విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ టీజర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది | Vijay Deverakonda Ranabaali Movie Teaser Out On September 9 | Sakshi
Sakshi News home page

‘రణబాలి’ టీజర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

Sep 7 2026 5:41 PM | Updated on Sep 7 2026 5:51 PM

Vijay Deverakonda Ranabaali Movie Teaser Out On September 9

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకుడు. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్‌ 16 ఈ సినిమా విడుదల  కానుంది.  ఈ క్రమంలో సెప్టెంబర్‌ 9న టీజర్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇదీ చదవండి: సాయిబాబాపై సినిమా.. రిలీజ్‌ డేట్‌ ఇదే..

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్‌కి మంచి స్పందన  వచ్చింది.  ఈ చిత్రం బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్‌ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్‌, అతుల్‌ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement