ఈ చిన్నారి నటనకి హాలీవుడ్‌ నటుడు ఫిదా | Tom Hanks Watches Maharaja Movie | Sakshi
Sakshi News home page

ఈ చిన్నారి నటనకి హాలీవుడ్‌ నటుడు ఫిదా

Nov 26 2026 5:29 PM | Updated on Nov 26 2026 6:16 PM

Tom Hanks Watches Maharaja Movie

విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘మహారాజ’. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 2024లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి విజయాన్ని సాధించింది. నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్‌ కశ్యప్‌, నటరాజ్‌ సుబ్రమణ్యం, చిన్నారి సచనా నామిదాస్‌ కీలక పాత్రల్లో కనిపించారు. సచనా నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలోని నటనకుగానూ ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును సైతం అందుకుంది.

తాజాగా ఈ సినిమాపై హాలీవుడ్‌ నటుడు టామ్‌ హ్యాంక్స్‌ ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (IATAS) బోర్డు సభ్యురాలు కవితా గుప్తా వెల్లడించారు.

టామ్‌ హ్యాంక్స్‌ ఏమన్నారంటే?
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎల్‌ఏసీఎంఏ (LACMA) గాలా కార్యక్రమంలో టామ్‌ హ్యాంక్స్‌ను కలిశాను. ఆ టైంలో చూడదగిన మూడు భారతీయ సినిమాలను సూచించమని ఆయన అడిగారు. దీంతో నేను ‘మహారాజ’ చిత్రాన్ని చూడాలని తెలిపాను. కొన్ని వారాల తర్వాత మరో కార్యక్రమంలో టామ్‌ హ్యాంక్స్‌ మళ్లీ కలిసినప్పుడు ఆయనే స్వయంగా ఈ సినిమా గురించి ప్రస్తావించారు’ అని ఆమె తెలిపారు. 

తర్వాత సినిమాలో చిన్నారి సచనా నామిదాస్‌ నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని టామ్‌ హ్యాంక్స్‌ చెప్పినట్లు కవితా గుప్తా తెలిపారు. ‘ఆ అమ్మాయి నటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. చాలా అద్భుతంగా నటించింది. నేను ఆ పాత్రలో ఉండి ఉంటే.. ఆ వ్యక్తిని చంపేసేవాడినేమో’ అని ఆయన అన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement