పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులకు ‘ఓజీ’ సీక్వెల్ అప్‌డేట్ ఇచ్చాడు దర్శకుడు సుజీత్. ఈ మేరకు బుధవారం ‘ఓజీ యూనివర్స్’ పేరిట ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. అందులో ‘ఓజీ’కి సీక్వెల్‌గా తెరకెక్కించే చిత్రం గురించి పవన్ కల్యాణ్‌తో సుజీత్, సంగీత దర్శకుడు తమన్ చేస్తున్న చర్చలు ఆస్తకి రేపుతున్నాయి. ‘యాన్ ఇండియన్ ఆరిజిన్.. సౌత్‌ఈస్ట్ ఎమోషన్.. వెస్ట్రన్ ప్రెజెంటేషన్..’ అనే మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
From the #OGUniverse
To the #OG…
ALL LOVE for everything so far…
And everything that begins from here :) 🧿🧿♥️♥️
Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk— Sujeeth (@Sujeethsign) September 2, 2026


