అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం | Taapsee Pannu Reveals Why She Would Choose Retirement Over Doing Films She Does Not Like, Read Story Inside | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం

Sep 3 2026 9:13 AM | Updated on Sep 3 2026 9:58 AM

Taapsee Pannu Says She Would Prefer Retiring

కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. ప్రస్తుతం ‘గాంధారి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో వస్తున్న హింస, షాక్‌ వాల్యూతో కూడిన భారీ చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘2015లో వచ్చిన సినిమాలను చూస్తే అది ఒక కలల కాలంలా అనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు కెరీర్‌ ప్రారంభించి ఉంటే..  నాకు అసలు కెరీర్‌ ఉండేది కాదు. ఇప్పుడు వస్తున్న చిత్రాలు అలా ఉన్నాయి. అప్పట్లో నచ్చిన చిత్రాలు చేసే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. 
కొద్ది రోజుల కిందట ఫ్యామిలీతో ఓ సినిమా చూశాను. తర్వాత నేను సినిమాల నుంచి తప్పుకుంటేనే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయడం కంటే రిటైర్‌ అవ్వడమే మేలు. అని తెలిపారు.

ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్‌ ఈమెదే.. ఎంతంటే..?

నచ్చని సినిమాలు చేయలేను..
‘ నా వృత్తి అంటే చాలా ఇష్టం. కానీ అదే పనిని గుడ్డిగా ప్రేమిస్తూ.. నచ్చని  సినిమాలు చేయలేను. మనం చేసిన సినిమాలే ఫిల్మోగ్రఫీని నిర్ణయిస్తాయి. కాలం మారుతుంది. పదేళ్ల తర్వాత ఏదో ఒక కొత్త జానర్‌ రావచ్చు. కానీ చేసిన సినిమాలు మాత్రం అలాగే ఉంటాయి. ఎవరైనా భవిష్యత్తులో నా ఫిల్మోగ్రఫీని చూస్తే.. చేసిన సినిమాల గురించి నాకు కానీ, నాతో కలిసి పనిచేసిన వారికి కానీ ఇబ్బందిగా అనిపించకూడదు. అందుకే ప్రస్తుత ట్రెండ్‌ కంటే నా ఫిల్మోగ్రఫీకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అని తాప్సీ పేర్కొన్నారు.

‘గాంధారి’తో మరోసారి..
తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’కి దేవాశిష్‌ మఖీజా దర్శకత్వం వహించారు. కనికా ధిల్లాన్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మించారు. జాయ్‌పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. తన కుమార్తె అదృశ్యమైన తర్వాత ఓ అంధ తల్లి సాగించే పోరాటం ఆధారంగా తీర్చిదిద్దారు. ఇష్వాక్‌ సింగ్‌, జతిన్‌ సర్నా, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్‌, ఛాయా కదమ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  ఈరోజు (సెప్టెంబర్‌ 3) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 

ఇదీ చదవండి: శ్రీకృష్ణుడిగా రామ్‌ చరణ్‌.. అంత పెద్ద రిస్క్‌ చేస్తాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement