breaking news
Unmadham Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
రెండో వీకెండ్ అయిపోయినా సరే ఇంకా 'ఇరుముడి' సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. గతవారం రిలీజైన 'టాక్సిక్' మాత్రం సైలెంట్ అయిపోయింది. ఇక ఈ వారం చాలానే మూవీస్ రాబోతున్నాయి. వాటిలో అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక', సందీప్ రెడ్డి వంగా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 'రోమాంచకం' చిత్రాలు ఉన్నంతలో కాస్త బజ్‌తో విడుదలవుతున్నాయి. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ 'ఐ యామ్ గేమ్', మమిత బైజు 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్', మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ లాంటి మూవీస్ కూడా బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)మరోవైపు ఓటీటీల్లోనూ 18 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రీసెంట్ హిట్స్ అయిన డిసి, కొరియన్ కనకరాజు, ఉన్మాదం లాంటి చిత్రాలు ఉన్నాయి. అలానే 'జగమే సంగీతం' అనే సిరీస్ కూడా చూడాలనే ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ వీకెండ్ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 06 వరకు)సన్ నెక్స్ట్డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 04అమెజాన్ ప్రైమ్జగమే సంగీతం (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 04హాట్స్టార్ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 04సోనీ లివ్క్రైమ్ పాట్రోల్ (హిందీ సిరీస్) - ఆగస్టు 31ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 04నెట్ఫ్లిక్స్అన్టోల్డ్ రేగన్: బ్రేకింగ్ బ్యాడ్లీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 01జారెడ్ ఫ్రైడ్ (ఇంగ్లీష్ కామెడీ షో) - సెప్టెంబరు 011000 ఎల్బీ సీజన్ 9 (ఇంగ్లీష్ రియాలిటీ షో) - సెప్టెంబరు 01లవ్ సిక్ (మెక్సికన్ సిరీస్) - సెప్టెంబరు 02టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 02ఫిటో పాయెజ్: ద వరల్డ్ వితిన్ ఏ సాంగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 03గాంధారి (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03ద జెంటిల్మెన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 03ధమాల్ 4 (హిందీ మూవీ) - సెప్టెంబరు 04కొరియన్ కనకరాజు (తెలుగు సినిమా) - సెప్టెంబరు 04ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 04టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 04ఆపిల్ టీవీ ప్లస్మే డే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 04(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సినిమా అనగానే చాలామందికి థ్రిల్లర్సే గుర్తొస్తాయి. అంతలా ఈ జానర్లో మూవీస్ తీస్తుంటారు. ఈ మధ్య కాలంలో అలా వచ్చిన ధృడం, ఉయిర్ లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు మరో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: థియేటర్లలో హిట్.. ఓటీటీకి వచ్చాక ఘోరంగా ట్రోల్స్)కుంచకో బోబన్, పోలీస్‌గా చేసిన సినిమా 'ఉన్మాదం'. 'జై భీమ్' ఫేమ్ లిజోమోల్ జోస్ కథానాయిక. కిరణ్ దాస్ దర్శకుడు. 'జోసెఫ్', 'నాయట్టు' లాంటి పోలీస్ థ్రిల్లర్స్‌కి రచయితగా చేసిన షాహీ కబీర్.. ఈ చిత్రానికి కథనందించారు. ఇది సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలా కాకుండా, సైకలాజికల్ డ్రామాగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జూలై 31న థియేటర్లలో రిలీజైంది. సెప్టెంబరు 04 నుంచి సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చూడొచ్చు.'ఉన్మాదం' విషయానికొస్తే.. ఎప్పటికైనా సినిమా రైటర్ కావాలని కలలు కనే ఓ పోలీస్ అధికారి(కుంచకో బోబన్) ఓ పాత ఆత్మహత్య కేసుని మళ్లీ తెరుస్తాడు. కానీ దర్యాప్తు లోతుగా చేసేసరికి అది ఆత్మహత్య కాదు.. దాని వెనుక ఓ సైకోపాత్ మైండ్ దాగి ఉందని తెలుస్తుంది. ఆ మిస్టరీని చేధించే క్రమంలో ఇతడు చూసే నిజాలు పిచ్చి లేపుతాయి. కేసు క్లైమాక్స్‌కి వచ్చేసరికి, శత్రువుల కంటే సొంత బుర్రే అతడికి పెద్ద శత్రువులా మారుతుంది.ఒకవైపు ప్రాణాంతకమైన నేరస్తులు, మరోవైపు తనని మానసికంగా ముంచేస్తున్న భ్రమలు.. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ సదరు పోలీస్ అధికారి అల్లాడిపోతాడు. తనే ఒక ఉన్మాదిలా మారే పరిస్థితి వచ్చినా, చివరి నిమిషం వరకు పోరాడి ఆ చీకటి రహస్యాన్ని అతడు ఎలా బయటపెట్టాడు అనేదే ఈ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)


