పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక | Suriya And Jyotika Get Married Again After 20 Years, Exchange Rings In Front Of Their Children, Video Went Viral | Sakshi
Sakshi News home page

Suriya And Jyotika: బంధానికి 20 ఏళ్లు.. మరోసారి పెళ్లి.. వీడియో వైరల్

Sep 16 2026 8:45 AM | Updated on Sep 16 2026 9:59 AM

Suriya And Jyotika Celebrates 20 Years Wedding

తమిళ స్టార్ జంట సూర్య-జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2006లో ప్రేమ వివాహం చేసుకున్న వీళ్లు.. ఇప్పుడు తమ బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రిస్టియన్ పద్ధతిలో పిల్లల సమక్షంలో ఉంగరాలు మార్చుకుని కొత్త జంటలా వివాహం చేసుకున్నారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని జ్యోతిక తన ఇన్ స్టాలో షేర్ చేసింది. 'ది సీక్వెల్- 20 ఏళ్ల ప్రేమకు మరో ప్రతిజ్ఞ' పేరుతో వీడియో షేర్ చేసిన జ్యోతిక తన మనసులోని మాటలకు అద్భుతమైన అక్షరరూపం ఇచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

'20 ఏళ్ల వైవాహిక బంధం.. ఎన్నో మధుర జ్ఞాపకాలు. చిన్న చిన్న మనస్పర్థలు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం,  త్యాగాలు, మరీ ముఖ్యంగా ఎలాంటి అంచనాల్లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఇది పరిపూర్ణమైన పెళ్లిని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఒకరి కోసం మరొకరు మారుతూ, ఎదుగుతూ వచ్చిన మనం అనే బంధానికి ఇది ఓ వేడుక. ఒకప్పుడు కలలా అనిపించిన జీవితం.. ఇప్పుడు నా జీవితాంతం కలగనేంత అందమైన నిజంలా మారింది'

'ఇకపై నేను ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. జీవితంలో ఇబ్బందులు ఎదురైతే అందులోని పాజిటివిటీనే చూడాలని నిర్ణయించుకున్నాను. జీవితాన్ని ప్రతిరోజూ వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇకపై ఎలాంటి ఫిర్యాదు చేయను. కృతజ్ఞతతో ఉంటాను. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను. మంచి తల్లిగా ఉండేందుకు ప్రయత్నిస్తాను' అని జ్యోతిక చెప్పుకొచ్చింది.

తన భర్త సూర్య గురించి మాట్లాడుతూ.. 'నేను ఎప్పటికీ నీతో గొడవపడతాను. మళ్లీ నేనే వచ్చి మాట్లాడతాను. ప్రతి చిన్న గొడవ తర్వాత మన బంధం మరింత దగ్గరవుతుందని నమ్ముతాను. ఈ 20 ఏళ్ల ప్రయాణంలో అన్నింటికంటే విలువైనది మన స్నేహమే. ఓ వ్యక్తి నాతో సమానంగా, మనసులోని మాటలు చెప్పుకోగలిగే నమ్మకస్తుడిగా, గాసిప్ పార్ట్‌నర్‌గా, బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండటం అరుదు. అలాంటి వ్యక్తే నా భర్తగా, నా పిల్లలకు తండ్రిగా నా జీవితంలో ఉండటం నేను చేసుకున్న అదృష్టం. ఇది 20 ఏళ్ల ప్రయాణానికి ముగింపు కాదు. మరో 20 ఏళ్లకు ఆరంభం' అని జ్యోతిక భావోద్వేగానికి గురైంది.

(ఇదీ చదవండి: పదేళ్ల ప్రేమ.. ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement