రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వచ్చిన మూవీ ‘రామాయణం’. దీపావళికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే నుంచే వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజైన మూడు వారాల్లోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఇందులో యశ్ రావణుడి పాత్రలో మెప్పించాడు.
అయితే ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసింది చిత్రబృందం. యశ్ ‘రావణుడి తాండవం’ వీడియోను విడుదల చేశారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
కాగా ఈ చిత్రం కలెక్షన్ల పరంగా వసూళ్ల సునామి సృష్టిప్తోంది. టాలీవుడ్ సినిమా పుష్ప-2 రికార్డ్‌ను బ్రేక్ చేసింది. కేవలం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,755.60 కోట్ల వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' (రూ. 1,742 కోట్లు)ను వెనక్కి నెట్టేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన జాబితాలో రామాయణ నాలుగోస్థానంలో నిలిచింది.
(ఇదీ చదవండి: రేపే ‘భోగి’ రిలీజ్.. అనుపమ సంచలన పోస్ట్)


