బిగ్‌బాస్‌ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్‌ ఈమెదే.. ఎంతంటే..? | Bigg Boss Telugu Highest Remuneration | Sakshi
Sakshi News home page

Bigboss: బిగ్‌బాస్‌ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్‌ ఈమెదే.. ఎంతంటే..?

Sep 3 2026 7:52 AM | Updated on Sep 3 2026 7:57 AM

Bigg Boss Telugu Highest Remuneration

బిగ్‌బాస్‌ తెలుగు మరో కొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇప్పుడు పదో సీజన్‌ ప్రారంభం అయ్యేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ఆదివారం సెప్టెంబర్‌ 06న  సాయంత్రం ఈ పదో సీజన్‌ ప్రారంభం కానుంది. దీనికీ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.  ఈ సారి ఎవరు ఎంట్రీ ఇస్తారనో అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
ఇప్పటికే పలువురు పేర్లు వినిపించాయి. సినీ సెలబ్రిటీలు, బుల్లితెర సెలబ్రిటీల పేర్లు ఈ కంటెంస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి.  అయితే ఇప్పుడు బిగ్‌బాస్‌ తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకున్న కంటెస్టెంట్‌ ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. 

ఎక్కువమంది చదివింది: ‘బిగ్‌బాస్‌ 10’ డేట్‌ వచ్చేసింది.. కంటెస్టెంట్స్‌ వీళ్లే!

రన్నరప్‌గా నిలిచినప్పటికీ..
బిగ్‌బాస్‌ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకున్న కంటెస్టెంట్‌ ప్రముఖ యాంకర్‌, నటి శ్రీముఖి అని తెలుస్తోంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి శ్రీముఖి.. తన ఆటతీరుతో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుంది. చివరి వరకు ఆమే విన్నర్‌ అనుకున్న ప్రేక్షకులకు ఆ సీజన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచి అందరికి షాక్‌ ఇచ్చాడు. శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. 


అ‍యితే విజేతగా నిలిచిన రాహుల్‌ సిప్లిగంజ్‌ కంటే శ్రీముఖి ఎక్కువగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. రాహుల్‌ 100 రోజులకు గాను రూ.20 లక్షల రెమ్యునరేషన్‌తో పాటు విన్నర్‌ గా ప్రైజ్‌ మని రూ.50 లక్షలు తీసుకున్నాడట. అయితే శ్రీముఖి ఒక్క రెమ్యునరేషనే రూ.80 లక్షల వరకు తీసుకుందట. 100 రోజులకు గాను రోజుకు రూ.80 వేలు వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన విన్నర్‌తో పోల్చుకుంటే శ్రీముఖి 10లక్షలు ఎక్కువగా తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇది బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్‌ అని సమాచారం.

ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?

బిగ్‌బాస్‌ సీజన్‌ 10 విషయానికి వస్తే..
ఈ బిగ్‌ రియాల్టీ షో 10వ సీజన్‌  ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి దశావతారం కాన్సెప్ట్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయనుంది.  కంటెస్టెంట్ల విషయానికి వస్తే..  దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్‌ ఫేం ముఖేష్‌ గౌడ పేర్లు దాదాపు కన్ఫామ్‌ అయ్యాయని సమాచారం. ఇక జబర్దస్త్‌ కమెడియన్స్‌ ఆటో రామ్‌ ప్రసాద్‌, పొట్టి నరేశ్‌, నూకరాజుతో పాటు ఎక్స్‌ప్రెస్‌ హరి పేరు కూడా ఈ సారి బలంగా వినబడుతుంది. వీరితో పాటు యాంకర్‌ వర్షిణి, పల్లవి గౌడ, తేజస్వీని గౌడ, యూట్యూబర్‌ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: రోమాంచకం మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement