టాలీవుడ్ రష్మిక ప్రస్తుతం మైసాతో పాటు రణబాలి చిత్రంలోనూ నటిస్తున్నారు. పెళ్లి తర్వాత విజయ్, రష్ జంటగా నటిస్తోన్న చిత్రం రణబాలి కావడం విశేషం. అయితే ఇటీవల రష్మికకు తుంటి గాయమైంది. ఆ తర్వాత షూటింగ్‌లకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో తనతో విజయ్ దేవరకొండ ఎక్కువ సమయం ఉన్నారని తెలిపింది. పెళ్లి తర్వాత కంటే గాయం అయ్యాకే మాకు ఎక్కువ సమయం దొరికిందని చెప్పుకొచ్చింది.
షూటింగ్స్ బిజీ షెడ్యూల్స్ వల్ల తామిద్దరం ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయలేకపోయామని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ పెళ్లి తర్వాత మూడు నెలల పాటు ఒకరినొకరం చాలా అరుదుగా కలిసేవాళ్లమని తెలిపింది. మా ఇద్దరి సంభాషణ చాలా వరకు ఫోన్ కాల్స్‌కే పరిమితమైందని రష్మిక వెల్లడించింది. అయితే తనను ఇంట్లోనే ఉండేలా చేసిన గాయం.. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని పేర్కొంది. పెళ్లి తర్వాత మేమిద్దరం కలిసి గడిపిన సుదీర్ఘ సమయం కూడా ఇదేనని రష్మిక తెలిపింది.
గాయం కాకుండా ఉంటే.. ఇలాంటి విరామ సమయంలో విజయ్ మరింత సంతోషంగా ఉండేవాడని వెల్లడించింది. ఈ విరామం నిద్రపోవడానికి, చదువుకోవడానికి, పజిల్స్ పరిష్కరించుకోవడానికి.. తన కుటుంబంతో సమయం గడపడానికి కూడా అవకాశం ఇచ్చిందని తెలిపింది. బిజీ షెడ్యూల్‌లోకి వెళ్లాక.. ఇలాంటి ప్రశాంతమైన క్షణాలను తాను మిస్ అవుతానని చెప్పింది. గాయపడినప్పటికీ, తాను నిస్సహాయంగా భావించలేదని రష్మిక చెప్పింది. ఇతరులపై ఆధారపడటం తనకు ఇష్టం లేదని.. తన పనులు తాను చూసుకోగలగడానికే ప్రాధాన్యత ఇస్తానని వివరించింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, తన కుటుంబంతో కలిసి మధురమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది.


