తెరపైనా అదరగొడుతున్న ‘మిర్జాపూర్‌’.. కలెక్షన్లు ఎంతంటే.? | Mirzapur The Movie Box Office Collections Day3 | Sakshi
Sakshi News home page

Mirzapur The Movie: ‘మిర్జాపూర్‌: ది మూవీ’ మూడో రోజు కలెక్షన్లు ఎంతంటే.?

Sep 7 2026 3:12 PM | Updated on Sep 7 2026 4:04 PM

Mirzapur The Movie Box Office Collections Day3

పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు, రవి కిషన్‌ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘మిర్జాపూర్‌:ది మూవీ’. ఓటీటీలో ‘మిర్జాపూర్‌’ వెబ్‌సిరీస్‌​​కు మంచి ఆదరణ రావడంతో అదే పేరుతో మరో కొత్త కథతో తెరపైకీ తీసుకొచ్చారు. ఇప్పుడీ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపుతోంది. తొలి రోజు నుంచే మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. ఆదివారం మరింత జోరు చూపించింది. మూడో రోజు ఏకంగా రూ. 36 కోట్ల నెట్‌ వసూళ్లూ సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 
ఎక్కువమంది చదివింది: ‘హనుమాన్‌ అంశ్‌’ కి తగ్గని క్రేజ్‌.. పంచెకట్టుతో విద్యార్థులు

రూ.100 కోట్లకు చేరువలో..
గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం రూ.25.75 కోట్లతో బోణీ కొట్టింది. శనివారం అదే జోరులో కలెక్షన్లు మరింత పెరిగి రూ. 32 కోట్లకు చేరాయి.  ఆదివారం వచ్చే సరికి ఈ చిత్రం రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ సినిమా నెట్‌ కలెక్షన్లు సుమారు రూ. 93.75 కోట్లకు చేరాయి. ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేందుకు దాదాపు రూ.6 కోట్ల దూరంలోనే ఉంది.
ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?

ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లు
ఈ చిత్రం.. ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతోంది. సాక్‌నిల్క్‌(గణాంకాల నివేదిక) ప్రకారం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.132.35 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. ఇందులో దాదాపు రూ.20 కోట్లు ఓవర్సీస్‌ మార్కెట్‌ నుంచి వచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement