యువతిపై అత్యాచారానికి యత్నించిన ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌! | Film Distributor Alexander Arrested In Woman Incident | Sakshi
Sakshi News home page

యువతిపై అత్యాచారానికి యత్నించిన ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌!

Sep 3 2026 1:56 PM | Updated on Sep 3 2026 2:06 PM

Film Distributor Alexander Arrested In Woman Incident

టీ.నగర్‌ లాడ్జీలో యువతిపై అత్యాచారానికి యత్నించిన సినిమా డిస్ట్రిబ్యూటర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. చెన్నై చేట్‌పట్‌ ప్రాంతానికి చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్ అలెగ్జాండర్‌ (38). ఇతను టీ.నగర్‌ తిరుమలై పిళ్ళై రోడ్డులోని ఒక ప్రముఖ ప్రైవేట్‌ హోటల్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఘటన జరిగిన రోజు అలెగ్జాండర్‌ స్నేహితుడు జై లాడ్జికి వచ్చాడు. 

అతనితో పాటు ఒక యువతిని కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ యువతిని లాడ్జిలో మాట్లాడుకుంటూ ఉండమని చెప్పి, స్నేహితుడు జై అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో అలెగ్జాండర్‌ అకస్మాత్తుగా ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారానికి యత్నించినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ యువతి తన స్నేహితురాలికి ఫోన్‌ చేసి, ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పి సహాయం కోసం రమ్మని పిలిచింది. 

దీంతో కంగారుపడిన ఆమె స్నేహితురాలు వెంటనే లాడ్జీకి వచ్చి, అలెగ్జాండర్‌ను దీని గురించి నిలదీసింది. దీంతో ఆగ్రహానికి గురైన అలెగ్జాండర్‌ ఆ ఇద్దరు యువతులపై దాడికి యత్నించాడు. దీంతో బాధిత యువతులు విషయాన్ని సామాజిక సంక్షేమ శాఖ అధికారులకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. సామాజిక సంక్షేమ శాఖ అధికారులు పాండి బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి అలెగ్జాండర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా యువతిని లాడ్జికి తీసుకొచ్చిన జై కోసం గాలింపు చేపట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement