ఎయిర్‌హోస్ట్‌ నుంచి హీరోయిన్‌గా.. ఇదే రాశీ సింగ్‌ సక్సెస్‌ జర్నీ | Rashi Singh Opens Up About Her industry Journey | Sakshi
Sakshi News home page

Rashi Singh: ఎయిర్‌హోస్ట్‌ నుంచి హీరోయిన్‌గా.. తన మాటల్లోనే..

Sep 4 2026 12:13 PM | Updated on Sep 4 2026 12:44 PM

Rashi Singh Opens Up About Her industry Journey

ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం.. మంచి జీతం. తన తల్లి కల కోసం సినిమాలవైపు వచ్చింది. నటనపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు వచ్చింది యువ హీరోయిన్‌ రాశీ సింగ్‌. ‘శశి’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో మరోసారి వెండి తెరపై కనిపించింది. ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఈ భామ తన కెరీర్‌ విశేషాలను వెల్లడించింది. తన మాటల్లోనే..

‘చిన్నప్పటి నుంచి నటిని కావాలని నిర్ణయించుకున్నా. నిజానికి మా అమ్మకు కూడా నటి కావాలనే కోరిక ఉండేది. కానీ కొన్ని కారణాల కాలేకపోయారు. ఆమె కల కోసం నన్ను ఇలా ప్రోత్సాహించారు. ఇప్పుడు నాలో ఆమెను చూసుకుంటున్నారు.

గతంలో ఓ ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్ట్‌గా పనిచేశా.  ఆ ఉద్యోగం బాగానే ఉన్నప్పటికీ నా మనసంతా సినిమాల పైనే ఉండేది. అందుకే ఉద్యోగాన్ని వదిలేశా. తర్వాత మోడలింగ్‌ చేయడంతో పాటు కొన్ని ప్రకటనల్లో నటించా. గాడ్‌ఫాదర్‌ లేకపోవడంతో చాలా విషయాల్లో కష్టపడాల్సి వచ్చేది. అయితే ఆ శ్రమకు ఇప్పుడు ప్రతిఫలం దక్కింది.

ఇదీ చదవండి: ‘ఓటీటీలు సోమరిపోతుల కోసమే’

నాకు కెమెరా అంటే భయం ఉండేది కాదు. షూటిం​గ్‌ టైమ్‌లో నటనకు సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకున్నా. యాడ్స్‌లో పనిచేయడం కూడా కలిసొచ్చింది. మోడలింగ్‌ ద్వారా చాలామందిని కలుసుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాలకు ఆడిషన్స్‌ ఇవ్వడం మొదలు పెట్టా.


ఎక్కువ మంది చదివింది: రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి​ : అల్లరి నరేష్‌

సినిమాలో నేను పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల నన్ను గుర్తుపట్టుకోవాలి. అందుకే తొందరపడకుండా  కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నా. కథ విన్నాకే నిర్ణయం తీసుకుంటా.  పరిశ్రమలో గుర్తుండుపోయే పాత్రలు చేయాలనేదే నా కోరిక’ అని రాశి సింగ్‌ ఓ ఇంటర్వ్యులో వెల్లడించారు. 

ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement