బిగ్‌బాస్ సీజన్-10లో నామినేషన్ కారణంగా చైత్ర ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా నరేశ్ చేసిన వ్యాఖ్యలపై చైత్ర స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే వెలిశారు
చైత్రను ప్రస్తావిస్తూ.. నిన్నటి ఎపిసోడ్‌లో నరేశ్.. షాలినీ ఎలిమినేషన్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో చైత్రను ప్రస్తావిస్తూ ఆమెతో జరిగిన గొడవను గుర్తు చేశాడు. ‘ఆ రోజు చైత్రకు సారీ చెప్పాల్సింది పోయి.. తిరిగి ఆమెనే నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పేలా చేశావు. అది సరైనది కాదు’ అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
మీమ్ రూపంలో.. ఈ క్లిప్‌ను చైత్ర తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మీమ్ రూపంలో షేర్ చేసింది. అంతేకాకుండా నరేశ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ‘బాగా చెప్పాడు’ అంటూ తన రియాక్షన్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో చైత్ర, షాలినీ మధ్య ఓ విషయంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైత్రనే షాలినీకి సారీ చెప్పింది. ఈ పరిణామంతో ఆమె హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే ఘటనను నరేశ్ ప్రస్తావించడంతో.. చైత్ర ఈ క్లిప్‌ను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.


