ఓటీటీ ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చిన ‘రామాయణం’ | Ramayana Movie OTT Release Date | Sakshi
Sakshi News home page

Ramayana Movie OTT: ఓటీటీ ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చిన ‘రామాయణం’

Nov 29 2026 7:26 PM | Updated on Nov 29 2026 7:39 PM

Ramayana Movie OTT Release Date

స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రామాయణం. దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించారు. విజువల్‌ వండర్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన ఈ పౌరాణిక ఇతిహాస చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలై నెల రోజులు గడుస్తున్నా థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతునే ఉంది.

అయితే  ఈ సినిమా ఓటీటీ విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 వారాల్లోపే లోకి వస్తుంటాయి. అయితే ‘రామాయణం’ విషయంలో మేకర్స్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీ విడుదలపై..
తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘రామాయణ’ను కేవలం స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోసమే తెరకెక్కించాం. అందువల్ల ఇప్పట్లో ఈ సినిమాను ఓటీటీలోకి వదిలే ఆలోచనే లేదు. కొన్ని నెలల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశమే లేదు’ అని అన్నారు. అంటే థియేటర్లలో సినిమాకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ విడుదల విషయంలో తొందరపడే ఆలోచనలో మేకర్స్ లేనట్లు తెలుస్తోంది. దీంతో ఆ సినిమా ఓటీటీలోకి  ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

(ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న నటుడు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement