గుడ్ నైట్, లవర్, టూరిస్ట్ ఫ్యామిలీ, అన్బే డయానా తదితర సినిమాలు నిర్మించిన మిలియన్ డాలర్ సంస్థ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ఒన్స్ మోర్'. అర్జున్ దాస్, అదితి శంకర్ జంటగా నటించగా ప్రముఖ మోడల్ సోనా ఒలిక్కల్ మరో హీరోయిన్‌గా చేసింది. విఘ్నేష్ శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయవుతున్నాడు. ఈ శుక్రవారం(ఆగస్టు 28) తమిళం వరకు థియేటర్లలో రిలీజ్ కానుంది. రెండు రోజుల క్రితం చెన్నైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ టీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: ‘రాకా’లో రకరకాల వింతలు చూశా.. మంచు లక్ష్మీ)
సినిమాలో 13 పాటలు ఉంటాయని నిర్మాత యువరాజ్ చెప్పారు. అర్జున్ దాస్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాశాను. అయితే సినిమా స్క్రిప్ట్ రెడీ చేసి పలువురు నిర్మాతలకు ఈ కథను వినిపించాను. కానీ వాళ్లంతా ఈ ప్రేమ కథకు అర్జున్ దాస్ హీరోనా? వేరే నటుడితో అయితే చేస్తానని అన్నారని దర్శకుడు విఘ్నేశ్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఈ చిత్రం తమిళంలోనే రిలీజ్ కానుంది. ఓటీటీలోకి వచ్చినప్పుడు తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చే అవకాశముంది.
ఇక అర్జున్ దాస్ విషయానికొస్తే ఖైదీ, మాస్టర్, ఓజీ తదితర సినిమాల్లో విలనీ పాత్రలు చేశాడు. రీసెంట్ టైంలో అయితే హీరోగానూ పలు మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు అలానే 'వన్స్ మోర్' అనే రొమాంటిక్ చిత్రంతో రాబోతున్నాడు. మరి దీనితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)


