ట్రైన్ పొడవంతా సినిమా టైటిల్.. ట్రైలర్ చూశారా? | Ee Paata Korinavaaru Telugu Movie Trailer out now | Sakshi
Sakshi News home page

Ee Paata Korinavaaru Trailer: ట్రైన్ పొడవంతా సినిమా టైటిల్.. ట్రైలర్ చూశారా?

Sep 15 2026 7:31 PM | Updated on Sep 15 2026 8:13 PM

Ee Paata Korinavaaru Telugu Movie Trailer out now

ఒక సినిమా టైటిల్ మహా ‍‍అయితే పదక్షరాల లోపే ఉంటుంది. లేదంటే ఓ పదిహేను అక్షరాల వరకు కూడా ఉండొచ్చు. ఇదేంటి ఏకంగా ఒక లైన్ అంతా టైటిల్ పెట్టేశారు. ఒక సినిమాకు ఇంత పెద్ద టైటిల్ కూడా పెడతారా అనే సస్పెన్స్‌కు తెరదించారు వీళ్లు. మొత్తానికి ఇలా కూడా టైటిల్ పెడతారా అనే చర్చకు తెరతీశారు. 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు' అంటూ ట్రైన్ పొడవంతా  అతిపెద్ద టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ అనిల్‌ రావిపూడి  చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల చేశారు. టైటిల్ పొడవు చాలదన్నట్లు 'ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా' అనే ఉపశీర్షిక కూడా పెట్టారు. ఈ మూవీకి చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న సినిమాగా రికార్డ్ సృష్టించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబర్ 18న విడుదల కానుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement