కళ్లుచెదిరేలా సీక్వెల్.. నయనతార 'మహాశక్తి' టీజర్ రిలీజ్ | Nayanthara Mahasakthi Movie Teaser | Sakshi
Sakshi News home page

Mahasakthi-Nayanthara: మరోసారి అమ్మవారిగా నయన్.. టీజర్ చూశారా?

Sep 14 2026 10:25 AM | Updated on Sep 14 2026 10:31 AM

Nayanthara Mahasakthi Movie Teaser

ఆరేళ్ల క్రితం అంటే లాక్ డౌన్ టైంలో వచ్చిన ఓ తమిళ సినిమా 'మూకుతి అమ్మన్'. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించి, లీడ్ రోల్ చేశాడు. ఇందులో అమ్మవారిగా నయనతార నటించింది. అప్పట్లో ఇది చిన్న చిత్రం. ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంది. చాన్నాళ్ల క్రితం దీని సీక్వెల్ మొదలుపెట్టారు. సుందర్.సి దర్శకుడు. వినాయక చవితి సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'విశ్వంభర' బండి కదిలింది)

ఐసరి గణేశన్‌, నయనతార సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌కి తెలుగులో 'మహాశక్తి' టైటిల్ నిర్ణయించారు. ఈ నవంబరు 06న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తొలి పార్ట్ ఓ మాదిరిగానే తీసినప్పటికీ ఈసారి మాత్రం కళ్లుచెదిరేంత భారీ కథతో వస్తున్నారు.

రిలీజైన టీజర్ బట్టి చూస్తే.. పలువురు దుండగుల బారినుంచి ఓ రాజకుమారుడిని రక్షించుకునేందుకు అతడి తల్లి.. అమ్మవారికి తనని తాను అర్పించుకుంటుంది. దీంతో మహాకాళిగా నయనతార సాక్షాత్కరిస్తుంది. తర్వాత జరిగే శత్రు సంహారమే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. తెలుగు నటుడు సునీల్, రెజీనా, కన్నడ నటుడు దునియా విజయ్ ఇందులో కీలక పాత్రలు చేశారు.

ఇకపోతే ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో దక్షిణాది, హిందీ భాషల్లో మూవీస్ చేసిన నయన్.. ఈసారి మాత్రం సోలోగా పాన్ ఇండియా స్థాయిలో రాబోతుంది. మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement