నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సినిమా | Gal Gadot The Runner Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

The Runner OTT: హాలీవుడ్ థ్రిల్లర్.. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్

Sep 2 2026 3:07 PM | Updated on Sep 2 2026 3:09 PM

Gal Gadot The Runner Movie OTT Streaming Now

హాలీవుడ్ ప్రముఖ నటి, 'వండర్ ఉమన్' ఫేమ్ గల్ గడోట్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా 'ద రన్నర్'. ఇది ఇ‍ప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజైపోయింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి కెవిన్ మెక్ డొనాల్డ్ దర్శకత్వం వహించాడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)

గల్ గడోట్ 'ద రన్నర్' సినిమా నేటి(సెప్టెంబరు 02) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం లాంటి ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.

'ద రన్నర్' విషయానికొస్తే.. లండన్‌లో కొడుకుతో జీవించే ఓ మహిళ.. ఆ పిల్లాడ్ని ఓ రోజు స్కూల్‌లో దిగబెట్టి వస్తుంది. కానీ కొంతసేపటి తర్వాత కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఒక గంటలో తాను చెప్పిన పనులన్నీ చేస్తేనే కొడుకుని అప్పగిస్తానని ఆమెని బెదిరిస్తాడు. మరి సదరు మహిళ.. కిడ్నాపర్ చెప్పిన పనులన్నీ చేసిందా? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొందనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement