నేను ఈ స్థాయిలో ఉండటానికి వెట్రిమారనే కారణం | Soori About Vetrimaaran In His Acting Carrer | Sakshi
Sakshi News home page

Soori-Vetrimaaran: ఆయన నాటిన విత్తనం ఇప్పుడు చెట్టుగా మారింది

Aug 31 2026 8:25 AM | Updated on Aug 31 2026 8:25 AM

Soori About Vetrimaaran In His Acting Carrer

తాను ఈ స్థాయిలో ఉండటానికి దర్శకుడు వెట్రిమారనే కారణమని తమిళ హీరో సూరి పేర్కొన్నాడు. 'వెన్నెలా కబడ్డికుళు' సినిమాతో నటుడిగా పరిచయమైన సూరి.. తర్వాత పలు చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో దర్శకుడు వెట్రిమారన్‌ తీసిన 'విడుదలై'తో హీరోగా మారాడు. తమిళంలో ఇది హిట్ అయింది. తర్వాత 'విడుదలై 2, మామన్‌, గరుడన్‌ తదితర మూవీస్‌లో సూరి హీరోగా చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇతడు చేసిన 'మండాడి' వచ్చే శుక్రవారం తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: తమిళ హీరో సూరి కాళ్లు మొక్కిన తెలుగు హీరో సుహాస్)

సముద్ర నేపథ్యంగా తీసిన ఈ భారీ సినిమాకు మతిమారన్‌ పుగళేంది దర్శకుడు. తెలుగు నటుడు సుహాస్‌ ప్రధాన పాత్ర చేశాడు. మహిమా నంబియార్‌ హీరోయిన్. మత్స్యకారుల జీవిత ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఇటీవల చైన్నెలో నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెట్రిమారన్‌ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటుడు సూరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నేనీ స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం దర్శకుడు వెట్రిమారనే. ఆయన నాటిన విత్తనం ఇప్పుడు చెట్టుగా మారింది. బోటు పోటీల్లో బోటులో ఉండే ఆరుగురికి మార్గదర్శి మండాడి. ఈ చిత్రం కోసం రిస్క్‌ తీసుకోలేదు. రిస్క్‌నే చిత్రంగా చేశాం. రెండు నెలలు సముద్రంలో షూటింగ్‌ చేశాం. ఈ కార్యక్రమానికి మా అమ్మ వచ్చారు.ఆమె నాకు దేవతలాంటిది అని సూరి చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: నెలలు గడిచినా నన్ను పంపించలేదు.. నా భార్య భయపడిపోయి: సూరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement