రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్‌ జాబ్‌ ఎంచుకున్న టెకీ | From Amazon to Indian Army Engineer Leaves Rs 46 Lakh Package for his dream job | Sakshi
Sakshi News home page

రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్‌ జాబ్‌ ఎంచుకున్న టెకీ

Sep 5 2026 3:57 PM | Updated on Sep 5 2026 4:05 PM

From Amazon to Indian Army Engineer Leaves Rs 46 Lakh Package  for his dream job

ప్రముఖ  గ్లోబల్‌ టెక్‌ కంపెనీలో ఉద్యోగం. లక్షల్లొ జీతం. సౌకర్యవంతమైన జీవితం.  సాధారణంగా చాలా మంది నిపుణులు  తమ కెరీర్‌లో ఒక మైలురాయిగా భావిస్తారు. కానీ  లక్నోకు చెందిన 27 ఏళ్ల శారదేందు తివారీ తీసుకున్న నిర్ణయం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలుస్తోంది.   తండ్రిని ప్రేరణగా తీసుకొని  మరీ తీసుకున్న  తివారి సంచనల నిర్ణయం గురించి తెలుసుకోవాలంటే ఈ  కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

శారదేందు  తివారీ  అమెజాన్‌లో క్లౌడ్ ఇంజినీర్‌గా ఏడాదికి సుమారు రూ.46 లక్షల ప్యాకేజీతో పనిచేసేవారు.  అయితే చాలా సౌకర్యవంతమైన కార్పొరేట్ జీతాన్ని వదులుకుని త్వరలో భారత ఆర్మీలో ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. శనివారం గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో పాసింగ్ అవుట్ పరేడ్ తన ప్రతిభను చాటుకున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులలో ఒకటైన సీనియర్ అండర్ ఆఫీసర్ (SUO)గా   ఎంపికయ్యారు.

ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్‌బస్‌లోనూ పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ , చిన్ననాటి నుంచి ఉన్న సైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకునేందుకు  చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నారట తివారీ. శర్దేందు తివారీ ఆర్మీ యూనిఫామ్ ధరించాలనే నిర్ణయానికి ఆయన కుటుంబ నేపథ్యమే కారణం. తండ్రి రాజ్ కుమార్ తివారీ ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో ఆనరరీ కెప్టెన్‌గా 36 ఏళ్ల పాటు దేశసేవ చేసి రిటైర్ అయ్యారు. తండ్రి సేవలను చిన్నప్పటి నుంచి చూసిన శారదేందుకు మిలిటరీలో చేరాలనే బలమైన కోరిక   ఉండేది.

శారదేందు తివారీది ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలోని పిపర్‌గావ్. అయితే వారి కుటుంబం లక్నోలోని నీల్‌మథ ప్రాంతంలో స్థిరపడింది. పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్ (చండీగఢ్) నుంచి ఐటీలో  ఇంజనీరింగ్‌,  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎం.టెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ తర్వాత, రూ. 46 లక్షల వార్షిక ప్యాకేజీతో అమెజాన్‌లో క్లౌడ్ ఇంజనీర్‌గా చేరారు.  కానీ ఆర్మీలో చేరాలన్న కోరిక మాత్రం నిరంతరం  మదిలో మెదులుతూనే ఉండది.  ఫలితంగా ఆర్మీ సెలెక్షన్ ప్రక్రియ కోసం ఆయన 8 సార్లు ప్రయత్నించారు. ఓటమికి కుంగిపోకుండా పట్టుదలతో శ్రమించి 'టెక్నికల్ రూట్' ద్వారా ఆర్మీకి సేవల చేయాలన్న కలను సాకారం చేసుకున్నారు. ఆర్మీ ఇచ్చే సాహసం, నాయకత్వ లక్షణాలు, దేశసేవ చేసే అవకాశం తనను ఆకర్షించాయనిశారదేందు తెలిపారు.

ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు

షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) శిక్షణ పూర్తి చేసిన తర్వాత, 219 మంది పురుషులు,35 మంది మహిళలతో సహా మొత్తం 254 మంది క్యాడెట్లు కమిషన్ పొందనున్నారు. వియత్నాం పీపుల్స్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ లే వాన్ హోయాంగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్‌ వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement