యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తొలిరోజే నెగెటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా.. వసూళ్లపరంగా ఘోరంగా విఫలమైంది. భారీ బడ్జెట్ చిత్రంపై పెట్టుకున్న అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.
ఇండియాలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ.. హాలీవుడ్‌లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం ఇంగ్లీష్ వర్షన్ సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ వర్షన్ రన్‌టైమ్‌లో 2 గంటల 57 నిమిషాలు ఉండనుందని.. ఒరిజనల్ వర్షన్ కంటే 17 నిమిషాలు తక్కువ ఉంటుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ ఆంగ్ల వర్షన్ విదేశాల్లో ఆగస్టు 26న విడుదలైంది. ఈ మూవీ ఇంగ్లీష్ వర్షన్ ఇండియాలో సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.
అయితే ఈ మూవీలోని ఏ సీన్స్ తొలగించారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. తబాహి, మధోశ్ లాంటి పాటలు తొలగించి ఉంటారని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ పాటలను తొలగించారనే వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. థియేటర్లో చూస్తేనే కానీ ఏయే సీన్స్ తొలగించారో ఓ క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.
Toxic: A Fairy Tale for Grown-Ups, in English - one of the languages the film was written and shot in. A shorter cut from the Indian language version. In cinemas from September 4, 2026. 🖤🎭#ToxicTheMovie @TheNameIsYash #Nayanthara @advani_kiara #TaraSutaria @rukminitweets… pic.twitter.com/AkKlV7AwvB
— KVN Productions (@KvnProductions) September 3, 2026


