మొన్నటి వరకు కోలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోయిన్ త్రిష పేరు రాష్ట్రంలో బాగా వినిపిస్తోంది. ఆయన ఎన్నికల్లో గెలిచి, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనీ, రాజకీయాల్లోనూ త్రిష పేరు మరింత ట్రెండ్ అయింది. ప్రతి పక్షాలు సైతం ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆమె పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. సీఎం విజయ్, త్రిషల మధ్య ఉన్న సంబంధంపై రకరకాల పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవి నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్‌లు కలిసి పర్యటనలు చేస్తున్నారు.
ఇటీవల సీఎం విజయ్ యూకే పర్యటనకు వెళ్లగా.. త్రిష కూడా అతని వెంట వెళ్లింది. ఇద్దరు లండన్‌లో కలిసి కనిపించిన వీడియో ఇటీవల నెట్టింట బాగా వైరల్ అయింది. కారు రేసింగ్ ఈవెంట్స్‌కి విజయ్ వెళ్లగా..త్రిష కూడా అక్కడ కనిపించింది. రేసింగ్ ఈవెంట్‌ను విజయ్ గ్యాలరీ నుంచి వీక్షిస్తుండగా సడెన్‌గా త్రిష మధ్యలోకి వచ్చింది. అయితే విజయ్ వెంటనే తన ముఖం వీడియోలో పడకుండా పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. వీరిద్దరు కలిసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో త్రిష, విజయ్‌ల స్నేహం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: ‘బిర్యానీ’ కోసం జుట్టు, గెడ్డం పెంచా.. యాక్షన్ సీన్స్ కూడా చేశా : సంపూర్ణేష్ బాబు)
తాజాగా దీనిపై నటి అంబిక స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. త్రిష స్థానంలో ఉంటే తాను అలా కెమెరాల ముందు కనిపించేదాన్ని కాదని చెప్పింది. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకున్నంత మాత్రాన పాత స్నేహాలను వదులుకోవాల్సిన అవసరం లేదు.కానీ, మనం ఆలోచించినంత ఉన్నతంగా బయటి వ్యక్తులు ఉండరు. మన ప్రవర్తన వల్ల మన స్నేహితుడిపై విమర్శలు వస్తాయని తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను త్రిష స్థానంలో ఉంటే, విమర్శలు వస్తాయని తెలిస్తే, నేను విజయ్‌తోపాటు వెళ్లకుండా ఉంటాను. ఇది నా అభిప్రాయం. మనం స్నేహానికి విలువ ఇవ్వాలి, కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి’ అని అంబిక చెప్పుకొచ్చింది.
అంబిక విషయానికొస్తే.. కన్నడ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, మురళీ మోహన్, కృష్ణ రాజు వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. దాదాపు ఆమె 300పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో కూడా నటించి, తన నటనా ప్రస్థానాన్ని కొనసాగించారు. 1988లో, అంబిక అమెరికాకు చెందిన ఒక డాక్టర్ మీనన్ ను వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లారు. ఎనిమిది సంవత్సరాల పాటు వైవాహిక జీవితం గడిపి, ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన తర్వాత, కొన్ని కారణాల వల్ల 1996లో ఆమె విడాకులు తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు.
Thalapathy Vijay didn't expected her entry ? He looks UNCOMFORTABLE right after the moment trisha entered the frame 👀#Thalapathy #Vijay #Ajithkumar #TVK pic.twitter.com/2lDJpW5hnP
— Gokul (@ItzGokulVJ) September 12, 2026


