పెళ్లి పీటలెక్కిన ప్రముఖ హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు | Actress Ahaana Krishna tied the knot with cinematographer Nimish Ravi | Sakshi
Sakshi News home page

Ahaana Krishna: పెళ్లి పీటలెక్కిన హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు

Sep 15 2026 8:29 PM | Updated on Sep 15 2026 8:52 PM

Actress Ahaana Krishna tied the knot with cinematographer Nimish Ravi

ప్రముఖ మలయాళ బ్యూటీ అహానా కృష్ణ పెళ్లి పీటలెక్కింది. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవిని ఆమె పెళ్లాడింది.  వీరిద్దరి వివాహా వేడుక కేరళ కోవలంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో గ్రాండ్‌గా జరిగింది.  ఈ పెళ్లి ఫోటోలను అహానా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో హీరో దుల్కర్ సల్మాన్,  సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్  సందడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా.. రాజీవ్ రవి దర్శకత్వం వహించిన 'నాన్ స్టీవ్ లోప్స్' చిత్రంతో అహానా కృష్ణ హీరోయిన్‌గా పరిచయమయ్యారు. అంతేకాకుండా అహానా బీజేపీ నాయకుడు, నటుడు జి. కృష్ణకుమార్ కుమార్తె కావడం విశేషం. ఆమె నటించిన తొలి చిత్రానికి నిమిషా రవి సహాయ కెమెరామెన్‌గా పనిచేశారు. అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అహానా నటించిన'లూకా'మూవీకి సైతం నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌లలో ఒకరిగా నిమిష్ రవి గుర్తింపు తెచ్చుకున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement