breaking news
Ahaana Krishna
-
30లోకి ఎంటరైన హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ
మలయాళ బ్యూటీ అహానా కృష్ణ (Ahaana Krishna) తన పుట్టినరోజు (అక్టోబర్ 13)కు కొత్త కారును ఇంటికి తెచ్చేసుకుంది. BMW X5 మోడల్ కారు కొనాలన్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకుంది. తనకు తానే ఈ లగ్జరీ కారును గిఫ్ట్ ఇచ్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 20's నుంచి 30'sలోకి అడుగుపెడుతున్నందుకు కొంత బాధగా ఉంది. ఏదేమైనా 30 ఏళ్ల వయసుకు హాయ్ చెప్పేందుకు రెడీ అయ్యాను. హీరో సలహాతో..ఇప్పటివరకు నేనేం చేయాలి? ఏం చేయకూడదు? అని ఆంక్షలు విధించని అమ్మానాన్నకు థాంక్యూ. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా బతకనిచ్చే స్వేచ్ఛ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఏదీ కోరుకోకపోయినా అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. అందుకు ఈ ప్రపంచానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఎలాంటి కారు కొనాలి? ఏదైతే బాగుంటుంది? అని దుల్కర్ సల్మాన్ సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాతే అహానా ఈ కారు కొనుగోలు చేయడం విశేషం. ఈ కారు ధర రూ.95 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.సినిమాఅహానా కెరీర్ విషయానికి వస్తే.. గృహప్రవేశం అనే సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. తండ్రితో కలిసి ఓ సీరియల్ కూడా చేసింది. ఎంజన్ స్టీవ్ లోపేజ్ (2014) అనే మలయాళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. పదినెట్టం పడి, ఆడి, నాన్సీ రాణి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. చివరగా కొత్త లోక: చాప్టర్ 1 మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) చదవండి: వివాదాలతో సతమతం.. అప్పుడే ఫుల్స్టాప్ అంటున్న హన్సిక -
దుబాయ్లో చిల్ అవుతున్న బర్త్డే గాళ్ (ఫొటోలు)
-
నెచ్చెలులతో మల్లు బ్యూటీ ‘అహనా కృష్ణ’ ఊయల ఉల్లాసం (ఫొటొలు)