51 ఏళ్ల హీరోయిన్‌తో టీమిండియా స్టార్‌ డేటింగ్‌?! | Ameesha Patel Reacts To Dating Rumours With Hardik Pandya Video Goes Viral, Says We Are Just Friends | Sakshi
Sakshi News home page

‘నీకు ఒక్క అమ్మాయితోనూ స్నేహం లేదేమో.. అందుకే ఇలా’

Sep 7 2026 11:25 AM | Updated on Sep 7 2026 12:04 PM

Surely dont have girl: Ameesha Patel Slams dating rumours Hardik Pandya

PC: Instagram

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. వరుస గాయాల కారణంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో అతడు చాన్నాళ్లుగా పునరావాసం పొందుతున్నాడు. ఈ క్రమంలో ముంబై నుంచి కొంతకాలం పాటు బెంగళూరుకు పూర్తిగా మకాం మార్చాడనే వార్తలు వచ్చాయి.

ముందుగా నటాషా
ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెర్బియా మోడల్‌ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించిన ఈ బరోడా ప్లేయర్‌.. పెళ్లికి ముందే తండ్రయ్యాడు. ఆ తర్వాత కుమారుడు అగస్త్య సమక్షంలో హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయ పద్ధతుల్లో హార్దిక్‌- నటాషా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం మహీకతో రిలేషన్‌షిప్‌
అయితే, కొంతకాలానికే తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు హార్దిక్‌- నటాషా ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో హార్దిక్‌ అభిమానులు నటాషాపై సోషల్‌ మీడియా వేదికగా విద్వేష విషం చిమ్మారు. డబ్బు కోసమే ప్రేమ, పిల్లాడు, పెళ్లి అంటూ ఆమెను అవమానించారు.

ఇక నటాషాతో విడిపోయిన కొన్ని నెలల వ్యవధిలోనే మరో మోడల్‌ మహీక శర్మతో ప్రేమలో ఉన్నట్లు హార్దిక్‌ పాండ్యా ప్రకటించాడు. ఇద్దరూ వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు విడుదల చేశాడు. దీంతో నటాషాపై కాస్త ట్రోలింగ్‌ తగ్గి.. ఈసారి మహీకను టార్గెట్‌ చేశారు చాలామంది. అయినా వీరి బంధం ఇప్పటి వరకైతే సజావుగా కొనసాగుతోంది.

51 ఏళ్ల హీరోయిన్‌తో డేటింగ్‌ అంటూ
ఇలాంటి తరుణంలో 32 ఏళ్ల  హార్దిక్‌ పాండ్యా... తాజాగా 51 ఏళ్ల బాలీవుడ్‌ హీరోయిన్‌ అమీషా పటేల్‌తో డేటింగ్‌ చేస్తున్నాడనే వదంతులు వ్యాపించాయి. తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌లో హార్దిక్‌- అమీషా కలిసి కనిపించడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

నిజమే రొమాంటిక్‌గానే చేయి వేశాను
ఈ నేపథ్యంలో ఓ సోషల్‌ మీడియా యూజర్‌.. ‘‘హార్దిక్‌ పాండ్యా భుజం మీద అమీషా పటేల్‌ చేయి వేసిన తీరు చూస్తుంటే రెడిట్‌ రూమర్లు నిజమే అనిపిస్తోంది’’ అంటూ వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారనే అర్థంలో కామెంట్‌ చేశాడు. ఇందుకు అమీషా పటేల్‌ గట్టిగానే బదులిచ్చింది.

సదరు యూజర్‌ పోస్టును తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘‘అవును అది నిజమే యార్‌!! (వ్యంగ్యంగా).. నేను రొమాంటిక్‌గానే అతడిపై చేయి వేశాను కదా!.. నాకు తెలిసి నీతో కనీసం ఒక్క అమ్మాయి కూడా స్నేహం చేసి ఉండదేమో!..

ఇలాంటి చెత్త పోస్ట్‌ చేసేముందు కనీసం ఒక్క అమ్మాయితోనైనా స్నేహం పెంచుకో.. అప్పుడే నీకు అన్నీ అర్థమవుతాయి’’ అంటూ అమీషా పటేల్‌ ఘాటుగా స్పందించింది. తద్వారా తాము స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేసింది.

చదవండి: ‘అందమైన సాయంత్రం.. చెన్నైలో మాకు మరో కుటుంబం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement