ఈ ఏడాది విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో హిట్ కొట్టిన సూర్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా వచ్చిన ‘సీన్’ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. కోలీవుడ్ డైరెక్టర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తమ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.
తాజాగా ఈ సినిమా మరోసారి ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 4 నుంచి ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో తమిళ, తెలుగు భాషలతో పాటు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్‌గా నటించింది. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కథేంటంటే..
క్రైమ్ బ్రాంచ్‌లో డీఎస్పీగా పని చేసే ప్రేమ్ రాజ్ (సూర్య) తన తెలివి తేటలతో క్లిష్టమైన కేసులను ఈజీగా సాల్వ్ చేస్తుంటాడు. సీరియల్ కిల్లర్ విక్టర్ (టోవినో థామస్)ను అరెస్ట్ చేసిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు. అది పెండింగ్‌లో ఉండగానే నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అవన్నీ సీరియల్ కిల్లర్ విక్టర్ చేసిన మర్డర్స్ మాదిరే ఉంటాయి. విక్టర్ జైల్లో ఉంటే.. బయట ఆ హత్యలు ఎవరు చేస్తున్నారనేది మిస్టరీగా మారుతుంది. అదే సమయంలో ప్రేమ్ సంబంధించిన ఓ సంచలన నిజం క్రైమ్ బ్రాంచ్ చీఫ్ స్టీఫెన్‌కి తెలుస్తుంది. దీంతో విక్టర్‌ని ఉద్యోగం నుంచి తప్పిస్తాడు. అయినప్పటికీ సీరియల్ కిల్లర్ కేసుని ప్రేమ్ సవాల్‌గా తీసుకుంటాడు. మాయ(నజ్రీయా) సాయంతో ఈ కేసులను విచారిస్తుంటాడు. అసలు ఆ హత్యలు చేస్తున్నదెవరు? ప్రేమ్ ఆ సీరియల్ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నాడు? పై అధికారుల దగ్గర ప్రేమ్ దాచిన నిజం ఏంటి? ప్రేమ్‌కు ఉన్న సమస్య ఏంటి? ఈ కేసు విచారణలో ప్రేమ్‌కి మాయ ఎలాంటి సహాయం చేసింది? ఈ కథలో ఈశ్వరన్ (నస్లేన్) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
(ఇదీ చదవండి: ఓటీటీ ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన ‘రామాయణం’)


