అడుగుపెట్టగానే ఫేమస్‌.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? | Who Is Debjani Modak The Bigg Boss Telugu 10 Contestant Winning Hearts With Her Unique Style | Sakshi
Sakshi News home page

Debjani Modak: తెలుగు యాసతో కట్టిపడేస్తున్న దేబ్జానీ ఎవరంటే..?

Sep 14 2026 1:03 PM | Updated on Sep 14 2026 1:31 PM

Who Is Debjani Modak The Bigg Boss Telugu 10 Contestant Winning Hearts With Her Unique Style

బిగ్‌బాస్‌ సీజన్‌10లో కంటెస్టెంట్ల ఆట ఒకవైపు ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు కొందరి మాటతీరు.. ప్రవర్తన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి వారిలో దేబ్జానీ మోదక్‌ ఒకరు.  బెంగాలీ నేపథ్యంలో నుంచి వచ్చిన ఆమె తెలుగులో మాట్లాడే విధానం.. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, తనదైన శైలిలో స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా  హౌస్‌లో అందరితో మాట్లాడే మాటలు, తోటి కంటెస్టెంట్లతో కలిసిపోయే విధానం హౌస్‌మేట్స్‌కే కాకుండా బయట ప్రేక్షకులకూ ముచ్చటగా అనిపిస్తోంది. మరి ఆమె కోసం కొన్ని ముచ్చటైన విషయాలు తెలుసుకుందామా..!

దేబ్జానీ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్బా మోదక్‌ వ్యాపారవేత్త.. తల్లి మితా మోదక్‌ గృహిణి.  ఈమెకు నందిని మోదక్‌ అనే చెల్లెలు ఉంది. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి లేదు. అనుకోకుండా ఓ సీరియల్‌లో అవకాశం రావడంతో అలా బుల్లితెరపై అడుగుపెట్టి బెంగాలీ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.

ఎన్నెన్నో జన్మల బంధంతో గుర్తింపు...
తెలుగులో బేబ్జానీకి మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్‌ ‘ఎన్నెన్నో జన్మల బంధం’.  ఈ సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అప్పట్లో ఈమె.. తన నటన, మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?

బిగ్‌బాస్‌లో ఫస్ట్‌ కంటెస్టెంట్‌గా..
ఇప్పుడు అదే గుర్తింపుతో బిగ్‌బాస్‌ సీజన్‌10లో ఫస్ట్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి తన మాటలతో అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ఇప్పటి ప్రేక్షకులకూ దగ్గరవుతున్నారు.

బిగ్‌బాస్‌లో ప్రపోజల్‌ హింట్‌..
బిగ్‌బాస్‌లో తొలివారం బేబ్జానీ పేరే హైలెట్‌గా నిలిచింది. ఆమె ఆడే తీరు అలాంటిది మరి. అయితే బిగ్‌బాస్‌లో ఓ కంటెస్టెంట్‌ అంటే కూడా చాలా ఇష్టమని తన మాటల్లోనే చెప్పింది. ‘ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న ముకేశ్‌ అంటే  నాకు చాలా ఇష్టం. ముకేశ్‌ అందరితో పులహారి కలుపుతాడని కానీ నా దగ్గరకు మాత్రం రావడం లేదు. అందుకే ఈ విషయం అతనితో చెప్పలేకపోయా. నీక కాఫీ అంటే ఎంత ఇష్టమో అతను అంటే కూడా అంతే ఇష్టం. అతని కళ్లు కూడా చాలా బాగుంటాయి’ అని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఓ సందర్భంలో తన మనసులోని మాటను బయటపెట్టింది దేబ్జానీ. 
ఇదీ చదవండి: బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో పరిస్థితేంటి?

అంతే కాకుండా తాను ఆరో తరగతి తొలసారి ఫైయిల్‌ కావడంతో రెండు సార్లు చదవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే నిజంగానే అతనంటే ఇష్టమా లేక గేమ్‌ కోసం చెప్పిందా అని సందిగ్దత నెలకొంది. ఏదీఏమైనప్పటికీ ఈ బిగ్‌బాస్‌లో దేబ్జానీ జర్నీ ఎంతవరకు సాగుతుంది?. ఈ సారి కప్‌ ఈమె కొడుతుందో లేదో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement