రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. శనివారం రెండో రోజు కూడా భారీ వసూళ్ల రాబట్టింది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.47 కోట్లు సాధించినట్లు సాక్‌నిల్క్ నివేదిక అంచనా వేసింది.
రెండో రోజు కూడా ఇండియాలో రూ.16.10 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.31.40కు చేరాయి. గ్రాస్ వసూళ్లు రూ.36.45 కోట్లుగా ఉన్నాయి.
ఆంధ్ర, తెలంగాణలో 15.75 కోట్లు రాగా.. కర్ణాటక నుంచి రూ.2 కోట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో అతి తొందరలోనే ‘ఇరుముడి’ ప్రపంచ వ్యాపంగా రూ.50 కోట్లక్లబ్‌లోకి చేరే అవకాశముందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.


