అంతులేని వెతుకులాట  | Rescue Operations Continue In Nepal Amid Deadly Flash Floods | Sakshi
Sakshi News home page

అంతులేని వెతుకులాట 

Sep 7 2026 5:58 AM | Updated on Sep 7 2026 6:38 AM

Rescue Operations Continue In Nepal Amid Deadly Flash Floods

నేపాల్‌లో కొనసాగుతున్న అన్వేషణ  

కఠ్మాండు:  నేపాల్‌లో ఆకస్మిక వరదలు ముంచెత్తి 11 రోజులు గడిచిపోయాయి. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల గుర్తింపులో అధికారులు ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలిస్తూనే ఉన్నాయి. మృతుల సంఖ్య దాదాపు 1,400కు చేరుకుంది. 589 మంది విదేశీయులు సహా 5 వేల మందికిపైగా గల్లంతయ్యారు.  

నేపాల్‌ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్‌ ఆదివారం సహాయక, పునరావాస చర్యలపై చర్చించారు.  మరోవైపు బాధిత మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. ఆకలితో ఉన్న తమ బిడ్డలకు ఆహారం అందించలేకపోతున్నామని చెబుతున్నారు. తల్లులు పాలివ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. సమస్య తలెత్తితే ఆసుపత్రికి ఎలా వెళ్లాలనే దానిపై గర్భిణిలు ఆందోళన చెందుతున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement