ప్రియుడితో పెళ్లి.. మెసేజ్‌ పెట్టిందన్న హీరోయిన్‌ తండ్రి | Ahaana Krishna Father Reveals Interesting Things About His Daughter Marriage Plans, Read Story Inside | Sakshi
Sakshi News home page

ప్రియుడితో పెళ్లి ప్లానింగ్‌.. మెసేజ్‌ చేస్తే తెలిసిందన్న హీరోయిన్‌ తండ్రి

Mar 16 2026 12:07 PM | Updated on Mar 16 2026 12:27 PM

Ahaana Krishna Father Reveals Daughter Sent Message about Wedding Plans

మలయాళ హీరోయిన్‌ అహానా కృష్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రియుడు నిమిష్‌ రవితో ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి, నటుడు కృష్ణ కుమార్‌ ధ్రువీకరించాడు. వెరైటీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతురి పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

మా ఇంటిక్కూడా..
అతడు మాట్లాడుతూ.. అహానా పెళ్లి చేసుకుంటానని నాకు మెసేజ్‌ పెట్టింది. ఆ అబ్బాయిని మాకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చి వెళ్తుంటాడు. నేను కుర్రవయసులో ఉన్నప్పుడు కూడా అచ్చం నా కూతురిలాగే ఉండేవాడిని. ఏమాత్రం మొహమాటం లేకుండా నా భార్య సింధును పెళ్లికి ముందే ఇంటికి తీసుకెళ్లేవాడిని. దానివల్ల నేనెవర్ని పెళ్లి చేసుకోబోతున్నాను? వాళ్లు ఎలాంటివాళ్లు? అనేది అందరికీ ముందే తెలుస్తుంది. ఏ టెన్షన్‌ లేకుండా పెళ్లి ప్రశాంతంగా సాగిపోతుంది.

30 ఏళ్లుగా తెలుసు
నిమిష్‌ తండ్రి, నిర్మాత రవి నాకు 30 ఏళ్లుగా తెలుసు. వాళ్ల కుటుంబంలో ఏ అవసరం వచ్చినా నేను చనువుతో సలహాలు ఇస్తుంటాను. అహానా, నిమిష్‌ ఓ షార్ట్‌ ఫిలింలో కలిసి పని చేసినప్పుడు అతడిని కలిశాను. తను చాలా సింపుల్‌గా ఉంటాడు. అతడి ఎదుగుదల చూస్తుంటే ముచ్చటేస్తేంటుంది. అతడి తండ్రికి ఎన్నో కలలుండేవి. సినిమాకోసం ఎంతో ఖర్చుపెట్టాడు.. ఈ క్రమంలో చాలా కోల్పోయాడు. కానీ దేవుడు అతడి త్యాగాలకు.. పిల్లల రూపంలో ప్రతిఫలాన్ని ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు.

సినిమా
కాగా అహానా కృష్ణ సినిమాటోగ్రాఫర్‌ నిమిష్‌ రవితో ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అహానా తండ్రి మాటల్ని బట్టి వీరిద్దరూ తమ ప్రేమను నెక్స్ట్‌ స్టెప్‌కు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి! నిమిష్‌ రవి.. చివరగా లోక:చాప్టర్‌ 1 సినిమాతో పెద్ద హిట్‌ అందుకున్నాడు. అహానా.. ఎంజన్‌, స్టీవ్‌ లోపెజ్‌, లూకా, పతినేట్టం పది, ఆడి, నాన్సీ రాణి వంటి మలయాళ చిత్రాలతో గుర్తింపు పొందింది.

చదవండి: ఆస్కార్‌ గెలిచిన సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement