టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. హెచ్‌-1బీ వీసాల పేరుతో.. | Gudivada MLA Venigandla Ramu Faces Allegations Over H-1B Consultancy Business In The US, Check More Details Inside | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. హెచ్‌-1బీ వీసాల పేరుతో..

Sep 16 2026 9:31 AM | Updated on Sep 16 2026 10:15 AM

Cockroach Exposer Alleges Fraud Against TDP MLA Venigandla Ramu

సాక్షి, విజయవాడ: గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై ‘కాక్రోచ్ ఎక్స్‌పోజర్’ అనే సోషల్ మీడియా ఖాతా సంచలన ఆరోపణలు చేసింది. అమెరికాలో హెచ్‌-1బీ, ఓపీటీ, సీపీటీ, హెచ్‌4 ఈఏడీ ఉద్యోగులకు సంబంధించి పలు అంశాల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేశారంటూ ఎక్స్‌ వేదికగా ఆరోపణలు చేసింది.

‘కాక్రోచ్ ఎక్స్‌పోజర్’ పోస్టుల్లో.. 1994లో ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాపై అమెరికా వెళ్లిన వెనిగండ్ల రాము.. అనంతరం గ్రీన్‌కార్డు పొందిన తర్వాత హెచ్‌-1బీ కన్సల్టెన్సీ వ్యాపారాల్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ‘బాడీ షాపింగ్‌’ ద్వారా భారీ మొత్తంలో సంపాదించారని, అమెరికాలో ఆయన సంపాదన బిలియన్‌ డాలర్లకు పైగానే ఉందని ఆ ఖాతా ఆరోపించింది.

పలు సంస్థలతో సంబంధాలంటూ ఆరోపణలు..
వెనిగండ్ల రాముకు Verdict Holdings LLC (Eficens Systems LLC), Magtech Consulting & Solutions LLC, Morgan Stanley Smith Barney LLC, Ogni GP LLC, Elear LLC, Techsynergy LLC, Lilly Housing LLC, Castle Housing LLC, Stoney Point Housing LLC, Grayson Housing LLC తదితర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోస్టుల్లో పేర్కొన్నారు. ఈ సంస్థల ద్వారా వేలాది హెచ్‌-1బీ దరఖాస్తులు దాఖలు చేశారంటూ ఆరోపణలు చేశారు.

ఇదే సమయంలో హెచ్‌-1బీ, ఓపీటీ, సీపీటీ, హెచ్‌4 ఈఏడీ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారని, 5,000 మందికి పైగా హెచ్‌-1బీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని కాక్రోచ్ ఎక్స్‌పోజర్ ఆరోపించింది. అలాగే అమెరికా ప్రభుత్వం అందించిన పీపీపీ (Paycheck Protection Program) నిధులను దుర్వినియోగం చేశారని కూడా పోస్టుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి: డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తారా? లేదా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement