త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం లండన్ లో ప్రారంభమైంది. కరుప్పు వంటి హిట్ చిత్రం తరువాత ఈమె నటించే చిత్రం గురించి రకరకాల ప్రచారం జరిగింది. ఇంకా చెప్పాలంటే త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం వైరల్ అయ్యింది. అలాంటి పలు నిరాధార వార్తల మధ్య త్రిష తన తాజా చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈమెతో పాటు నటి రాధిక శరత్ కుమార్, అపర్ణ బాలమురళీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రాజా కృష్ణ మీనన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ కోలీవుడ్లోకి రంగప్రవేశం చేస్తోంది. లోకోమోటివ్ గ్లోబల్ సంస్థతో కలిసి మనోరమా స్టూడియోస్ సంస్థ తమిళంలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రం డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రం కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతకు ముందు పలు చిత్రాలకు దర్శకత్వం వహించినా, ఈ చిత్రం తనకు కొత్త అనుభవం ఇచ్చిందని దర్శకుడు రాజా కృష్ణ మీనన్ పేర్కొన్నారు.
త్రిష, రాధిక శరత్ కుమార్, అపర్ణ బాలమురళీ వంటి ప్రతిభావంతులైన నటీమణులు, సాంకేతిక వర్గంతో చేస్తున్న చిత్రం ఇది.దీన్ని తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నాం. ఇంకా. పేరు నిర్ణయించిన ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని దర్శకుడు చెప్పారు.


