రెండో వీకెండ్ అయిపోయినా సరే ఇంకా 'ఇరుముడి' సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. గతవారం రిలీజైన 'టాక్సిక్' మాత్రం సైలెంట్ అయిపోయింది. ఇక ఈ వారం చాలానే మూవీస్ రాబోతున్నాయి. వాటిలో అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక', సందీప్ రెడ్డి వంగా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 'రోమాంచకం' చిత్రాలు ఉన్నంతలో కాస్త బజ్‌తో విడుదలవుతున్నాయి. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ 'ఐ యామ్ గేమ్', మమిత బైజు 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్', మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ లాంటి మూవీస్ కూడా బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)

మరోవైపు ఓటీటీల్లోనూ 18 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రీసెంట్ హిట్స్ అయిన డిసి, కొరియన్ కనకరాజు, ఉన్మాదం లాంటి చిత్రాలు ఉన్నాయి. అలానే 'జగమే సంగీతం' అనే సిరీస్ కూడా చూడాలనే ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ వీకెండ్ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 06 వరకు)
సన్ నెక్స్ట్
డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 04
అమెజాన్ ప్రైమ్
జగమే సంగీతం (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 04
హాట్‌స్టార్
ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 04
సోనీ లివ్
క్రైమ్ పాట్రోల్ (హిందీ సిరీస్) - ఆగస్టు 31
ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 04
నెట్‌ఫ్లిక్స్
అన్‌టోల్డ్ రేగన్: బ్రేకింగ్ బ్యాడ్లీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 01
జారెడ్ ఫ్రైడ్ (ఇంగ్లీష్ కామెడీ షో) - సెప్టెంబరు 01
1000 ఎల్‌బీ సీజన్ 9 (ఇంగ్లీష్ రియాలిటీ షో) - సెప్టెంబరు 01
లవ్ సిక్ (మెక్సికన్ సిరీస్) - సెప్టెంబరు 02
టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 02
ఫిటో పాయెజ్: ద వరల్డ్ వితిన్ ఏ సాంగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 03
గాంధారి (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03
ద జెంటిల్‌మెన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 03
ధమాల్ 4 (హిందీ మూవీ) - సెప్టెంబరు 04
కొరియన్ కనకరాజు (తెలుగు సినిమా) - సెప్టెంబరు 04
ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 04
టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 04
ఆపిల్ టీవీ ప్లస్
మే డే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 04
(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)


