంటర్ఇదిలా ఉండగా.. విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి లండన్ వెళ్లినట్లు చెబుతున్న విజయ్.. తన స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసును వీక్షించడంపై డీఎంకే నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పెట్టుబడుల పర్యటన పేరుతో వెళ్లి రేసు కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శించారు. దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. విజయ్ అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ అజిత్‌ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్‌లో అజిత్‌కు ఉన్న గుర్తింపును తమిళనాడు బ్రాండ్ ప్రమోషన్‌కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.పెట్టుబడుల కోసం విజయ్ యూకే పర్యటనఇదిలా ఉండగా విజయ్ యూకే పర్యటన ప్రధానంగా తమిళనాడుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంపైనే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సుమారు రూ.12,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా రాష్ట్రంలో 9,400కు పైగా హై-వాల్యూ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడును ఆసియాలో అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ తన యూకే పర్యటనను ముగించుకుని బుధవారం భారత్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విజయ్‌పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ -
‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’.. దోస్తీ అంటూనే విజయ్‌తో కుస్తీ!
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. విజయ్ ఏర్పాటు చేయబోయే సెక్యులర్ కూటమికి దూరంగా ఉంటామని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. అంతేకాదు.. 120 రోజుల విజయ్ పాలనపై తీవ్ర విమర్శలకు సిద్ధపడినట్లు బహిరంగంగా ప్రకటించాయి. ఇది చాలదన్నట్లు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇవన్నీ డీఎంకేకు లాభం చేకూర్చే నిర్ణయాలేనని, ప్రతిపక్షానికి మళ్లీ అవి దగ్గరవుతున్నాయా? అనే చర్చా జోరందుకుంది.తమిళనాడులో అక్టోబర్ 6న జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మదురాంతకంలో సీపీఎం, ధారాపురంలో సీపీఐ అభ్యర్థులను బరిలోకి దించనున్నాయి. సెప్టెంబర్ 15న అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే నేతృత్వంలోని కూటమితో పాటు డీఎంకే, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి, నామ్ తమిళర్ కట్చి ఇప్పటికే రంగంలో ఉన్నాయి. వామపక్షాల తాజా నిర్ణయంతో పోరు ఐదు కోణాల్లో సాగనుంది. అయితే ఈ పోటీ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని.. విజయ్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దీంతో బయటి నుంచే సపోర్ట్ చేస్తున్న వామపక్షాలు.. ఉప ఎన్నికల వేళ మాత్రం అదే ప్రభుత్వ అభ్యర్థులకు ఎదురుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ నిర్ణయం డీఎంకేకు లాభం చేకూర్చేందుకు కాదని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేశాయి. టీవీకే ఏర్పాటు చేయబోయే కొత్త కూటమిలో మేం చేరబోం. మూడు ప్రధాన కూటములకూ వ్యతిరేకంగా మేం పోటీ చేస్తున్నాం. అంతే తప్పా ఏ పార్టీకో లాభం చేకూర్చేందుకు మేం పోటీ చేయడం లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం తేల్చిచెప్పారు. బయట మద్దతు.. లోపల విమర్శలు2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెజార్టీకి కొంత దూరంలో నిలిచిన విజయ్ ప్రభుత్వానికి సీపీఐ, సీపీఎం బయట నుంచి మద్దతు ప్రకటించాయి. ప్రజల తీర్పును గౌరవించడం, గవర్నర్ పాలనకు అవకాశం లేకుండా చూడటం, పరోక్షంగా బీజేపీ పాలన రాకుండా అడ్డుకోవడమే తమ మద్దతు ఉద్దేశమని అప్పట్లో వామపక్షాలు తెలిపాయి. అయితే కేబినెట్లో మాత్రం చేరలేదు. అలాగే టీవీకే అధికారిక కూటమిలోనూ భాగం కాలేదు.ఇప్పుడు ఉప ఎన్నికల్లో మాత్రం టీవీకే అభ్యర్థులపై పోటీకి దిగుతున్నాయి. దీంతో ‘ప్రభుత్వానికి మద్దతు.. అభ్యర్థులకు వ్యతిరేకం’ అనే వామపక్షాల వైఖరి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీనిపై విమర్శలు వచ్చినా.. ఉప ఎన్నికలు ప్రభుత్వం మార్పు కోసం జరిగేవి కావని షణ్ముగం స్పష్టం చేశారు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడం తమ రాజకీయ నిర్ణయమని తెలిపారు.120 రోజుల పాలనపై ప్రచారంలోనే కౌంటర్ఉప ఎన్నికల ప్రచారాన్ని విజయ్ ప్రభుత్వంపై విమర్శలకు వేదికగా చేసుకుంటామని సీపీఎం ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ తొలి 120 రోజుల పాలన, ఆర్థిక విధానాలు, పరిపాలనా చర్యలు, అసెంబ్లీ పనితీరుపై తమ అభిప్రాయాలను ప్రజలకు వివరిస్తామని షణ్ముగం చెప్పారు. ముఖ్యంగా ‘నియో లిబరల్’ ఆర్థిక విధానాలపై తమ అభ్యంతరాలను ప్రచారంలో ప్రస్తావిస్తామన్నారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత ఉండాలని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి.సచివాలయం విషయంలోనూ విభేదాలుచెన్నైలోని పట్టినప్పాక్కంలో కొత్త సచివాలయం, అసెంబ్లీ సముదాయం నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపైనా వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై మత్స్యకారుల జీవనోపాధి, పర్యావరణం, ట్రాఫిక్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని కోరాయి. అసెంబ్లీలో డీఎంకే అధినేత స్టాలిన్‌పై విజయ్ చేసిన వ్యాఖ్యలు, చేతి సైగలపైనా సీపీఎం గతంలో తీవ్రంగా స్పందించింది. సభను వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చొద్దని షణ్ముగం సూచించారు.‘ఇది ప్రజలపై రుద్దిన ఎన్నిక’మదురాంతకం, ధారాపురం ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయన్న దానిపైనా వామపక్షాలు టీవీకేపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 2026 ఎన్నికల్లో ఈ రెండు స్థానాల నుంచి అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కే. మరగతం కుమారవేల్, పి. సత్యబామలు ఆ తర్వాత రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఇప్పుడు అదే స్థానాల నుంచి టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.ఎన్నికైన కొద్ది రోజులకే ఎమ్మెల్యేలు పార్టీ మారి రాజీనామా చేయడం ప్రజల తీర్పును అవమానించడమేనని సీపీఎం విమర్శించింది. ఈ పరిణామాల వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని.. ఇవి సహజంగా వచ్చిన ఎన్నికలు కావని, ప్రజలపై రుద్దిన ఎన్నికలని షణ్ముగం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పు వెనుక ‘హార్స్ ట్రేడింగ్’ జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.రెండు సీట్లలో గెలిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తమ గొంతును మరింత బలంగా వినిపించవచ్చన్నది వామపక్షాల లెక్క. అందుకే ప్రభుత్వం విషయంలో విజయ్‌కు మద్దతు కొనసాగిస్తూనే.. ఎన్నికల విషయంలో మాత్రం టీవీకేను ఢీకొట్టాలని నిర్ణయించాయి. అంటే.. ప్రభుత్వం నిలబడేందుకు దోస్తీ.. తమ రాజకీయ బలం చాటుకునేందుకు కుస్తీ! ఇదే ఇప్పుడు తమిళనాడు ఉప ఎన్నికల్లో లెఫ్ట్ అనుసరిస్తున్న ‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’ అనే ప్రశ్నకు అసలు సమాధానం.ఇదీ చదవండి: బిహార్‌లో బీజేపీకి ఝలక్ -
దోస్త్ మేరా దోస్త్ ట్రేండింగ్ లో విజయ్, అజిత్ వీడియో
-
ఇది 'సీఎం విజయ్' వినాయకుడు.. ఫొటోలు వైరల్
ఒకప్పుడు వినాయక చవితి అంటే పద్ధతిగా పందిరి వేసి జరుపుకొనేవారు. కానీ గత కొన్నేళ్లలో సినిమా హీరోలు, క్రికెటర్లని పోలినట్లు ఉండే వినాయక ప్రతిమలు తయారు చేస్తున్నారు. గతేడాది 'పుష్ప' తరహా బొమ్మలు కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి అలాంటిదేం లేనప్పటికీ తమిళనాడులో మాత్రం వినాయక చవితిలోనూ సీఎం విజయ్ మేనియానే నడుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?)ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచిన హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి పండగ రావడంతో విజయ్ సైకిల్ తొక్కిన, కోటు వేసుకుని గడ్డం కింద చేయి పెట్టినట్లు, అలానే గిల్లీ చిత్రంలో కబడ్డీ ఆడుతున్న విజయ్ తరహా వినాయకుడి బొమ్మలు తమిళనాడులో కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్.. వీడియో) -
ఫ్యాన్స్ ఫైట్ చేస్తుంటే.. స్టార్స్ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)
-
టీవీకే సర్కార్‌కు డీఎంకే షాక్.. విజయ్ ప్లాన్‌కు బ్రేక్ తప్పదా?
చెన్నై: తమిళనాడులో మరోసారి అధికార టీవీకే, డీఎంకే మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడులో కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయం నిర్మాణం విషయం రాజకీయ రగడకు కారణమవుతోంది. చెన్నైలోని పటినపాక్కంలో 25.55 ఎకరాల్లో రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును డీఎంకే వ్యతిరేకించింది. అక్కడ సచివాలయం నిర్మిస్తే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆ పార్టీ ఎంపీ విల్సన్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నిర్మాణాన్ని అనుమతించబోమని తేల్చిచెప్పారు.అయితే కొత్త స్థలం కోసం వెతకడం కంటే.. ఇప్పటికే ఉన్న ఓమందూరార్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాన్నే తిరిగి సచివాలయంగా మార్చాలని డీఎంకే సూచిస్తోంది. మాజీ సీఎం ఎం. కరుణానిధి హయాంలో ఈ భవనాన్ని సచివాలయం కోసమే నిర్మించారని, పెద్దగా మార్పులు చేయకుండానే చిన్నపాటి మరమ్మతులతో తిరిగి ఉపయోగించుకోవచ్చని విల్సన్ పేర్కొన్నారు. కరుణానిధి ప్రభుత్వం నిర్మించిన ఈ భవనాన్ని అనంతరం జయలలిత ప్రభుత్వం ఆస్పత్రిగా మార్చింది.12 గ్రామాల ఆందోళన..మరోవైపు పటినపాక్కంలో ప్రతిపాదిత నిర్మాణంపై స్థానిక మత్స్యకారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమీపంలోని 12 మత్స్యకార గ్రామాలకు చెందిన కుటుంబాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పడవలు నిలపడం, వలలు బాగుచేయడం, చేపలు ఆరబెట్టడం, మార్కెట్లు నిర్వహించడం కోసం ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నామని వారు చెబుతున్నారు. సచివాలయ నిర్మాణం జరిగితే సముద్రానికి తమ రాకపోకలు పరిమితం కావడంతో పాటు భవిష్యత్తులో జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశంపై డీఎంకే మాత్రమే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం పనులను నిలిపివేసి, స్థల ఎంపికపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ తీరప్రాంత పర్యావరణం, వరదలు, తుపాన్ల ముప్పును ప్రస్తావించారు. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కూడా కొత్త సచివాలయం వల్ల ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ.. చెన్నై వెలుపల ప్రత్యేక పరిపాలనా నగరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.దీంతో రూ.1,200 కోట్ల కొత్త సచివాలయ ప్రాజెక్టు ఇప్పుడు స్థల వివాదంలో చిక్కుకుంది. మత్స్యకారుల అభ్యంతరాలు, ప్రతిపక్షాల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం పటినపాక్కం ప్రతిపాదనపైనే ముందుకెళ్తుందా? లేక ఇప్పటికే ఉన్న ఓమందూరార్ భవనాన్ని తిరిగి సచివాలయంగా మార్చే ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: తన డ్యాన్స్ వీడియోపై కేరళం సీఎం విస్మయం -
లండన్ లో అజిత్ ని చూడగానే విజయ్ రియాక్షన్.. ఏం చేశాడంటే
-
అసెంబ్లీలో విజయ్ వెటకారం.. స్టాలిన్ దిమ్మతిరిగే పంచ్
-
విజయ్ సర్కార్‌కు తొలి పరీక్ష.. అన్నాడీఎంకే కంచుకోటల్లో బిగ్ ఫైట్!
తమిళనాడు రాజకీయాల్లో వేడి పెరిగింది.. విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష ఎదురైంది. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బైపోల్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు అన్నాడీఎంకేకు కంచుకోటలుగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో టీవీకే.. మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలనే తమ అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో విజయ్ వర్సెస్ స్టాలిన్ పోరుకు.. అన్నాడీఎంకే కౌంటర్‌తో ముక్కోణపు యుద్ధం మొదలైంది. అక్టోబర్ 6న జరగనున్న ఈ రెండు ఉపఎన్నికలు ఎవరి బలమెంతో తేల్చడమే కాదు.. విజయ్ కొత్త ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు తొలి సంకేతంగా మారే అవకాశముంది.అక్టోబర్ 6న తమిళనాడులో జరగనున్న రెండు అసెంబ్లీ ఉపఎన్నికలకు టీవీకే అధినేత, సీఎం విజయ్ అభ్యర్థులను ప్రకటించారు. మదురాంతకం నుంచి మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కె. మరగతం కుమారవేల్, ధారాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే పి. సత్యబామను బరిలోకి దింపారు. ఇద్దరూ ఏప్రిల్ 23 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.త్రిముఖ పోరు తప్పదా?ఈ రెండు నియోజకవర్గాలు అన్నాడీఎంకేకు బలమైన స్థానాలుగా పరిగణిస్తుండటంతో.. ఇప్పుడు అక్కడ టీవీకే, డీఎంకేతో పాటు అన్నాడీఎంకే కూడా బరిలోకి దిగడంతో త్రిముఖ పోరు నెలకొంది. మదురాంతకంలో డీఎంకే తరఫున మాజీ ఎమ్మెల్యే ఐ. పరందామన్, ధారాపురంలో ఎస్. సుగన్య పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే మదురాంతకంలో మాజీ ఎమ్మెల్యే కనిత సంపత్, ధారాపురంలో కె. బానుమతిని అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే ఈ ఉపఎన్నికలు విజయ్ ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారనున్నాయి. ఏప్రిల్ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత టీవీకే ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల పోరు ఇదే కావడంతో.. ఈ రెండు ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విజయ్ ఈ ఉపఎన్నికలను కాంగ్రెస్, ఎండీఎంకేతో కూడిన ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ ఫ్రంట్’ కూటమి పేరుతో ఎదుర్కోనున్నట్లు ప్రకటించారు.డీఎంకే, అన్నాడీఎంకే ఫుల్ ఫోకస్..తమకు ఇప్పటికే ఉన్న వ్యక్తిగత ఓటు బ్యాంకు, నియోజకవర్గాల్లో పరిచయం ఉన్న నాయకత్వం కలిసి పనిచేస్తుందని టీవీకే అంచనా వేస్తోంది. మదురాంతకం అభ్యర్థి మరగతం కుమారవేల్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో సాధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిస్తామని చెప్పారు. మరోవైపు.. అన్నాడీఎంకే తన బలమైన స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తుండగా, అధికార టీవీకేను నిలువరించేందుకు డీఎంకే కూడా గట్టిగానే పోరాడుతోంది. టీవీకే ఎదుగుదలను అడ్డుకోవడమే డీఎంకేకి ప్రధాన రాజకీయ సవాల్‌గా కనిపిస్తోంది. ఇందులో భాగంగా మదురాంతకం, ధారాపురం రెండింటిలోనూ డీఎంకే అభ్యర్థులను ముందుగానే ప్రకటించి పోరుకు తెరతీసింది. ఇదిలా ఉండగా.. మదురాంతకంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు అదే స్థానంలో బలాన్ని పెంచుకోవడం స్టాలిన్ పార్టీకి పెద్ద సవాల్‌గా ఉంది. ఇక, విజయ్ ప్రభుత్వానికి ఈ రెండు బైపోల్స్ తొలి రాజకీయ పరీక్షగా మారాయి. రెండు స్థానాలకు సంబంధించి అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇదీ చదవండి: తమిళనాట సంచలనం.. స్టాలిన్‌కు పళని బిగ్ ఆఫర్ -
తమ్ముడూ విజయ్... TVK పాలనపై స్టాలిన్ రియాక్షన్
-
తమిళనాడులో సంచలనం.. స్టాలిన్‌కు పళనిస్వామి బంపరాఫర్!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో కొత్త సమీకరణాలపై ఉత్కంఠ పెరుగుతోంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి డీఎంకేతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకేకు వ్యతిరేకంగా తమ కూటమిలోకి ఇతర పార్టీలు వస్తే స్వాగతిస్తామని చెప్పిన ఆయన.. ‘డీఎంకే వస్తుందా?’ అంటూ ఆ పార్టీకి నేరుగా సవాల్ విసిరారు.టీవీకేకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడుతోందా అని మీడియా ప్రశ్నించగా.. తాము కూడా టీవీకేకు వ్యతిరేకమేనని ఈపీఎస్ స్పష్టం చేశారు. తమ కూటమి ఇప్పటికే ఉన్న విధంగానే కొనసాగుతుందని, ఇతర పార్టీలు చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అదే సమయంలో ‘డీఎంకే వస్తుందా?’ అంటూ ప్రశ్నించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో టీవీకే నేతృత్వంలోని కూటమి, డీఎంకే నేతృత్వంలోని ఫ్రంట్, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.మరోవైపు విజయ్ ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, ధరల పెరుగుదల, శాంతిభద్రతలు, డ్రగ్స్ సమస్య, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సీఎం విజయ్ నేరుగా సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.ఇప్పటికే అసెంబ్లీ వేదికగా విజయ్, డీఎంకే మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మాజీ డీఎంకే ప్రభుత్వంపై విజయ్ అవినీతి ఆరోపణలు చేయడంతో డీఎంకే సభ్యులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈపీఎస్ డీఎంకేతో కలిసి టీవీకేకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమంటూ సంకేతాలు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఇక, విజయ్ కూటమి బలం పెంచుకుంటున్న వేళ.. పాత ప్రత్యర్థులైన డీఎంకే-అన్నాడీఎంకే ఒకే వేదికపైకి వస్తాయా? ఈపీఎస్ వ్యాఖ్యలు నిజంగా పొత్తుకు సంకేతాలా? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.ఇదీ చదవండి: తమ్ముడు విజయ్.. నువ్వుచెప్పింది కరెక్టే: స్టాలిన్ -
నేడు లండన్ పర్యటనకు సీఎం విజయ్
సాక్షి, చెన్నై: సీఎం జోసెఫ్ విజయ్ పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా వారం రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రి ఆయన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. సీఎం విజయ్ రాత్రి 10 గంటలకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో దుబాయ్ మీదుగా లండన్ వెళ్లనున్నారు. పర్యటన ముగించుకుని సెపె్టంబర్ 16న రాత్రి 8.30 గంటలకు తిరిగి చెన్నై చేరుకుంటారు. లండన్ పర్యటనలో భాగంగా ఆయన యూరోపియన్ వ్యాపారవేత్తలతో ప్రతినిధి స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. తమిళనాడులో కొత్త పరిశ్రమల స్థాపన, కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం Výæమనార్హం. -
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
అసెంబ్లీ వేదికగా స్టాలిన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి విజయ్ చేసిన ‘అవినీతి’ ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. అలాగే స్టాలిన్‌పైనా విజయ్ బాడీ షేమింగ్ చేయడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో స్టాలిన్ వాటిపై స్పందించారు. తన తండ్రి, డీఎంకే మాజీ సీఎం కరుణానిధి హయాంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ.. ‘‘తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది నిజమే. అబద్ధం కాదు’’ అంటూ ఈ ఉదయం ఓ వీడియోను రిలీజ్ చేశారాయన. తన తండ్రి కరుణానిధి, తనను విజయ్ టార్గెట్‌గా చేసుకోవడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో తన దవడ వెనుక కథ ఇదేనంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారాయన. ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి మెరీనా బీచ్‌లో భారీ సభ నిర్వహించి మీసా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని స్టాలిన్ గుర్తుచేశారు. అనంతరం 1976 జనవరి 31న కేంద్ర ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిందన్నారు. ఆ వెంటనే గోపాలపురం ఇంటికి పోలీసులు వచ్చి తనను మీసా కింద అరెస్టు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.‘‘ఆ రోజు నేను ఇంట్లో లేను. నా కొడుకు ప్రచారానికి వెళ్లాడు.. రేపు వస్తాడు. వచ్చిన వెంటనే నేనే ఫోన్ చేస్తా.. వచ్చి అరెస్టు చేసుకోండి’’ అంటూ కరుణానిధి పోలీసులను వెనక్కి పంపారని తెలిపారు. మరుసటి రోజు తాను ఇంటికి వచ్చిన తర్వాత కరుణానిధే పోలీసులకు ఫోన్ చేసి తనను అరెస్టు చేయించారని చెప్పారు. జైల్లో తనను తీవ్రంగా హింసించారని స్టాలిన్ పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులను ఉంచే ప్రదేశంలో చిన్న గదిలో పది మందిని బంధించారని, అదే గదిలో ఒకే కుండను మూత్ర విసర్జనకు ఉపయోగించాల్సి వచ్చేదని వివరించారు. రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా పోలీసులు లాఠీలతో కొట్టేవారని, బూట్లతో తన్నేవారని చెప్పారు. ఖైదీల దాడిలో ఎంపీ చిట్టిబాబు మరణించారని, తన దవడ ఎముక విరిగిందని తెలిపారు. నాటి దాడుల గాయాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు.‘‘మా సిద్ధాంత నాయకుడినని చెబుతున్నావు. పెరరింజర్ అన్నా(సి.ఎన్. అన్నాదురై) కాలం నుంచి ఇదే డీఎంకే చరిత్ర. అందులో నేనూ భాగం కావడం గర్వంగా ఉంది. ఎవరెంత తక్కువ చేసి చూపించాలని చూసినా చరిత్రను మార్చలేరు’’ అని స్టాలిన్ అన్నారు.సర్కారియా కమిషన్.. విజయ్‌కు మరో కౌంటర్అదే సమయంలో సర్కారియా కమిషన్, అవినీతి ఆరోపణలపైనా విజయ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సర్కారియా కమిషన్ ఏర్పడిన తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అనేక ప్రభుత్వాలు మారాయని గుర్తుచేశారు. ఆ ఆరోపణల్లో నిజం ఉంటే ఇన్నేళ్లలో తప్పకుండా చర్యలు జరిగేవని అన్నారు. ఈడీ కేసులను ప్రస్తావిస్తూ కూడా విజయ్‌పై స్టాలిన్ విమర్శలు చేశారు. ఈడీ నమోదు చేసిన అనేక కేసుల్లో ఆరోపణలు నిరూపితం కాలేదని, నిందితులు నిర్దోషులుగా బయటపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈడీని ఉపయోగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కాంగ్రెస్ నేతలపైనా ఈడీ కేసులు పెట్టిన విషయాన్ని విజయ్ ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు.అసెంబ్లీని వివాదాలకు వేదిక చేయొద్దుతమిళనాడు అసెంబ్లీకి ఎంతో గౌరవం, చరిత్ర ఉందని.. అక్కడ ప్రజా సమస్యలపై చర్చ జరగాలని స్టాలిన్ సూచించారు. శాంతిభద్రతలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, తమిళనాడు హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చించాలని కోరారు. అనవసర వివాదాలను అసెంబ్లీలోకి తీసుకురావద్దని విజయ్‌కు హితవు పలికారు.విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటికి వచ్చి కలిసిన విషయాన్ని కూడా స్టాలిన్ గుర్తుచేశారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో తనపై విజయ్ తీవ్ర విమర్శలు చేశానని ఆయన చెప్పగా.. ‘‘పర్లేదు తమ్ముడూ.. వాటిని మనసులో పెట్టుకోను’’ అని తాను చెప్పినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఆ పదవికి తగ్గ హుందాతనం కనిపించాలని సూచించారు.‘సినిమా షూటింగ్‌లా పాలన’విజయ్ ప్రభుత్వ పనితీరుపైనా స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. తాము నిర్మించిన వంతెనపై నిలబడి ఫొటోషూట్లు చేయడం, అసెంబ్లీని రీల్స్‌కు వేదికగా మార్చడం సరికాదన్నారు. సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో హత్యలు, దొంగతనాలు, మహిళలపై నేరాలు పెరిగాయని, శాంతిభద్రతలు దిగజారిపోయాయని విమర్శించారు. పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేసి తమిళనాడు అభివృద్ధిని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. రైతులకు పూర్తి రుణమాఫీ, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు రూ.2,500 సాయం వంటి హామీల విషయంలోనూ విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విమర్శించారు.‘‘అప్పుడు చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నది మరొకటి. మార్పు కావాలని ఓటేసిన యువత ఇప్పుడు నిజంగా ఎలాంటి మార్పు వచ్చిందో గమనిస్తోంది’’ అని స్టాలిన్ అన్నారు.అధికారం లేకున్నా ప్రజల కోసం పోరాటమేచివరగా డీఎంకే కార్యకర్తలకు స్టాలిన్ కీలక సందేశం ఇచ్చారు. ప్రజలు పూర్తిగా తమకు మద్దతు ఇవ్వకపోవడంతో అధికారంలోకి రాలేకపోయామని, కానీ ప్రభుత్వం చేసే తప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ‘‘మనకేం సంబంధం’’ అనే ధోరణి ఉండకూడదన్నారు. అధికారంలో ఉండటం, లేకపోవడం రెండూ ప్రజాసేవలో భాగమేనని పేర్కొన్నారు. తమిళనాడు హక్కులు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం డీఎంకే ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘‘వాళ్ల(ప్రజలను ఉద్దేశించి..) తాతల కోసం పోరాడాం. వాళ్ల తండ్రుల కోసం పోరాడాం. ఇప్పుడు వాళ్ల కోసం పోరాడతాం. ఇదే డీఎంకే చరిత్ర. ఆ చరిత్ర ఎప్పటికీ మారదు.. మారకూడదు’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు.வீட்ல என்னை meet பண்ணப்ப சொன்னதை மறந்துட்டீங்களா தம்பி விஜய்? pic.twitter.com/kzpwXi14L8— M.K.Stalin (@mkstalin) September 10, 2026సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీలో పోలీస్ శాఖపై చర్చకు సీఎం విజయ్ సమాధానం ఇస్తూ.. ఎమర్జెన్సీ–MISA అంశాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో దవడ దగ్గర చేతితో హావభావం చేశారు. ఈ సైగపై డీఎంకే నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాలిన్ ఎమర్జెన్సీ సమయంలో పోలీసుల దాడిలో దవడ విరిగిన విషయాన్ని విజయ్ ఎగతాళి చేశారని ఆరోపించారు. వామపక్షాలు కూడా విజయ్ తీరును తప్పుబట్టాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం.. స్టాలిన్ గాయాన్ని హేళన చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అయితే దీనిపై సెప్టెంబర్ 8న విజయ్ వివరణ ఇచ్చారు. తన బాడీ లాంగ్వేజ్ అనుకోకుండా వచ్చిందని, ఎవరినీ వ్యక్తిగతంగా బాధపెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీజేపీకి చెక్ పెట్టేందుకే విజయ్‌కు తోడుగా.. -
విజయ్ కూటమికి కొత్త పేరు.. వాళ్లు దూరం.. తమిళనాట కొత్త లెక్కలు!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటమి ఆవిర్భవించింది. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతృత్వంలోని కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’గా పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ అధ్యక్షతన బుధవారం చెన్నైలోని పనైయూర్లో జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ కూటమిలో టీవీకేతో పాటు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉన్నాయి. కూటమి పేరులోనే మత సామరస్యం, సామాజిక న్యాయం, విజయ్ రాజకీయ గుర్తింపు కనిపించేలా రూపొందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి నాయకత్వం విజయ్‌దే అని నేతలు స్పష్టం చేశారు.వీసీకే నేత ఎస్ఎస్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ పేరు విజయ్ ఆలోచన నుంచి వచ్చిందని తెలిపారు. బీజేపీ, ‘ఫాసిస్టు శక్తులకు’ వ్యతిరేకంగా కూటమి పనిచేస్తుందనే విషయాన్ని పేరు స్పష్టం చేస్తుందని చెప్పారు. టీవీకే బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలకు కూడా దీనితో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌తో విభేదాల్లేవ్..ఇటీవల ‘విజయ్ ఫర్ పీఎం’ అంటూ టీవీకే వర్గాల్లో వినిపిస్తున్న నినాదాలపై కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే టీఎన్‌సీసీ అధ్యక్షుడు బి.మాణిక్కం ఠాగూర్ మాత్రం టీవీకే, కాంగ్రెస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. సరైన సమయంలో కూటమి ప్రధానమంత్రి అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్లు పెరగడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కూటమి జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్‌లో చేరుతుందా? అనే ప్రశ్నకు వీసీకే నేత బాలాజీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. టీవీకేకు ప్రస్తుతం ఎంపీలు లేరని, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వచ్చిన తర్వాత ఇండియా కూటమిలో చేరే అంశం ఉంటుందని చెప్పారు. దీంతో రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో జాతీయ రాజకీయాల వైపు కూడా విజయ్ అడుగులు వేయనున్నారా? అన్న చర్చ మొదలైంది.వామపక్షాలు మాత్రం దూరం..కూటమి ఏర్పాటులో మరో కీలక అంశం వామపక్ష పార్టీల గైర్హాజరు. సీపీఐ, సీపీఎం నేతలు సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో టీవీకేకు వామపక్షాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. తాజా కూటమి సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నాయి. అయితే టీవీకే నేత ఆధవ్ అర్జునా కమ్యూనిస్టు పార్టీలు త్వరలోనే కూటమిలో చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే, కూటమి తన రాజకీయ ప్రయాణాన్ని రాబోయే ఉప ఎన్నికలతో ప్రారంభించనుంది. అభ్యర్థుల ప్రకటన త్వరలో ఉంటుందని నాయకులు తెలిపారు. కూటమి భవిష్యత్ నిర్మాణం, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, స్టీరింగ్ కమిటీ వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు.టీవీకే 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్‌తో కలిసి అధికార కూటమికి అధికారిక రూపం ఇచ్చింది. మరోవైపు డీఎంకే నేతృత్వంలోని కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటములకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త ఫ్రంట్ నిలవనుంది. రాబోయే ఉప ఎన్నికల్లో ఈ మూడు శక్తుల మధ్య పోటీకి ఇది వేదిక కానుంది. అయితే విజయ్ నేతృత్వంలోని ఈ కూటమి ఎన్నికల కూటమిగానే కొనసాగుతుందా? లేదంటే తమిళనాడు రాజకీయాల్లో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: గెట్ రెడీ ఫర్ సీబీఐ రైడ్స్! -
పొలిటికల్ హీట్.. స్టాలిన్‌పై బాడీ షేమింగ్ ఆరోపణలు
చెన్నై: డీఎంకే అధినేత స్టాలిన్‌పై తమిళనాడు సీఎం విజయ్ బాడీషేమింగ్ చేసారన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడుతుండగా తాను చేసిన హావభావం అనుకోకుండా జరిగిందని, అది ఏ విధంగానూ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా ఎవరినైనా బాధపెట్టాలనే ఉద్దేశంతో తాను ఆ చర్య చేయలేదని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఈ విషయమై తన వివరణను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ... “2026 సెప్టెంబర్ 7న శాసనసభలో పోలీసు శాఖ గ్రాంట్‌పై నా సమాధాన ప్రసంగం సందర్భంగా, మధ్యలో అనుకోకుండా కనిపించిన నా బాడీ లాంగ్వేజ్ ఏ విధంగానూ ఉద్దేశపూర్వకమైనది కాదు. అందువల్ల, ఎవరి వ్యక్తిగత భావాలను బాధపెట్టే ఉద్దేశంతో చేసిన చర్యగా దాన్ని అర్థం చేసుకోవద్దని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.కాగా విజయ్ ప్రసంగం అనంతరం డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఛాంబర్ వెలుపల నిరసనకు దిగారు. విజయ్ చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మార్షల్స్ జోక్యం చేసుకుని డీఎంకే ఎమ్మెల్యేలను అక్కడి నుంచి బలవంతంగా తొలగించారు.అదే సమయంలో సీపీఐ(ఎం) నేత పి. షణ్ముగం కూడా విజయ్‌పై తీవ్రంగా స్పందించారు. విజయ్ తన హావభావం ద్వారా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై వ్యక్తిగత దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా, స్టాలిన్ గతంలో మీసా నిర్బంధ సమయంలో ఎదుర్కొన్న దాడి కారణంగా దెబ్బతిన్న దవడను విజయ్ అనుకరించినట్లుగా కనిపించిందని షణ్ముగం పేర్కొన్నారు.ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని, అదే సమయంలో తీవ్ర అణచివేత, అకృత్యాలు చోటుచేసుకున్నాయని షణ్ముగం తన ఎక్స్ పోస్టులో గుర్తుచేశారు. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను పోలీసులు దారుణంగా కొట్టడంతో ఆయన దవడ విరిగిందని తెలిపారు. ఎవరైనా ఒకరి శారీరక రూపాన్ని ఎగతాళి చేయడం ఖండించదగిన విషయం. ముఖ్యమంత్రి స్వయంగా అలా చేయడం బాధ్యతారాహిత్యమైన చర్యని షణ్ముగం విమర్శించారు.వివాదం ఎందుకు?ఈ వివాదానికి కారణమైన ఘటన నిన్న సోమవారం తమిళనాడు అసెంబ్లీలో విజయ్ చేసిన ప్రసంగంలో చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న డీఎంకేపై విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. తన ప్రసంగంలో మీసా కాలం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో విజయ్ దవడను చూపించారు. ఈ హావభావాన్ని చాలామంది స్టాలిన్‌కు గతంలో జరిగిన దాడి, దాని కారణంగా ఆయన దవడ విరిగిన ఘటనకు సూచనగా భావించారు. దీంతో విజయ్ ఉద్దేశపూర్వకంగా స్టాలిన్ శారీరక పరిస్థితిని ఎగతాళి చేశారనే ఆరోపణలు వచ్చాయి.అయితే ఇప్పుడు విజయ్ ఇచ్చిన వివరణ ప్రకారం, ఆ హావభావం అనుకోకుండా జరిగినదే తప్ప, ఎవరినైనా వ్యక్తిగతంగా అవమానించాలన్న లేదా బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. We have seen Chief Ministers like a statesman, #MKStalin, speak respectfully in the Assembly; we have seen #Kalaignar speak sense with wit and wisdom; we have seen Madam #Jayalalithaa speak with confidence, elan and elegance; we have seen #EPS and #OPS speak sincerely and… pic.twitter.com/ry1bNWoLcL— Prakash Raghavadass (@PrakashRaghav) September 7, 2026 -
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
సాక్షి, చెన్నై: చెన్నై మెరీనా తీరంలోని పట్టినంబాక్కంలో 25 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండ సచివాలయం, అసెంబ్లీ భవన్ రూపుదిద్దుకోనున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తులు మొదలయ్యాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోట భవనంలో ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ సచివాలయం, శాసనసభ కొనసాగుతున్నాయి. అక్కడ తీవ్రమైన వాహనాల రద్దీ, పార్కింగ్ ఇబ్బందులు ప్రజల రద్దీ పెరిగిన నేపథ్యంలో చెన్నై పట్టినంబాక్కంలో కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రహ్మాండ భవనంగా.. రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త సచివాలయం, శాసనసభ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రధాన భవనాన్ని 20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో, 15 అంతస్తుల ఎత్తులో అత్యంత అధునాతనంగా రూపొందించనున్నారు. గిండిలోని హైవేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నందంబాక్కం ఫిన్‌టెక్ సిటీ ఎదురుగా ఉన్న భూములను పరిశీలించిన అనంతరం,పట్టినంబాక్కంలోని 25 ఎకరాల భూమిని ఈ నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదించింది. శాంతోమ్ ప్రధాన రహదారిని అనుసంధానించే ఈ స్థలం తమిళనాడు హౌసింగ్ బోర్డు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చదరపు అడుగు మార్కెట్ మార్గదర్శక విలువ రూ.22,000 కాగా, మొత్తం భూమి అంచనా విలువ సుమారు రూ.2,047 కోట్లుగాపరిగణించి ఉన్నారు. అనుమతుల మంజూరు మైలాపూర్, పట్టినం బాక్కం పరిధిలోని 21.37 ఎకరాల హౌసింగ్ బోర్డ్ భూమిని ప్రజా ప్రయోజనాల సచివాలయ నిర్మాణానికి ఉపయోగించేందుకు తమిళనాడు హౌసింగ్ బోర్డు అనుమతి ఇచ్చింది. అలాగే మిగిలిన భూమి, రోడ్ల వినియోగానికి చెన్నై కార్పొరేషన్ కమిషనర్, రెవెన్యూ శాఖలు కూడా ఆమోదం తెలిపాయి. 1958లో సేకరించిన ఈ స్థలంలో గతంలో నిర్మించి ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి స్థలాన్ని ఖాళీ చేసే ప్రక్రియను హౌసింగ్ బోర్డు వేగవంతం చేయడానికి నిర్ణయించింది. చదవండి: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. బాటిల్‌పై రూ.10 తగ్గింపు -
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కోలీవుడ్ నటి త్రిష కృష్ణన్ బంధం గురించి చాలాకాలంగా అక్కడ చర్చ నడుస్తోంది. అయితే ఆమెను ఉద్దేశించి.. నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యవహారంపై సీఎం విజయ్ కూడా భగ్గుమన్నారు. మహిళల్ని కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఎపిసోడ్‌పై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళలను కించపరిచేందుకు.. వారి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ధోరణేనని ఆమె వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం కంగనా మీడియాతో మాట్లాడారు. మహిళలు ఉద్యోగం చేస్తున్నా, విజయవంతమైనా, నాయకురాలిగా ఉన్నా, అధికార స్థానంలో ఉన్నా.. వారిని కిందకు లాగేందుకు.. ఆమె పరువు, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం మనకు కొత్తేం కాదు. అలాగని ఈ సమస్య భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచమంతటా ఉందని పేర్కొన్నారామె. ఈ క్రమంలోనే త్రిష ఎపిసోడ్‌ను ఆమె ప్రస్తావించారు. తమిళనాడులో మొన్న ఏం జరిగిందో అంతా చూశారు. ఎంతో గౌరవనీయమైన నటి ఒక వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆ వ్యవహారంలో సంబంధం ఇద్దరి మధ్య ఉంది. కానీ, దూషణలు, వ్యక్తిత్వాన్ని కించపర్చడం మాత్రం మహిళపైనే జరుగుతున్నాయి. ఎందుకలా?” అని కంగనా అన్నారు. ఆ ధోరణి ఇంకెప్పుడు ఆగుతుందని వ్యాఖ్యానించారామె. సమాజం తనను తాను ఈ విషయంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని.. మహిళలను మనం ఎలా చూస్తున్నాం? నిజంగా వారిని గౌరవిస్తున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలని వ్యాఖ్యానించారు.ఆగస్టు 3న కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు త్రిష పేరు ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీనికి ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. త్రిషను ఉద్దేశించే ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదవడంతో ఆగస్టు 4న ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.అయితే తాను త్రిష పేరును ప్రస్తావించలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉదయనిధి చెప్పారు. కావేరీ నదిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్య చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. త్రిషకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు, మహిళా నేతలు స్పందించారు. కంగనా కూడా గతంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. బహిరంగంగా అసభ్యకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేయడం ఏ నాగరిక సమాజమూ అంగీకరించదని పేర్కొన్నారు. ఉదయనిధిపై తీసుకున్న చట్టపరమైన చర్యలు మంచి ఉదాహరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.ఇదే వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశరు. మహిళలపై వ్యక్తిగత దూషణలు, ద్వంద్వార్థ వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చని, కానీ మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు మాత్రం చోటు ఉండకూడదని హెచ్చరించారు. మహిళలపై దూషణలు, వ్యక్తిగత దాడులు కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంతా మా ఇష్టం అంటే కుదరదిక్కడ -
విజయ్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం
ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చేసిన ఆరోపణలు తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. గత డీఎంకే ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ విజయ్ ఆరోపణలు చేయడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఆరోపణలపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంగళవారం సభలో గందరగోళం నెలకొంది.డీఎంకే హయాంలో లోన్ ఈఎంఐ తరహాలో లంచాలు తీసుకున్నారంటూ నిన్న సీఎం విజయ్ ఆరోపించారు. పార్టీ ఫండ్ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని చెబుతూ.. ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్ నివేదికను ప్రస్తావించారు. అంతేకాదు మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తదితరుల పేర్లను కూడా విజయ్ ప్రస్తావించారు. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే విప్ ఈవీ వేలు.. ఈ అంశాన్ని లేవనెత్తారు. సీఎం విజయ్ తన ప్రసంగంలో ప్రస్తావించిన ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్ నివేదికకు సంబంధించిన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. అయితే విజయ్ ప్రస్తావించిన అంశాలు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న అధికారిక పత్రాల్లో ఉన్నవేనని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. అందువల్ల వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.డీఎంకే డిమాండ్‌ను న్యాయశాఖ మంత్రి ఆర్.ఎన్. నిర్మల్‌కుమార్ కూడా వ్యతిరేకించారు. విజయ్ చేసిన వ్యాఖ్యలు సర్కారియా కమిషన్ నివేదిక, ఈడీ అధికారిక పత్రాల ఆధారంగానే ఉన్నాయని పేర్కొన్నారు. గత డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ఆయన సమర్థించారు. దీంతో డీఎంకే సభ్యులు మరింత ఆందోళనకు దిగారు. తమకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలని కోరుతూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభలో నినాదాలు కొనసాగుతుండటంతో సభా నాయకుడు కేఏ సెంగొట్టయ్యన్ జోక్యం చేసుకున్నారు. స్పీకర్ నిర్ణయం తర్వాత కూడా డీఎంకే సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, అసెంబ్లీ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యులు తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని స్పీకర్ హెచ్చరించారు. ఒక నిమిషంలోపు సీట్లలో కూర్చుంటే కేఎన్ నెహ్రూ లేదా ఈవీ వేళుకు మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పారు. అయినప్పటికీ డీఎంకే సభ్యులు వెనక్కి తగ్గలేదు.సభలో గందరగోళం.. అలాగే అనుమతి లేకుండా పోస్టర్లను సభలోకి తీసుకురావడంపైనా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పట్టించుకోకుండా నిరసన కొనసాగించడంతో.. చివరకు మార్షల్స్‌ను రంగంలోకి దించారు. స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ డీఎంకే సభ్యులను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. కొందరు సభ్యులు ప్రతిఘటించడంతో వారిని మార్షల్స్ బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు కూడా కనిపించాయి.குழப்பவாதிகள் கூண்டோடு வெளியேற்றப்பட்டனர்‼️#TVK #Vijay pic.twitter.com/7saYzn4m3c— Vivek Rangasamy (@VivekRangasamy) September 8, 2026మరోవైపు, విజయ్ గత ప్రభుత్వంలోని అవినీతి అంశాలను ప్రస్తావించడంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా సీఎం గతాన్ని తవ్వుతున్నారని విమర్శించారు. విజయ్ చేసిన ఆరోపణలు కోర్టులో నిరూపితం కానివేనని పేర్కొంటూ.. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. -
నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్
-
త్రిష వివాదం పై స్టాలిన్ కి ఇచ్చి పడేసిన విజయ్
-
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. రాష్ట్రంలో వరుస హత్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై అధికార టీవీకే ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో సభలో వాగ్వాదం, నినాదాలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. దీనికి ముఖ్యమంత్రి విజయ్ ఘాటుగా బదులిస్తూ.. నేరస్తులు ఏ పార్టీకి చెందినవారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో డీఎంకేపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ‘పార్టీ ఫండ్స్’ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేశారని ఆరోపించడం సభలో మరింత వేడి పెంచింది.సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే సభ్యులు రాష్ట్రంలో పెరుగుతున్న హత్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, వరుసగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దీనిపై చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ కోరారు. ఈ అంశంపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు డీఎంకే సభ్యులు ప్రయత్నించడంతో సభలో ఉద్రిక్తత మొదలైంది.దీనిపై ముఖ్యమంత్రి విజయ్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం నేరాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. పోలీసులు మంచివారికి మిత్రులుగా, నేరస్తులకు శత్రువులుగా ఉండాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. నేరస్తుడు ఏ పార్టీకి చెందినవాడైనా చట్టం ముందు సమానమేనని తెలిపారు.‘పోలీసులు పవర్ సెంటర్ కాకూడదు’పోలీసు వ్యవస్థ ప్రజలను భయపెట్టే పవర్‌సెంటర్‌గా మారకూడదని విజయ్ అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యతగా ఉండాలని చెప్పారు. గత మూడు నెలల్లో జరిగిన నేరాలను ఒకేసారి జరిగిన ఘటనలుగా చూడటం సరికాదని, వాటిలో అనేకం పాత కక్షలు, ప్రతీకారాల కారణంగా జరిగినవేనని వివరించారు.డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కోయంబత్తూరులో జరిగిన ఓ కాలేజీ విద్యార్థి హత్య కేసులో 36 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో యాంటీ డ్రగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, చెన్నైలో మూడు నెలల్లో ఎన్డీపీఎస్ చట్టం కింద 330 కేసులు నమోదు చేసి 556 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.డీఎంకేపై విజయ్ సంచలన ఆరోపణలుశాంతిభద్రతల అంశంతో మొదలైన అసెంబ్లీ రచ్చ.. ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో మరింత ముదిరింది. తమపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు చూపించాలని విపక్షాలు పదేపదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. విజయ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పత్రాన్ని ప్రస్తావించారు.గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల నుంచి కాంట్రాక్టు విలువలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు ‘పార్టీ ఫండ్స్’ పేరుతో వసూలు చేశారని** ఆయన ఆరోపించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ సప్లై (MAWS) శాఖ పరిధిలో ప్రభుత్వ పనులు చేపట్టే కాంట్రాక్టర్ల నుంచి ఈ మొత్తాలను లంచాల రూపంలో వసూలు చేశారని ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు విజయ్ సభలో చదివి వినిపించారు.‘లంచాలు.. లోన్ ఈఎంఐల్లా వసూలు’ఈ క్రమంలో పురుషోత్తం అనే వ్యక్తి పేరును ప్రస్తావించిన విజయ్.. ఆయన నుంచి రూ.29 లక్షలు లంచంగా వసూలు చేసినట్లు ఈడీ నివేదికలో ఉందన్నారు. అయితే ఆ మొత్తం ఒక్కసారిగా తీసుకోలేదని.. లోన్ ఈఎంఐలు చెల్లించినట్టుగా విడతల వారీగా వసూలు చేశారని విజయ్ ఆరోపించారు. అంతేకాదు.. ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు ‘పార్టీ ఫండ్స్’కు ప్రత్యక్ష లబ్ధిదారులుగా అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, అప్పటి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రవి ప్రసాద్‌తో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయని విజయ్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తనవి కావని, ఈడీ పత్రంలో ఉన్నవేనని ఆయన స్పష్టం చేశారు.సర్కారియా కమిషన్ నివేదిక ప్రస్తావనడీఎంకేపై అవినీతి ఆరోపణలకు చారిత్రక నేపథ్యం ఉందని చెప్పేందుకు విజయ్ సర్కారియా కమిషన్ నివేదికను కూడా ప్రస్తావించారు. వీరాణం నీటి సరఫరా పథకానికి సంబంధించిన వ్యవహారంలో ‘పార్టీ ఫండ్’ పేరుతో 2.5 శాతం డిమాండ్ చేశారన్న ఆరోపణలు కమిషన్ నివేదికలో ఉన్నాయని చెప్పారు. అప్పట్లో టెండర్ విలువ రూ.16 కోట్లుగా ఉందని తెలిపారు.2001లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ మంత్రి పొన్నయ్యన్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారని విజయ్ గుర్తుచేశారు. ‘కొంచెం లోతుగా పరిశీలిస్తే మరెన్నో విషయాలు బయటకు వచ్చాయి’ అంటూ డీఎంకేపై విమర్శలు గుప్పించారు.చివరకు వాకౌట్..విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుపడుతూ.. నినాదాలు చేశారు. పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పోడియం చుట్టూ చేరడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.ఇదీ చదవండి: డీ బాస్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ నేత -
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండానే.. ‘మహిళలను అవమానిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొనసాగుతున్న త్రిష వివాదానికి మరింత వేడి పెంచాయి. ఉదయనిధి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలు తాజా వివాదాన్ని ఉద్దేశించేలా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్..‘భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నామో మనం ఆలోచించాలి. మన ప్రజలను, మహిళలను కించపరిచేలా మాట్లాడకూడదు. మన ఇళ్లలో మహిళలు తల్లులు, సోదరీమణులుగా ఉన్నారు. మహిళలను అవమానిస్తే చట్టం చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.రాజకీయ విమర్శ వేరు.. అయితే విజయ్ మాత్రం రాజకీయ విమర్శలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. మహిళలను అవమానించే వ్యాఖ్యలకు ఆ స్వేచ్ఛను అడ్డుపెట్టుకోలేమని స్పష్టం చేశారు. గతంలో అసెంబ్లీలో మాజీ సీఎం జయలలిత ఎదుర్కొన్న అవమానాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపైనా విజయ్ మాట్లాడారు. పోలీసులు కేవలం నేరస్తులను అరెస్టు చేయడానికే పరిమితం కాకూడదని, నేరాలు జరగకుండా ముందే అడ్డుకోవడమే అసలు లక్ష్యమని చెప్పారు. చట్టాన్ని పాటించే వారికి పోలీసులు స్నేహితులుగా.. ఉల్లంఘించే వారికి శత్రువులుగా ఉండాలని పేర్కొన్నారు.TN Assembly: “If anyone talks in a derogatory manner about women, stern action is assured.”- TN CM Vijay, recalls 'humiliation' of former CM Jayalalithaa in the Assembly pic.twitter.com/c7Y6bD1kCo— News Arena India (@NewsArenaIndia) September 7, 2026పోలీసులకు హెచ్చరికలు.. తమ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై నేరాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని విజయ్ తెలిపారు. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. నేరాలను ముందుగానే నిరోధించేందుకు పోలీసులు పనిచేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సైబర్ నేరాలపై కూడా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై కూడా విజయ్ కఠిన వైఖరి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ.. తమ ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు. పోలీసులపై ఆరోపణలు వచ్చినా వారిని కాపాడే ప్రసక్తి లేదని, లాకప్‌లో జరిగే నేరాలపై పారదర్శక దర్యాప్తు చేపడతామని తెలిపారు.దీంతో త్రిష వివాదం నేపథ్యంలో విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. పేర్లు ప్రస్తావించకుండా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఆగస్టు 3న తంజావూరులో జరిగిన కావేరీ నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్న సమయంలో కొందరు త్రిష పేరును నినాదించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు కావేరీ సమస్యకు మాత్రమే సంబంధించినవని ఉదయనిధి వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఆగస్టు 4న పోలీసులు ఉదయనిధిని అరెస్టు చేసి తంజావూరుకు తీసుకెళ్లారు. అనంతరం అదే రోజు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. తనపై కేసు నమోదు చేయడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా ఆయన అభివర్ణించారు. -
బంగారు తల్లుల్ని బలిగొన్న బస్సు!
తమిళనాడులో ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అమ్మాయిలు మరణించారు. ప్రమాదకరమైన మలుపు దాటే క్రమంలో.. వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం సైతం ప్రకటించారు. నమక్కల్ జిల్లా తిరుచెంగోడు(tiruchengode Accident) సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వారి బంధువైన మరో బాలిక.. నలుగురూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న 19 ఏళ్ల యువతి తన ఇద్దరు చెల్లెళ్లను, బంధువైన బాలికను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.సంకరంపాళయం ప్రాంతానికి చెందిన సుభిత కలైసెల్వి (19), ఆమె చెల్లెళ్లు నివేత (17), ధనుశ్రీ (12), బంధువైన అభినయ (11) ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. సుభిత కళాశాల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం.. ఎలచిపాళయం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తన చెల్లెళ్లు, అభినయను తీసుకుని ఇంటికి బయలుదేరింది. అయితే..రసిపురం–తిరుచెంగోడు రహదారిపై చక్కరంపాళయం జంక్షన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. రసిపురం వైపు నుంచి వచ్చిన ముత్తాయమ్మాళ్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి నలుగురూ రోడ్డుపై పడిపోయారు. సుభిత, అభినయ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన నివేత, ధనుశ్రీని తిరుచెంగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. డ్రైవర్ అరెస్ట్ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎలచిపాళయం పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలించారు. చివరకు డ్రైవర్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, మృతికి కారణమైన ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తాజా సమాచారం.Tiruchengode 🚨⚠️Disturbing Visuals🚨4 on a 2 wheeler behind College Bus, taking right turn next to petrol bunk with blocked vision, headON with other Bus.Always look ahead & behind, before taking any such turns.@DriveSmart_IN https://t.co/8hVIFtjdhE— Dave (Road Safety: City & Highways) (@motordave2) September 4, 2026పేద కుటుంబం.. పెద్ద కష్టంమృతుల్లో సుభిత, నివేత, ధనుశ్రీ ముగ్గురూ శేఖర్, అముధ దంపతుల కుమార్తెలు. వారు కూరగాయల వ్యాపారం/కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో సుభిత చదువుకు గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్. ఉమా సహాయం చేసినట్లు సమాచారం. ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుఓంది. ఇక అభినయ.. శేఖర్ సోదరుడు రమేశ్‌బాబు కుమార్తె. ఇలా ఒకే కుటుంబ బంధంలో ఉన్న నలుగురు చిన్నారులు, యువతులు ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంతో సంకరంపాళయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.సీఎం విజయ్ సంతాపం.. రూ.3 లక్షల పరిహారంఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి బాధ కలిగించిందని అన్నారు. మృతులు సుభిత, నివేత, ధనుశ్రీ, అభినయ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు.కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదంచదువుకుని జీవితంలో ఎదగాల్సిన వయసులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వారి బంధువైన మరో బాలిక ఇలా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. సుభిత తన చెల్లెళ్లను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్న ప్రయాణమే.. ఆ కుటుంబానికి చివరి ప్రయాణంగా మారింది. అదే సమయంలో.. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. నలుగురు ఒకే బైక్‌పై ప్రయాణించడం.. అందునా ప్రమాదకరమైన మలుపులో ప్రయాణం.. తప్పంతా యువతులదే అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఇదీ చదవండి: తుక్కుతుక్కైన కారు.. 8 మంది బీటెక్ స్టూడెంట్స్ దుర్మరణం -
త్వరలోనే కేబినెట్లో భారీ మార్పులు?
సాక్షి, చెన్నై: శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం తమ మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కొన్ని నెలలుగా మంత్రుల పరిపాలనా సామర్థ్యం, పనితీరుపై చేయించిన సర్వేలు, అంతర్గత విచారణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో రాణించని వారికి, వివాదాల్లో చిక్కుకున్న వారికి పదవుల నుంచి ఉద్వాసన పలికి , సమర్థులైన కొత్తవారికి కీలక శాఖలు అప్పగించేందుకు సీఎం విజయ్ ప్రణాళికలు రచిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో మరింత వేగం పెంచేందుకు పరిశ్రమల శాఖనుఅధవ్ అర్జునకు అప్పగించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే, పాఠశాల విద్యా శాఖను అనుభవడైన సెంగోట్టయాన్‌కు అప్పగించవచ్చని భావిస్తున్నారు.మంత్రి రాజ్ మోహన్‌కు ఇతర ముఖ్య బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే, పరిశ్రమల మంత్రి కీర్తనకు మానవ వనరుల అభివృద్ధిశౠఖను అప్పగించే యోచనతో పాటుగా మరి కొందరి స్థానాలు కదిలించే దిశగా టీవీకే నాయకత్వం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు విశ్వనాథన్, రాజేష్ కుమార్ శాఖల్లో సైతం మార్పులు ఉంటాయని తెలుస్తోంది. చదవండి: యోగి సర్కార్‌కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం! -
రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయాలతో దూసుకు పోతున్నారు. తాజాగా చెన్నైలో కొత్త శాసనసభ - సచివాలయ (Assembly-cum-Secretariat) భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్మాణం రాబోయే 100 సంవత్సరాల వరకు ఉపయోగ పడేలా ఉంటుందని ఆయన తెలిపారు.అసెంబ్లీలో రూల్ 110 కింద అనేక ప్రకటనలు చేస్తూ, తమిళనాడు ఒలింపిక్ సిటీని, చెన్నైలో మోటార్ స్పోర్ట్స్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఎం ప్రకటించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయికి పెంచడానికి ముఖ్యమంత్రి మూడు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు.ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారుప్రస్తుతం ఫోర్ట్ సెయింట్ జార్జ్ (Fort St George) కాంప్లెక్స్ తమిళనాడు ప్రభుత్వ శాసనసభ , సచివాలయంగా పనిచేస్తోంది. సీఎం విజయ్ ఆధ్వర్యంలో రానున్న కొత్త సెక్రటేరియట్ అంచనా వ్యయం రూ. 1,200 కోట్లుగా భావిస్తున్నారు. 20 లక్షల చదరపు అడుగులవిస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకోనుంది. కొత్త కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం పట్టణపాక్కం, నందంబాక్కం, కోయంబేడు మరియు గిండిలోని హైవేస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ప్రాంగణాలను ఎంపిక చేసింది. గతంలో మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎం. కరుణానిధి కూడా అసెంబ్లీ, సచివాలయాలను వేరే చోటికి మార్చాలని ప్రతిపాదించినప్పటికీ, దశాబ్దాలుగా ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణమే పాలనా కేంద్రంగా కొనసాగుతోంది.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు -
ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?
-
సీఎం విజయ్ వృద్ధురాలికి గిఫ్ట్‌గా సన్‌గ్లాసెస్.. ధర ఎంతో తెలుసా..!
తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ ఇటీవల సేలం పర్యటించారు. ఆయన అక్కడ ఒక వృద్ధురాలికి డియోర్ సన్‌గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ అపురూపమైన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ సీఎం విజయ్ బహుమతిగా ఇచ్చిన ఆ సన్‌గ్లాసెస్ ధర ఎంత ఉంటుందో తెలుసా..!.ఆ సన్‌గ్లాస్ ప్రత్యేకత ఇది..ఇక్కడ క్రిస్టియన్ డియోర్ అనేది ఫ్యాషన్‌కి సంబంధించిన బ్యూటీ లేబుల్ దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. ఇది విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగులు, నాణ్యమైన దుస్తులు, ప్రత్యేకమైన యాక్సెసరీలకు ప్రసిద్ధిగాంచింది. ఇది బ్లాక్ రెక్టాంగులర్ సన్ గ్లాసెస్ అని తెలుస్తోంది. ఆ బ్రాండ్ వెబ్సైట్ ప్రకారం..ఈ సన్‌గ్లాసెస్ ఖరీదు వచ్చేసి రూ. 46,450లు. దీనిలో సన్నని నల్లటి ఫ్రేమ్‌కు క్రిస్టల్-టోన్, సిల్వర్-ఫినిష్ మెటల్ టెంపుల్స్ అమర్చబడి, సూక్ష్మంగా కాంట్రాస్ట్‌గా ఉండే 'క్రిస్టియన్ డియోర్' సంతకం కూడా ఉంటుంట. ఇటలీలో తయారైన ఈ యాక్సెసరీ నీలి రంగు లెన్సులు, నీలి రంగు టెంపుల్ చివరలు, నల్లటి ఎసిటేట్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ ఇచ్చే చలువ కళ్లజోడే. కాగా, కావేరీ డెల్టాలో సాంబ వరి సాగు కోసం మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి విజయ్ సేలంలో ఉన్నారు. పవర్ స్టేషన్‌ను తనిఖీ చేసిన తర్వాత, ఆయన రోడ్డు పక్కన ఉన్న ఒక ఫామ్‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ ఆయనకు చెల్లం అనే వృద్ధురాలిని కలిశారు. అంతేగాదు ఆయన ఆమెను భోజనం చేశారా అని అడగగా, తన కోసం ఎదురుచూస్తూ తినలేదని చెప్పిందామె. అలాగే ఆమె ఆరోగ్యం గురించి అడిగాను. కానీ ఆ వృధ్దురాలు విజయ్‌ని చూసిన ఆనందంలో తను పడుతున్న కష్టాల గురించి వెళ్లబోసుకోవడం మర్చిపోయిందామె.#WATCH | Salem | Tamil Nadu CM Joseph Vijay visits the house of a farmer and gifts his glasses to an elderly woman in Mettur(Source: TN CMO) https://t.co/VQy07Jy7kt pic.twitter.com/NhZN3FfXmF— ANI (@ANI) September 1, 2026(చదవండి: క్లౌడ్ కిచెన్‌తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!) -
అలా కేసులు పెట్టడం అమానవీయం.. విజయ్ ఫైర్
ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం ఎవరైనా శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టవచ్చని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. అయితే అవి హింసాత్మకంగా మారకుండా, ప్రజలకో.. ప్రభుత్వ ఆస్తులకో నష్టం కలిగించకుండా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం అసెంబ్లీ సాక్షిగా ఓ కీలక ప్రకటన చేశారు.గత డీఎంకే ప్రభుత్వంలో రైతులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం విజయ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే వాళ్లు ధర్నాలు చేపడితే కేసులు పెట్టారని.. అది అమానవీయమని మండిపడ్డారాయన. ఆయా కేసులు ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని సభలో తెలియజేశారు. ఈ నేపథ్యంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. దీంతో 2021 మే నుంచి 2026 వరకు ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులన్నీ రద్దు కానున్నాయి.రైతులపై కేసులెందుకు?రాష్ట్రానికి.. దేశానికి రైతులే వెన్నెముక అని విజయ్ పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ముఖ్యంగా సిప్కాట్ పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సందర్భంగా రైతులపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. విజయ్ ప్రకటన చేసిన సమయంలో ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ సభలోనే ఉండడం గమనార్హం.డీఎంకే హయాంలో పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక రైతులు, గ్రామస్తులు సుదీర్ఘంగా ఆందోళనలు చేశారు. ఈ తరుణంలో.. విమానాశ్రయాన్ని రద్దు చేస్తూ విజయ్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. టీచర్లపైనా..ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేసినప్పటికీ వారిపైనా కేసులు పెట్టారని సీఎం విజయ్ తెలిపారు. ఆ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును వినియోగించుకున్నందుకు కేసులతో వేధించడం సరికాదని వ్యాఖ్యానించారు.ఎన్ని కేసులు?అయితే డీఎంకే హయాంలో రైతులు, ఉపాధ్యాయులపై వివిధ ఆందోళనలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయనే పూర్తి సంఖ్యను విజయ్ ప్రభుత్వం ఈ ప్రకటనలో వెల్లడించలేదు. అయితే గతంలో తమిళనాడులో వివిధ ఉద్యమాలకు సంబంధించిన పెండింగ్ కేసులపై ప్రభుత్వాలు దశలవారీగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష డీఎంకే స్పందించాల్సి ఉంది. ఆ ఇబ్బందుల్ని అర్థం చేసుకున్నాంగత డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన వారిని అమానవీయంగా వ్యవహరించారని విజయ్ ఆరోపించారు. కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, ఇతర వ్యక్తిగత వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఉపశమనం కల్పించేందుకే కేసుల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా, ఇటీవలే యాంటీ-నీట్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 2న పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు డీఎంకే హయాంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులను కొట్టేయాలని నిర్ణయించడం గమనార్హం.ఇదీ చదవండి: కాంగ్రెస్ ప్లాన్‌బీ.. వాళ్లకు బంపర్ ఆఫర్ -
లండన్ లో త్రిష.. విజయ్ వెళ్ళేది ఆమె కోసమేనా!
-
రాహుల్ గాందీనే ప్రధాని అభ్యర్థి!
సాక్షి, చెన్నై: జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మాత్రమే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని, తమిళనాడు సీఎం విజయ్‌కి అలాంటి ఆలోచన ఊహల్లో కూడా ఉండదని ఎండీఎంకే నేత వైగో వ్యాఖ్యానించారు. ఇకపై మంత్రులు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ చూసుకోవాలని సూచించారు. సోమవారం తిరునెల్వేలిలో వైగో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో ఒక భారీ ప్రభుత్వ మార్పు వచ్చిందని, టీవీకే ప్రభుత్వాన్ని సీఎం విజయ్ అవి నీతి రహితంగా నడిపిస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రతి శాఖలో లంచాలు ఇస్తేనే పనులు జరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ప్రజలు ఏ ప్రభు త్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కమీషన్లు లేకుండా నేరుగా పాల న సాగుతోందన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వానికి తాను 100కి 80 మార్కులు ఇస్తున్నానని, అవినీతిని పూర్తిగా నిర్మూలించడం హిమాలయాన్ని కదిలించినంత కష్టమైన పనిగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చక్కగా పనిచేస్తున్నట్టు వైగో అభినందించారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వం: ‘’రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరించకపోతే రాజీనామా చేస్తాం’’ అని మంత్రి రాజేష్‌కుమార్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం విజయ్ ఊహల్లో కూడా అలాంటి ఆలోచన ఉండదన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాం«దీనే ప్రధాని అభ్యరి్థగా ఉంటారని, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ నిరోధించాలని సూచించారు. ఇక, కావేరీ నిర్వహణ బోర్డు తన బాధ్యతను విస్మరించిందని, కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూ తమిళనాడుకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని, ఈ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైగో డిమాండ్ చేశారు. కాగా, సీఎం విజయ్ భావి ప్రదాని అంటూ మంత్రులు వ్యాఖ్యల తూటాలను అందుకోవడంతో కాంగ్రెస్ నాయకులు గుర్రు మంటున్న విషయం తెలిసిందే. చదవండి: విజయ్‌తో విభేదాల్లేవు.. ఆయనే ప్రధాని అభ్యర్థి! -
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేరుతో మరో కొత్త చర్చ మొదలైంది. 2029లో ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ను ప్రొజెక్ట్ చేస్తూ ఆయన పార్టీ టీవీకే వర్గాలు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే–సీవోటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి విజయ్ మూడో స్థానంలో నిలవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఈ తరుణంలో.. అక్కడి ప్రతిపక్ష డీఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది.రాజకీయ ఉద్దండులను తోసేసి మరీ.. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తర్వాత ప్రధాని రేసులో విజయ్ ఉన్నారన్నది ఇండియాటుడే సర్వేలో వెల్లడైంది. అంతేకాదు సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగానూ ఆయనకు అర్హత ఉందంటూ రాహుల్ గాంధీ తర్వాతి ప్లేస్‌ను కట్టబెట్టారు. దీంతో విజయ్‌కు జాతీయ స్థాయిలో ఆదరణ ఉందని.. రాబోయే రోజుల్లో పక్కా దేశానికి ప్రధాని అవుతారంటూ టీవీకే హడావిడి చేస్తోంది. అయితే ఈ ప్రచారంపై డీఎంకే నేత ఆర్ఎస్ భారతి స్పందిస్తూ ఆయన పార్టీ కార్యకర్తలు కోరుకుంటే విజయ్ పీఎం ఏంటి.. ఏకంగా ఐక్యరాజ్యసమితి అధిపతి అవుతారని సెటైర్ వేశారు.“వారి ఊహలకు హద్దుల్లేవు.. ఏదైనా ఊహించుకోనివ్వండి” అంటూ ఆర్ఎస్ భారతి కామెంట్ చేశారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఆ పార్టీ ఆశయం ఏమైపోతుందో అంటూ ఇంకో చురక అంటించారు.కాంగ్రెస్ గుంటనక్క కథ.. ఇండియా టుడే సర్వే, టీవీకే చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ కూడా పరోక్షంగా స్పందించినట్లు ఆయన తాజా ట్వీట్‌తో స్పష్టమవుతోంది. ‘ది ఫాక్స్ ఫేక్ పోల్’ పేరుతో ఓ నక్క కథను ఎక్స్‌లో పంచుకున్న ఆయన.. సర్వేలో ఎంతమందిని ప్రశ్నించారు? ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రశ్నలు అడిగారు? ఫలితాలను ఎలా లెక్కించారు? వంటి అంశాలను ప్రస్తావించారు. “ప్రతి సంఖ్య నిజాన్ని చెప్పదు.. ప్రతి సర్వే ప్రజల గొంతుక కాదు” అంటూ తేల్చేశారు. ఆయన చెప్పిన కథలో ఏముందంటే..ఒక అడవిలో సింహం, ఏనుగు మంచి స్నేహితులు. అడవికి సంబంధించి ఏ నిర్ణయమైనా ఇద్దరూ కలిసే తీసుకుంటారు. వారి స్నేహాన్ని చూసి ఈర్ష్యపడిన గుంటనక్క.. కొందరిని మాత్రమే అడిగి ఓ సర్వే నిర్వహిస్తుంది. ఆ సర్వే పేరుతో సింహానికి ఏనుగుపై, ఏనుగుకు సింహంపై అనుమానాలు కలిగించి వాళ్లను విడగొట్టాలని చూస్తుంది. చివరకు ఓ చీమ.. ముందుకు వచ్చి నక్కను అందరి ముందే నిలదీస్తుంది. సర్వేలో ఎంతమందిని అడిగారు? ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రశ్నలు వేశారు? ఫలితాలను ఎలా లెక్కించారు? అని ప్రశ్నించడంతో నక్క నీళ్లునములుతూ కనిపిస్తుంది. అలా ఏనుగు-సింహం స్నేహం చెడిపోకుండా కాపాడుతుంది. படித்ததில் பிடித்த ஒரு குட்டி கதை …நரியின் போலி கருத்துக்கணிப்புஒரு காட்டில் சிங்கமும் யானையும் நெருங்கிய நண்பர்களாக இருந்தனர்.காட்டில் எந்தப் பெரிய முடிவாக இருந்தாலும், இருவரும் ஒன்றாக ஆலோசனை செய்வார்கள்.ஒருநாள், அந்த நட்பைப் பார்த்து பொறாமைப்பட்ட நரி, ஒரு…— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 30, 2026ఇండియాటుడే చానెల్ ఈ మధ్యే తమిళంలోనూ అడుగు పెట్టింది. అది సీఎం విజయ్ చేతుల మీదుగానే ప్రారంభం కావడం గమనార్హం.విజయ్‌కు మూడో స్థానంఆగస్టు 28న వెలువడిన తాజా ఇండియా టుడే–సీవోటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి ప్రజల ఎంపికలో విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. వీటితో పాటు గత ఆరు నెలల్లో నిర్వహించిన మరో 91,795 ఇంటర్వ్యూల డేటాను కూడా విశ్లేషణలో ఉపయోగించారు. మొత్తం 9.2% మంది విజయ్ తదుపరి ప్రధాని కావడానికి అనుకూలంగా ఓటేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి 48.7%, రాహుల్ గాంధీకి 27.1% మద్దతు లభించింది. దీంతో 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే వర్గాల్లో ‘విజయ్ ఫర్ పీఎం’ నినాదం మరింత బలంగా వినిపిస్తోంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విజయ్ను ప్రధాని చేయాలంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ తరుణంలో మిత్రపక్షం కాంగ్రెస్ నుంచే కౌంటర్లు రావడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సెప్టెంబర్ 17న తమిళ రాజకీయాల్లో బిగ్ బాంబ్? -
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. DMK స్టాలిన్ కు షాక్
-
సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. నేరుగా ఖైదీలతో!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అక్కడి పుజల్ జైలులో ఆకస్మిక పర్యటన చేశారు. కారాగారంలో ఖైదీల బాగోగులు ఆరా తీశారు. ఖైదీలకు అందిస్తున్న ప్రాథమిక సౌకర్యాలు, వైద్య సంరక్షణ, ఆహార నాణ్యత, వృత్తి శిక్షణా కేంద్రాలను తనీఖీ చేశారు. అనంతరం ఖైదీలకు అందిస్తున్న సహాయ సహకారాలు తదితర విషయాలపై నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్ శుక్రవారం పుజల్ సెంట్రల్ జైలులో ఆకస్మిక పర్యటన చేశారు. తన పర్యటన సందర్భంగా విజయ్, పుజల్ సెంట్రల్ జైలు-1లోని క్వారంటైన్ జోన్, సందర్శకుల హాల్, జైలు ఆసుపత్రి, రీహాబిలిటేషన్ సెంటర్, మహాత్మా గాంధీ కమ్యూనిటీ కళాశాలలోని తరగతి గదులు, గ్రంథాలయం, అధునాతన కంప్యూటర్ శిక్షణా కేంద్రం, హై-సెక్యూరిటీ బ్లాక్, ఉరితీత ప్రాంతంతో సహా పలు కీలక సౌకర్యాలను తనిఖీ చేశారు.అనంతరం అక్కడే వస్త్రాలు తయారు చేసే పవర్లూమ్ విభాగాన్ని, అలాగే టైలరింగ్ యూనిట్‌ను సమీక్షించారు. ఆయన ఖైదీలకు అందించే ఆహార నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, వారి సమస్యలు, అవసరాలను నేరుగా వినడానికి వారితో సంభాషించారు. జైలు సందర్శన అనంతరం ముఖ్యమంత్రి ఎం-3 పుజల్ పోలీస్ స్టేషన్‌ను అక్కడి పోలీసు అధికారులతో రోజువారీ కార్యకలాపాలను సమీక్షించారు, స్టేషన్ రిజిస్టర్లను పరిశీలించారు. సబ్-ఇన్స్పెక్టర్ గది, కంప్యూటర్ గది, లాకప్ సౌకర్యాలను తనిఖీ చేశారు.ముఖ్యమంత్రి పర్యటనలో సీఎంతో పాటు పోలీస్ డైరెక్టర్ జనరల్, జైళ్లు జైళ్ల డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (చెన్నై రేంజ్) టి. పళని, జైళ్ల సూపరింటెండెంట్ కృష్ణరాజ్ మరియు ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
విజయ్ మరో సంచలనం.. మోదీ, రాహుల్ తర్వాత ప్లేస్!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ జాతీయ రాజకీయాల్లోనూ తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాత.. తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా టుడే–సీ ఓటర్ నిర్వహించిన తాజా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వేలో ఈ ఆసక్తికరమైన ఫలితం వెల్లడైంది.ప్రధాని పదవికి తదుపరి ఎంపికగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నించగా.. నరేంద్ర మోదీకి 48.7 శాతం మంది, రాహుల్ గాంధీకి 27.1 శాతం మంది మద్దతు తెలిపారు. అనూహ్యంగా విజయ్‌కు ఏకంగా 9.2 శాతం మంది మద్దతు పలికారు. దీంతో ఆయన మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండేళ్లు కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థిగా విజయ్ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.విజయ్ తర్వాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 2 శాతంతో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ 1.7 శాతంతో, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే 1.3 శాతంతో, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఆ రకంగానూ విజయ్‌కు ఆదరణేప్రధాని ఎంపిక ప్రశ్నతో పాటు.. ప్రస్తుత ప్రతిపక్ష నేతల్లో కూటమికి నాయకత్వం వహించేందుకు ఎవరు సమర్థులని అడిగినప్పుడు కూడా విజయ్ మంచి స్థానంలో నిలిచారు. ఈ విభాగంలో రాహుల్ గాంధీ 29 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. విజయ్ 12.2 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. మమతా బెనర్జీ 8.5 శాతం, కేజ్రీవాల్ 7.5 శాతం, అఖిలేశ్ యాదవ్ 6.9 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.రెండేళ్లలోనే సీఎం.. ఇప్పుడేమోవిజయ్ 2024లో టీవీకేను స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత రెండేళ్లలోనే జరిగిన తొలి ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారించారు. తొలి ఏడాది పాలన కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ఆయన పేరు ప్రధాని అభ్యర్థుల జాబితాలో వినిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఇటీవల టీవీకే నేతలు కూడా విజయ్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను బహిరంగంగానే ప్రారంభించారు. 2029 లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే సంకేతాలు ఇస్తున్నారు.‘దక్షిణం నుంచి ప్రధాని రావాలి’విజయ్ ప్రధాని అభ్యర్థిత్వంపై టీవీకే నేతల వ్యాఖ్యలు కూడా ఇటీవల జోరందుకున్నాయి. ఆగస్టు 18న తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడిన టీవీకే మంత్రి శరత్‌కుమార్.. విజయ్ భవిష్యత్ ప్రధాని అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు.అంతకుముందు టీవీకే నేత, తమిళనాడు ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున కూడా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావడం ఖాయమని, అలాంటి నాయకుడు తమిళనాడు నుంచి ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా వెలువడిన ఇండియాటుడే సర్వే ఫలితాలు టీవీకే వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.25 వేల మందితో తాజా సర్వేఇండియా టుడే గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో భాగంగా తాజా సర్వేను సీ ఓటర్ నిర్వహించింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత ఆరు నెలల్లో సీ ఓటర్ నిర్వహించిన సాధారణ ట్రాకింగ్ సర్వేలలోని 91,795 ఇంటర్వ్యూలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సర్వేలో వ్యక్తమైన ప్రజాదరణను దేశవ్యాప్తంగా ఓట్లుగా, కూటమిగా మార్చుకోవడం విజయ్‌కు పెద్ద సవాలే. అయినప్పటికీ.. తమిళనాడు రాజకీయాలకే పరిమితమైన నాయకుడిగా కాకుండా, జాతీయ స్థాయిలో ప్రధాని రేసులో పేరు వినిపించే స్థాయికి విజయ్ చేరుకోవడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: దటీజ్ విజయ్.. తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త సంప్రదాయం -
అసెంబ్లీలో సీఎం విజయ్ కొత్త రూల్.. ప్రతిపక్షాల అభ్యంతరం
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం ఆసక్తికరంగా వ్యవహరించారు. సాధారణంగా స్పీకర్ కుర్చీకి సమీపంలో సీఎం కోసం కేటాయించిన ప్రత్యేక సీటులో కూర్చునే ఆయన.. తొలిసారి ఆ స్థానాన్ని వదిలి మంత్రుల వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో అసెంబ్లీలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. విజయ్ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కుడివైపున ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీటు ఉంటుంది. ఆయన పక్కనే మంత్రులు వారి సీనియారిటీ ఆధారంగా కూర్చుంటారు. అయితే గురువారం మధ్యాహ్నం సమావేశాల సందర్భంగా విజయ్ తన సీటు నుంచి లేచి.. సభా నాయకుడు, మంత్రి కేఏ సెంగొట్టయ్యన్, మరో మంత్రి ఆధవ్ అర్జున మధ్యలో కూర్చున్నారు. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విజయ్ ఇష్టానుసారం వ్యవహరించడం తగదని.. పాలనకంటూ కొన్ని మార్గదర్శకాలు ఉంటాయని.. వాటిని ఆయన పాటించాలని సూచించాయి. అయితే సహచర మంత్రులతో మాట్లాడేందుకే ఆయన ఇలా స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. CM Vijay is in some discussion with Minister KAS pic.twitter.com/CynRjQChQB— Actor Vijay FC (@ActorVijayFC) August 27, 2026సాధారణంగా మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు తమ సహచరులతో మాట్లాడేందుకు కొద్దిసేపు సీట్లు మారడం కనిపిస్తుంటుంది. కానీ ముఖ్యమంత్రి తనకు కేటాయించిన అధికారిక సీటును వదిలి మంత్రుల కోసం ఉద్దేశించిన సీటులో కూర్చోవడం మాత్రం తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.ఇదిలా ఉండగా.. సభలో అధికారుల గైర్హాజరుపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. కీలక అంశాలపై ఎమ్మెల్యేలు చర్చిస్తున్న సమయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు అసెంబ్లీలోనే ఉండేలా చూడాలని స్పీకర్‌ను కోరారు. గతంలో కరూర్ తొక్కిసలాట ఘటనపై చర్చ జరిగినప్పుడు అప్పటి సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు చీఫ్ సెక్రటరీ, శాఖల కార్యదర్శులు సభలో ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం, ఉన్నతాధికారులు సభలో కనిపించడం లేదని విమర్శించారు.దీనిపై మంత్రి ఆధవ్ అర్జున స్పందిస్తూ.. అధికారులు పక్కనే ఉన్న ‘వార్ రూమ్’లో ఉండి, సభ్యుల ప్రసంగాలను నోట్ చేసుకుంటున్నారని తెలిపారు. అయితే ఉదయనిధి సూచనతో ఏకీభవించిన స్పీకర్.. అసెంబ్లీ సమావేశాల సమయంలో సీనియర్ అధికారులు సభలోనే ఉండేలా ఆదేశిస్తామని చెప్పారు. అంతకుముందు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం విజయ్.. ఆ తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు.ఇదీ చదవండి: రాఖీ పండుగను రాజకీయం కోసం వాడేసుకుంటున్నారా? -
యాక్షన్ ప్లాన్ ఏది?.. నేపాల్‌లో తమిళ యాత్రికుల మిస్సింగ్
నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య పెరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళ యాత్రికుల పరిస్థితిపై ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.కుంభకోణానికి చెందిన సూపర్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మొత్తం 57 మంది తమిళ యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. వీరిలో 20 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా.. మరో 37 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీవీకే సర్కార్ ఈ మధ్యాహ్నాం దాకా ఎలాంటి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.ఏం చర్యలు తీసుకున్నారు?ఈ వ్యవహారంపై తమిళనాడు టీవీకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. నేపాల్‌లో చిక్కుకున్న తమిళ యాత్రికుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. “ఎంతమంది యాత్రికులు గల్లంతయ్యారు? ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఎన్ని కాల్స్ వచ్చాయి? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఆ 57 మంది తమిళ యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ.. నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని కోరింది.LoP Udhayanidhi Stalin in Tamil Nadu Assembly on Nepal floods: "Many Tamils who went missing in Nepal are still unreachable. How many calls were received on the Government helpline? What action has been taken? - Udhayanidhi questions.""All 57 Tamils must be rescued and brought… https://t.co/wENvCSTZUl— ANI (@ANI) August 27, 202657 కాదు.. 106 మందితమిళనాడు మంత్రి రాజ్‌మోహన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అక్కడి అధికార యంత్రాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం జరుపుతున్నామని తెలిపారు. కుంభకోణం ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 57 మంది వెళ్లగా.. చెన్నైకి చెందిన మరో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మరో 49 మంది యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.చివరి ఫోన్ కాల్.. నో రెస్పాన్స్తమ కుటుంబ సభ్యుల నుంచి చివరిసారిగా వచ్చిన ఫోన్ కాల్ తర్వాత యాత్రికుల బంధువుల్లో ఆందోళన మరింత పెరిగింది. విష్ణు రామస్వామి అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన తల్లి, ఇద్దరు సోదరీమణులు యాత్రలో ఉన్నారని తెలిపారు. “ఆగస్టు 23న వారు బయలుదేరారు. ఢిల్లీ, ఖాట్మండు చేరుకున్న తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసేవారు. ఆగస్టు 26 ఉదయం 6.15 గంటలకు చివరిసారి మాట్లాడారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ సంబంధాలు తెగిపోయాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.విజయ్ అత్యవసర సమావేశంఅసెంబ్లీలో నేపాల్ వరదల మిస్సింగ్‌పై ఆందోళనలు వ్యక్తం అయ్యాక.. ముఖ్యమంత్రి విజయ్ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.Nepal tragedy - Cm instructions Chief Minster of Tamil Nadu conducted a review meeting to oversee the relief measures post the Nepal tragedy CM has instructed Thiru Ashish Kumar, IAS, Resident Commissioner,TN House, New Delhi along with a team to proceed to Kathmandu to… pic.twitter.com/EqYLS4YzyF— Vignesh Theni (@Vignesh_twitz) August 27, 2026ఆచూకీ కోసం ప్రయత్నాలునేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన భారతీయుల వివరాలను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి. చాలామంది యాత్రికుల బృందాలు వరదల కంటే ముందే ఆ ప్రాంతాన్ని దాటినట్లు సమాచారం అందుతోంది. దీంతో యాత్రికుల సురక్షిత తరలింపుపై కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: విపత్తుల నేపాల్.. ఆ ట్రాక్ రికార్డు అంత ఘోరం మరి! -
సీనియర్ టీచర్లకు టెట్ వద్దు
-
కేరళలో దూసుకుపోతున్న TVK దేవన్ కు CM విజయ్ బంపర్ ఆఫర్
-
విజయ్ సర్కార్ సంచలన తీర్మానం సీనియర్ టీచర్లకు TET టెన్షన్ వద్దు
-
సీనియర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ షాకిచ్చిన వేళ.. పక్క రాష్ట్రం తమిళనాడు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టీచర్లకు(2010 కంటే ముందు) టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని మంగళవారం విజయ్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.సీనియర్ టీచర్లకు ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుంచి మినహాయింపునకు సంబంధించిన తీర్మానాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ నుంచి పూర్తిగా, శాశ్వతంగా మినహాయించాలని అందులో కోరారాయన. ఈ ప్రతిపాదన ద్వారా సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, పదోన్నతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజయ్ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.3.28 లక్షల మందికి ప్రయోజనం2010 ఆగస్టు 23కు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో నియమితులైన సుమారు 3,28,701 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ నిబంధన పరిధిలోకి వస్తున్నారని మంత్రి తెలిపారు. వీరిలో చాలామంది ఇప్పటికే 15 నుంచి 20 ఏళ్లుగా ఎలాంటి విరామం లేకుండా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఇప్పుడు తప్పనిసరిగా కొత్త పరీక్ష రాయాల్సి రావడం వారి ఉద్యోగ భద్రత, జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని వివరించారు.Minister Rajmohan has moved a resolution urging the Central Government to exempt teachers who joined service before 2010 from the Teacher Eligibility Test (TET). pic.twitter.com/p4PiMcJFmL— Vignesh Theni (@Vignesh_twitz) August 25, 2026కేంద్రాన్ని కోరిన తమిళనాడుసీనియర్ టీచర్లకు ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ తీర్మానం ద్వారా కోరుతున్నట్లు రాజ్‌మోహన్ తెలిపారు. ఇందుకోసం 2009 విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రమోషన్లకు ఇబ్బంది లేకుండా..టెట్ నిబంధన కారణంగా ఇప్పటికే సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ ప్రయోజనాలు, ముఖ్యంగా పదోన్నతులు నిలిచిపోకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను కొత్తగా పరీక్ష రాయాల్సిన పరిస్థితి నుంచి తప్పించడం ద్వారా వారి సర్వీస్ ప్రయోజనాలను కాపాడాలని విజయ్ ప్రభుత్వం భావిస్తోంది.ఏపీలో ఇదే అంశంపై కొంతకాలంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. కనీసం మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. అవేవీ పట్టించుకోకుండా ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ తరుణంలో 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయుల విషయంలో టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలన్న తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రం, NCTE స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఆరెస్సెస్ స్కెచ్.. జెన్‌జీ టార్గెట్ -
బీజేపీకి గుడ్‌బై.. ఆ వెంటనే విజయ్ TVK బంపర్ ఆఫర్!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన తమిళగ వెట్రి కజగం (TVK) రాజకీయంగా విస్తరించేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకే పరిమితం కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ అవకాశాలను ఇప్పటికే పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన నటుడు దేవన్‌కు మాంచి ఆఫర్ ఇచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా బీజేపీపై రగిలిపోతున్న ఆ సీనియర్ నటుడే ఓ జాతీయ మీడియా చానెల్‌కు వెల్లడించారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా అంది వచ్చిన అవకాశాన్ని విజయ్ టీవీకే సకాలంలో అందిపుచ్చుకుంది. అద్భుత విజయంతో అధికారం చేపట్టింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ కన్ను పక్క రాష్ట్రాలపై పడింది. విజయ్ క్రేజ్, అలాగే.. రాజకీయ పరిస్థితులను బేరీజూ వేసుకుని విస్తరణకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కేరళలో టీవీకే విస్తరణకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మలయాళ ఇండస్ట్రీలో సీనియర్ నటుడైన దేవన్‌కు.. టీవీకే పార్టీ తాజాగా కేరళ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆఫర్ చేసింది. దేవన్ ఆగస్టు 16న బీజేపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన బీజేపీపై భగ్గుమన్నారు. దాదాపు ఐదేళ్లు పార్టీలో ఉన్నప్పటికీ తనకు ఎలాంటి బాధ్యత ఇవ్వలేదని, పనిచేయాలన్నా అవకాశం కల్పించలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాజీనామా చేసిన మరుసటి రోజే సీఎం విజయ్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని దేవన్ తెలిపారు.#WATCH | Kollam, Keralam: On joining TVK after resigning from BJP, Malayalam actor Devan said, "...I've been working for the BJP very affirmatively, aggressively, taking a lot of risks. But they couldn't understand my mission and my planning. They are against all these things. I… pic.twitter.com/q9PW7Ur3Tp— ANI (@ANI) August 23, 2026ఆ తర్వాత టీవీకేకి చెందిన ఇద్దరు నేతలు తన ఇంటికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపినట్లు చెప్పారు. అనంతరం సీనియర్ నేతలతో గూగుల్ మీట్ ద్వారా కూడా చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఈ చర్చల్లో కేరళ TVK రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తనకు ఆఫర్ చేసినట్లు దేవన్ తెలిపారు.విజయ్‌తో భేటీ తర్వాతే ప్రకటనదేవన్ త్వరలో చెన్నై వెళ్లి విజయ్ను కలవనున్నారు. సెప్టెంబర్ 10 తర్వాత ఈ భేటీ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విజయ్‌తో చర్చించిన అనంతరం TVKలో చేరిక, కేరళ పార్టీ బాధ్యతలు చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.విజయ్, దేవన్‌కు సినిమా రోజుల నుంచే మంచి పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆ అనుబంధమే ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త సమీకరణానికి దారితీస్తుందన్న ఆసక్తి నెలకొంది.తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే!మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన దేవన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. బాషా, ధర్మక్షేత్రం, రౌడీ మొగుడు, శుభాకాంక్షలు, పెళ్లి చేసుకుందాం, చన్నకేశవరెడ్డి, దేశముదురు, ఏ మాయ చేశావె, ఢమరుకం, హార్ట్ ఎటాక్, రాజుగారి గది-2, సాహో వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. దేవన్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. విద్యార్థి దశలో కాంగ్రెస్, KSUతో అనుబంధం ఉన్న ఆయన.. 2004లో కేరళ పీపుల్స్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో దాన్ని నవ కేరళ పీపుల్స్ పార్టీగా పునరుద్ధరించి, 2021లో బీజేపీలో విలీనం చేశారు. అనంతరం కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసి TVK వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం కేరళలో అధికార, ప్రతిపక్ష కూటముల మీద జనాలకు అసంతృప్తి నెలకొందని, మాంచి స్ట్రాటజీతో ముందుకెళ్తే టీవీకే రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారాయన.కేరళలో ‘కొత్త ప్రత్యామ్నాయం’..కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్.. ఈ రెండు కూటముల మధ్యే అధికార పంపిణీ రొటీన్‌గా మారింది. ఈ మధ్యలో బీజేపీ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమోనని భావించినా ఫలితం దక్కలేదు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, విజయ్ నేతృత్వంలోని TVK వైపు యువత, విద్యార్థులు ఆసక్తి చూపించొచ్చని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్‌కు కేరళలో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఆయన డబ్బింగ్ సినిమాలు విపరీతంగా ఆడేవి. గతంలో అక్కడికి వెళ్లిన ఆయన.. అభిమానులతో దిగిన సెల్ఫీలు సైతం నెట్టింట పంచుకునేవారు. విజయ్ రాజకీయ ఎంట్రీ, విజయాన్ని సైతం అక్కడి ప్రజలు నిశితంగా గమనించారు. దీంతో ఆయన ఎంట్రీ ఇస్తే ఆదరణ దక్కవచ్చని దేవన్ అంటున్నారు. టీవీకేలోకి దేవన్ ఎంట్రీ జరిగితే.. కేరళలో TVKకి తొలి కీలక అడుగు పడినట్లే. అయితే ఒకవైపు తమిళనాడులో పార్టీని బలోపేతం చేస్తూనే.. కేరళలో సినీ రంగంలో పరిచయం ఉన్న నేతను ముందుకు తీసుకురావడం ద్వారా విజయ్ తన పార్టీని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారా అన్న చర్చ మొదలైంది.ఇదీ చదవండి: ఎస్ఐ చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు -
పరందూర్ ఎయిర్ పోర్ట్ రద్దుతో కొత్త ట్విస్ట్.. చెన్నైకి మరో విమానాశ్రయం ఎక్కడ..?
-
పరందూర్ ఎయిర్పోర్ట్ రద్దు.. రైతులకే మా మద్దతు.. CM విజయ్ సంచలన నిర్ణయం
-
మాట నిలబెట్టుకున్న తమిళనాడు సీఎం విజయ్
మేనిఫెస్టో పేరిట అడ్డగోలు హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని ఎగ్గొట్టడం.. కొందరికి అలవాటే!. ముఖ్యంగా ఇప్పుడున్న కొన్ని ప్రభుత్వాలు ప్రజలను అలా మోసం చేస్తున్నవే. అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాగా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సోమవారం కీలక ప్రకటన చేశారు. పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం వెల్లడించారు. చెన్నై సమీపంలో ప్రతిపాదించిన ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు, స్థానికులకు అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు.‘‘పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నాం. ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’ అని విజయ్ తెలిపారు. వీటితో పాటు ఎన్నికల హామీలైన మూడు ఉచిత సిలిండర్ల పథకం పొంగల్ నుంచి ప్రారంభిస్తామని, అక్టోబర్ 2 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(డీలక్స్ బస్సులకూ వర్తింపజేస్తూ) పథకం మొదలుపెడతామని.. అలాగే మిగతా మేనిఫెస్టో హామీలపైనా స్పష్టత ఇచ్చారు. 🚨Chief Minister Vijay announces that the TVK government will abandon the proposed Parandur airport project. RIP TN Economy...🙏🙂 pic.twitter.com/ga7qbFvT64— Chennai Updates (@UpdatesChennai) August 24, 2026రైతుల ఆందోళనకు అండగా..చెన్నైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని కాంచీపురం జిల్లాలోని పరందూర్‌లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల బహుళ పంటలు పండే వ్యవసాయ భూములు, నీటి వనరులు దెబ్బతింటాయని స్థానిక రైతులు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.టీవీకే అధినేతగా ఉన్నప్పటి నుంచే విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించారు. 2024 అక్టోబర్‌లో విక్రవాండి సభలోనే ఈ అంశంపై స్పందించిన ఆయన.. పారిశ్రామిక అభివృద్ధికి విమానాశ్రయాలు అవసరమే అయినా, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి నిర్మాణాలు చేపట్టకూడదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే ప్రజల హామీని నెరవేరుస్తానని చెప్పిన విజయ్.. తాజాగా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు.డీఎంకే హయాంలోనే ప్రతిపాదనపరందూర్ ఎయిర్‌పోర్ట్‌కు 2025 ఏప్రిల్‌లో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. అయితే అప్పటి డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లింది. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదిత స్థలాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించి.. నీటి వనరులు, సారవంతమైన భూములను కాపాడేలా చర్యలు తీసుకుంటామని పార్టీ నేతలు వెల్లడించారు.విజయ్ ప్రకటనపై డీఎంకే కౌంటర్అయితే విజయ్ నిర్ణయంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్ట్‌కు సంబంధించిన మా ఫైళ్లను బయటపెట్టేందుకు విజయ్‌కు అనుమతి ఇస్తున్నాం. వారం రోజుల్లో వాటిని బయటపెట్టకపోతే.. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తాం’’ అని అన్నారు.ఎన్నికల ముందు పరందూర్ ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన విజయ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిర్ణయాన్ని అమలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులు, పర్యావరణ పరిరక్షణ అంశాలను ముందుకు తెస్తూ తీసుకున్న ఈ నిర్ణయం.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: మిడ్డిలో విజయ్ ఎమ్మెల్యే??.. కీర్తన రియాక్షన్ ఇదే -
బిడ్డకు మేనమామ ఉంగరం : బిడ్డింగ్ దక్కించుకున్న జ్యుయల్లర్స్ ఇవే!
సాక్షి, చెన్నై: ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టిన నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరాలను అందించే తల్లి మేనమామ బంగారు ఉంగరం పథకం (Thaimaman Thanga Mothiram Scheme) కొనుగోలు ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం ఖరారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ (టీఎన్ఎంఎస్సీ) 70:30 నిష్పత్తిలో జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్‌కు 1,28,499 బంగారు ఉంగరాలు సరఫరా చేసేందుకు వర్క్ ఆర్డర్లను జారీ చేసింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రకటించిన ఈ పథకం ప్రకారం జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆస్పత్రులలో పుట్టిన శిశువులకు ఈ పథం వర్తిస్తుంది. ఈ మేరకు జ్యుయల్లరీ సంస్థలకు 70:30 నిష్పత్తిలో వర్క్ ఆర్డర్లు జారీ అయ్యాయి. జూన్ నుండి సెప్టెంబర్ నాలుగు నెలల వరకు ఉన్న లబ్ధిదారుల కోసం మొదటి విడతలో జూన్ నుండి లబ్ధిదారులకు 1,28,499 బంగారు ఉంగరాలను ఈ రెండు సంస్థలు సరఫరా చేస్తాయి.టెండర్ ప్రక్రియలో జాయ్ అలుక్కాస్ సంస్థ 1 గ్రాము బంగారు ధర మినహాయించి, తయారీ, రవాణా, ఇన్సూరెన్స్, BIS హాల్‌మార్కింగ్ చార్జీల కోసం కేవలం 0.01 (1 పైసా) అత్యల్ప ధరగా బిడ్ దాఖలు చేసింది. తమిళనాడు పారదర్శక టెండర్ల చట్టం ప్రకారం, కళ్యాణ్ జువెలర్స్ కూడా అతి తక్కువ ధరకు అంగీకరించడంతో 30శాతం వాటా దక్కించుకుంది. ఇదీ చదవండి: రూ. 150 కోట్ల అవినీతి : బార్ కౌన్సిల్ ఛైర్మన్‌పై సంచలన ఆరోపణలు కాగా తమిళ సంస్కృతిలో పుట్టిన బిడ్డకు మేనమామ బంగారు ఉంగరం తొడగడం ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఈ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ,మగ లేదా ఆడ అనే లింగ బేధం లేకుండా, అలాగే ఎన్నో కాన్పు అనే పరిమితి లేకుండా పుట్టిన ప్రతి బిడ్డకు ఈ ఉంగరాన్ని అందిస్తారు.ఈ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏటా రూ. 755.83 కోట్లు కేటాయించింది.ప్రభుత్వ వైద్య విధానంపై ప్రజలకు నమ్మకాన్ని పెంచడం , ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని సీఎం విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: దారుణం బిల్‌పై బాడీ షేమింగ్ వివాదం : స్పందించిన కెఫే -
విజయ్ను రాహుల్‌గాంధీ ద్రోహి అంటారా?
తమిళనాడులో డీలిమిటేషన్ అంశం మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ విషయంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ వైఖరి మారిందంటూ అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం విజయ్ తన వైఖరిని సడలించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు విజయ్ మిత్రపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తారని నిలదీస్తున్నాయి.. డీఎంకే ఎంపీ దయానిధి మారన్, సీఎం విజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో డీలిమిటేషన్ బిల్లుపై ఓ పెద్ద జాతీయ పార్టీ డీఎంకేను ‘‘తమిళనాడు ద్రోహులు’’గా అభివర్ణించిందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే ఎప్పుడూ తన వైఖరిని మార్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ వైఖరిలో మార్పు కనిపిస్తోందని ఆరోపించారు.‘‘అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఒక తీర్మానం, అసెంబ్లీలో మరో తీర్మానం చేసి డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నిలిచిన విజయ్.. ఇప్పుడు న్యాయమైన డీలిమిటేషన్ కావాలని చెబుతున్నారు. మరి విజయ్ను రాహుల్‌గాంధీ ద్రోహి అంటారా?’’ అంటూ దయానిధి మారన్ ప్రశ్నించారు.అర్ధరాత్రి భేటీతో మార్పు వచ్చిందా?కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విజయ్ భేటీ అయిన తర్వాతే ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని డీఎంకే ఆరోపిస్తోంది. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించిన టీవీకే.. ఇప్పుడు ‘‘న్యాయమైన డీలిమిటేషన్’’ అంటూ కొత్త వైఖరి తీసుకుందని విమర్శించింది. ఈ పరిణామాలను డీఎంకే రాజకీయంగా ఉపయోగించుకుంటూ విజయ్ స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఇది పూర్తి యూటర్న్: అన్నాడీఎంకేవిజయ్ వైఖరిపై అన్నాడీఎంకే కూడా తీవ్రంగా స్పందించింది. టీవీకే ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుందని ఆరోపించింది. ‘‘ఇప్పుడు మీరు చెబుతున్నదే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత మాట మార్చడం ఎందుకు?’’ అంటూ అన్నాడీఎంకే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. డీలిమిటేషన్ అంశంపై టీవీకే ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని అన్నాడీఎంకే ‘‘రాజకీయ డ్రామా’’గా అభివర్ణించింది.టీటీవీ దినకరన్ విమర్శలుఅమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్ కూడా విజయ్‌పై విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీవీకే అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆరోపించారు. డీలిమిటేషన్ అంశంలో విజయ్ వైఖరి మారడంతో ఆ రాజకీయ వ్యూహం బయటపడిందని వ్యాఖ్యానించారు.మా వైఖరిలో మార్పు లేదు: టీవీకేవిమర్శల నేపథ్యంలో టీవీకే ఐటీ విభాగం స్పందించింది. డీలిమిటేషన్ అంశంపై పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని, న్యాయమైన డీలిమిటేషన్ కోసం మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది.డీలిమిటేషన్‌పై కొత్త రాజకీయ సమరండీలిమిటేషన్ అంశం ఇప్పటికే తమిళనాడులో సున్నితమైన రాజకీయ అంశంగా మారింది. ఇప్పుడు విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందనే ఆరోపణలు రావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విజయ్ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ముప్పేట విమర్శలు గుప్పిస్తుండగా.. టీవీకే మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. దీంతో రానున్న రోజుల్లో డీలిమిటేషన్ అంశం తమిళనాడు రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: డీలిమిటేషన్.. కేంద్రం కీలక నిర్ణయం -
మాకు NEET వద్దు.. అమిత్ షా తో CM విజయ్
-
విజయ్-త్రిష బంధంపై నటి సంజన కీలక వ్యాఖ్యలు
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హీరోయిన్ త్రిష పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్‌కు త్రిష సెల్యూట్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా నటి సంజన స్పందించారు. విజయ్ పాలనపై మాట్లాడే ధైర్యం లేకే కొందరు వ్యక్తిగత అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆమె విమర్శించారు.విజయ్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సంజన ప్రశంసించారు. ప్రజా సమస్యలపై ఆయన వేగంగా స్పందిస్తూ.. తన పాలనతో ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. విజయ్ పరిపాలనలో లోపాలు చూపించలేకే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు.‘విజయ్ రాష్ట్రాన్ని సమర్థంగా పరిపాలిస్తున్నారు కాబట్టి.. ఆయనపై ఆరోపణలు చేయలేకపోతున్నారు. వృత్తిపరంగా ఎలాంటి లోపాలు కనిపించనప్పుడు వ్యక్తిగత ఎజెండాను వెతకడానికి ప్రయత్నిస్తారు. వారి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కించపరచాలని చూస్తారు. విజయ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. మహిళలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి రాజకీయాలు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు’ అని సంజన వ్యాఖ్యానించారు.ఇక త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఎంతో గొప్ప నటి అని సంజన అన్నారు. సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్నారని ప్రశంసించారు. విజయ్, త్రిష మధ్య ఉన్న బంధం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇద్దరి సాన్నిహిత్యాన్ని చూసి వారి బంధం గురించి ఓ నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయపడ్డారు. విజయ్ సీఎం అయిన తర్వాత త్రిష పేరు ఆయనతో ముడిపెట్టి సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. సంజన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. -
సౌత్ నుంచి PM.. 2029 ప్రధాని రేసులో విజయ్
-
తమిళనాడు ఎమ్మెల్యేలకు విజయ్ గుడ్ న్యూస్!
-
విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఉత్తర్వులు వెనక్కి
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించిన వివాదాస్పద జీవోను.. బుధవారం వెనక్కి తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలంటూ అంతకు ముందు జారీ చేసిన జీవోలో దుమారం రేపింది. ఆగస్టు 14న విజయ్ ప్రభుత్వం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఓ ఉత్తర్వు జారీ చేసింది. అందులో.. లెఫ్ట్ పార్టీలతో పాటు సీపీజే నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనాలనే ఆసక్తికి విద్యార్థులు, యువత ‘లోనుకాకుండా’ చర్యలు తీసుకోవాలని పాఠశాలలు, కళాశాలలకు సూచించింది. ఇందుకోసం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. అంతేకాదు.. తీసుకున్న చర్యలపై ఆగస్టు 20లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలుఇటీవల పరీక్షలు, విద్యా సంబంధిత అంశాలపై దేశవ్యాప్తంగా జెన్‌జెడ్, జెన్ఆల్ఫా విద్యార్థుల నిరసనలు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీపీజే ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు యువత పోరాటాలకు మద్దతుగా మాట్లాడిన సీఎం విజయ్.. మొన్న స్వాతంత్ర్య దినోత్సవంలోనూ వణక్కం జెన్‌జీ అంటూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం అంతకు ఒక్కరోజు ముందు ఈ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.సీజేపీ తీవ్ర అభ్యంతరం.. ఆగ్రహంఈ ఉత్తర్వులపై సీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ సహ కన్వీనర్ సౌరవ్ దాస్.. విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. విద్యార్థులు, యువత తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం అర్థరహితమైన, అహేతుకమైన చర్య అని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. సీజేపీ, లెఫ్ట్ పార్టీలను ‘అరాచకానికి ఏజెంట్లు’గా బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం అభివర్ణించారు.విజయ్ ప్రభుత్వానికి లెఫ్ట్ మద్దతు..మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు జూన్‌లో లెఫ్ట్ పార్టీలు బేషరతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి దూరంగా నిలిచింది. దీంతో కాంగ్రెస్, వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంది.ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీల ఆందోళనలకూ విద్యార్థులు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఈ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనే హక్కు, వారిని రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉంచే ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. వివాదాస్పద ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తాజా రాజకీయ పరిణామంగా మారింది.ఇటు సీపీజే పేరుపైనా వివాదంఇదిలా ఉండగా.. తమిళనాడులో కాక్రోచ్ జనతా పార్టీ పేరు పైనా వివాదం నడుస్తోంది. ఆ పేరుతో ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీని నమోదు చేయాలని న్యాయవాది సి. బ్రహ్మ బాలసుబ్రమణియం నేతృత్వంలోని బృందం జూన్‌లో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే ఆ సంస్థ.. అభిజిత్ దీప్కేకు చెందిన సీపీజేకు భిన్నమైనదని బ్రహ్మ బాలసుబ్రమణియం వాదిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
కాక్రోచ్ దెబ్బకు విజయ్ సర్కార్ యూటర్న్
-
100 రోజుల్లో సీఎంగా విజయ్ హిట్టా..? ఫట్టా..?
-
క్లీన్ గవర్నెన్స్.. విజయ్ సంచలన నిర్ణయాలు
వరస సంచలన నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. తాజాగా.. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకూ కొత్త ప్రభుత్వ కార్లు అందించనున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. చట్ట సభ్యుల్లో చాలామంది కొత్తవాళ్లని.. పైగా వాళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని.. అందుకే ఈ నిర్ణయమని ప్రకటించారాయన. అంతేకాకుండా.. మరికొన్ని సంక్షేమ ప్రకటనలు సైతం చేశారు.ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని సీఎం విజయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వ వాహనాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత అసెంబ్లీలో తొలిసారి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు సాధారణ కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చినవారని.. వారికి ప్రజా సేవ చేసేందుకు అవసరమైన రవాణా సదుపాయం ఉండాలని సీఎం వివరించారు. దీంతో పాటు కారు డ్రైవర్ జీతం, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75 వేల భత్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదనంగా మరో రూ.25 వేలుఅంతేకాకుండా ఎమ్మెల్యే కార్యాలయంలో అధికారిక పనుల కోసం సహాయకుడిని నియమించుకునేందుకు నెలకు రూ.25 వేల గ్రాంట్ ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం వీసీకే ఎమ్మెల్యే జోతిమణి చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో వెలువడింది. ఎమ్మెల్యేలకు అవసరమైన లాజిస్టికల్ సపోర్ట్ లేకుండా సమర్థంగా పనిచేయడం కష్టమని ఆమె అసెంబ్లీలో ప్రస్తావించారు.‘క్లీన్ గవర్నెన్స్’ కోసమే..ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం వల్ల నియోజకవర్గ పర్యటనలు సులభమవడంతో పాటు ప్రజల సమస్యలపై వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని విజయ్ ప్రభుత్వం చెబుతోంది. అధికారిక పనులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా పాలన సాగించవచ్చన్నది ప్రభుత్వ వాదన.అయితే ఎమ్మెల్యేలకు వాహనాలు, భత్యాలపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. 234 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వాహనాలు, నిర్వహణ, డ్రైవర్, సహాయకుల ఖర్చులు రాష్ట్ర ఖజానాపై అదనపు భారం అవుతాయని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వాలు ఆర్థిక పరిమితుల కారణంగా ఇలాంటి డిమాండ్లను పక్కన పెట్టాయని ఓ డీఎంకే ఎమ్మెల్యే సభలోనే ప్రస్తావించారు.వైద్య విద్యకు రూ.351 కోట్లుఎమ్మెల్యేల సదుపాయాల ప్రకటనతో పాటు వైద్య రంగంలోనూ విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.351 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా మొత్తం 6,098 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.వీటిలో బీఎస్సీ నర్సింగ్‌లో 660, నర్సింగ్ కళాశాలలు, పాఠశాలల్లో 1,925, 12 పారామెడికల్ కోర్సుల్లో 2,778, వైద్య కోర్సుల్లో 735 అదనపు సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ఏడు కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు.పెరంబలూరులో ఆసుపత్రిపెరంబలూరులో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో 400 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యాధునిక వైద్య సేవలను అందించేలా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నారు.ఆరోగ్య బీమా పరిమితి రూ.25 లక్షలకుముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ప్రస్తుతం ఉన్న వార్షిక చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఖరీదైన వైద్య చికిత్సలు అవసరమైన కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభించే అవకాశం ఉంది.అదే సమయంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు అదనపు వైద్య, శస్త్రచికిత్స సేవలను కూడా పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. చెన్నై స్టాన్లీతో పాటు తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగల్పట్టు, తిరువారూర్, కరూర్, కన్యాకుమారి ఆసుపత్రుల్లో ఈ సేవలను అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.జీతం ఫ్లస్..తమిళనాడు ఎమ్మెల్యేలకు ఒకప్పుడు రూ.55 వేల నెలవారీ వేతనం ఉండేది. 2017లో అప్పటి ప్రభుత్వం అలవెన్సులన్నీ కలిపి రూ.1.05 లక్షలకు పెంచింది. ఇందులో ప్రాథమిక వేతనం రూ.30 వేలు, నియోజకవర్గ అలవెన్స్ రూ.25 వేలు, టెలిఫోన్ అలవెన్స్ రూ.7,500, ఇతర అలవెన్సులు ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రికి వేతనం సుమారు రూ.2.05 లక్షల దాకా ఉంది. విజయ్ సర్కార్ ఇప్పుడు ఆ వేతనానికి అదనంగా.. కారు+డ్రైవర్+పీఏ జీతం కోసం లక్ష అదనంగా చెల్లించనుంది. -
'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు
-
అసెంబ్లీలోకి సీఎం వస్తే లేచి నిలబడాలా?
సాక్షి, చెన్నై: శాసనసభలోకి సీఎం వచ్చినప్పుడు సభ్యులు గౌరవార్థం లేచి నిలబడటం తప్పనిసరా..? అనే అంశంపై అసెంబ్లీలో కాసేపు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీనిపై స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ స్పందిస్తూ... సీఎం సభలోకి వచ్చినప్పుడు సభ్యులు లేచి నిలబడటం నిర్బంధం ఏమీ కాదన్నారు. అది వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, సభ్యుల హక్కుకు సంబంధించిన అంశం అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. సభలో దేవాదాయ శాఖమంత్రి రమేష్ మాట్లాడుతూ, సీఎం విజయ్ సభలోకి వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించే మర్యాదను ప్రతిపక్ష నాయకుడికి , మాజీ సీఎం ఓ. పన్నీర్‌సెల్వం నేర్పించాల్సి ఉందని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇందుకు పన్నీరుసెల్వం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.పన్నీర్‌సెల్వం సమాధానం ఇస్తూ స్పీకర్ సభలోకి వచ్చినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరూ లేచి నిలబడటం కాలక్రమేణా వస్తున్న సాంప్రదాయం అని గుర్తు చేశారు. అయితే, సీఎం నేరుగా తమ స్థానానికి వెళ్లి నమస్కరించి కూర్చోవడం అనవాయితీగా వస్తున్నదన్నారు. తాజా సీఎం విజయ్ సభలోకి వస్తూ అటు... ఇటు ఇరువైపులా తిరిగి నమస్కరిస్తూ వెళ్తున్నారని, ఇది కొత్తగా ఉందన్నారు.. ఒకవేళ సీఎం కోసం లేచి నిలబడాలనే నిబంధనే ఉంటే, ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కూడా నిలబడాలా? అని ప్రశ్నించారు. స్పీకర్ వివరణ.. దీనిపై స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ సమాధానమిస్తూ.. సీఎంగానీ, ప్రతి పక్ష నాయకుడు గానీ సభలోకి వచ్చినప్పుడు సభ్యులు లేచి నిలబడాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ఈ సభ అత్యున్నత సాంప్రదాయం ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు. తమిళుల సంస్కృతి ప్రకారం అలా గౌరవం ఇవ్వడం మంచి పరిణామమేనని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలా వద్దా అనేది సభ్యుల ఇష్టానికే వదిలేస్తున్నానని వివరించారు. 100 రోజుల పాలనపై స్పీకర్ ప్రశంసలు ముందుగా అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం విజయవంతంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. లౌకిక, సామాజిక న్యాయాన్ని కాపాడే సీఎం విజయ్ పాలనలో ఈ 100 రోజులు కేవలం క్యాలెండర్ రోజులు కావు అని, తమిళనాడు చరిత్రలో ఒక చారిత్రక మార్పు అని వ్యాఖ్యలు చేశారు. -
మంత్రి చేసిన తప్పు.. సభలో సారీ చెప్పిన సీఎం విజయ్
-
‘రెస్పెక్ట్’ రచ్చ.. క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్
తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కేవలం పేరుతో సంబోధించడంపై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే పరిస్థితి చేజారిపోకుండా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రంగంలోకి దిగారు. తనదైన స్టైల్లో ఆ వివాదానికి ముగింపు పలికారు.అసెంబ్లీలో ఆరోగ్య, రెవెన్యూ శాఖల పద్దులపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న నగదు పంపిణీ, ఓటుకు నోటు తరహా రాజకీయాలను ప్రస్తావిస్తూ మంత్రి రంజిత్ కుమార్ డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచేవారని, తన కాంచీపురం నియోజకవర్గంలో ఒక్కో ఓటుకు రూ.1,500 వరకు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా గతంలో అమలైన ఎన్నికల వ్యూహాలను ప్రస్తావిస్తూ.. డీఎంకే వ్యవస్థాపక నేతల్లో ఒకరైన, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని మంత్రి కేవలం పేరుతోనే సంబోధించారు. సాధారణంగా తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధిని ‘కలైంజర్’, ‘మాజీ ముఖ్యమంత్రి’ వంటి గౌరవప్రదమైన సంబోధనలతో ప్రస్తావించే సంప్రదాయం ఉంది. దీంతో డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.. @TVKVijayHQ : அவர் சார்பா நான் மன்னிப்பு கேட்டுக்கொள்கிறேன் ! 🥺❤️#TNAssembly pic.twitter.com/ZUEf9gWWUJ— Prakash Vijay (@PrakazVijay_Of) August 17, 2026మంత్రి ఆర్వీ రంజిత్ కుమార్ తన ప్రసంగంలో కరుణానిధిని ఎలాంటి గౌరవప్రదమైన బిరుదు లేకుండా పేరుతో ప్రస్తావించడంతో డీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ నేతృత్వంలో డీఎంకే సభ్యులు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఎం సి. జోసెఫ్ విజయ్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. కరుణానిధిని ఆ విధంగా సంబోధించడం సరైనది కాదని అంగీకరించిన ఆయన.. ‘‘ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను’’ అని ప్రకటించారు. సీఎం జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మంత్రి మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే మంత్రి బదులు సీఎం విజయ్ క్షమాపణలు చెప్పడాన్ని ఓ వర్గం అభినందిస్తుండగా.. ఆ క్షమాపణ ఏదో మంత్రితో చెప్పిచ్చి ఉంటే బాగుండేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. -
సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు
-
సీఎం విజయ్ 100 రోజుల పాలన
-
విజయ్ మంచివారే.. ఆయనపై ఆ నమ్మకం ఉంది: అన్నామలై
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీవీకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్‌పై, బీజేపీ మాజీ నేత కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్ చాలా మంచివారని, ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రశంసింస్తూనే.. అదే సమయంలో మంత్రులు, అధికారుల పనితీరుపై ఓ కన్నేసి ఉంచాలని సీఎంకు సలహా ఇచ్చారు.బీజేపీకి గుడ్‌బై చెప్పిన తర్వాత.. సొంత రాజకీయ వేదిక దిశగా అన్నామలై అడుగులు వేస్తున్నారు. ‘వీ ద లీడర్స్’ పేరుతో ప్రారంభించిన ఉద్యమాన్ని భవిష్యత్‌లో రాజకీయ పార్టీగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ వేదిక ద్వారా కార్యకర్తలు, వాలంటీర్లను సమీకరించే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ‘వీ ద లీడర్స్’ (WTL) సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అన్నామలై మాట్లాడుతూ.. సీఎం విజయ్ చాలా మంచివారని, ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. అయితే కొందరు మంత్రులు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద ఆడియో ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటించారు.‘2 నుంచి 4 శాతం కమిషన్ అడుగుతున్నారు’కొంతమంది మంత్రులు గత ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నామలై ఆరోపించారు. ‘‘ఓట్లు కొనడానికి డబ్బు ఖర్చు చేశాం.. ఇప్పుడు టెండర్లలో 2 శాతం, 3 శాతం, 4 శాతం ఇవ్వాలని అడుగుతున్నారంటూ’’ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని ఇప్పుడే పెద్ద వివాదంగా మార్చడం లేదని.. ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన తర్వాత దీనిపై మరింతగా మాట్లాడతానని అన్నామలై తెలిపారు. ‘‘సీఎం విజయ్ మంత్రులు, అధికారులపై నియంత్రణ ఉంచాలి. లేదంటే పాలన దారి తప్పే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని చెప్పిన ఆయన.. అదే సమయంలో మంత్రులు, అధికారుల పనితీరుపై సీఎం విజయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలంటే తరచూ సమీక్షలు నిర్వహించాలని కోరారు.విజయ్ సర్కార్‌కు ఏడాది సమయంకొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం సరికాదని అన్నామలై అభిప్రాయపడ్డారు. తమిళనాడులో రాజకీయ మార్పు జరిగిందని, ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని అన్నారు. 234 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తొలిసారి అసెంబ్లీకి వచ్చారని పేర్కొంటూ.. వారికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని సూచించారు. ‘‘వాళ్లు సరిగ్గా పనిచేస్తే అభినందిస్తాం.. తప్పులు చేస్తే మొదట ప్రశ్నించేది మేమే’’ అని అన్నామలై అన్నారు. ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలను కూడా తాము స్వాగతిస్తామని తెలిపారు.ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. తాను బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నానన్న విమర్శలను అన్నామలై ఖండించారు. కేంద్ర హోంశాఖ నుంచి ఢిల్లీకి రావాలని ఆహ్వానం వచ్చినా.. తమిళనాడులోనే ఉండి ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజకీయ ప్రయాణం రాష్ట్ర ప్రయోజనాలకే అంకితమని చెప్పారు. కావేరీ జలాల అంశంలోనూ తమిళనాడు ప్రయోజనాలకే కట్టుబడి ఉంటానని అన్నామలై తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ మేకెదాటు ప్రాజెక్టును వ్యతిరేకించానని గుర్తుచేశారు. కావేరీ వివాదానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు.అన్నామలై వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెబుతూనే.. మరోవైపు అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా విజయ్ ప్రభుత్వంపై పరోక్ష ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో టీవీకే ప్రభుత్వం ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
తమిళుల కాల్చివేతపై భగ్గుమన్న విజయ్ సర్కార్
సాక్షి, చెన్నై: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వేటగాళ్లనే అనుమానంతో అటవీ శాఖ అధికారులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అయితే ఆ ముగ్గురు తమిళులు కావడంతో ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంది. వాళ్లు వేటగాళ్లు కాదని.. రైతులు అని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఘటనను తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కర్ణాటక అటవీ శాఖ వివరణపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఆగస్టు 15 తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఆంటోనీ సామి, జాన్ రోజ్ పీటర్, కుమార్ అనే ముగ్గురు తమిళులు మృతి చెందారు. వీరు చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలోని గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా స్పందించారు. తమిళులపై జరిగిన ఈ ఘటనను ఖండించిన ఆయన.. కర్ణాటక అటవీ శాఖ చెబుతున్న వివరణ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర, ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్, డీకే శివకుమార్ సర్కార్‌ను కోరారు. బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం అవసరమైన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పూర్తి నిజాలు బయటకు రావాలని.. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పారదర్శక విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.స్టాలిన్ ఆగ్రహంఈ ఘటనపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు తమిళ రైతుల కాల్చివేత ఘటన దిగ్భ్రాంతికరమని పేర్కొన్న ఆయన.. దీనిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరగకూడదు. కాల్పులకు బాధ్యులైన వారిపై హత్య కేసు నమోదు చేసి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి" అని స్టాలిన్ అన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై స్పందించడంలో ఆలస్యం చేయకుండా కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు: కర్ణాటక అధికారులుమరోవైపు కర్ణాటక అటవీ అధికారులు మాత్రం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వన్యప్రాణుల వేట కోసం వచ్చారని తెలిపారు. అటవీ సిబ్బందిని ఎదుర్కొన్న సమయంలో వారు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణలో భాగంగా ఎదురుకాల్పులు జరిపామని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, వేటకు ఉపయోగించిన వస్తువులు, అడవి జంతువుల మాంసంతో ఉన్న సంచులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.‘వేట ఆరోపణల్లో నిజం లేదు’.. ప్రతిపక్షాల ఆగ్రహంఅయితే తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు కర్ణాటక అధికారుల వాదనలను ప్రశ్నిస్తున్నాయి. ముగ్గురు వ్యక్తులు నిజంగానే వేటకు పాల్పడ్డారా? కాల్పులు అనివార్యమా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పీఎంకే నేత అన్బుమణి రామదాస్ ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. సీపీఎం, సీపీఐ నేతలు కూడా కాల్పుల్లో పాల్గొన్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.విచారణకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని చెప్పారు. కాల్పులు ఆత్మరక్షణలో భాగమా? లేదంటే ఉద్దేశపూర్వక చర్యా? అనేది విచారణలో తేలనుంది.కావేరీ జలాలు.. మేకెదాటు విషయంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఇవాళ సుప్రీం కోర్టులో తమిళనాడు వేసిన పిటిషన్(నీటి విడుదల కోసం..) విచారణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ముగ్గురు తమిళుల మృతితో ఇటు రాజకీయంగానూ ఘర్షణలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. -
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు కారు..
సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రభుత్వమే కారు, వ్యక్తిగత సహాయకుడిని కేటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం వెలువడింది. వివరాలు.. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో టీవీకేకు చెందిన 107 మంది అత్యధిక సభ్యులుగా ఉన్నారు.వీరిలో సీఎం విజయ్‌తో పాటూ 90 శాతం మంది తొలి సారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కిన వారే. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, వీసీకే, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ , ఎండీఎంకే ,డీఎండీకే తదితర పారీ్టలలో ఇద్దరు ముగ్గురు కొత్త వారు ఉన్నారు. ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో మెజారిటీ శాతం కొత్త వారు, తొలి సారిగా అడుగు పెట్టినవారే ఉన్నారు. వీరికి అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వాల్సిన పరిస్థితిఏర్పడింది. టీవీకే నుంచి గెలిచిన వారిలో అత్యధిక శాతం అభిమానులే. వీరి ఆస్తి పస్తులు అంతంత మాత్రమే. అప్పోసొప్పో చేసి ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీలోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీసీకే చెందిన కాట్టుమన్నార్కోయిల్ ఎమ్మెల్యే జ్యోతిమణి మాట్లాడుతూ.. సభలో చెప్పులు కూడా వేసుకోలేని నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు.. నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు సేవ చేయడానికి తమకు సొంత వాహనాలు లేవు అని, అద్దె వాహనాల్లో తిరగాల్సి వస్తున్నట్టు వివరించారు. అలాగే సహాయకుడిని పెట్టుకుని జీతం ఇచ్చే ఆర్థిక స్థోమత కూడా లేదన్నారు. అవినీతి లేని పాలన అందించాలంటే ఎమ్మెల్యేల కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేల నుండి వచ్చిన విజ్ఞప్తులను ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి తీసుకెళ్తానని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. సీఎం వద్దకు ప్రతిపాదన.. ఈ విషయంగా స్పీకర్ వినతిపత్రాన్ని సీఎం విజయ్‌కు పంపించారు. ఎమ్మెల్యేలు ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవ చేసేలా చూడాలనే ఉద్దేశంతో.. తొలిసారి సభలోకి అడుగుపెట్టిన శాసనసభ్యులకు కారు, అసిస్టెంట్‌ను కేటాయించేందుకు సీఎం విజయ్ ఆమోదం తెలిపినట్లు, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ దృష్ట్యా,కారు కూడా లేని ఎమ్మెల్యేలందెరికో వాహనాలు మరికొద్ది రోజులలో దరి చేరనున్నాయి. ఎవ్వరెవ్వరికి కార్లు లేవో, వారి వివరాలను సేకరించి కార్ల కొనుగోలుకు సంబం«ధించిన కసరత్తులపైఅ ధికారులు దృష్టి పెట్టారు. -
విజయ్ తల్లిపై కామెంట్స్.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిపై ఫిర్యాదు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఆయన తల్లిపై అవమానకర, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌పై తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు అందింది. డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని, సంబంధిత చట్టపరమైన నిబంధనల కింద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని, పరువునష్టం, బహిరంగ ప్రదేశంలో అనుచిత ప్రవర్తనకు సంబంధించి తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు పోలీసులను కోరారు.శనివారం చెన్నైలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కమలాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన రాజకీయ వివాదం నేపథ్యంలో ఈ ఫిర్యాదు వచ్చింది. అసెంబ్లీలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి విజయ్ చేసిన “కుట్టి కథై” (చిన్న కథ) వ్యాఖ్యలపై నాగేంద్రన్ విమర్శలు చేశారు.పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన నాగేంద్రన్.. అసెంబ్లీలో విజయ్ పదేపదే “తండ్రి” గురించి ప్రస్తావించడాన్ని ఎగతాళి చేశారు. “మీ తండ్రి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలనుకునేవారు అసెంబ్లీలో సమాధానం కోసం వెతకకుండా ఇంట్లో మీ అమ్మను అడగాలి” అని అన్నారు.విజయ్, ఆయన తల్లిపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను పరిశీలించి, కేసు దర్యాప్తులో భాగంగా వాటిని స్వాధీనం చేసుకోవాలని కూడా పోలీసులను కోరారు. 2026 ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత అసెంబ్లీలో విజయ్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది.డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తండ్రి ఎక్కడ ఉన్నారనే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ “కుట్టి కథై” చెప్పారు. ఇది కొళత్తూరులో డీఎంకే అధ్యక్షుడి ఓటమిని ఉద్దేశించిన హాస్యభరిత వ్యాఖ్యగా భావించారు.ఆ సమయంలో డీఎంకేతో పాటు పలు రాజకీయ పార్టీలు విజయ్ వ్యాఖ్యలను విమర్శించాయి. ముఖ్యమంత్రి చేసిన కామెంట్లపై స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి.. తాను శాసనసభలో లేకపోయినా ప్రజల హృదయాల్లో ఉన్నానని అన్నారు. నాగేంద్రన్ తాజా వ్యాఖ్యలపై బీజేపీలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ విమర్శలు వచ్చాయి.తమిళనాడు మంత్రి ఎ.రాజ్‌మోహన్ ఈ వ్యాఖ్యలను “అనాగరికమైనవి, అనుచితమైనవి”గా అభివర్ణించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు ఎదురైనా రాజకీయాల్లో మర్యాద పాటించాలని విజయ్ తన సహచరులను ఎప్పటికప్పుడు కోరారని చెప్పారు.తమిళనాడు నేత కె.అన్నామలై కూడా నాగేంద్రన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అవి రాజకీయ మర్యాదకు ఉన్న హద్దులను దాటాయని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, రాజకీయ విభేదాలపై చర్చించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్థించదగిన అంశాలని అన్నామలై చెప్పారు. -
సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. రగులుతున్న తమిళనాడు రాజకీయం?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం అధినేత, ముఖ్యమంత్రి విజయ్ను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో సీఎం విజయ్ ఓ చిన్న కథ చెబుతూ.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి కౌంటర్‌గా చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో తండ్రి ఎక్కడ ఉన్నారని వెతికే బదులు..అంటూ.. సీఎం విజయ్ తల్లిని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నేరుగా సీఎం విజయ్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన తల్లిని ఉద్దేశించినవేనంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలపై అధికార టీవీకే పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి అనాగరిక, అనుచిత వ్యాఖ్యలు బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తికి తగవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్‌మోహన్ తదితరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వయంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కూడా నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించారు. రాజకీయంగా విధానాలను, ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పులేదని, కానీ ఒక నాయకుడి కుటుంబాన్ని, ప్రత్యేకించి తల్లిని కించపరిచేలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది తమిళనాడు రాజకీయ సంస్కృతిని దిగజార్చేలా ఉందని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ.. తాను ఎవరిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆ వ్యాఖ్యలు చేయలేదని, తన ప్రసంగాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించారని వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ మాతృమూర్తిని, మాతృభాషను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఏదేమైనా, విజయ్ 'తండ్రి' వ్యాఖ్యలకు బీజేపీ 'అమ్మ' అంటూ ఇచ్చిన కౌంటర్ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు)
-
పాల ప్యాకెట్ల కింద లిక్కర్ బాటిల్స్!.. క్లాస్‌రూంలోనే దావత్!!
యువతను మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయడమే లక్ష్యంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలో.. అదే రాష్ట్రంలో ఓ గవర్నమెంట్ స్కూల్లో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. క్లాస్‌రూంలో.. అదీ అమ్మాయిలు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విజయ్ సర్కార్ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కన్యాకుమారి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. తరగతి గది సమీపంలో ఇద్దరు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ పాఠశాలలో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు పాఠశాలలోనే ఉండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.విజయ్ ప్రభుత్వం యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా స్థాయిలో నిఘా వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తుక్కలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ వీడియోతో కదిలిన యంత్రాంగంమద్యం సేవిస్తున్న దృశ్యాలను మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో కన్యాకుమారి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. విద్యార్థినులు ఎవరు? పాఠశాల ప్రాంగణంలోకి మద్యం ఎలా వచ్చింది? పర్యవేక్షణలో లోపం జరిగిందా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా ఎవాంజెలిన్ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.రాజ్‌కుమార్ అరెస్ట్విద్యార్థినులకు మద్యం అందించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత తోటి విద్యార్థులపై అనుమానం వ్యక్తమైనప్పటికీ.. వారి ప్రమేయం లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత తక్కలై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పాలు సరఫరా చేసే వ్యక్తిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ విద్యార్థినికి పరిచయస్తుడైన రాజ్‌కుమార్.. ఆమె కోరడంతో మద్యం కొనిచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.కౌన్సెలింగ్‌కు ఆదేశాలుఘటన అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థినులకు కూడా మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. మరోవైపు.. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల నియంత్రణ, పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతను మత్తుకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఇలాంటి ఘటనలు మరింత అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. -
సీఎం విజయకు త్రిష సెల్యూట్
-
ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష.. వీడియో వైరల్
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హీరోయిన్ త్రిష పేరు నెట్టింట తరచూ వైరల్‌గా మారుతోంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష పాల్గొనడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం విజయ్ తల్లిదండ్రులతో కలిసి ఆమె మొదటి వరుసలో కూర్చుని కార్యక్రమాలను వీక్షించారు. వేడుకలకు హాజరైన అధికారులను చిరునవ్వుతో పలకరిస్తూ.. వారికి అభివాదం చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లోకి త్రిష వస్తారంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇటీవల త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ కొన్ని పోస్టర్లు కూడా వెలిశాయి. మరోవైపు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. అలాగే త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి.ఉదయకుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ మదురై వ్యాప్తంగా త్రిష వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు, అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా త్రిష స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వీడియో వైరల్ కావడంతో.. ఆమె రాజకీయ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది.అయితే త్రిష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై ఆమె నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆమె తాజా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం అభిమానుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. Actor Trisha joins Independence Day function in Chennai. sits with Tamil Nadu CM Vijay's parents https://t.co/hHnqpS0xgx pic.twitter.com/czmejTY5W3— Vignesh Theni (@Vignesh_twitz) August 15, 2026#WATCH | சுதந்திர விழா அணிவகுப்பின்போது சல்யூட் அடித்த முதலமைச்சர் விஜய்க்கு சல்யூட் அடித்த த்ரிஷா!#SunNews | #Trisha | #Vijay | #IndependenceDay pic.twitter.com/YRCmkpBl3E— Sun News (@sunnewstamil) August 15, 2026Actress Trisha, who joyfully recorded a video on her phone as soon as Chief Minister Vijay arrived inside the fort premises where the national flag was hoisted..! pic.twitter.com/5F5oTOap1i— Global Box Office (@IndianBOReport) August 15, 2026 -
సీఎం విజయ్‌కు హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేయదలచిన మధ్యంతర పిటిషన్లను ఆగస్టు 25వ తేదీ లోపునే దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి విజయ్ విజయం సాధించినట్లు ప్రకటించడాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి ఆర్.డి శేఖర్, అలాగే ఓటర్లు దినేష్, లక్ష్మీ నరసింహన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే తరహాలో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలోనే హైకోర్టు ముఖ్యమంత్రి విజయ్ను ఆదేశించింది. పిటిషన్లు జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ ఎదుట విచారణకు వచ్చాయి. సీఎం విజయ్ తరఫు న్యాయవాదులు జి.మాసిలామణి, శ్రీనాథ్ శ్రీదేవన్ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. సీఎం విజయ్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ ఎన్నికల పిటిషన్లను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరుతూ తాము ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నామని, ఇందుకోసం 4 వారాల సమయం కావాలని అభ్యరి్థంచారు. నాలుగు వారాల గడువు ఇచ్చేందుకు నిరాకరించిన జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ ఆగస్టు 25 లోపు పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేశారు. తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున సాధించిన ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ విచారణను కూడా న్యాయమూర్తి ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళా రిజర్వేషన్ కు జై.. డీలిమిటేషన్ కు నో! విజయ్ సర్కార్ కీలక తీర్మానం
-
డ్రగ్ ఫ్రీ తమిళనాడు' కోసం సీఎం విజయ్ కీలక అడుగు
-
భాష ముఖ్యం బిగిలూ!
తమిళనాడులో భాషా రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. మంత్రి తమిళ ఉచ్చారణ, వ్యాకరణంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగా.. బీజేపీ కూడా రంగంలోకి దిగి తమిళ భాషను గౌరవించాలని డిమాండ్ చేసింది. దీంతో ‘భాషా ప్రేమ’ వర్సెస్ ‘వ్యక్తిగత శైలి’ అనే చర్చ మొదలైంది.ఆగస్టు 5న తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ తమిళంలో ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగంలో పలుచోట్ల వ్యాకరణ, ఉచ్చారణ లోపాలు కనిపించాయని డీఎంకే ఎమ్మెల్యే టీ.ఎం. రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడాలి” అని తాజాగా జరిగిన చర్చలో ఆయన సూచించారు. ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ వంటి కీలక ప్రసంగం చేస్తున్నప్పుడు భాషపై మరింత శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు.‘నా తమిళం.. నా స్టైల్’డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి మేరీ విల్సన్ తీవ్రంగా స్పందించారు. తన మాట్లాడే విధానాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు. “నా తమిళం గురించి నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా ప్రత్యేక శైలి. నేను ఇలాగే మాట్లాడగలను. అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇదే నా శైలి. మీ కోసం నేను మార్చుకోలేను” అంటూ మంత్రి ఘాటుగా బదులిచ్చారు.వివాదం పెరగడంతో అసెంబ్లీ స్పీకర్ జోక్యం చేసుకుని సభ్యులు ఈ అంశాన్ని తేలికగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు అర్థం చేసుకునేలా మంత్రి ప్రసంగించారని, భాషపై చర్చను సానుకూలంగా చూడాలని కోరారు.మతం ప్రస్తావనతో మరింత వేడితనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ మంత్రి విల్సన్ తన మత విశ్వాసాలను ప్రస్తావించారు. “క్రైస్తవం నాకు ప్రేమ, సానుభూతి అనే ఒకే భాషను నేర్పింది. నేను బైబిల్ నుంచి దాన్ని నేర్చుకున్నాను. నేను పుట్టుకతో క్రైస్తవుడిని” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. భాషా వివాదంలోకి మత ప్రస్తావన రావడంపై పలువురు స్పందించారు.‘తప్పులను అంగీకరించాలి’: డీఎంకేడీఎంకే సీనియర్ నేత టీ.కే.ఎస్. ఇళంగోవన్ మంత్రి తీరుపై విమర్శలు చేశారు. “బడ్జెట్ చదివే సమయంలో అనేక చోట్ల తమిళంలో తప్పులు జరిగాయి. దాన్ని అంగీకరించకుండా సమర్థించుకోవడం సరికాదు. ఆర్థిక మంత్రి భాషను సరిగ్గా చదవగలగాలి” అని అన్నారు.తమిళంను అవమానించొద్దు: బీజేపీఈ వివాదంలో బీజేపీ కూడా జోక్యం చేసుకుంది. తమిళ భాషను తక్కువ చేసి మాట్లాడే వ్యాఖ్యలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. “మతం ఏదైనా కావచ్చు. కానీ భావోద్వేగం, గుర్తింపు పరంగా మనమంతా తమిళులమే. మీ మతాన్ని గౌరవించడంలో తప్పులేదు. కానీ తమిళ భాషను కించపరిచే వ్యాఖ్యలను అంగీకరించలేం. మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.విజయ్ సూచనతమిళ భాషపై రేగిన వివాదంపై విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. మంత్రి విల్సన్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. “తమిళం మన అస్తిత్వం.. దాని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. భాష విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి” అంటూ సూచించినట్లు సమాచారం.భాషా గౌరవమా? వ్యక్తిగత స్వేచ్ఛా?ఈ వివాదం ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. ఒక వర్గం “తమిళం ప్రపంచంలోని పురాతన భాషల్లో ఒకటి.. దాన్ని సరిగ్గా మాట్లాడటం ప్రతి ఒక్కరి బాధ్యత” అంటుండగా.. మరోవర్గం “భాషలో చిన్న తప్పుల కంటే ప్రజలకు అర్థమయ్యేలా పాలన అందించడం ముఖ్యం” అని వాదిస్తోంది. -
CM విజయ్ సంచలనం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
-
విజయ్ బిగ్ ప్లాన్.. షాకిచ్చిన ప్రత్యర్థులు! వాట్ నెక్స్ట్?
తమిళనాడు గొంతును ఢిల్లీ వరకు వినిపించేందుకు ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రయత్నానికి అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆయన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన డీఎంకే, అన్నాడీఎంకే దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దీంతో తమిళనాడులో ఐక్య పోరాటానికి విజయ్ చేసిన ప్రయత్నం ప్రారంభంలోనే రాజకీయ విభేదాలను ఎదుర్కొంటోంది.కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై చర్చించేందుకు తమిళనాడు ఎంపీలతో ముఖ్యమంత్రి విజయ్ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరినీ ఆహ్వానిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీ భేదాలను పక్కన పెట్టి ఒకే నిర్ణయంతో ముందుకు వెళ్లాలని ఆయన ప్రయత్నించారు.డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమిళనాడు నుంచి ఏకాభిప్రాయంతో కూడిన వైఖరిని రూపొందించాలన్నది విజయ్ లక్ష్యంగా కనిపించింది. అయితే..డీఎంకే, అన్నాడీఎంకే బహిష్కరణవిజయ్ ప్రయత్నాలకు మొదటి దశలోనే అడ్డంకి ఎదురైంది. తమిళనాడులో కీలక రాజకీయ శక్తులైన డీఎంకే, అన్నాడీఎంకే ఈ సమావేశానికి హాజరు కావడం లేదని ప్రకటించాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ సభ్యులను కలిగి ఉన్న డీఎంకే గైర్హాజరు కావడం విజయ్ సమావేశానికి పెద్ద లోటుగా మారింది. అన్నాడీఎంకే కూడా దూరం కావడంతో తమిళనాడులోని ప్రధాన పార్టీల మధ్య డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదని స్పష్టమైంది.డీలిమిటేషన్ ఎందుకు వివాదం?కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియలో 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించే అవకాశం ఉంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను సుమారు 850 వరకు పెంచే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. అయితే దక్షిణాది రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఈ విధానం నష్టం చేస్తుందని వాటి వాదన. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు పెరుగుతాయని.. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.తమిళనాడు భయం ఇదే..ప్రస్తుతం తమిళనాడుకు లోక్‌సభలో 39 స్థానాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన కొత్త లెక్కలు అమలు చేస్తే రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీలు చెబుతున్నాయి. కేవలం ఎంపీ స్థానాలే కాకుండా.. కేంద్ర నిధుల కేటాయింపులు, పన్నుల పంపిణీ వంటి అంశాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల మాట బలహీనపడే అవకాశం ఉందన్నది వాటి ప్రధాన వాదన.డీఎంకే వైఖరిపై స్పష్టతఇటీవల డీలిమిటేషన్ అంశంలో డీఎంకే వైఖరి మారిందన్న ప్రచారం జరిగింది. దీనిపై ఆ పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ.. డీఎంకే మొదటి నుంచీ డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తోందని, భవిష్యత్‌లోనూ అదే వైఖరితో ఉంటుందని స్పష్టం చేశారు. 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా కొనసాగించాలని, అన్ని రాష్ట్రాలకు సమానంగా స్థానాలు పెంచాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల వారీగా కొత్తగా ఎన్ని స్థానాలు వస్తాయో ముందుగానే ప్రకటించాలని కోరుతోంది.విజయ్‌కు బిగ్ టెస్ట్ఇటీవలే రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న విజయ్‌కు డీలిమిటేషన్ అంశం కీలక పరీక్షగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో అన్ని పార్టీలను కలుపుకోవాలన్న ఆయన ప్రయత్నం ప్రశంసలు అందుకున్నప్పటికీ.. ప్రధాన పార్టీల గైర్హాజరు ఆయన ముందున్న రాజకీయ సవాళ్లను బయటపెట్టింది. డీలిమిటేషన్‌పై తమిళనాడు తరఫున ఒకే గొంతుక వినిపించాలని విజయ్ ప్రయత్నిస్తున్న వేళ.. డీఎంకే, అన్నాడీఎంకే దూరంగా ఉండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీలో తమిళనాడు గళం ఎంత బలంగా వినిపిస్తుందన్నది ఇకపై జరిగే రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. -
సీఎం విజయ్ భార్య విడాకుల పిటిషన్.. విత్ డ్రా వెనుక..
-
నో డివోర్స్ సీఎం విజయ్ కి బిగ్ రిలీఫ్
-
ఎన్ని అవమానాలకైనా సిద్ధమే.. విజయ్ స్పీచ్ తో దద్దరిల్లిన అసెంబ్లీ
-
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు
సాక్షిచెన్నై: తమిళనాడు సీఎం విజయ్ సతీమణి సంగీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు. దీంతో విజయ్-సంగీత విడాకుల కేసు కీలక మలుపు తిరిగినట్లైంది. సంగీత నిర్ణయంతో చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానం ఈ విడాకుల కేసు విచారణను పూర్తిగా ముగించింది. సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత ఈ పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.వివరాల్లోకి వెళితే..ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సీఎం విజయ్ భార్య సంగీత, తమ మధ్య పరిష్కరించుకోలేని తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ చెంగల్పట్టు జిల్లా కోర్టును ఆశ్రయించారు. విజయ్‌తో తన వివాహ బంధాన్ని చట్టబద్ధంగా రద్దు చేయడంతో పాటు, తనకు భరణం (జీవనభృతి) చెల్లించాలని, అలాగే చెన్నై నీలంకరైలోని తమ సొంత నివాసంలోనే నివసించేందుకు చట్టపరమైన అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ హైప్రొఫైల్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టినప్పటికీ, గతంలో జరిగిన పలు విచారణలకు సీఎం విజయ్, సంగీత ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. గత నెలలో జరిగిన విచారణకు సైతం ఇరుపక్షాలు గైర్హాజరవడంతో, న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి (శుక్రవారం) వాయిదా వేశారు.ఈ నేపథ్యంలో, నేడు (శుక్రవారం) జరిగిన విచారణకు సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై.. తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయస్థానానికి స్పష్టం చేశారు. దీంతో చెంగలపట్టు కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ కేసును క్లోజ్ చేసింది. గతంలో జరిగిన విచారణల సందర్భాలలో ఇరుపక్షాల తరఫున కేవలం వారి న్యాయవాదులు మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. సీఎం విజయ్, సంగీత భౌతికంగా కోర్టుకు హాజరు కావడంలో ఉన్న భద్రతాపరమైన ఇబ్బందులను వారి తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు. -
తమిళనాడు అసెంబ్లీలో CM విజయ్ Vs ఉదయనిధి స్టాలిన్
-
నో చీప్ పాలిటిక్స్.. ఉదయ్‌నిధికి విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
కావేరి జల వివాదం, కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకెదాటు ఆనకట్ట అంశంపై తమిళనాడు అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా.. ఆ అవసరం లేదంటూ ముఖ్యమంత్రి విజయ్ తేల్చేశారు. అలాగే కావేరి వివాదంపై కర్ణాటకతో చర్చలకు తానే ప్రతిపాదించానని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌కు ‘చీప్ పాలిటిక్స్’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తమిళనాడు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం.. అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలకు విజయ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మేకెదాటు అంశాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. “మేకెదాటు ఆనకట్ట విషయంలో చౌకబారు రాజకీయాలు(చీప్ పాలిటిక్స్) చేయాలని నేను అనుకోవడం లేదు. కావేరి జలాల విషయంలో మా వైఖరిని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా తెలియజేశాం. నది జలాల హక్కులు, మేకెదాటు అంశంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు” అని విజయ్ అన్నారు.అఖిలపక్షం నిర్వహించాల్సిన అవసరం లేదని.. కావేరి జలాల విషయంలో తమ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడేందుకు చివరి వరకు పోరాడుతుందని, ఎలాంటి రాజీకి వెళ్లబోమని కుండబద్ధలు కొట్టారు. అలాగే తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి అవమానాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం పాకులాడం..గతంలో ఎవరు ఏం చేశారన్న విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తాము భావించడం లేదని సీఎం చెప్పారు. “ఎవరు క్రెడిట్ తీసుకుంటారు? ఎవరికీ రాజకీయ ప్రయోజనం కలుగుతుంది? అనే దానిపై మాకు ఆసక్తి లేదు. కావేరి సమస్య పరిష్కారానికి ఏం చేయాలో మాకు తెలుసు. ఈ అంశాన్ని న్యాయపరమైన మార్గాల్లోనే ముందుకు తీసుకెళ్తాం” అని ఆయన స్పష్టం చేశారు.VIDEO | Cauvery is our lifeline, I do not want to play politics around it; wrote to PM on Mekedatu issue, we will protect state's rights, says CM Vijay speaking in Tamil Nadu Assembly.#CMVijay #TamilNaduAssembly #CauveryWater(Source: Third Party)(Full video available on PTI… pic.twitter.com/XCQrzRohHa— Press Trust of India (@PTI_News) August 7, 2026అఖిలపక్ష భేటీకి ఉదయనిధి డిమాండ్అయితే మేకెదాటు ప్రాజెక్టుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. కర్ణాటక కావేరి నదిపై మేకెదాటు ఆనకట్ట నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. అసెంబ్లీలో ఉదయనిధి మాట్లాడుతూ.. ఇది రాజకీయ అంశం కాదని, రైతుల జీవనాధారానికి సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు.“అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రధానికి లేఖ రాసినందుకు ప్రస్తుత సీఎం విమర్శించారు. ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన విషయం” అని ఉదయనిధి అన్నారు. కావేరి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.పేపర్ కౌంటర్కురువై (కావేరి డెల్టాలో వేసే ప్రత్యేక వరి సాగు) పంట సేకరణకు, కరువు నష్టపరిహారానికి మధ్య తేడా కూడా తెలియదా? కేవలం పేపర్లు చదివితే సరిపోదు.. రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి అంటూ సీఎం విజయ్‌కు చురకలు అంటించారు. అయితే.. దీనికి ఆ తర్వాత మాట్లాడిన విజయ్ కౌంటర్ ఇచ్చారు. కేవలం ఒక విషయం గురించి మాట్లాడటం కాదు.. మొత్తం వాస్తవాలు తెలుసుకోవాలి. ముందు వెనకా మొత్తం పేపర్లు చదివి ఉంటే అసలు పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది అంటూ ఆయన బదులిచ్చారు.முன்ன பின்ன பேப்பர் படிச்சிருந்தா தான தெரியும்!! 😭😅🤭#CmJosephVijay #CmVijay #Tnassembly pic.twitter.com/BpWGhqatF0— Meena 🐿️❤️ (@hsmeenatchi26) August 7, 2026సీఎం కర్ణాటక పర్యటనపై గందరగోళంమేకెదాటు వివాదంపై తమిళనాడు సీఎం విజయ్ కర్ణాటకకు వెళ్లి చర్చలు జరుపుతారన్న వార్తలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి. అయితే దీనిపై ప్రభుత్వంలోని కొందరు మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేసినట్లు ఉదయనిధి అసెంబ్లీలో ప్రస్తావించారు. “వ్యవసాయ మంత్రి సీఎం కర్ణాటక వెళ్తారని చెప్పారు. మరోవైపు ఇద్దరు మంత్రులు అలాంటి పర్యటన లేదని చెప్పారు. కర్ణాటక నేతలు కూడా తమిళనాడు సీఎం రావడం తమకు ఇష్టం లేదని, నీళ్లు విడుదల చేయడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు” అని ఉదయనిధి అన్నారు.డెల్టా రైతుల పరిస్థితిపై ఉదయనిధి ఆందోళనకావేరి నీటి కొరత ప్రభావం డెల్టా జిల్లాల రైతులపై పడుతోందని ఉదయనిధి పేర్కొన్నారు. సీఎం విజయ్ స్వయంగా డెల్టా ప్రాంత రైతులను కలుసుకుని వారి సమస్యలు వినాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో 6.8 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే.. ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 1.5 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగిందని ఆయన ఆరోపించారు.డీలిమిటేషన్ అంశంపైనా విజయ్ దూకుడుఇదిలా ఉండగా.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కూడా సీఎం విజయ్ దృష్టి సారించారు. ఈ అంశంపై తమిళనాడు ఎంపీలతో శనివారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అన్ని పార్టీలతో కలిసి చర్చించేందుకు విజయ్ ముందుకు వచ్చారు.కాగా, డీలిమిటేషన్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు పార్టీలు వాదిస్తున్నాయి. ఈ అంశంలో రాష్ట్ర ప్రయోజనాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు విజయ్ ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.ఉదయనిధి అరెస్టు.. కావేరి వివాదం మరింత వేడిఇదిలా ఉండగా.. కావేరి వివాదం నేపథ్యంలో సీఎం విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్ అరెస్టు కావడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది. తన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించినవి కాదని, కావేరి నది పరిరక్షణ కోసమే మాట్లాడానని ఉదయనిధి స్పష్టం చేశారు. తనను అరెస్టు చేయడం కావేరి, మేకెదాటు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తకుండా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆయన ఆరోపించారు.మేకెదాటు ప్రాజెక్టుపై పాత వివాదంకర్ణాటక కావేరి నదిపై మేకెదాటు వద్ద భారీ జలాశయం నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడుకు రావాల్సిన నీటి ప్రవాహంపై ప్రభావం పడుతుందని తమిళనాడు వాదిస్తోంది. ఈ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజా పరిణామాలతో కావేరి జల వివాదం మరోసారి తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. సీఎం విజయ్ అఖిలపక్ష భేటీకి నిరాకరించడం, ఉదయనిధి ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు లేవనెత్తడంతో అసెంబ్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. -
ఉదయనిధి.. స్టేషన్ బెయిల్ వెనుక విజయ్ మాస్టర్ ప్లాన్
-
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ ప్రభుత్వం
-
త్రిష మేడం రాజకీయ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
-
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
చెన్నై: తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి తెరలేపుతూ.. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఎన్. మరియా విల్సన్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, మహిళా సాధికారత, విద్య, యువత ఉపాధి, ఆరోగ్యం, క్రీడలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపొందించారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న ఆర్థిక మంత్రి విల్సన్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంతో పాటు పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో సీఎం విజయ్‌పై ఆయన ప్రశంసలు గుప్పించారు.మహిళలకు బంగారం.. పెళ్లి కానుకTVK ఎన్నికల హామీల్లో కీలకమైన ‘అన్నన్ సీర్ తిట్టం’ పథకానికి బడ్జెట్లో రూ.812 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు వివాహ సమయంలో 8 గ్రాముల (ఒక సవరన్) బంగారు నాణెం, పట్టు చీర అందించనున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘తై మామన్ తంగా మోదిరం తిట్టం’ పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించనున్నారు. ఈ పథకానికి రూ.560 కోట్లు కేటాయించారు.విద్యకు భారీ కేటాయింపులువిద్యారంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు రూ.44,527 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.8,393 కోట్లు కేటాయించారు. కళాశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించే ‘వెట్రి ల్యాప్‌టాప్ పథకం’ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించారు. డిజిటల్ విద్యను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ‘పళ్లి నిరైవు తిట్టం’ కింద రూ.300 కోట్లు కేటాయించారు. మొత్తం 3,734 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ‘సూపర్ క్లీన్.. సూపర్ క్యాంపస్’ పథకం కింద తొలిదశలో 10 వేల పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, భద్రత కోసం రూ.139 కోట్లు కేటాయించారు.విద్యార్థులకు సైకిళ్లు.. కొత్త హాస్టళ్లు11వ తరగతి విద్యార్థులకు హెల్మెట్, వాటర్ బాటిల్‌తో కూడిన సైకిళ్లు అందించే ‘పుతియా పయనం.. పుతియా వేగం’ పథకానికి రూ.277 కోట్లు కేటాయించారు. దీని ద్వారా 5.3 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. విద్యార్థుల వసతి సదుపాయాల కోసం తమిళనాడు స్టూడెంట్ హాస్టల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. TN-SUDAR పథకం కింద 200 ఆధునిక హాస్టళ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.యువతకు స్కిల్ ట్రైనింగ్ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ‘వెట్రి స్కిల్ ట్రైనింగ్ స్కీమ్’ను ప్రకటించారు. 13 లక్షల మంది యువతకు పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ అందించనున్నారు. తొలి దశలో 20 వేల మంది యువతకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఇందుకోసం రూ.150 కోట్లు కేటాయించారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు, అధ్యాపకులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణ అందించే ప్రణాళికను కూడా ప్రభుత్వం ప్రకటించింది.క్రీడలకు ప్రోత్సాహంక్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 ఒలింపిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించారు. తమిళనాడు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.ఆరోగ్య రంగానికి రూ.23 వేల కోట్లకు పైగావైద్యం, ప్రజారోగ్య శాఖకు రూ.23,353 కోట్ల నిధులు కేటాయించారు. గర్భిణుల కోసం ‘తై కేర్’ పేరుతో ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రసవ సమయం దగ్గర పడిన మహిళలకు ఉచిత భోజనం, వైద్య సహాయం, ఆరోగ్య పర్యవేక్షణ అందించనున్నారు. వృద్ధుల కోసం దశలవారీగా 1,000 మొబైల్ జెరియాట్రిక్ ట్రీట్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రంలో వైద్యుడు, నర్సు, ఫిజియోథెరపిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి.NEETపై మరోసారి వ్యతిరేకతబడ్జెట్ ప్రసంగంలో NEET పరీక్షపై TVK ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. వైద్య ప్రవేశాలను 12వ తరగతి మార్కుల ఆధారంగా పాత విధానంలోనే నిర్వహించేలా NEETను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.కేజీ నుంచి లా వరకు కొత్త ప్రకటనలుమదురైలో 300 మంది విద్యార్థుల సామర్థ్యంతో ప్రత్యేక ప్రభుత్వ లా కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐదు కొత్త ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు (ITI) ఏర్పాటు చేయడానికి రూ.90 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ‘అన్నల్ అంబేద్కర్ ఓవర్సీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్’ పథకం కింద ఒక్కో విద్యార్థికి గరిష్ఠంగా రూ.36 లక్షల వరకు సాయం అందించనున్నారు.పారదర్శక పాలనపై ఫోకస్గత ప్రభుత్వ పాలనలో టెండర్ల కేటాయింపుల్లో కొందరు వ్యక్తులు, వర్గాలకు ప్రయోజనం కలిగించే ‘కట్’ విధానం ఉండేదని ఆర్థిక మంత్రి విమర్శించారు. అలాంటి విధానాలకు ముగింపు పలికి.. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పన్ను, పన్నేతర ఆదాయాలను పెంచే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో తమిళనాడు అప్పులు పెరిగాయని, వాటిని నియంత్రిస్తూ అభివృద్ధి కొనసాగిస్తామని తెలిపారు.ఇతర హైలైట్స్* EV ఛార్జింగ్ స్టేషన్ల కోసం రూ.50 కోట్లు కేటాయింపు* ఐదేళ్లలో 20 వేల పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యం* మైనారిటీ సంక్షేమం కోసం రూ.1,700 కోట్లు* హజ్ యాత్ర సబ్సిడీని రూ.25 వేల నుంచి రూ.35 వేలకు పెంపు* సామాజిక న్యాయ శాఖకు రూ.3,937 కోట్లు* దివ్యాంగుల సంక్షేమ శాఖకు రూ.1,485 కోట్లు* డ్రగ్ ఫ్రీ తమిళనాడు కార్యక్రమం కోసం ప్రత్యేక చర్యలుమొత్తంగా.. విజయ్ సర్కార్ తొలి బడ్జెట్ ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల విస్తరణ, యువత-మహిళల సాధికారత, డిజిటల్ విద్య, పారదర్శక పాలన చుట్టూ తిరిగింది. తొలి బడ్జెట్‌తోనే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజలకు స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. -
ఆయన ప్రచారం చేస్తే నీ డిపాజిట్ గల్లంతే!
తమిళనాడు రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. నటి త్రిషపై వ్యాఖ్యల వివాదంలో కేసు, అటుపై నాటకీయ పరిణామాల నడుమ అరెస్టైన ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్.. హైకోర్టు ఊరటతో గత రాత్రి విడుదలయ్యారు. ఆ రిలీజ్ అయిన వెంటనే ఆయన టీవీకే అధినేత విజయ్‌పై ‘జోకర్ సర్కార్’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తంజావూర్ పీఎస్‌లో అసభ్యకర వ్యాఖ్యల కేసులో విచారణ అనంతరం గత రాత్రి ఉదయ్‌నిధి రిలీజ్ అయ్యారు. ఆ సమయంలో డీఎంకే శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికాయి. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై తీసుకున్న చర్యలను “సర్కస్ ప్రభుత్వం” వ్యవహారంగా అభివర్ణించారు. పోలీసులు తనను ఉగ్రవాదిలా తీసుకెళ్లారని ఆరోపించారు. తన అరెస్టు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఉదయ్‌నిధి అన్నారు. కావేరీ జలాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. టీవీకే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. మేకేదాటు డ్యామ్, కావేరీ నీటి వివాదంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.అంతేకాకుండా టీవీకే అధినేత విజయ్ను, విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. విజయ్ను డమ్మీ సీఎంగా అభివర్ణించాడు. అంతేకాదు.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎలాంటి డబుల్‌మీనింగ్ డైలాగు కొట్టలేదని.. సింగిల్ మీనింగ్‌తోనే మాట్లాడానని అన్నారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ కేసుపై చట్టపరంగా పోరాడతానని తెలిపారు. టీవీకే ఘాటు కౌంటర్ఉదయ్నిధి వ్యాఖ్యలకు టీవీకే ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ నేత ఆధవ్ అర్జున ఆ వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. విజయ్ ప్రజల మద్దతుతో రాజకీయాల్లోకి వచ్చారని, డీఎంకేను తాము ప్రత్యర్థిగా కూడా చూడటం లేదని వ్యాఖ్యానించారు.“మా నాయకుడిని విమర్శించాలంటే అర్హత ఉండాలి. ఉదయ్‌నిధి స్టాలిన్‌కి దమ్ముంటే.. తన తాత, తండ్రి రాజకీయ వారసత్వాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి. ఆ నియోజకవర్గంలో విజయ్ ఒక్కసారి ప్రచారం చేసినా చాలు.. ఉదయ్‌నిధికి డిపాజిట్ కూడా దక్కదు” అంటూ ఆధవ్ అర్జున సవాల్ విసిరారు.త్రిష వ్యాఖ్యలతో మొదలైన వివాదంకావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా.. ప్రేక్షకుల నుంచి త్రిష పేరు వినిపించింది. దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యల్లో ద్వంద్వార్థం ఉందని టీవీకే ఆరోపించింది.రాజకీయాల్లో మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని టీవీకే విమర్శించింది. ఉదయ్‌నిధి క్షమాపణలు చెప్పేంత వరకు ఊరుకోబోమని అంటోంది. అయితే తన వ్యాఖ్యలకు వక్రీకరణ జరిగిందని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని ఉదయ్‌నిధి వివరణ ఇచ్చారు. డీఎంకే కూడా విజయ్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం డీఎంకే–టీవీకే మధ్య రాజకీయ పోరుగా మారింది. ఇవాళ్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. -
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట
సాక్షి,చెన్నై: డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న ఉదయనిధి స్టాలిన్‌ను విడుదల చేయాలని మద్రాసు హైకోర్టు మంగళవారం పోలీసులను ఆదేశించింది. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్‌కు సూచించింది. సోమవారం తంజావూరులో కర్ణాటక,తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ నదీ జలాలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నటి త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయం దుమారం రేగింది. దీనిపై అధికార టీవీకే పార్టీతో పాటు పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.రంగంలోకి దిగిన పోలీసులు చెన్నై నీలాంకరైలోని ఉదయనిధి నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేయగా.. ఈ లోపు ఉదయనిధి స్టాలిన్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మధ్యాహ్నం ప్రత్యేక విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ మాట్లాడుతూ.. ఉదయనిధిని తంజావూరుకు తరలించినప్పటికీ, ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపే ఉద్దేశం పోలీసులకు లేదని తెలిపారు. కేవలం విచారించి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజే ఆయనను విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో డీఎంకే శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. -
నా అరెస్ట్ ఒక జోక్... అరెస్ట్ పై ఉదయనిధి రియాక్షన్
-
ఉదయ్నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్‌కాంత్
తమిళనాట ఉదయ్‌నిధి స్టాలిన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు పలువురు ఉదయ్‌నిధి వ్యాఖ్యల్ని తప్పుబడుతుంటే.. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్‌కాంత్ మాత్రం ఆ అరెస్ట్‌ను ఖండించారు.డీఎంకే నేత, ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌పై పోలీసు చర్యల నేపథ్యంలో మంగళవారం డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్‌నిధి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొంటూ.. ఆయనకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో రాజకీయ భిన్నాభిప్రాయాలను అరెస్టులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రేమలత విజయకాంత్ అన్నారు. ఒకరి వ్యాఖ్యలను మరో పార్టీ రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. అరెస్టులు పరిష్కారం కాదని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో రాజకీయ వ్యాఖ్యలపై అరెస్టులు చేయడం ప్రజల్లో అసంతృప్తిని, ప్రజాస్వామ్యంపై అనుమానాలను పెంచుతుందని వ్యాఖ్యానించారు.“ఉదయ్‌నిధి మాట్లాడిన దాంట్లో తప్పు లేదు”ఉదయ్‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ప్రేమలత.. ఆయన మాటల్లో తప్పేమీ లేదని అన్నారు. రాజకీయ వేదికలపై ప్రతిపక్ష నేతలకు తమ అభిప్రాయాలను చెప్పే హక్కు ఉందని స్పష్టం చేశారు. “ఉదయ్‌నిధికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అందులో అభ్యంతరకరం ఏంటో అర్థం కావడం లేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.నీటి కోసం మేం పోరాడుతుంటే..ఇదే సమయంలో తమిళనాడులోని రాజకీయ పోరాటాలపై కూడా ప్రేమలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై, ముఖ్యంగా కావేరీ జలాల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు నటుడు విజయ్ రాజకీయ పోరాటం చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ.. “మేం నీటి కోసం పోరాడుతుంటే.. నటి కోసం విజయ్ పోరాడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరురాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు అరెస్టులను ఉపయోగించడం సరైన విధానం కాదని ప్రేమలత విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఉన్న హక్కులే ప్రతిపక్షాలకు కూడా ఉంటాయని అన్నారు.అధికార పార్టీ, ముఖ్యమంత్రి తమ అభిప్రాయాలను రాజకీయ వేదికలపై వ్యక్తం చేయవచ్చని.. అదే విధంగా ప్రతిపక్షాలు కూడా తమ వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లే హక్కు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సింది రాజకీయంగానే కానీ.. అరెస్టులతో కాదని స్పష్టం చేశారు.చట్టం అందరికీ సమానంగా ఉండాలిఇటీవల రాణిపేటలో జర్నలిస్టులపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలను ప్రస్తావించిన ప్రేమలత.. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై మాత్రం తక్షణ చర్యలు తీసుకోవడం చట్ట అమలులో సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు ప్రతిపక్ష నేతపై అరెస్టు చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తగదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలని కోరారు. మొత్తంగా.. ఉదయ్‌నిధి స్టాలిన్ విషయంలో ప్రేమలత విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. -
ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్ట్
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ తమిళగ వెట్రి కగళం పార్టీ ఫిర్యాదు చేయంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టీవీకే నిరసనల నడుమ పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించగా.. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈ మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టు విచారణ జరపనుంది.మంగళవారం ఉదయం ఉదయనిధి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్ట్ తర్వాత ఆయన్ని తరలించే క్రమంలో డీఎంకే శ్రేణులు పోలీసులకు అడ్డు పడ్డాయి. వాహనాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగాయి. అయినప్పటికి పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో ఉదయ్‌నిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఎవరి పేరును నేను ప్రస్తావించలేదు. ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటా అని ఆయన అన్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని తరలించినట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే.. సోమవారం తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన డీఎంకే కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో.. కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయ్‌నిధి.. కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా, ‘నీళ్లు’ మాత్రం అక్కడికి వెళ్తాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి డబుల్ మీనింగ్‌గా చేసిన వ్యాఖ్యలేనని టీవీకే ఆరోపిస్తోంది. Udhayanidhi Stalin has landed in controversy after making an alleged double-meaning remark during a Cauvery protest speech when the crowd began chanting "Trisha"The video has gone viral, ruling TVK calls the comment "disgusting" and BJP demands his arrest over the remark. DMK… pic.twitter.com/Ay4S0i9HCv— Nabila Jamal (@nabilajamal_) August 3, 2026కేసు నమోదు.. హైకోర్టులో పిటిషన్ఉదయ్నిధి వ్యాఖ్యల నేపథ్యంలో తంజావూర్ పీఎస్‌లో టీవీకే ఫిర్యాదు చేసింది. సీఎం విజయ్ను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రావాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం.“బహిరంగ క్షమాపణలు చెప్పాలి”.. ఉదయ్‌నిధి వ్యాఖ్యలపై టీవీకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. క్షమాఫలు చెప్పే దాకా ఉదయ్‌నిధి స్టాలిన్‌ను వదలబోమని అంటున్నారు.ఉదయ్‌నిధి ఇంటి వద్ద భారీ భద్రత.. ఆ వెంటనే అరెస్ట్టీవీకే నిరసనల నేపథ్యంలో చెన్నైలోని ఉదయ్‌నిధి స్టాలిన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను పెంచారు. ఆ సమయంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హైడ్రామా నెలకొంది. అయితే ఆ తర్వాతే ఉదయ్‌నిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ (NCW)ను టీవీకే ఆశ్రయించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పళా సెల్వకుమార్ ఫిర్యాదు చేస్తూ.. ఉదయ్‌నిధి ప్రసంగానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయ్‌నిధి నుంచి వివరణ కోరాలని, బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని మహిళా కమిషన్‌ను విజ్ఞప్తి చేశారు. అలాగే సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకునేలా పోలీసులకు సూచించాలని కోరినట్లు టీవీకే వెల్లడించింది.బీజేపీ సైతం డీఎంకేపై ఫైర్ఆ వ్యాఖ్యలు మహిళను(త్రిష) కించపరిచేలా ఉన్నాయని, రాజకీయ నాయకుల స్థాయికి తగవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తమిళనాడు బీజేపీ కూడా స్పందించింది. ఉదయ్‌నిధి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజా జీవితంలో ఉన్న నేతలు మహిళల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు.రాజకీయ పోరుకు కొత్త అస్త్రంఇప్పటికే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే, డీఎంకే మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో త్రిష ప్రస్తావన వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. టీవీకే ఈ అంశాన్ని మహిళా గౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకుని ముందుకు వెళ్తుండగా.. డీఎంకే లేదా ఉదయ్‌నిధి స్టాలిన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. -
త్రిష పేరుతో సీఎం విజయ్‌పై కామెంట్స్
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న (సోమవారం) కావేరీ అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో సీఎం విజయ్‌పై విమర్శలు గుప్పిస్తున్న సమయంలో సభలోని ప్రజలనుంచి నుంచి "త్రిష-త్రిష" అంటూ నినాదాలు వ్యక్తమయ్యాయి. దీనికి ఉదయనిధి నవ్వుతూ ఇన్యుయేండో (అర్థవంతమైన వ్యాఖ్య) అని అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కాగా ఈ వాఖ్యలను టీవీకేతో పాటు బీజేపీ ఖండించిందిటీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ మాట్లాడుతూ " ఇలాంటి వ్యాఖ్యలు అసహ్యకరం. ఎవరిపైనైనా ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలు చేయడం పూర్తిగా సిగ్గుచేటు. ఇది ఆ కుటుంబం యొక్క ఆలోచనా విధానాన్ని, రాజకీయ సంస్కృతిని పడిపోతున్న ప్రమాణాలను బట్టబయలు చేస్తోంది" అని ఆయన మండిపడ్డారు. రాజకీయ నాయకుడిగా ఉదయనిధి స్థాయి మరింతగా దిగజారిందని విమర్శించారు.తమిళనాడు బీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ నారాయణ తిరుపతి మాట్లాడుతుూ..తంజావూరులో ముఖ్యమంత్రి విజయ్ ,త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ ప్రసంగం అసహ్యకరమైనది, అభ్యంతరకరమైనది సిగ్గుచేటని అన్నారు. "తల్లి, భార్య, కూతురు ఉన్న ఏ దొంగ లేదా రౌడీ కూడా అంత నీచంగా మాట్లాడలేడు. 'ద్రవిడ మోడల్' అని చెప్పుకునే ఈ వ్యక్తులు బహిరంగంగా ఇలా మాట్లాడుతుంటే, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చూస్తూ ఊరుకోవడం సిగ్గుచేటు" అని ఆయన దుయ్యబట్టారు. ఉదయనిధిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు.బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం: "తాను ఆ కళాకారుడి మనవడిని అని చెప్పుకునే ఆయన ఇలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. ప్రతిపక్ష నేత స్వయంగా మాజీ నటుడే. అయినప్పటికీ తోటి కళాకారుల పట్ల ఇంత చిన్నచూపుతో, అసహ్యంగా మాట్లాడడం దిగ్భ్రాంతికరం ". అన్నారు.గత వివాదాలుమూడేళ్ల క్రితం సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోల్చి ఉదయనిధి స్టాలిన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దానిని నిర్మూలించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో, ఉదయనిధి చేసిన ఈ తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేపాయి.ఏం జరిగింది.తమిళనాడులో కావేరి నీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం (టీవీకే) వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తంజావూరులో ఒక భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఆ సమయంలో సభికుల్లో నుంచి కొందరు అకస్మాత్తుగా "త్రిష... త్రిష" అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రజల నుంచి ఆ నినాదాలను చూసి ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం మధ్యలో ఆగిపోయి, నవ్వుతూ ఒక డబుల్ మీనింగ్ (అర్థవంతమైన ఇన్యుయేండో) వ్యాఖ్య చేశారు. దీనిపై ఇప్పడు దుమారం చెలరేగింది -
కావేరీ కత్తి.. విజయ్‌కు తొలి పరీక్ష!
తమిళనాడు రాజకీయాల్లో కావేరీ జల వివాదం మరోసారి వేడి పుట్టిస్తోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి.. ఒకటి కర్ణాటకతో నీటి హక్కుల పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? రెండోది.. రాష్ట్రంలో ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?కావేరీ అంశం తమిళనాడులో కేవలం నీటి సమస్య మాత్రమే కాదు.. ఇది రైతుల జీవనాధారం, ప్రాంతీయ హక్కులు, రాజకీయ ప్రతిష్ఠతో ముడిపడిన సున్నితమైన అంశం. అందుకే ఈ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తుంటాయి.అఖిలపక్ష సమావేశం కోసం డీఎంకే ఒత్తిడికావేరీ వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డీఎంకే సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు డ్యామ్ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని పార్టీలను కలుపుకుని వ్యూహం రూపొందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.డీఎంకే వాదన ప్రకారం.. కావేరీ వంటి కీలక అంశాల్లో రాజకీయ భేదాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలి. ముఖ్యమంత్రి విజయ్ అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని డీఎంకే ప్రశ్నిస్తోంది.‘ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాం’అయితే టీవీకే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించడం లేదు. టీవీకే సీనియర్ నేత, మంత్రి సీటీఆర్ నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ.. కావేరీ అంశంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగిందని, అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం కూడా ఆమోదించామని తెలిపారు. అసెంబ్లీలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని టీవీకే ఆరోపిస్తోంది.చర్చల నుంచి రాజకీయ విమర్శల దిశగా.. కావేరీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించిన విజయ్ ప్రభుత్వ వైఖరిలో ఇప్పుడు రాజకీయ దూకుడు కూడా కనిపిస్తోంది. విజయ్ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన కొద్ది రోజులకే.. మంత్రి ఆర్. నిర్మల్‌కుమార్ కర్ణాటక సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. డీకే శివకుమార్ కర్ణాటక ప్రయోజనాల కంటే డీఎంకే నాయకత్వం ప్రభావంతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. “ఆయన సొంత పార్టీ నేతగా కాకుండా డీఎంకేతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది” అంటూ విమర్శలు చేశారు.అయితే కావేరీ వంటి సున్నితమైన అంశంలో ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత వేడెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.విజయ్ వ్యూహం వెనుక..అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు గతంలో కావేరీ వివాదం తీవ్రంగా మారిన ప్రతిసారి అఖిలపక్ష సమావేశాలను ఆశ్రయించాయి. అయితే విజయ్ ప్రభుత్వం మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంటోంది. సమస్యను నేరుగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది.కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ కోసం బెంగళూరు వెళ్లాలని విజయ్ భావించినట్లు సమాచారం. అయితే కర్ణాటకలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. ఇక్కడే విజయ్‌కు అసలు పరీక్ష మొదలవుతుంది.రాజకీయ అనుభవం ఉన్న పార్టీల మాదిరిగా ఉద్యమాల మార్గాన్ని ఎంచుకోవాలా? లేక చర్చల ద్వారా పరిష్కారం సాధించే ప్రయత్నం చేయాలా? అనే విషయంలో ఆయన నిర్ణయం కీలకం కానుంది.కావేరీ నీటి వివాదం దశాబ్దాలుగా తమిళనాడు-కర్ణాటక మధ్య కొనసాగుతున్న సమస్య. ఇది మరీ ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ భావోద్వేగ అంశమే. డెల్టా ప్రాంత రైతులకు కావేరీ నీరు అత్యంత కీలకం. నీటి విడుదలలో ఆలస్యం జరిగిన ప్రతిసారి తమిళనాడులో రైతుల ఆందోళనలు, రాజకీయ నిరసనలు తీవ్ర స్థాయికి చేరుతాయి. అందుకే ఈ అంశంలో ఏ ప్రభుత్వం బలహీనంగా కనిపించినా ప్రతిపక్షాలకు అది రాజకీయ ఆయుధంగా మారుతుంది.డీఎంకే ఆందోళనతో మరింత వేడికావేరీ నీటి సమస్య, రైతుల అంశంపై టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని డీఎంకే ఆగస్టు 3న తంజావూరులో భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ ఆందోళన ద్వారా విజయ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డీఎంకే భావిస్తోంది. మరోవైపు టీవీకే మాత్రం తమ ప్రభుత్వం తమిళనాడు హక్కుల విషయంలో రాజీ పడదని చెబుతోంది.విజయ్ ముందు రెండు మార్గాలుప్రస్తుతం కావేరీ వివాదం విజయ్ రాజకీయ నాయకత్వానికి తొలి పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాల ఒత్తిడి.. మరోవైపు కర్ణాటకతో సున్నితమైన జల వివాదం.. ఇంకోవైపు రైతుల అంచనాలు.. ఈ మూడు అంశాలను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి విజయ్‌కు ఎదురైంది. కావేరీ విషయంలో విజయ్ తీసుకునే నిర్ణయం కేవలం ఒక నీటి వివాదానికి పరిష్కారం చూపడమే కాదు.. ఆయన పరిపాలనా శైలి, రాజకీయ పరిపక్వతకు కూడా తొలి కొలమానంగా మారనుంది. -
విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు
స్టార్ హీరో విజయ్.. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగిన రెండు ప్రధాన పార్టీల ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ సరికొత్త రికార్డ్ సృష్టించారు. అయితే ఇదంతా జరగడానికి కొన్నాళ్ల ముందు వ్యక్తిగతంగా విషయాల కారణంగా ఈయన వార్తల్లో నిలిచారు.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్)భార్యతో విడాకులు, తండ్రి ముఖ్యమంత్రి అయినా సరే కొడుకు జేసన్ ఏం మాట్లాడకపోవడం, సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం లాంటివి జరిగేసరికి విజయ్, అతడి కొడుకు జేసన్ల మధ్య దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేసన్ మాటాలు వింటే అలాంటిదేం లేదని అనిపిస్తోంది. ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రి కావడంపై జేసన్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్ రాజకీయ విజయాన్ని 'చారిత్రక విప్లవం'గా అభివర్ణించిన జేసన్.. 'నాన్న సీఎం కావడం మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో పెద్ద బాధ్యతతో పాటు గౌరవం కూడా. అదే సమయంలో మేమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు. తండ్రి ఇచ్చిన సలహా గురించి మాట్లాడుతూ.. 'ఆయన నాకు చెప్పిన మాటల్లో నాకు చాలా ఇష్టమైనది ఒకటే. 'నువ్వు నీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి' అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సలహానే నాకు జీవితంలో ఎంతో ప్రేరణనిచ్చింది. ఎప్పుడైనా నీకు నా సహాయం అవసరమైతే నన్ను సంప్రదించొచ్చు. కానీ ముందుగా నువ్వే చొరవ తీసుకుని నా దగ్గరకు రావాలి. నేను అడగను అని నాన్న నాతో చెప్పారు' అని జేసన్ చెప్పుకొచ్చాడు.దర్శకుడిని కాకముందు తనకు పూర్తిగా భిన్నమైన ఆలోచనలు ఉండేవని జేసన్ గుర్తుచేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని, తర్వాత క్రికెటర్ కావాలని బలమైన కోరిక ఉండేది. 'నాకు క్రికెట్ అంటే పిచ్చి. బ్యాటింగ్ చేయడం ఇష్టం. కానీ నా అసలు ప్రతిభ బౌలింగ్‌లోనే ఉంది. ఇంటర్లో ఉన్నప్పుడు కథలు చెప్పడం, సినిమాలు తీయడంపై ఆసక్తి వచ్చింది. దీంతో ఇదే నా కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా. కెనడాలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాక ఏం చేయాలనుకుంటున్నానో క్లారిటీ వచ్చింది. మా నాన్న విజయ్ సినిమాకు దర్శకత్వం వహించాలన్నది నా కల. ఆయనతో పాటు హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాథమ్‌ను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను' అని జేసన్ చెప్పుకొచ్చాడు.జేసన్ దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్ హీరో కాగా తమన్ సంగీతమందించాడు. లెక్క ప్రకారం జూలై 31నే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)This is “HISTORIC REVOLUTION” - #JasonSanjay about his father @actorvijay’s Election Victory 🔥 pic.twitter.com/RWF6wkNIvP— Vijay Fans Trends (@VijayFansTrends) August 1, 2026 -
‘సీఎం విజయ్.. మీరు మా రాష్ట్రానికి రావొద్దు’
సాక్షి, బెంగళూరు: కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో జరగాల్సిన చర్చలను కర్ణాటక రద్దు చేసుకుంది. ఈ క్రమంలో తమిళనాడు సీఎం విజయ్, ఆయన బృందం ఇప్పుడు కర్ణాటకకు రావడం అంత మంచిది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ కర్ణాటక పర్యటనను వాయిదా వేసుకోవాల్సిందిగా తాము తమిళనాడు ప్రభుత్వానికి సలహా ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు సీఎం విజయ్ ఇక్కడికి వస్తే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 12న కర్ణాటక వ్యాప్తంగా బంద్‌కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి.ఈ వివాదం ప్రభావం సినిమాలపైనా పడింది. కర్ణాటకలో తమిళనాడు సీఎం విజయ్ నటించిన తాజా చిత్రం ‘జనగాయన్’ ప్రదర్శనను థియేటర్లలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లపై కన్నడ సంఘాలు దాడులు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ Vs ధనుష్ రాధన్ పండిత్ మరో సంచలనం
-
సీఎంగా విజయ్.. తమిళ హీరోలు ఇలా బయటపడుతున్నారేంటి?
రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నటీనటులు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, విజయ్ లాంటి వాళ్లు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు. అయితే హీరో విజయ్.. తమిళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈయన కొన్ని సీట్లు గెలిస్తే గొప్ప అనుకున్నారు. కానీ సీఎం అయ్యేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఈయనకు అధికారం రావడం మాటేమో గానీ తమిళ హీరోలు ఒకరి తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని బయటపెడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి విశాల్ చేరిపోయాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)రీసెంట్ టైంలో కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ తనకున్న రాజకీయ ఆసక్తిని బయటపెట్టేలా మాట్లాడగా.. హీరో ధనుష్ ఏకంగా పెద్ద సభని ఏర్పాటు చేశాడు. తాజాగా విశాల్ కూడా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తాను సొంతం చేసుకున్న మంచి పేరును ప్రజా సేవకు ఉపయోగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా. మీరు చూపిన అభిమానానికి.. మీకు తిరిగి ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నా. ఇకపై నా ప్రయాణం సాధారణంగా ఉండదు. ఎలాంటి అడ్డదారులు లేకుండా నేరుగా, నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నా. ఆ మార్గంలో ప్రయాణిస్తూ అన్ని రంగాల్లో మీకు అండగా ఉంటానని విశాల్ అన్నాడు. దీంతో ఈ హీరో కూడా త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఇస్తారని మాట్లాడుకుంటున్నారు.అయితే విజయ్‌కి కలిసొచ్చినట్లు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మిగతా తమిళ హీరోలకు పరిస్థితులు కలిసొస్తాయా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. ధనుష్, విశాల్ లాంటి హీరోలకు ఉన్న అభిమాన గణం వేరు. చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లోకి చాలామంది హీరోలు వచ్చేలా కనిపిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: రామ్ చరణ్‌కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)#Vishal 🔥 pic.twitter.com/L6gFlHmgab— Cine World Entertainment 🌍 (@CineWorldEnt) July 28, 2026 -
ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఈ లేఖలో కోరారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు మురుగునీటి నిల్వ/డ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ సమాధానం ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి మాట్లాడుతూ, కావేరీ నదిపై ఏదైనా నిర్మాణాన్ని చేపట్టే ముందు కర్ణాటక రాష్ట్రం ఇతర దిగువ రాష్ట్రాల (తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పులో స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదని సమాధానమిచ్చారు.అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సమాధానం తీవ్ర నిరాశకు గురిచేసిందని సీఎం విజయ్ పేర్కొన్నారు. అంతరాష్ట్ర నీటి వివాదాలలో ఇప్పటికే స్థిరపడిన చట్టాలు మరియు చట్టపరమైన సూత్రాలను పరిశీలించకుండానే కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారని విజయ్ విమర్శించారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిన ఆలమట్టి డ్యామ్ వివాదంలో, దిగువన ఉండే రాష్ట్రం యొక్క అనుమతి ఖచ్చితంగా అవసరమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.కావేరీ నీటి వివాదాల ట్రిబ్యునల్ అవార్డు, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఉంటే తప్ప, మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుకు ఎటువంటి పరిపాలనాపరమైన లేదా చట్టపరమైన అనుమతులు మంజూరు చేయకుండా చూడాలని సీఎం విజయ్ ప్రధానమంత్రిని కోరారు. అలాగే, 2018లో సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ తీర్పును సమర్థించినప్పుడు, రాష్ట్రాలు తమ పరిధిలోని నీటిని ట్రిబ్యునల్ ఆదేశాలకు లోబడి మాత్రమే నియంత్రించుకోవచ్చని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.గతంలో కేరళకు చెందిన పాంబార్ హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విషయంలో కూడా దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉమ్మడి ఒప్పందాలు అవసరమని ట్రిబ్యునల్ పేర్కొన్న విషయాన్ని విజయ్ గుర్తు చేశారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యసభలో ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని, దిగువ రాష్ట్రాల హక్కులను రక్షించాలని ఈ ప్రాజెక్టుపై సమగ్ర చట్టపరమైన, సాంకేతిక పరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. -
2031 నాటికి రాజకీయాల్లోకి ధనుష్?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే నటుడు విజయ్ సీఎంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ తనదైన మార్కు చూపిస్తూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగా, ఇప్పుడు తమిళ సినీ రంగంలో మరో స్టార్ హీరో ధనుష్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ప్రచారం జోరందుకుంది. తమిళనాడు వ్యాప్తంగా తన అభిమాన సంఘాలకు ప్రత్యేకమైన జెండా,చిహా్నలను (తెలుపు, ఎరుపు రంగు నక్షత్రం) కేటాయించడం, జిల్లాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. 2031 నాటికి ధనుష్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమం మారింది. ధనుష్ వ్యాఖ్యల చర్చ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పరిధిలో నిర్వహించిన నిధుల సేకరణ, రక్తదాన శిబిరం , విద్యా సహాయ వితరణ కార్యక్రమంలో నటుడు ధనుష్ పాల్గొని అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. 2002 నుంచి 24 సంవత్సరాలుగా తనకు అండగా నిలిచారని అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.అభిమానులు తనకు విస్తృతమైన కుటుంబం. జీవితంలో ఎవరు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో చెప్పలేం, అందుకే మానసికంగా, శారీరకంగా బలంగా ఉండండి అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అభిమానులకు పలు ఉపదేశాలు ఇస్తూనే ఆయన జాతీయ అవార్డుల గురించి స్పందించి ఉండటం తాజాగా చర్చకు దారి తీసింది. కాగా, ధనుష్ చూపిన బాటలోనే నడుస్తామని, తమ నాయకుడు ధనుష్ చెప్పినట్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామని, ఆయన మార్గదర్శకత్వంలో తమిళనాడు అంతటా పర్యటించి, ప్రజలకు సేవ చేస్తామని, . 2031 నాటికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడులో మంచి మార్పు తీసుకువస్తారని ఆశిస్తున్నామని అభిమానులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
సీఎం సినిమాకే తప్పని తిప్పలు.. షోలు ఆపేసి మరీ
తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్'.. గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాడులో మాత్రం అభిమానులు థియేటర్లకు వెళ్తున్నారు. అయితే చెన్నైలోని పలు థియేటర్లలో ఈ మూవీ షోలని మధ్యలోనే నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)వయలెన్స్ ఉందనే కారణంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్.. ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా సరే కొందరు ప్రేక్షకులు తమతోపాటు చిన్న పిల్లల్ని కూడా థియేటర్లకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం చెన్నైలోని పలు మల్టీప్లెక్స్‌ల్లో జరిగిన పోలీసుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఇది రూల్స్‌కి విరుద్ధం కావడంతో షోలు ఆపేశారు.ఈ క్రమంలోనే పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులని థియేటర్లలో నుంచి బయటకు పంపేందుకు దాదాపు గంట పట్టింది. ఫలితంగా కొన్నిచోట్ల షోలు ఆలస్యమయ్యాయి. మరోసారి నిబంధనలని గుర్తుచేస్తూ మైనర్లతో వచ్చేవాళ్లని మల్టీప్లెక్స్‌ల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశాయి.తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్‌గా దీన్ని తీశారు. అసలైన పాయింట్ తీసుకుని మిగతాది అంతా యాక్షన్‌తో నింపేశారని, దీంతో వరస్ట్‌గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజవ్వాలి కానీ సెన్సార్ సమస్యలని దాటుకుని గత వీకెండ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.(ఇదీ చదవండి: నా కథ, స్క్రీన్‌ప్లే దొంగిలించారు) -
పాపం ధనుష్.. ఆ మాటలకే ఇన్ని తిట్లా?
సినీ పరిశ్రమకు, రాజకీయాలకు మధ్య అనుబంధం తమిళనాట కొత్తేమీ కాదు. తెరపై భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పలువురు నటులు.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వేదికగా మార్చుకుని.. ఆ తర్వాత రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ప్రయాణం ఇప్పుడు మరికొందరు సినీ ప్రముఖుల భవిష్యత్తుపైనా ఆసక్తి పెంచింది.ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. అభిమానుల్లో, నెటిజన్లలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అయితే ధనుష్ అసలు రాజకీయాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆయన మాటలను కొందరు పొలిటికల్ యాంగిల్లో విశ్లేషిస్తున్నారు. తన అభిమానులను ఉద్దేశించి ధనుష్ మాట్లాడుతూ.. కేవలం సినిమా వేడుకలు, అభిమానుల సమావేశాలకే పరిమితం కాకుండా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.“ఒకచోట ఇంతమంది కలవడం వెనుక ఎంతో శక్తి ఉంది. ఆ శక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆడియో లాంచ్‌లు, మీటింగ్స్‌కే పరిమితం కాకుండా.. మీ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయండి. మీ ప్రాంతంలోని కుటుంబాలకు అండగా నిలవండి. మీపై నేను మరింత గర్వపడేలా చేయండి” అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఇక్కడి నుంచే అసలు చర్చ మొదలైంది. “ఇది కేవలం అభిమానులకు ఇచ్చిన సామాజిక సందేశమా? లేదంటే భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి సంకేతమా?” అని చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ చర్చకు మరో కారణం విజయ్ రాజకీయ ప్రయాణమే. విజయ్ కూడా గతంలో తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ధనుష్ కూడా అదే దారిలో వెళ్తున్నారా? అంటూ కొందరు పోల్చడం మొదలుపెట్టారు.ఇటు విజయ్ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. “విజయ్ బాటను కాపీ చేస్తున్నారా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ధనుష్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్‌ను ఆయన మాజీ మామ, సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో పోలుస్తూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఏళ్ల తరబడి ఊహాగానాలు వచ్చినప్పటికీ.. చివరకు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. విజయ్ గెలుపు సమయంలోనూ అభినందించకుండా ‘అసూయ’ను ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో “రజినీకాంత్ వల్లే కాలేదు.. ఇంక ధనుష్ ఏం చేస్తారు?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే ధనుష్ అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం మాత్రమే రాజకీయ ఎంట్రీకి సంకేతం కాదని, ప్రతి హీరో వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటున్నారు. రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటిదాకా ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు అభిమానులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరిన సందేశంగానే కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో సినీ హీరోలకు ఉన్న ప్రజాదరణ, అభిమాన సంఘాల ప్రభావం కారణంగా ఇలాంటి చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. -
‘జననాయకన్’ చూస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది
సాక్షి, చెన్నై : జననాయకన్ సినిమా చూడడం వలన మెదడు చురుగ్గా, ఉత్సా హంగా పనిచేస్తుందని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు సంబంధం లేదని తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ నటించిన జననాయకన్ చిత్రం గురువా రం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మంత్రులు, టీవీకే ఎమ్మెల్యేలు ఈ చిత్రం వీక్షణ, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జేసీడీ ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రజలు కోరుకునే మార్పులను తీసుకురావడానికి ముఖ్యమంత్రి ఎంతో పట్టుదలతో సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటాన్ని జననాయకన్ సినిమా నీరుగార్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా ‘ఈ చిత్రం ముందే ప్రకటించిన తేదీ ప్రకారం థియేటర్లలో విడుదలయ్యిందే తప్పా, విద్యార్థుల ఆందోళనలతో(నీట్) దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. జననాయగన్ సినిమా చూడడం వలన మెదడుకు చురుకుదనం, ఉత్తేజం వస్తాయన్నారు. ఇది విద్యార్థులు లేదా ప్రజల మెదడును బ్రెయిన్ వాష్ చేసే సినిమా కాదని, మాటల ద్వారా సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు ఎవరూ పాల్పడకూడదనే విషయంలో తాము ఎంతో శ్రద్ధతో ఉన్నామన్నారు. కాగా, సినీ నటి త్రిష తల్లి ఉమాకృష్ణన్ జననాయకన్ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. రోహిణి థియేటర్లో సినిమా చూసిన ఆమె చాలా ఆనందంతో వీక్షించామన్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడం ఎంతో బాధగా ఉందని, ఆయన్ను చాలా మిస్ అవుతున్నాం అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
విడాకుల వివాదం.. ‘జన నాయకన్’ చూసిన సంగీత?
తమిళనాడు నాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ (తెలుగులో జన నాయకుడు) భారీ అంచనాల మధ్య ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించకపోయినా.. విజయ్ ఫ్యాన్స్‌ని మాత్రం ఆకట్టుకుంది. అభిమానులు ఆశించే యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అలాగే పొలిటికల్ టచ్ కూడా ఇవ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు టీవీకే పార్టీ శ్రేణులు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విజయ్ స్నేహితురాలు, స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఈ సినిమా వీక్షించారు. ఆమె థియేటర్స్‌కి వెళ్లిన వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పాటు మరో వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. విజయ్ భార్య సంగీత కూడా ‘జన నాయకన్’ వీక్షించారట. ఆమె థియేటర్‌కి సినిమా చూసిన వీడియో ఒక్కటి ఇప్పుడు వైరల్ అవుతుంది.అయితే అసలు నిజం ఏంటంటే.. అది చాలా పాత వీడియో. గతంలో ఓ సినిమా కోసం థియేటర్‌కి వెళ్లిన సంగీత వీడియో క్లిప్పుని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో సంగీత కారులో నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ఉన్నాయి, ఆమె ముఖానికి మాస్క్ ధరించి, సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. ఈ వీడియోతో విజయ్ అభిమానులు ఆమె 'జన నాయకన్' చిత్రాన్ని చూడటానికి థియేటర్‌కు వచ్చారని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ వీడియో పాతది. దీన్ని కొత్త వీడియోలతో కలిపి ఆమె థియేటర్‌కు వెళ్లినట్లు చూపించడానికి ఉపయోగించారు.విడాకుల వివాదం..ఈ ఏడాది ప్రారంభంలో, విజయ్ భార్య సంగీత.. తన భర్త విజయ్‌తో విడాకులు ఇప్పించాలంటూ కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమిళనాడు ఎన్నికల ముందు ఆమె కోర్టు మెట్లు ఎక్కారు. విజయ్.. వెరొక నటితో రిలేషన్లో ఉన్నారని ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి త్రిష పేరు నెట్టింట మారుమోగిపోయింది. విజయ్ రిలేషన్లో ఉన్న నటి త్రిషనే అని ప్రచారం చేశారు. అది నిజం అన్నట్లుగానే త్రిష, విజయ్ కలిసి ఓ ఫంక్షన్ హాజరయ్యారు. ఎన్నికల్లో గెలిచి.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా త్రిష తన తల్లితో కలిసి ఆ వేడుకకు హాజరైంది. కానీ విజయ్ సతీమణి సంగీత, పిల్లలు మాత్రం హాజరు కాలేదు.அண்ணனின் #jananayagan படம் பார்க்க வந்தா அண்ணி சங்கீதா அவர்கள் pic.twitter.com/GFVv7xah6t— 𝚃𝚊𝚖𝚒𝚕 𝚜𝚎𝚕𝚟𝚊𝚗 𝚃𝚅𝙺 (@Selvatvk6kb) July 23, 2026 -
విజయ్ బ్రో.. వెరీ రాంగ్ బ్రో!
తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం కొత్త విషయం కాదు. కానీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓ నటుడిగా విజయ్‌కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఆయన నటించిన ‘చివరి చిత్రం’ జన నాయగన్ విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. ఈ కోలాహలం ఇటు రాజకీయ చర్చకూ దారితీసింది.‘జన నాయగన్’ విడుదల సందర్భంగా విజయ్ అభిమానుల నుంచి భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ అభిమానంలో పాలకులు సైతం పోటీ పడ్డారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు తమిళనాడు మంత్రులు, అధికార పార్టీ నేతలు థియేటర్లకు తరలివెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ నుంచి పలువురు మంత్రుల వరకు సినిమా వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు అభిమానులతో కలిసి థియేటర్లలో సందడి చేయగా.. మరికొందరు సోషల్ మీడియాలో సినిమాకు ప్రచారం చేశారు.మంత్రి టీకే ప్రభు సినిమా స్టిక్కర్లను ఇళ్ల తలుపులు, ఆటోలకు అంటించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరో మంత్రి సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. రాష్ట్రంలో కీలక సమస్యలు బోలెడన్ని పెండింగ్‌లో ఉన్నాయని.. పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సినిమా వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైందేనా? అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.నీట్ నుంచి రైతుల వరకు..నీట్‌పై అభ్యంతరాలతో మొదటి నుంచి కేంద్రం నుంచి పోరాడుతోంది తమిళనాడునే. అసలు ఆ పరీక్షను రద్ద చేయాలనే డిమాండ్ మొదలైంది కూడా అక్కడి నుంచే. అలాంటి రాష్ట్రంలో.. నీట్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో తమది మొదటి నుంచి ఒకే మాట అని విజయ్ టీవీకే చెబుతోంది.అయితే నిరసనల్లో మాత్రం ఆ పార్టీకి చెందిన నేతలెవరూ కనిపించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్న వేళ.. విజయ్ సినిమా వంకతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు, కావేరీ నీటి విడుదల, డెల్టా రైతుల సమస్యలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సినిమా విడుదల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించడం విమర్శలకు కారణమైంది.వెరీ రాంగ్ బ్రో.. ఇటీవల తమిళనాడులో వరుసగా కస్టడీ మరణాల ఆరోపణలు కలకలం రేపాయి. పోలీసుల వేధింపులతో నలుగురు మరణించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలీసు దౌర్జన్యాలపై గళమెత్తిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.గతంలో కస్టడీ బాధిత కుటుంబాలను కలిసిన విజయ్.. పోలీసు సంస్కరణలు తీసుకురావాలని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమా హీరో కావొచ్చు, కానీ..విజయ్ రాజకీయ ప్రయాణం మొత్తం ప్రజా సమస్యల చుట్టూనే సాగింది. అవినీతి, పరిపాలనా లోపాలు, ప్రజల హక్కుల కోసం పోరాడతానని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ముందున్న అసలు పరీక్ష.. అభిమానుల సీఎంగా కాకుండా ప్రజల సీఎంగా నిరూపించుకోవడం. సినిమా విజయోత్సవాలు రాజకీయంగా నష్టం చేయకపోయినా.. ప్రజా సమస్యలపై స్పందన ఆలస్యమైతే ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సినీ మత్తు వీడి రంగంలోకి దిగాలనే అభిప్రాయమై వ్యక్తమవుతోంది. View this post on Instagram A post shared by Chennai Live (@chennailive1048) -
దళపతి విజయ్ కాదు.. సీఎం జోసెఫ్ విజయ్
దళపతి విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా 'జన నాయగన్'. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.ఈ సందర్భంగా థియేటర్లలో ఆసక్తికర సన్నివేశం కనిపించిది. ఇప్పటి వరకు దళపతి విజయ్ అని పడిన టైటిల్ కార్డు.. ఇప్పుడు గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ థియేటర్లలో కనువిందు చేసింది. సీఎం విజయ్ అని స్క్రీన్‌మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అది కూడా విజయ్ సీఎం అయ్యాక అసెంబ్లీలో ఆయన చేసిన సంజ్ఞతో ఈ టైటిల్‌కార్డు వేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ స్టైల్లో గడ్డం కింద చేయి పెట్టి డీఎంకేను విజయ్ ఎద్దేవా చేస్తూ ఓ సైగ చేశారు. ఆ స్టిల్ నెట్టింట తెగ వైరల్ కాగా.. ఇప్పుడదే థియేటర్లో కనిపించడంతో ఆ వీడియోలు అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు. #JanaNayagan Santhosa Padratha illa varuththa Padratha theriyala 🥺 any way love you na @actorvijay 🫂 forever ♾️ ni maddum than 🫀 pic.twitter.com/MvZJC0yEqf— Sai Jegadheesh (@saijegadheeshh) July 23, 2026 -
సీఎం విజయ్‌తో సినిమా ట్రెండింగ్ లో మమితా బైజు (ఫొటోలు)
-
‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : జన నాయకన్(జన నాయకుడు)నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు తదితరులునిర్మాణ సంస్థ: కేవీఎన్ ప్రొడక్షన్స్నిర్మాత: వెంకట్ కె. నారాయణ (కేవీఎన్)దర్శకత్వం: హెచ్. వినోద్సంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ఎడిటింగ్: ప్రదీప్ ఇ. రాఘవ్విడుదల తేది: జులై 23, 2026జన నాయకన్.. తమిళనాడు ఎన్నికల ముందు ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయ్ చివరి చిత్రం అని చెప్పడంతో అప్పటికే ‘జన నాయకన్’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఎన్నికల సమయంలో సెన్సార్ అడ్డంకులు ఏర్పడి, సినిమా రిలీజ్ కాకపోవడం.. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు పెట్టడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎలాంటి అడ్డకుంలు లేకుండా నేడు (జులై 23) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి విజయ్ చివరి చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..దళపతి వెట్రి కొండన్(విజయ్) పోలీసు ఆఫీసర్. ఓ నేరం కింద ఆయన మధురై సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు.కొత్తగా వచ్చిన జైలు వార్డెన్(గౌతమ్ వాసుదేవ్ మీనన్),దళపతి మంచి తనం చూసి.. అనారోగ్యంతో ఉన్న తన తల్లి(రేవతి)ని చివరి సారిగా చూసేందుకు అనుమతి ఇస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 15న వచ్చే సాధారణ క్షమాభిక్ష ద్వారా జైలు నుంచి విడుదలయ్యేలా చేస్తాడు. ఈ క్రమంలో జైలు జైలర్ కూతురు విజ్జి(మమితా బైజు)తో దళపతికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. రోడ్డు ప్రమాదంలో జైలర్ చనిపోవడంతో విజ్జికి అన్ని తానై చూసుకుంటాడు. తండ్రి కోరిక మేరకు ఆమెను ఆర్మీలో జాయిన్ చేయించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే విజ్జికి ఫియర్ ఫోబియా ఉండడంతో..ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకొని సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. అలాంటి విజ్జిని ఓ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఆమెను చంపేందుకు ప్లాన్ చేస్తుంది. దీని వెనుక గ్యాంగ్‌స్టర్ హిమ్లర్(బాబీ డియోల్) ఉన్నాడని దళపతి తెలుసుకుంటాడు. అసలు హిమ్లర్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతని మనుషులు విజ్జిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఆఫ్రికాలో అల్లకల్లోలం సృష్టించిన హిమ్లర్..ఇండియాకు ఎందుకు వచ్చాడు? భారత్‌పై ఆయన చేసిన కుట్ర ఏంటి? దాన్ని దళపతి ఎలా అడ్డుకున్నాడు? ఈ విషయంలో జర్నలిస్ట్ కాయల్(పూజా హెగ్డే)..దళపతికి ఎలా తోడుగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా కథని బేస్‌గా తీసుకొని, దానికి రాజకీయఅంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘జన నాయకన్’. హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి.. ఆయనకు ఉపయోగపడేలా పొలిటికల్ సీన్లను పేర్చి.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీర్చి దిద్దారు.అయితే ఆయా సీన్లు విజయ్ ఫ్యాన్స్‌ని అలరిస్తాయేమో కానీ.. జనరల్ ఆడియన్స్‌ని మాత్రం అంతగా ఆకట్టుకోలేవు. ఇక తెలుగు ప్రేక్షకుల్లో అల్రేడీ భగవంత్ కేసరి చూసినవారైతే..ఓపికతో ఈ సినిమా చూడాల్సిందే.విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కేవలం అభిమానుల కోసమే అన్నట్లుగా చాలా చోట్ల హీరోకి ఎలివేషన్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ కూడా అదే రేంజ్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న..గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్..ఎలివేషన్స్.. భారీ యాక్షన్ సీన్స్..అన్ని ఈ సినిమాలో ఉంటాయి. కానీ ఏ ఒక్కటి కూడా కొత్తగా అనిపించవు. పైగా క్లైమాక్స్‌లో రోబోలతో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే సహనానికి పరీక్షగా మారుతుంది. హీరో పరిచయ సన్నివేశం నుంచి మొదలు ఫస్టాఫ్ మొత్తం దాదాపు ‘భగవంత్ కేసరి’ చూసినట్లుగానే అనిపిస్తుంది. అయినా కూడా కొంతమేర ఎంటర్టైన్ కావొచ్చు. కానీ సెకండాఫ్ మాత్రం మరీ హింసాత్మకంగా మారుతుంది. లాజిక్ లేని సీన్లు ఒకవైపు.. అనవసరమైన పొలిటికల్ డైలాగులు మరోవైపు.. సీట్లో కూర్చున్న ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా పెడతాయి. ఇదంతా ఏం వద్దు..ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే.. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంచుకున్నాడు. దళపతి పాత్రకు తగిన న్యాయం చేశాడు. యాక్షన్‌తో పాటు ఓ పాటలో డ్యాన్స్ కూడా ఇరగ దీశాడు. బాబీ డియోల్ విలనిజం బాగానే పండింది. ఆయన పాత్రకు కూడా భారీ ఎలివేషన్స్ ఉంటాయి. విజ్జు పాత్రకి మమితా బైజు న్యాయం చేసింది. అయితే శ్రీలీలతో పోలిస్తే మాత్రం కాస్త వెనకే ఉందని చెప్పాలి. పూజా హెగ్డే తెరపై అందంగా కనిపించింది కానీ.. నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. ప్రకాశ్ రాజ్ పాత్ర బాగుంది. కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం దారుణంగా ఉంది. నాజర్, ప్రియమణి, రేవతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.టెక్నికల్ విషయాలకొస్తే..అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ తగ్గలేదు. -
‘జన నాయగన్’ ట్విటర్ రివ్యూ
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్( తెలుగులో జన నాయకుడు). . హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య నేడు(జులై 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చెన్నైతో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అదిరిపోయిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తే.. యావరేజ్ సినిమా అని మరి కొంతమంది చెబుతున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోని తెరపై చూసి మురిసిపోతున్నామని చెబుతున్నారు. సినిమాలో విజయ్ వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్‌గా మారాయి.‘సీఎం విజయ్ యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. దర్శకుడు వినోద్ సినిమాను బాగా తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్‌కి అనిరుధ్ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది. పూజా హెగ్డే గ్లామర్ మరో ప్లస్ పాయింట్ అంటూ ఓ నెటిజన్ 4 రేటింగ్ ఇచ్చాడు.#JanaNayaganReview : 4/5 ⭐️⭐️⭐️⭐️#JanaNayagan CM Vijay's High Action & Political Sequence Movie Director #HVinoth Balanced both Cenematic Metric Space @anirudhofficial BGM Score action Sequence, Choreography #PoojaHegde Glamour and #Vijay Fans Fest in Theatres..— South Digital Media (@SDM_official1) July 23, 2026#JanaNayaganReview1st Half:Kerala Fan sitting nearby ~Ditto of leaked version it seems😂Lag, CG worst 😂Cringe pro maxxx dialogues & delivery🤣🐿️s Vinoth ah thookitu poga poranunga😭Most importantly waiting for the response from Islamic parties who offered Support🫣 pic.twitter.com/nM2E1bvWlD— Kingsley (@CineKingsley) July 23, 2026❤️❤️❤️From Thalapathy to CM – today marks one last big-screen journey for Anna with #JanaNayagan ❤️❤️❤️ Fans across TN & beyond are pouring love, from FDFS crowds to emotional celebrations.Cinema gave us a hero; politics now tests the leader. ❤️#JanaNayagan #ThalapathyVijay… pic.twitter.com/EvIvgI5tt9— CM Vijay Rising (@CMVijayRising) July 23, 2026#JanaNayagan Mediocre 1st Half!The interval block is solid and the main highlight so far. Apart from that and a few template elevation scenes, the execution has been sloppy. Bobby Deol’s villain track is absurd, the VFX is poor, and the core daughter emotion feels half baked.…— Venky Reviews (@venkyreviews) July 23, 2026#JanaNayaganFirst half is purely Mass Overloaded... THALAPATHY peak elevation...Never seen before....Enjoy Thalapathy..KGF elevation pathurukom.... Thalapathy ku intha padathula parungaaaa🔥🔥🔥— Praveen Kumar (@Praveen02kumar) July 23, 2026#ThalapathyViiay #JananayaganFirst Half - A Pakka commercial entertainer filled with complete mass moments🥶🔥Anirudh bgm elevate scenes🔥🔥🥵One last dance pic.twitter.com/HLkat99789— Ad Entertainment (@AdithianAd74923) July 23, 2026#JanaNayagan:One Last Dance – the extended 1.5-minute vintage Thalapathy dance sequence is an absolute treat for fans. 💥The interval fight is pure fire! 🔥🔥🔥The first half is a complete mass entertainer, especially for those who haven't watched Bhagavanth Kesari. For…— cinee worldd (@Cinee_Worldd) July 23, 2026One last Peak Tittle Card for Honourable CM @actorvijay ❤️🔥💥 #JanaNayakudu #JanaNayagan pic.twitter.com/gT8PGOAi9r— Rãm Teetøtàller (@urstruly_hrb23) July 23, 2026Exact remake of Bhagavat kesariFirst half looks very bad#JanaNayagan #JananayaganReview#JananayaganDisaster— AssaultSethu (@Assault002) July 23, 2026 -
జన నాయగన్ రిలీజ్.. ట్రెండింగ్ లో హీరోయిన్ పూజా హెగ్డే (ఫొటోలు)
-
విజయ్.. ఒక దెబ్బకు రెండు పిట్టలు!
నీట్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న వేళ.. తమిళగ వెట్రి కళగం అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలన్నదే తమ పార్టీ విధానమని ప్రకటించారు. కేవలం పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్‌లు వంటి అంశాలను సరిదిద్దితే సరిపోదని.. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష విధానాన్నే పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారాయన. అయితే ఈసారి ఆయన టార్గెట్ కేవలం నీట్ మాత్రమే కాదని అనిపిస్తోంది.ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో టీవీకే కీలక ప్రకటన చేసింది. వైద్య విద్య ప్రవేశాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా (Concurrent List)లో ఉంది. అంటే కేంద్రం, రాష్ట్రాలు రెండూ దీనిపై చట్టాలు చేయవచ్చు. అయితే విద్యను రాష్ట్ర జాబితా (State List)లోకి మార్చాలని టీవీకే కోరుతోంది.ఒకవేళ దీనికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉంటే.. మధ్యంతర పరిష్కారంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించే ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించింది. TVK అభిప్రాయం ప్రకారం.. స్థానిక పరిస్థితులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య విధానాలను రాష్ట్రాలే రూపొందించుకునే అవకాశం ఉండాలి.కేంద్రంపై విమర్శ.. డీఎంకేపై కౌంటర్విజయ్ తాజా ప్రకటనలో రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ విధానాన్ని వ్యతిరేకించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీవీకే.. అదే సమయంలో తమిళనాడులో ప్రధాన ప్రత్యర్థి అయిన డీఎంకేపైనా ప్రశ్నలు సంధించింది.2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే నీట్‌ను రద్దు చేస్తామని(చేయిస్తామని) హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని టీవీకే విమర్శించింది.“మేమే నీట్‌ను రద్దు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేయం” అంటూ పరోక్షంగా డీఎంకేను టార్గెట్ చేసింది టీవీకే. ఒకే అంశంతో అటు కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటు డీఎంకే హామీలను ప్రశ్నించే వ్యూహాన్ని విజయ్ అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పాత వివాదమే.. కొత్త రాజకీయ రంగుతమిళనాడులో ఈ అంశం కొత్తది కాదు. వైద్య విద్య ప్రవేశాల్లో జాతీయ స్థాయి పరీక్ష అవసరమా? లేదంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా? అనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. నీట్‌ను వ్యతిరేకించేవాళ్లు.. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విధానం ప్రతికూలంగా మారుతోందని వాదిస్తున్నారు. కోచింగ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరిగి, సామాన్య కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు అనుకూల వర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల్లో ఒకే ప్రమాణం ఉండేందుకు జాతీయ స్థాయి పరీక్ష అవసరమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పేపర్ లీకేజీ వివాదం.. తమిళనాడు చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.విజయ్‌కు రాజకీయంగా కీలకమా?సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుంటున్నారు. తమిళనాడులో విద్య, సామాజిక న్యాయం అంశాలు ఎప్పటి నుంచో కీలక రాజకీయ అంశాలు. ఈ నేపథ్యంలో నీట్ వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నంగా ఈ అడుగును చూస్తున్నారు.NEET రగడ.. పొలిటికల్ గేమ్‌గా మారుతుందా?ఇప్పటివరకు నీట్ వివాదం ప్రధానంగా పరీక్షా విధానం, లీక్‌లు, సంస్కరణల చుట్టూ తిరిగింది. కానీ తమిళనాడులో మాత్రం ఇది కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయ ఆధిపత్య పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది. విజయ్ తాజా వైఖరి చూస్తే.. నీట్ అంశాన్ని కేవలం విద్యా సమస్యగా కాకుండా రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. NEET వ్యతిరేకతతో కేంద్రంపై విమర్శలు, డీఎంకేపై ఎదురుదాడి.. రెండింటినీ ఒకేసారి సాధించే వ్యూహంతో విజయ్ ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
అబద్ధాలు ప్రచారం చేయడంలో దేశం ఎంతో ముందుంది
తమిళనాడు సీఎం విజయ్ కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ వివాదాలు, విడుదల అడ్డంకులపై దర్శకుడు హెచ్. వినోద్ మంగళవారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో కులం, మతం ఆధారంగా అబద్ధాలను సృష్టించి ప్రచారం చేయడంలో దేశం ముందంజలో ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ’ఎ’ సర్టిఫికెట్ వివాదం ఈచిత్రానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయని, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ’ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం విచారకరమన్నారు. అయితే దీనిపై చట్టపరంగా పోరాడటానికి తమకు తగినంత సమయం లేదని, ప్రజలే ఈ సినిమాకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అబద్ధాల ప్రచారంపై ఆవేదన ‘‘అబద్ధాలను సృష్టించడంలో దేశం ముందుంది. కులం, మతం పేరుతో అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారు. ఒక చిన్న అబద్ధం మనిషిని మూర్ఖుడిగా మార్చగలదు. ఇలాంటి వాటిని అరికట్టడానికి బలమైన చట్టాలు అవసరం. కేవలం సెన్సార్ బోర్డు మాత్రమే ఈ సినిమాను అడ్డుకోలేకపోయింది.’’ అని వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యక్తినీ, పార్టీనీ లక్ష్యంగా చేసుకోలేదు జననాయగన్ ద్వేషానికి వ్యతిరేకంగా, సమాజంలో ఐక్యత , మహిళల పురోగతిని ఆకాంక్షిస్తూ తీసిన చిత్రం. ఇందులో ఏ వ్యక్తిని, ఏ రాజకీయ పార్టీని లేదా సంస్థను లక్ష్యంగా చేసుకోలేదన్నారు.. విజయ్ కూడా ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని స్పష్టంగా చెప్పారని, ద్వేషానికి వ్యతిరేకంగా తీసిన సినిమాపై మళ్లీ ద్వేషాన్ని రుద్దడం సరికాదన్నారు. తన చివరి సినిమా ఎలా ఉండాలనే దానిపై విజయ్ కొన్ని స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయన్నారు. ఎన్నో కథలు విన్న తర్వాత ఆయన ఈ కథను ఎంచుకోవడానికి ప్రధాన కారణం సమాజం , మహిళా సాధికారతపై ఆయనకున్న తీవ్రమైన అభిరుచే అని వివరించారు. ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం విజయ్‌కు కృతజ్ఞతులు అని పేర్కొంటూ, ఆయనపై ఎనలేని ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని స్పష్టంచేశారు. కాగా, విజయ్ నటించిన ఈ చిత్రం 23 వతేదీ గురువారం దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. తమిళనాడులో థియేటర్లలో వారం రోజుల పాటుగా అన్ని టికెట్లు బుక్కయ్యాయి. -
సీఎం విజయ్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, చైన్నై : తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పెరంబూరు నియోజకవర్గం నుండి తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు , ముఖ్యమంత్రి విజయ్ సాధించిన విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై చెన్నై హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.సీఎం విజయ్‌కు, అలాగే సంబంధిత రిటర్నింగ్ అధికారికి మళ్లీ కొత్తగా నోటీసులు పంపించేందుకు నిర్ణయించారు. కేసు నేపథ్యం.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం విజయ్ 1,20,365 ఓట్లు సాధించి, తన సమీప డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై 53,715 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి శేఖర్‌కు 66,650 ఓట్లు వచ్చాయి. అయితే, విజయ్ విజయాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని కోరుతూ డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన దినేష్, లక్ష్మి నరసింహన్ అనే ఓటర్లు చెన్నై హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల ప్రధాన ఆరోపణలు డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్ తన పిటిషన్లో విజయ్ తన నామినేషన్ పత్రాల్లో పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని సమర్పించారని ఆరోపించారు. ఆయనకు ఉన్న ఆస్తులు, ఆయనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను సరైన రీతిలో వెల్లడించలేదని, కాబట్టి పెరంబూరులో ఆయన సాధించిన విజయాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ సమక్షంలో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది రిచర్డ్సన్ విల్సన్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీఎం విజయ్‌తో పాటు ఎన్నికల అధికారులకు ఇదివరకు పంపిన కోర్టు నోటీసులు ఇంకా అందలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, సీఎం విజయ్, ఎన్నికల అధికారులకు కొత్తగా నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేశారు. -
‘ఎముకలు విరిగిపోతాయి’.. సీఎం విజయ్‌పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
సాక్షి చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ను ఉద్దేశించి బహిరంగ సభలో అభ్యంతరకరమైన, బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై విలాతికుళం నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే జి.వి. మార్కండేయన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం (జూలై 20, 2026) తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఆయనను తూత్తుకుడి ఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఈ అరెస్టును నిరసిస్తూ డీఎంకే మద్దతుదారులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. దీనిని ఉద్దేశించి అసెంబ్లీలో సీఎం విజయ్ ‘మీ నాన్న ఎక్కడ?’ అంటూ సెటైర్లు వేశారు. దీనికి కౌంటర్‌గా జూలై 18న కొవిల్‌పట్టిలో జరిగిన డీఎంకే కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే మార్కండేయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అసెంబ్లీలో ముఖ్యమంత్రి తాను ఒకరి తండ్రి కోసం వెతుకుతున్నానని మాట్లాడుతున్నారు. ఆయనొక సిగ్గులేని ముఖ్యమంత్రి. అసెంబ్లీలో మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. అసెంబ్లీ తలుపులు మూసివేస్తానని ఆయన అంటున్నారు. ఒకవేళ ఆయన గనుక వాటిని మూసివేస్తే, ఆయన ఎముకలు విరిగిపోతాయి. దమ్ముంటే అసెంబ్లీని మూసి చూడమనండి’అంటూ మార్కండేయన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రసంగం తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీవీకే ఉత్తర జిల్లా కార్యదర్శి బాలసుబ్రమణియన్ తూత్తుకుడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మార్కండేయన్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విలాతికుళంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.మార్కండేయన్ అరెస్టును డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. విమర్శలను తట్టుకోలేక అధికార టీవీకే ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందని, ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని వారు మండిపడ్డారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నెల ప్రారంభంలోనే తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన అదే రోజు బెయిల్‌పై విడుదలయ్యారు. తాజా అరెస్టుతో తమిళనాడులో డీఎంకే, టీవీకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మరింత ముదిరింది. -
సీఎం విజయ్ ని చూసి చంద్రబాబు నేర్చుకోవాలి
-
నిరుద్యోగ భృతి రూ. 4 వేలకు పెంపు?
సాక్షి, చెన్నై : నిరుద్యోగ పట్టభద్రులకు ప్రభుత్వం త్వరలోనే భారీ తీపి కబురు అందించబోతోంది. రాష్ట్రంలో నిరుద్యోగులకు అందించే నెలవారీ సహాయాన్ని ఏకంగా రూ. 4 వేలకు పెంచే అవకాశం ఉందని కార్మిక సంక్షేమ శాఖ మంత్రి జె. మహమ్మద్ పర్వేజ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పుదుక్కోట్టైలో వివిధ ప్రభుత్వ శాఖల తరఫున 721 మంది లబి్ధదారులకు సంక్షేమ సహాయం అందించే కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా మంత్రి నిరుద్యోగ భృతి పెంప గురించి ప్రస్తాంచారు. ఎన్నికల హామీలు నిర్ణీత కాలపరిమితిలోగా నెరవేర్చాలని అధికారులను సీఎం విజయ్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే నిరుద్యోగ యువతకు అందించే భృతి రూ. 4,000లకు పెంచేందుకు అవసరమైన చర్యలు వేగంగా జరుగుతున్నాయని, బడ్జెట్లో దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. అలాగే తమిళనాడులో ప్రస్తుతం పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల (వలస) కారి్మకుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందినట్లు మంత్రి మహమ్మద్ పర్వేజ్ తెలిపారు. ఈ విషయంలో మరింత పారదర్శకత కోసం అధికారులు ప్రతి జిల్లాలోనూ వలస కారి్మకుల జనాభా గణన కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
అన్నా.. పురుగుల అన్నం పెడ్తున్నారు!
‘‘అన్నా.. హాస్టల్లో భోజనం సరిగ్గా ఉండదు.. అన్నంలో పురుగులు వస్తున్నాయ్’’ అంటూ పిల్లలు చెప్పిన మాటలకు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చలించిపోయారు. చెన్నైలోని సైదాపేటలో ఉన్న ఎంసీ రాజా సోషల్ జస్టిస్ స్టూడెంట్స్ హాస్టల్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హాస్టల్‌కు చేరుకున్న విజయ్.. అక్కడి వసతులు, నిర్వహణ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత లోపాలు, నీటి సమస్యలు, సిబ్బంది కొరత వంటి అంశాలను వివరించారు.ఫిర్యాదు చేస్తే కొద్దిరోజులే.. హాస్టల్లో అందించే భోజనం నాణ్యతపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆహారంలో పురుగులు కనిపిస్తున్నాయని, భోజనం విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని వారు సీఎంకు తెలిపారు. గతంలో విద్యార్థుల ఆందోళనల తర్వాత కొంతకాలం ఆహారం నాణ్యత మెరుగుపడిందని, కానీ కొద్దిరోజులకే మళ్లీ పాత పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగదిలో పరిశుభ్రత పాటించడం లేదని, సిబ్బంది గ్లౌజులు, క్యాప్స్ వంటి రక్షణ పరికరాలు ఉపయోగించడం లేదని చెప్పారు.హాస్టల్స్ లో దయనీయ స్థితి..సీఎం విజయ్ వద్ద తమ గోడు వినిపించిన విద్యార్థులు అభివృద్ధిలో టాప్ 5 స్థానాల్లో ఉన్న తమిళనాడులో వాస్తవ పరిస్థితులు ఇవి..#CMVijay pic.twitter.com/JTgr31HMGW— UttarandhraNow (@UttarandhraNow) July 17, 2026వసతులపై విద్యార్థుల ఫిర్యాదులుహాస్టల్లో నీటి సరఫరా సమస్యలు, మరుగుదొడ్ల నిర్వహణ లోపాలు, సిబ్బంది కొరత, భద్రతా లోపాలపై కూడా విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, హాస్టల్లో భద్రతపై ఆందోళన ఉందని తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.రాత్రి ఆలస్యంగా కోచింగ్ తరగతులు లేదా పనుల నుంచి వచ్చే విద్యార్థులకు గేట్లు మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు విద్యార్థులు చెప్పారు. స్పోర్ట్స్ సదుపాయాలు, ఆధునిక జిమ్, లైబ్రరీలో మరిన్ని పుస్తకాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.సీఎం స్పందన.. అధికారులకు ఆదేశాలువిద్యార్థుల సమస్యలను ఓపికగా విన్న సీఎం విజయ్.. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భోజనం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని సూచించారు. హాస్టల్లోని వంటగది, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలించిన విజయ్.. సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. తదుపరి తనిఖీ నాటికి అన్ని లోపాలు సరిచేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.రూ.44.50 కోట్లతో నిర్మించిన హైటెక్ హాస్టల్సైదాపేటలోని ఈ 10 అంతస్తుల హాస్టల్‌ను గత డీఎంకే ప్రభుత్వ హయాంలో సుమారు రూ.44.50 కోట్లతో నిర్మించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. లిఫ్ట్‌లు సహా పలు ఆధునిక సదుపాయాలు ఉన్నప్పటికీ.. నిర్వహణ లోపాలపై విద్యార్థుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో సీఎం స్వయంగా తనిఖీ చేపట్టినట్లు సమాచారం.వరుసగా రెండో ఆకస్మిక తనిఖీముఖ్యమంత్రి విజయ్ ఇటీవల చెన్నైలోని ఎగ్మోర్ చిన్నారుల ఆసుపత్రిని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాజాగా విద్యార్థుల హాస్టల్‌ను సందర్శించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. “సమస్యలు చెప్పేందుకు ప్రజలు సీఎం వద్దకు వెళ్లడం కాదు.. సీఎం స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లడం” అనే విధంగా ఆయన తనిఖీలపై చర్చ జరుగుతోంది. -
విజయ్‌కు త్రిష.. నాకేమో నవ్వు!
సాక్షి సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కృష్ణన్ బంధంపై తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. తన తాజా చిత్రం 'విజిటర్' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ధ్యాన్.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకను పరోక్షంగా ప్రస్తావిస్తూ వేసిన సరదా పంచ్‌లు ప్రేక్షకులను నవ్వించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారడంతో పాటు విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్లో తన సహనటి నవ్యా నాయర్‌ను ఉద్దేశించి ధ్యాన్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. నవ్యాకు పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా నేను ఒకరోజు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. నువ్వు తెల్లచీర కట్టుకుని ముందు వరుసలో కూర్చొని, కళ్లలో నీళ్లతో నన్ను చూస్తూ ఉండాలి" అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో సభలో నవ్వులు పూశాయి.Trisha emotions were on high during Vijay oath ceremony. An emotional moment ❤️ pic.twitter.com/GrJcW88bwg— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 10, 2026ఆ తర్వాత మైక్ అందుకున్న నవ్యా నాయర్ కూడా అదే స్థాయిలో స్పందించింది. "నువ్వు సీఎం అయితే.. నువ్వు చెప్పినట్టే తెల్లచీరకు ఆకుపచ్చ అంచు, డైమండ్ నెక్లెస్ వేసుకుని ముందు వరుసలో కూర్చుంటా. కళ్లలో ఆనందబాష్పాలతో నీకు జైకొడతా. కానీ ముందు వరుసలో నాకు సీటు మాత్రం రిజర్వ్ చేయాలి" అంటూ చమత్కరించింది. దీంతో సభలో మరోసారి నవ్వుల వెల్లువ ఎగిసింది.ఇదంతా సరదా సంభాషణలా అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తప్పు బడుతున్నారు. ఈ వ్యాఖ్యలను విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో పోలుస్తున్నారు. వాళ్లిద్దరిపైనా మండిపడుతున్నారు. The day I take the oath as CM... I think Navya will be there in the front row wearing a saree...!!- Dhyan Sreenivasan 😂 pic.twitter.com/UT5GvyK8Fq— Trollywood 𝕏 (@TrollywoodX) July 16, 2026 తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు త్రిష.. ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురికావడం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఘటననే ధ్యాన్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రస్తావించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ధ్యాన్ మరో సరదా వ్యాఖ్య కూడా చేశాడు. విజయ్ ముఖ్యమంత్రి అయినట్లే.. తానూ రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అవుతానని జోక్ చేశాడు. అలాగే తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్‌ను ఈ సంభాషణలోకి లాగుతూ.. తనకి గవర్నర్ పదవి బాగుంటుందని నవ్వించాడు. వెంటనే అజు వర్గీస్ మీ అమ్మగారికి రాష్ట్రపతి పదవి దక్కుతుందని జోక్ చేశాడు.అయితే ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందని అనుకున్నాడో ఏమో.. అజు వర్గీస్ వేదిక మీదకు వచ్చి "విజయ్ సార్, నా ఫ్రెండ్ కొంచెం పిచ్చోడు.. దయచేసి క్షమించండి" అంటూ వ్యాఖ్యానించాడు. ఆ మాటతో అక్కుడున్నవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.ఎవరీ ధ్యాన్-నవ్యా?ధ్యాన్ శ్రీనివాసన్(Dhyan Sreenivasan) మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాసన్ కుమారుడు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వినీత్ శ్రీనివాసన్‌కు సోదరుడు. 2013లో వచ్చిన తీరా సినిమాతో నటుడిగా పరిచయమైన ధ్యాన్, 2013లో 'తీరా' చిత్రంతో నటుడిగా పరిచయమైన ధ్యాన్ శ్రీనివాసన్.. 'ఆది కాప్యారే కూటమణి', 'కుంజిరామాయణం', 'గూడలోచన', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక.. నవ్యా నాయర్ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి. 'నందనం', 'ఇష్టం', 'కళ్యాణరామన్', 'పందిప్పాడ' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె, మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్ 2017లో అర్పితా సెబాస్టియన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్యా నాయర్ 2010లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. -
మంత్రులకు సీఎం విజయ్ వార్నింగ్
-
సెకండ్ చాన్స్ ఉండదు.. మంత్రులకూ విజయ్ వార్నింగ్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అవినీతిపై తన మంత్రులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం (Second Chance) ఉండదని గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ.. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని మరోసారి ప్రకటించారు.ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తన పార్టీ చెంగల్పట్టు ఈస్ట్ జిల్లా సంయుక్త కార్యదర్శి వీరసామిని విజయ్ పార్టీ నుంచి బహిష్కరించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన వీడియో వైరల్ కావడంతో.. రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించారు. అనంతరం పోలీసులు కూడా ఆయనను అరెస్ట్ చేశారు. అయితే వీరసామి మాత్రం ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీస్ విచారణ జరుగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తున్న విజయ్.. అవినీతిపై రాజీపడబోమనే సంకేతాన్ని వరుస చర్యల ద్వారా ఇస్తున్నారు. ప్రజల సహకారంతోనే అవినీతిని పూర్తిగా నిర్మూలించగలమని ఆయన పదేపదే చెబుతున్నారు. ఈ క్రమంలో.. మొన్న కరూర్‌లో ఇటీవల నిర్వహించిన ప్రజాసభలో మాట్లాడుతూ.. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి ఏమాత్రం తావుండబోదని తేల్చిచెప్పారు."ఎవరైనా లంచం అడిగితే నేరుగా 'ఇవ్వను' అని చెప్పండి. మీ వెంటే నేను ఉంటాను. అయినా ఒత్తిడి చేస్తే.. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న విజయ్ మా వెన్నంటి ఉన్నారని ధైర్యంగా చెప్పండి" అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆ సందర్భంలో స్పష్టం చేశారాయన.ఇక అవినీతి నిర్మూలన కోసం విజయ్ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు 94981 80936 నంబర్‌తో ప్రత్యేక వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో పాటు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC) ఫిర్యాదు వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్లలో "లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరాలే" అనే హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సందేశాన్ని అన్ని ప్రభుత్వ వెబ్సైట్లలోనూ ప్రదర్శించాలని, నేరుగా DVAC ఫిర్యాదు లింక్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఈ చర్యల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. తమిళనాడులో విజయ్ సర్కార్ చేపడుతున్న అవినీతి వ్యతిరేక చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
జయలలిత ఇంటిని కొనుగోలు చేస్తున్న సీఎం విజయ్
-
సీఎం సారూ.. బ్యాగు బరువును తగ్గించాలి మీరు!
సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల విజయం తర్వాత సీఎం విజయ్ తన సొంత నియోజకవర్గమైన పెరంబూర్‌లో తొలిసారి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఎనిమిదో తరగతి చదువుతున్న రుద్ర అనే విద్యార్థిని సీఎంని కలిసి తన సమస్యను విన్నవించుకోవాలని భావించింది. అయితే, భద్రతా కారణాల వల్ల సీఎంను కలవలేక ఆ బాలిక నిరాశకు గురైంది. దీనిపై మీడియా ప్రతినిధులు విద్యార్థిని ప్రశ్నించగా, ఆమె తన కోరికను మంగళవారం సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. “పాఠశాల పుస్తకాల బ్యాగు బరువు చాలా ఎక్కువగా ఉంటోంది. అంత బరువును రోజూ మోయడం వల్ల తీవ్రమైన నడుము నొప్పి వస్తోంది. విద్యార్థులపై ఉన్న ఈ పుస్తకాల సంచుల బరువును తగ్గించేలా సీఎం తగిన చర్యలు తీసుకోవాలి అని కోరింది. కాగా ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుండడం గమనార్హం. -
దివ్యాంగుడి కస్టోడియల్ డెత్! విజయ్ సర్కార్ మౌనంపై ఆగ్రహం
తమిళనాడును మరో లాకప్‌డెత్ మరణం కుదిపేస్తోంది. దివ్యాంగుడైన శబరివర్మన్ పోలీసుల కస్టడీలో ఉండగా మృతి చెందడం వివాదాస్పదమైంది. అతని ఒంటిపై గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడికావడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులు హింసించి చంపారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై హోంశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.నాగర్‌కోయిల్‌కు చెందిన శబరివర్మన్ దివ్యాంగుడు. గుట్కా, పాన్ మసాలా అక్రమ విక్రయాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇదే కేసులో గతంలోనూ అతడిపై రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూలై 9న కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. అయితే సోమవారం తెల్లవారుజామున జైల్లో శబరివర్మన్ మృతి చెందాడు.మృతదేహంపై గాయాలు.. జైల్లో ఏం జరిగింది?శబరివర్మన్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అతడి శరీరంపై గాయాలు ఉన్నాయని ఆరోపించారు. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టంలో మొత్తం 19 గాయాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జైల్లో అతడిపై దాడి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు జైలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ముగ్గురు జైలు వార్డర్లు, కొంతమంది ఖైదీలు శబరివర్మన్‌పై దాడి చేసినట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. అనంతరం సంబంధిత జైలు సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.డీఎంకే ఆగ్రహం.. సీఎం విజయ్‌కు ప్రశ్నలుశబరివర్మన్ మృతి రాజకీయ వివాదానికి దారితీసింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. అరెస్టు సమయంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లిన తర్వాత గాయాలతో ఎలా మృతి చెందాడని ప్రశ్నించారు. దివ్యాంగుడన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాడి చేశారన్న కుటుంబ సభ్యుల ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున ఈ ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు.అంతేకాదు.. ఇటీవల గుట్కా కేసులో ఓ టీవీకే నేత అరెస్టై అదే రోజు బెయిల్ పొందిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సామాన్యులకు ఒక చట్టం, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారికి మరో చట్టమా? అంటూ పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. గతంలో లాకప్‌డెత్‌ల సమయంలో విజయ్ వ్యవహరించిన తీరుకు.. ఇప్పుడు అధికారంలో మౌనం వహించడం సరికాదని అంటున్నారు.తమిళనాడులో కస్టడీ మరణాలపై మళ్లీ చర్చశబరివర్మన్ ఘటనతో తమిళనాడులో కస్టడీ మరణాలపై మరోసారి చర్చ మొదలైంది. 2020లో తూత్తుకుడిలో జరిగిన జయరాజ్, బెన్నిక్స్ తండ్రీకొడుకుల కస్టడీ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే శివగంగైలో అజిత్ కుమార్, తిరుప్పూర్‌లో మారిముత్తు కస్టడీ మరణాల ఘటనలు కూడా తీవ్ర నిరసనలకు దారితీశాయి. ఇప్పుడు నాగర్‌కోయిల్ ఘటనలో దివ్యాంగుడి మృతి, మృతదేహంపై గాయాల అంశం మరోసారి పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అయితే శబరివర్మన్ మృతికి దారితీసిన పూర్తి కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?
హీరోగా స్టార్డమ్ అనుభవించిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన కొడుకు జేసన్ సంజయ్ లండన్‌లో సినిమాకు సంబంధించిన కోర్స్ చేసొచ్చాడు. ఈ క్రమంలోనే తండ్రిలా హీరో అవుతాడనుకుంటే జేసన్ మాత్రం అందరికీ షాకిస్తూ డైరెక్టర్ అయ్యాడు. సిగ్మా పేరుతో ఓ మూవీ తీశాడు. ఇది ఈ నెల 31న రిలీజ్ కావాలి కానీ 'జన నాయగన్' కారణంగా వాయిదా పడేలా ఉంది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త లగ్జరీ ఫామ్ హౌస్!)ఈ సినిమాలోనే జేసన్ సంజయ్ ఒక పాటలోనూ నటించడం విశేషం. దీంతో పలువురు సినీ ప్రముఖులు జేసన్.. హీరోగానూ త్వరలో ఎంట్రీ ఇస్తారని భావించారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే విజయ్ కొడుకు హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు. దీనిని తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు జీకే తమిళ్ కుమరన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. స్టార్ డైరెక్టర్ తీయబోయే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన 'సిగ్మా' రిలీజైన తర్వాత రానుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: తండ్రి దళపతి విజయ్ కోసం తగ్గిన కొడుకు) -
సీఎం విజయ్‌కు బొమ్మ కారు గిఫ్ట్.. ఎవరిచ్చారంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు, అధికారిక కార్యక్రమాల వల్ల మాత్రమే కాకుండా.. ఆయన సహజమైన, సరదా క్షణాల వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఆసియా ఆపరేషన్స్ సీఈఓ ఫామ్ సాన్ చౌ (Pham Sanh Chau)తో జరిగిన సమావేశం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. ఈ సమావేశంలో విన్‌ఫాస్ట్ కంపెనీ ప్రతినిధి.. ముఖ్యమంత్రి విజయ్‌కు తమ కంపెనీకి చెందిన విన్‌ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ కారు స్కేల్ మోడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ చిన్న కారు బొమ్మను విజయ్ తీసుకుని, పక్కన పెట్టకుండా ఆసక్తిగా చేతిలో పట్టుకుని పరిశీలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.చాలామంది నెటిజన్లు విజయ్ అమాయకత్వాన్ని, సరళ స్వభావాన్ని ప్రశంసించారు. కొందరు ఆయన ఆ చిన్న కారును ఎంతో ఆసక్తిగా చూస్తున్న తీరు చాలా క్యూట్‌గా ఉందని, చిన్నపిల్లాడిలా ఆనందపడ్డారని కామెంట్లు చేశారు.నిజానికి సీఎం విజయ్‌కు ఇచ్చిన టాయ్ కారు విన్‌ఫాస్ట్ వీఎఫ్8 అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి చెందిన చిన్న నమూనా. దీనిని కంపెనీ పిల్లలు ఆదుకునే బొమ్మగా కాకుండా.. తమ వాహనాలను ప్రచారం చేయడానికి లేదా ప్రత్యేక అతిథులకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి రూపొందించింది.విన్‌ఫాస్ట్ వీఎఫ్8 గురించిఅసలైన విన్‌ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండో తరం. ఇది 60.13 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 228 హార్స్పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 500 కిమీ ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.#CMVijay's cute playtime with a Miniature Toy Car... 🤎🚗 pic.twitter.com/dmrxMCbeO2— 𝐒𝐚𝐤𝐭𝐡𝐢 𝐀𝐠𝐫𝐢 𝑻𝑽𝑲 (@mersal_sakthi03) July 13, 2026 -
విజయ్ మోడల్: ఫ్యాన్స్ మీటింగ్‌లు.. పొలిటికల్ సిగ్నల్సా?
దక్షిణాది రాజకీయాల్లో మరోసారి సినీ తారల రాజకీయ అరంగేట్రంపై చర్చ మొదలైంది. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల్లో విజయాన్ని సాధించి అధికార పీఠాన్ని అధిరోహించడం.. సినీ గ్లామర్, అభిమాన బలం రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపగలవో మరోసారి చర్చకు తెచ్చింది. ఇదే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ అభిమాన గణం ఉన్న జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.విజయ్ ప్రయాణం వెనుక ప్రధానంగా కనిపించిన అంశం.. సినిమా ద్వారా ఏర్పడిన అభిమాన వర్గాన్ని రాజకీయ నిర్మాణంగా మార్చుకోవడం. కేవలం స్టార్ ఇమేజ్‌తో కాకుండా.. అభిమాన సంఘాలను క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌గా ఉపయోగించుకోవడం, ప్రజా సమస్యలపై స్పందించడం, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించడం ద్వారా ఆయన రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.ఇప్పుడు ఇదే కోణంలో తెలుగు సినీ రంగంలోని ఇద్దరు అగ్ర హీరోల పేర్లు చర్చకు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి.. అల్లు అర్జున్ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందా? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.వారసత్వం + ఆ అనుభవం!తారక్‌కు రాజకీయ నేపథ్యం బలంగానే ఉంది. ఆయన తాత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్న రాజకీయ వారసత్వం, జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న భారీ అభిమాన గణం.. ఈ రెండు అంశాలు ఆయన రాజకీయ ప్రవేశంపై చర్చకు కారణమవుతున్నాయి.2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన వాగ్ధాటితో యువతను ఆకట్టుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై దృష్టి పెట్టారు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా, అభిమాన సంఘాల బలం పెరిగిన నేపథ్యంలో.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపగలరనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా 2034 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే అభిమాన వర్గాలను సమన్వయం చేసుకుంటున్నారా? అనే చర్చ కూడా వినిపిస్తోంది.తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా..మరోవైపు అల్లు అర్జున్ పేరు తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చకు వస్తోంది. పాన్ ఇండియా స్టార్‌గా వచ్చిన గుర్తింపు, యువతలో ఉన్న ఆదరణ, విస్తృతమైన అభిమాన వర్గం ఆయనకు రాజకీయంగా అనుకూల అంశాలుగా భావిస్తున్నారు.ఇటీవల అల్లు అర్జున్ అభిమానులతో సమావేశాలు నిర్వహించడం, అభిమాన సంఘాలతో అనుబంధాన్ని పెంచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. అయితే ఇవి పూర్తిగా అభిమానులతో సంబంధాలను బలోపేతం చేసుకునే కార్యక్రమాలా? లేక భవిష్యత్ రాజకీయ అడుగులకు పునాది వేస్తున్న చర్యలా? అన్నది మాత్రం స్పష్టంగా లేదు.తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినీ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే యువ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇద్దరి టార్గెట్ ఒక్కటే!ప్రస్తుతం వినిపిస్తున్న విశ్లేషణల్లో కీలక అంశం 2034 ఎన్నికలు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే విజయం సాధించడం కంటే.. ముందుగా ప్రజలతో అనుబంధం పెంచుకోవడం, అభిమాన వ్యవస్థను క్షేత్రస్థాయి బలంగా మార్చుకోవడం అవసరమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. విజయ్ మోడల్ కూడా ఇదే విషయాన్ని చూపించింది. సినిమా ఇమేజ్ను రాజకీయ విజయంగా మార్చాలంటే కేవలం అభిమాన బలం సరిపోదు.. స్పష్టమైన రాజకీయ లక్ష్యం, ప్రజా సమస్యలపై వైఖరి, బలమైన వ్యవస్థ అవసరం.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అభిమాన సమావేశాలు, విజయ్ రాజకీయ ప్రయాణం, 2034 ఎన్నికల అంచనాలు కలిపి చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో సినీ రాజకీయాలపై చర్చ మాత్రం ఇప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. -
వివాదాల నేపథ్యంలో.. విజయ్ సంచలన నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కీలక పరిపాలనా నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ. అరుణ్‌ను రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించారు. నియామకం జరిగిన రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.అరుణ్‌ను ఈ ఏడాది మే నెలలో విజయ్ ప్రభుత్వం విజిలెన్స్ చీఫ్‌గా నియమించింది. అయితే అప్పటి నుంచే ఆయన నియామకం వివాదాస్పదమైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆయనను "డీఎంకే అనుకూల అధికారి" అంటూ విమర్శించింది. ఆ సమయంలో ఆయన గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయనను తప్పనిసరి నిరీక్షణ (Compulsory Wait)లో ఉంచిన విషయం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక ఆయన విజిలెన్స్ చీఫ్‌గా నియామకంపై మద్రాస్ హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవినీతి నిరోధక సంస్థకు నాయకత్వం వహించే అధికారి నిష్కళంకమైన ప్రతిష్ఠ కలిగి ఉండాలని, "సీజర్ భార్యపై ఎలాంటి అనుమానం ఉండకూడదన్నట్లే, విజిలెన్స్ డైరెక్టర్‌పై కూడా ఎలాంటి అనుమానాలకు తావుండకూడదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. (వివరణ: ప్రాచీన రోమ్ పాలకుడు జూలియస్ సీజర్ తన భార్యపై ఎలాంటి ఆధారాలు లేకపోయినా అనుమానాలు రావడంతో విడాకులు ఇచ్చి, "నా భార్యపై అనుమానం కూడా ఉండకూడదు" అన్నాడు. అప్పటి నుంచే "Caesar's wife must be above suspicion" అనే సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది. మద్రాస్ హైకోర్టు ఈ సామెతనే ప్రస్తావించింది)..ఏ. అరుణ్ తమిళనాడు కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) హోదాలో ఉన్న ఆయన గతంలో చెన్నై నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనను డీవీఏసీ వంటి అత్యంత కీలకమైన అవినీతి నిరోధక విభాగానికి అధిపతిగా నియమించడం అప్పట్లోనే చర్చకు దారితీసింది. ఇలాంటి సంస్థకు నాయకత్వం వహించే అధికారి ఎంపికలో పారదర్శకత, నిష్పాక్షికత అత్యంత కీలకమని న్యాయస్థానం అభిప్రాయపడింది... ఈ నేపథ్యంలో నియామకంపై వచ్చిన విమర్శలు, న్యాయస్థాన పరిశీలన మధ్య కేవలం రెండు నెలల్లోనే అరుణ్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తూ విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమిళనాడులో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.ఏడీజీపీ హోదాలో ఉన్న అరుణ్‌ను చెన్నైలోని తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం డీవీఏసీ(DVAC) లో ప్రత్యేక దర్యాప్తు విభాగం ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సీ. మహేశ్వరి ఐపీఎస్‌కు విజిలెన్స్ డైరెక్టర్ బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
రీల్స్ వ్యామోహం వదిలి హామీలు నెరవేర్చండి!
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ ఎన్నికలలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి, దాన్ని వదిలేసి, అనవసరంగా పంచి డైలాగ్‌ల గురించి మాట్లాడటంలో అర్థం లేదని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, ప్రచార డిప్యూటీ సెక్రటరీ అప్సరా రెడ్డి విమర్శించారు. చెన్నై విమానాశ్రయం జరిగిన విలేకర్ల సమావేశంలో అన్నాడీఎంకే లో ప్రచార శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళణి స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఏఐఏడీఎంకే పాలనలో ప్రజలకు ఇచ్చిన, చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చిందన్నారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చిన ఏకైక ప్రభుత్వం అని అన్నారు. విజయ్ ప్రభుత్వం రీల్స్ వ్యామోహాన్ని విడిచిపెట్టాలన్నారు. ఎప్పటికైనా, ఏఐఏడీఎంకే ప్రభుత్వం చేసిన మంచి ప్రణాళికలను, ప్రస్తుత ప్రభుత్వ అవకతవకలను ప్రజలు గ్రహిస్తారని అభిప్రాయపడ్డారు.


