‘రాకా’లో రకరకాల వింతలు చూశా.. మంచు లక్ష్మీ వీడియో వైరల్‌ | Manchu Lakshmi Reveals Shocking Experience On Allu Arjun Raaka Set, Says ‘I’ve Never Seen Anything Like This, Watch Viral Video | Sakshi
Sakshi News home page

‘రాకా’లో రకరకాల వింతలు చూశా..అంచనాలు పెంచేసిన మంచు లక్ష్మీ

Aug 23 2026 7:22 PM | Updated on Aug 23 2026 8:00 PM

Manchu Lakshmi Interesting Comments On Allu Arjun, Atlee Raaka Movie

అల్లు అర్జున్‌-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్‌, బన్నీ లుక్‌ మినహా ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన పెద్దగా వివరాలు బయటకు రాకపోయినా.. ఇటీవల విడుదలైన పోస్టర్‌ ఈ మూవీ హాలీవుడ్‌ స్థాయిలో ఉండబోతుందనే ఆసక్తిని పెంచింది. ఇక తాజాగా నటి మంచు లక్ష్మీప్రసన్న చేసిన వ్యాఖ్యలు ‘రాకా’పై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

తాజాగా తాను ‘రాకా’ మూవీ సెట్‌ నుంచి వస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించింది. అల్లు అర్జున్‌ తనను ఎప్పటినుంచో సినిమా సెట్‌ చూసేందుకు పిలుస్తున్నాడని.. తాజాగా ముంబైలోని ‘రాకా’ సెట్‌కు వెళ్లి వచ్చానని ఆమె తెలిపింది. అక్కడ చూసిన భారీ సెట్‌, విభిన్నమైన జంతువులను చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పింది.

‘రాకా సెట్ చూసి నోరు వెళ్ళబెట్టాను. వచ్చి కారులో కూర్చునే దాకా నా నోరు మూతబడలేదు. 'రాకా'లో రకరకాల వింతలు నేను చూశాను. అంతరా నుంచి వింత జంతవులు తీసుకొచ్చారు అనుకుంటా. నేను ఇంతకు ముందెన్నడూ అలాంటి జంతువులను చూడలేదు. బన్నీ లాంటి మనుషులను గానీ, ఎన్నో డిపార్మెంట్స్ తో కూడిన ఇలాంటి సెట్ ని గానీ నేనెప్పుడూ చూడలేదు. మామూలుగా లేదు. పిచ్చెక్కిపోయింది. వావ్ అనిపించేలా ఉంది. నిజంగా అద్భుతంగా ఉంది. నేను ఈ సినిమా కోసం ఆగలేకపోతున్నాను. ఇంకా ఎన్నో విషయాలను షేర్ చేసుకోవాలని ఉంది కానీ, బయటకు చెప్పలేను’ అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.

ఇప్పటికే భారీ బడ్జెట్‌, హాలీవుడ్‌ స్థాయి విజువల్స్‌తో తెరకెక్కుతున్న సినిమాగా ‘రాకా’పై ఆసక్తి నెలకొంది. తాజాగా మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇంతకీ అల్లు అర్జున్‌, అట్లీ కలిసి తెరపై ఎలాంటి అద్భుతాలను చూపించబోతున్నారో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement