విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి! | Jharkhand Minister Sudivya Kumar Sonu dies of cardiac arrest | Sakshi
Sakshi News home page

విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి!

Sep 6 2026 7:58 AM | Updated on Sep 6 2026 8:02 AM

Jharkhand Minister Sudivya Kumar Sonu dies of cardiac arrest

రాంచీ: జార్ఖండ్‌ రాజకీయాల్లో విషాదకర చోటుచేసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖ మంత్రి, జేఎంఎం సీనియర్‌ నేత సుదివ్య కుమార్‌ సోను (56) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గిరిడీహ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

సుదివ్య సోను గిరిడీహ్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)లో కీలక నేతగా కొనసాగుతున్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై సీఎం హేమంత్‌ సోరేన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మృతి జేఎంఎం కుటుంబానికి, జార్ఖండ్‌ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదివ్య సోను సేవలు, పార్టీకి చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరోవైపు.. జేఎంఎం నేత, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి దీపక్‌ బిరువా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదివ్య సోను ఆరోగ్యం గత రాత్రి అకస్మాత్తుగా క్షీణించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిపారు. జేఎంఎం కుటుంబానికి ఇది తీరని లోటని పేర్కొంటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు.

ఇదీ చదవండి: లోహగడ్‌ కోట.. కేతన్‌ హత్యలో మరో షాకింగ్‌ ట్విస్ట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement