యశ్ టాక్సిక్.. కేజీఎఫ్-2 రికార్డ్ బద్దలు కొడుతుందా? | Yash Toxic Sets Box Office Buzz With ₹27 Crore Advance Bookings Before Release All Over Country, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Toxic Movie: యశ్ టాక్సిక్.. ఆ భాషలోనే అత్యధిక బుకింగ్స్..!

Aug 23 2026 12:01 PM | Updated on Aug 23 2026 1:28 PM

Yash Toxic crosses Rs 27 crore in advance bookings all over country

యశ్ హీరోగా వస్తోన్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ మూవీ కోసం యశ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా ఫుల్ వయొలెన్స్ అండ్ బోల్డ్‌గా అనిపించింది. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ మూవీని ఓకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించారు.

రిలీజ్‌కు మూడు రోజులే సమయం ఉండడంతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభించారు మేకర్స్. కేజీఎఫ్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దీంతో విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఏకంగా రూ.27 కోట్ల వసూళ్లు దాటేసింది. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి 4 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ప్రీ-సేల్స్‌లో కన్నడ వెర్షన్‌లో అత్యధిక వాటాను కలిగి ఉండగా..ఆ తర్వాత హిందీ వర్షన్‌లో ఎక్కువగా సేల్స్ కనిపించాయి.

కేవలం కన్నడ 2డీ వర్షన్‌లోనే  4 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఒక్క కర్ణాటకలోనే రూ. 9 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత హిందీ 2డీ , తెలుగు 2డీ వర్షన్ నిలిచాయి. ఈ జోరు చూస్తుంటే తొలి రోజే వసూళ్ల పరంగా సెంచరీ కొట్టేలా కనిపిస్తోంది. గతంలో రిలీజైన కేజీఎఫ్ చాప్టర్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.80 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రికార్డ్‌ను టాక్సిక్ బద్దలు కొడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement