ఓటీటీలో మాధవన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన | GDN Movie OTT Streaming Update | Sakshi
Sakshi News home page

GDN Movie OTT: నెలలోపే స్ట్రీమింగ్.. ఓటీటీ సంస్థ ప్రకటన

Sep 2 2026 12:49 PM | Updated on Sep 2 2026 12:54 PM

GDN Movie OTT Streaming Update

ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వారం ఇప్పటికే 'పళ్లబురుసు' అనే తెలుగు మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. వీకెండ్‌లో కొరియన్ కనకరాజు, డిసి, ఉన్మాదం, గాంధారి, జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇవలా ఉండగానే మరొకటి కూడా రాబోతుందని అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: డైరెక్టర్ లేకుండానే సినిమా.. శ్రీకృష్ణ దేవరాయలుగా సుదీప్)

మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జీడీఎన్'. గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అలియాస్ జీడీ నాయుడు అంటే తమిళనాడులో తెలియనివాళ్లు లేరు. వందేళ్ల క్రితం ద‌క్షిణ భార‌త‌దేశంలో వాణిజ్య, సాంకేతిక విప్లవానికి ఈయన ఆద్యుడు. ఇండియ‌న్ ఎడిస‌న్‌గా పేరుగాంచాడు. తెలుగు మూలాలు ఉన్న నాయుడి జీవితాన్ని 'జీడీఎన్' పేరుతో గత నెల 7న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు నెలలోపే అంటే ఈ శుక్రవారమే (సెప్టెంబరు 04) నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది.

'జీడీఎన్' విషయానికొస్తే.. కోయంబ‌త్తూరులోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన నాయుడు(మాధవన్) పెద్దగా చ‌దువుకోలేదు. డిగ్రీల ‌కంటే అనుభ‌వం , జ్ఞానం ముఖ్యమని ఆయ‌న న‌మ్మకం. ఒక బ్రిటీష‌ర్ ద‌గ్గర రూ.250‌తో మోటర్ సైకిల్ కొనాల‌ని అనుకుంటాడు. కానీ ఆ డ‌బ్బుని రైతు కూలీల‌కి ఇచ్చేస్తాడు. త‌న‌తో పాటు న‌లుగురూ బావుండాల‌నే త‌ప‌న‌. త‌ర్వాత ఒక హోట‌ల్‌లో ప‌నిచేసి డ‌బ్బు సంపాదించి మోట‌ర్ సైకిల్ కొని, అది ఎలా ప‌ని చేస్తుందో తెలుసుకుంటాడు. కొత్త వ‌స్తువులు కనిపెట్టడం ద‌గ్రి నుంచి ఒక బ‌స్సుల కంపెనీ య‌జ‌మాని వ‌ర‌కూ ఎదుగుతాడు.

జ‌ర్మనీ వెళ్లి హిట్లర్‌తో ప్రశంస‌లు పొందుతాడు. ఈ క్రమంలో బ్రిటీష్ వాళ్లు ఒక ఇన్‌క‌మ్‌ట్యాక్స్ అధికారి సాయంతో నాయుడు మీద కుట్రలు చేస్తారు. దేశ‌ద్రోహిగా ముద్ర వేసే ప్రయ‌త్నం చేస్తారు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత కూడా ఆయ‌న్ని వేధించి, ఆస్తుల జ‌ప్తు వ‌ర‌కు తీసుకొస్తారు. ఇవ‌న్నీ జీడీఎన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగ‌తా స్టోరీ.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

SSS

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement