‘బిర్యానీ’ కోసం జుట్టు, గెడ్డం పెంచా.. యాక్షన్‌ సీన్స్‌ కూడా చేశా : సంపూర్ణేష్‌ బాబు | Sampoornesh Babu Turns Serious For His Role In Nani The Paradise Movie, His Interesting Comments Goes Viral | Sakshi
Sakshi News home page

‘బిర్యానీ’ కోసం జుట్టు, గెడ్డం పెంచా.. యాక్షన్‌ సీన్స్‌ కూడా చేశా : సంపూర్ణేష్‌ బాబు

Sep 16 2026 10:42 AM | Updated on Sep 16 2026 10:53 AM

Sampoornesh Babu Talk About The Paradise

‘‘నేను ఇప్పటివరకూ చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా నవ్వించాయి. అయితే ‘ది ప్యారడైజ్‌’లో చేసిన బిర్యానీ పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌ కోసం నేను వేరే ఏ సినిమాలు ఒప్పుకోలేదు. జుట్టు, గెడ్డం పెంచడంతో పాటు బరువు పెరిగి ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యాను. యాక్షన్‌ సీన్స్‌ కూడా చేశాను. నా కెరీర్‌లో బిర్యానీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని సంపూర్ణేష్‌ బాబు తెలిపారు. 

(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)

నాని, కయాదు లోహర్‌ జంటగా నటించిన చిత్రం ‘ది ప్యారడైజ్‌’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్‌బాబు, సంపూర్ణేష్‌ బాబు కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ‘ది ప్యారడైజ్‌’ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా సంపూర్ణేష్‌ బాబు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని బిర్యానీ పాత్రకు లుక్‌ టెస్ట్‌ చేసి, సరిపోతానని నన్ను ఎంపిక చేశారు శ్రీకాంత్‌ ఓదెల. నానీగారి అనుచరుడిగా చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తాను. ప్రస్తుతం హీరోగా ఓ సినిమా ఒప్పుకున్నాను. ‘ది ప్యారడైజ్‌’ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement