Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి | Mexico Fireworks Blast 10 Killed, 64 Injured | Sakshi
Sakshi News home page

Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి

Sep 7 2026 10:04 AM | Updated on Sep 7 2026 10:16 AM

Mexico Fireworks Blast 10 Killed, 64 Injured

మెక్సికో: మతపరమైన వేడుకల్లో బాణసంచా సామగ్రికి నిప్పంటుకుని పేలుడు సంభవించిన ఘటనలో 10 మంది మృతిచెందగా, మరో 64 మంది గాయపడ్డారు. మెక్సికోలోని తేమాస్కాల్సింగో పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.

శనివారం రాత్రి తేమాస్కాల్సింగోలోని ‘నుయెస్ట్రా సెనోరా డె లా లూజ్’ చర్చి సమీపంలో ఈ పేలుడు జరిగింది. మతపరమైన వేడుకల్లో భాగంగా బాణసంచా ప్రదర్శనను వీక్షించేందుకు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చిన వీడియోల్లో శిథిలాల మధ్య ప్రాణాలతో ఉన్నవారి కోసం స్థానికులు గాలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

తేమాస్కాల్సింగో పట్టణ జనాభా సుమారు 66,000. ఇది మెక్సికో సిటీకి వాయవ్య దిశలో సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మెక్సికో రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. మెక్సికోలో మతపరమైన వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో బాణసంచా వినియోగం సాధారణం. ఇలాంటి వేడుకల సమయంలో పేలుడు ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. నాలుగేళ్ల క్రితం హిడాల్గో రాష్ట్రంలోని హ్యూహుట్లా మున్సిపాలిటీ పరిధిలోని ఓ గ్రామంలో బాణసంచా కారణంగా సంభవించిన భారీ పేలుడులో 17 మంది గాయపడ్డారు.

ఇది కూడా చడవండి: కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement