తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి చెందిన రిషబ్ శెట్టి ఫిల్మ్స్ ఓ సినిమా నిర్మించనుంది. రిషబ్ శెట్టి సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, ప్రగతి రిషబ్ శెట్టి ‘మోటార్ సైకిల్ డైరీస్’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి శివ చిరంతన దర్శకత్వం వహించనున్నారు.
‘‘గమ్యస్థానాలకు అతీతమైన ఓ భావోద్వేగ ప్రయాణం, జ్ఞాపకాలు, జీవితాన్ని మార్చే అనుభవాల సమా హారంగా సాగే ఓ అందమైన ప్రయాణమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ని ప్రారంభించనున్నారు. నటీనటులు, ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: భువన్ రెడ్డి.


